శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చేతికి చిక్కని చక్కని దృశ్యం ..ఏంచేస్తాం ! ప్రాప్తమింతే

>> Monday, September 19, 2011

ఈరోజు సంధ్యహారతి సమయంలో ఆలయంలో నుండి హారతినిస్తూ ఆవరణలోని పరివార దేవతలందరకూ హారతి నిచ్చాను. ఆంజనేయ స్వామి వారికి హారతినిస్తూ ఆకాశంలోకి చూశాను .అద్భుతమైన వర్ణసమ్మేళనం గోచరించింది అక్కడ . నేనెప్పుడు అన్నివర్ణాలు అలా మిళితమై ఆకాశంలో ఒకేసారి చూడలేదు . ఎరుపు,నీలం.ముదురు బూడిద,తెలుపు ,పసుపుపచ్చ ఇలా అద్భుతదృశ్యమది. అలానే చూస్తుండిపోతుండగా ఫోటో తీయాలని గుర్తొచ్చి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి కెమెరా తెచ్చి ఫోటో తీయాలని చూసేసరికే వర్ణాలన్నీ కరిగిపోయాయి . ప్చ్.. ఆ చిత్రాన్ని కెమెరాలో బంధించే అదృష్టందక్క లేదు . చేతిలోనుంచి జారిపోయినచందమామ కోసం మారాం చేస్తున్న పిల్లవాడి లా మనసు గోలచేస్తుండగా అలా క్లిక్ చేశాను కానీ ............ఇవే మిగిలింది .







1 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి September 19, 2011 at 8:21 AM  

బాగానే పట్టుకున్నారుగా!

మీ ఆశ్రమం చాలా అందంగా ఉందండీ! ఎప్పుడు వస్తామో ఏమిటో?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP