శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బ్రాహ్మణులపై కాదు ధర్మంపైద్వేషమే అసలు కారణం .

>> Tuesday, February 1, 2011

ఈ యుగంలో సనాతనమైన ఈ ధర్మాన్ని లేకుండా చేయాలనే సంకల్పం కలిపురుషునిది. ఇక ఆయన తయారుచేసుకున్న సైన్యం ఆయనవారసులు తమశక్తివంచన లేకుండా తమప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈధర్మం పట్ల అపనమ్మకం పెంచటం, ఈధర్మానికిచెందిన శాస్త్రాదులపై చులకన భావాన్ని పెంచి శాస్త్రజ్ఞానాన్ని క్రమేపీ తరువాత తరాలకు అందకుండా చూడటం . అలా అందజేస్తున్న వారిని ,ఆచరిస్తున్నవారిని అనేకానేక ప్రలోభాలతో ,విధ్వంశకర చర్యలతో నశింపజేయటం ,ఈ ప్రణాళికలన్నీ తరాలుగా సాగుతున్నాయి .కాకుంటే ఇప్పుడు వికృతచేష్టలుగా బయటపడుతున్నాయి.

ఇక ప్రతిసమాజం లోనూ ఉండే సామాజి విభాగాలలాగే ఈ పుణ్యభూమిలో శ్రమ విభజన వర్ణాశ్రమ రూపంలో జరిగింది. ఈ యుగధర్మాన్ననుసరించి అన్ని వర్ణాలలోనూ మంచితోపాటు చెడ్దబుద్దులతో సమాజానికి మేలు,కీడు చేసినవారున్నారు . అయితే
బ్రాహ్మణ్యం అనబడే వారిలో సాత్వికులు భగవత్ చింతనాపరులు తాము ఆకలితో,పేదరికంతో మగ్గటానికైనా సిద్దపడ్డారేకాని ధర్మాచరణను వదులుకోలేదు . కనుకనే మానవజాతిమహోన్నతస్థితిపొందటానికి మహర్షులు భగవత్ ప్రసాదితంగా పొందిన విజ్ఞానమంతా ఇంకా మనకందుతున్నది. ధర్మాచరణలేనివారిని పుట్టుకను మాత్రమే చూసి బ్రాహ్మణులుగా మన:పూర్వకంగా అంగీకరించలేదు మనసమాజం. ఆచరణరీత్యా ధార్మికులయినవారిని చూసి స్పూర్తిపొందుతూ ధర్మచ్యుతి పొందకుండా నిలబడిఉంది. అటువంటివారిని అనుసరిస్తూ వివిధసామాజికవర్గాలనుండికూడా ధార్మికులు ధర్మరక్షనకై నడుం బిగిస్తూనే ఉన్నారు.
ఇలా పరంపరానుగతంగా కొనసాగుతుంటే ధర్మధ్వంశకులు సహిస్తారా ? కనుకనే ముందుగా బ్రాహ్మణులమీద ద్వేషం వెళ్లగక్కుతారు . మానసికంగా హింసించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటారు.

పోనీ బ్రాహ్మణులంతా మేము ఈధర్మాన్ని వదిలేస్తామన్నా వీళ్ళపని పూర్తికాదు. ఇంకా భగవంతునిపై విశ్వాసంతో ఈధర్మాన్ని ఆశ్రయించిన వారెవరన్నా భూమ్మీద మిగిలుంటే వాళ్ళపై గురిపెడతారు.వీల్లమాటలు జాగ్రత్తగా గమనించండి అర్ధమవుతుంది . బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణిజం నశించాలన్నిది కోరికట. అంటే బ్రాహ్మణులు అనే పేరు ఉన్నా కలిపురుషుడి మాయలకు లోబడి ధర్మచ్యుతులైనవారితో బాధలేదు . ఇంకా ఈధర్మాన్ని పట్టుకుని వేళ్లాడుతుండేవారు[వాళ్ళు పుట్టుకరీత్యా అయినా,కాకపోయినా ఆచరణరీత్యా బ్రాహ్మణులైనవారినైనా] వీళ్లను ధ్వంశం చేయాలన్నదే లక్ష్యమని స్పష్టంగా చెబుతున్నారు .ఇంకా స్పష్టం గా చెప్పాలంటే ఈ సనాతన హైందవధర్మాన్ని నశింపచేయటమే తమ అసలు లక్ష్యం . కాకుంటే వారిభాషావిన్యాసాలమాటున నేను వివరించినంత మోటుగా కాక తేనెపూసినకత్తిలా కనపడుతుంది . అసలు విషయం ధర్మాన్ని ద్వేషించటమే.

చరిత్ర మొత్తం తిరగేస్తే అధర్మానికి పాల్పడ్డవాల్లు బ్రాహ్మణులొక్కరేనా ? అన్ని వర్ణాలవారున్నారు. ఈరోజు కోట్లరూపాయల సమాజసంపదను దోచి దాచుకున్నవాల్లంతా ఎవరు బ్రాహ్మణులొక్కరేనా ?అధికారం చేజిక్కించుకుని అడ్డమైన పనులుచేస్తున్నవారంతా ఎవరు? సమాజానికి హితాన్ని కలిగించేవాడు మాత్రమే బ్రాహ్మణుడని మనసనాతన ధర్మం ఘోషిస్తున్నది నూతన తరం కూడా దానినివిశ్వసిస్తున్నది.
వేదాలగూర్చి,పురాణాలగూర్చి మనసమస్తశాస్త్రసంపదనుగూర్చి అవహేళనగామాట్లాడుతున్నా మనం ధర్మాగ్రహం చూపం. అందుకనే పదేపదే ఇలా కులచిచ్చులో వెకిలిచర్చలో లేపాలని ద్వేషాలురగల్చాలను ప్రయత్నిస్తుంటారు.

వీళ్ళు మన పక్కనే మనవారిగా ఉంటూనే , మన ధర్మధ్వంసనకోసం ప్రయత్నాలు చేస్తున్నందున వీళ్లకు రక్షణ కవచాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకు ఈధర్మం పై విశ్వాసం లేదు. పోనీ వదిలెయ్యమనండి. దానితోపాటు ఈధర్మం వలన ఇవ్వబడ్ద కులాన్ని వదులుకోరు .ఎందుకని ? అది సామాజికంగా తమకు రక్షనకవచం కనుక. సామాజికంగా తమ బలం తగ్గకూడదు కనుక . ఇది వీళ్ళ నయవంచక నాటకం . ఈమధ్య మావాళ్ల లో ఒకాయన కనపడ్డాడు. ఆయనకు తలకెక్కిన పైత్యమంతా కక్కాడు . ఈదేశంలో బ్రాహ్మణులుచాలామోసాలు చేశారని ఈధర్మమంతా వాళ్లసృష్టని కాబట్టి వదిలివేశానని చెప్పాడు . బాగుంది ప్రస్తుతం నువ్వు ఈధర్మం పట్ల విరక్తికలిగి వదిలివేశావు .ఇక నీకు దీని సంబంధించిన అవశేషాలు మాత్రం ఎందుకు ? నేను పలానా కులం వాడిని అని చెప్పుకోవటం మాత్రం ఎందుకు ? దాన్నికూడా వదిలివెయ్ ! అన్నాను . అట్లెట్లాకుదురుద్ది .అని జారుకున్నాడాయన .
సామాజికసౌకర్యం కోసం నాడెప్పుడొ ఏర్పరచుకున్న కులాలు కాలప్రవాహంలో మంచివాల్లతోనూ చెడ్దవాల్లతోనూ నిండిపోయాయి. అవి లక్ష్యానికి వికృతిగా మారి సమాజానికి నష్టం కలిగిస్తే వాటిని సంస్కరించుకోవాల్సినది మనమే, దానికి ధర్మమెలా కారణమవుతుంది ? ఇక ధర్మద్వేషులు దీన్నొక ఆయుధంగా మలచుకోవటానికి మాత్రం అనుకూలంగా మారింది. కొందరు ఇతరులపై ద్వేషాన్నిచిమ్మేది సమాజంపట్ల ప్రేమతో అని చెప్పుకున స్వయంప్రకటిత సంస్కర్తలుంటారు . ఒకపక్క విషం చిమ్ముతూ .అది సమాజానికి ఔషధం .మీరు నమ్మాలి నమ్మమంటారు.
మనసునిండా కుళ్ళునింపుకుని సమాజంపట్లప్రేమ కలిగి ఉన్నాని ప్రకటించుకున్నంతమాత్రాన పవిత్రులవుతారా ?మనం వీళ్ల కుయుక్తులు గమనిస్తున్నామని తెలిస్తే చాలు మేము ఈధర్మం లోనేకాదు ఇతరచోట్లకూడా ఇలానే పోరాడతామంటారు. కానీ ఇతర ధర్మీయులపట్ల వీల్లేదన్నా వ్యాఖ్యానం చేసేప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాటలు పేర్చుకుంటారు. [మీరు పరీక్షించి చూడండి . మీకే తెలుస్తుంది] . ఎందుకయ్యా ! అంటే , ఎన్నన్నాగానీ సహనము ,క్షమాగుణము కలిగినది హిందువులకే . అదే ఇతరులపట్ల ఇలామాట్లాడితే వీళ్ళకు కపాలమోక్షం తప్పదు అనేసత్యం బాగా తెలుసు.

ధర్మద్వేషులారా ! యుగధర్మాన్ననుసరించి మీకుయుక్తులు కొంత విజయవంతమైనట్లు కానరావచ్చు. కానీ అంతిమవిజయం ధర్మానిదే .
అందుకే మేము మరలా నినదిస్తున్నాం
గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం....లోకాస్సమస్తా సుఖినోభవంతు..

88 వ్యాఖ్యలు:

Dharanija February 1, 2011 at 9:48 AM  

chaalaa baagaa chepparandee.

Anonymous February 1, 2011 at 10:01 AM  

Brahminism అనే మతం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉన్నది హిందూమతం ఒక్కటే. మతాన్ని కులంగా చూడ్డం, కులాల్నే మతంగా ప్రచారం చేయడం - ఈ పనులు అన్యమతాలకు చెందిన దేశద్రోహులు చేస్తున్నటువంటివి. హిందువులకు హిందూమతం పట్ల సెంటిమెంటునీ, అటాచ్‌మెంటునీ పోగొట్టడమే ఈ ప్రచారాల వెనక ఉన్న అసలు ఉద్దేశం.

Bhãskar Rãmarãju February 1, 2011 at 10:08 AM  

>>హిందువులకు హిందూమతం పట్ల సెంటిమెంటునీ, అటాచ్‌మెంటునీ పోగొట్టడమే ఈ ప్రచారాల వెనక ఉన్న అసలు ఉద్దేశం.

తాడేపల్లి గారు, బాగా చెప్పారు.

Anonymous February 1, 2011 at 10:32 AM  
This comment has been removed by a blog administrator.
Chittoor Murugesan February 1, 2011 at 11:26 AM  

అయ్యా,
//అంతిమవిజయం ధర్మానిదే .//
నేనెప్పుడు అధర్మానికే విజయమని చెప్పలేదు. ధర్మం ఏది అన్న అంశం పైనే విభేదిస్తున్నా.

//అందుకే మేము మరలా నినదిస్తున్నాం//
మీ అసలు ఉద్దేశం ఏమిటో తదుపరి వాక్యంలోనే భయిట పెట్టేరు థ్యాంక్స్.

//గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం....లోకాస్సమస్తా సుఖినోభవంతు..//

మీరు నెత్తి మీద పెట్టుకునే భగవద్గీతలో శ్రీ కృష్ణుడు సత్ బ్రాహ్మణుడ్ని - కుక్క మాంసం వండుకుని తినువాడిని సమత మమతతో చూడువాడే అభేధభావం గలవాడన్నాడు కదా..

కేవలం ఆవులకు -బ్రాహ్మణులకు శుభం జరిగి పోతే చాలనా మీ ఉద్దేశం? అదేనా మీ ధర్మం?

Seetharam February 1, 2011 at 12:20 PM  

It is believed that if cows and people who perform the Yajnas and teach to society are good, the whole world would get benefited. The next lines in that poem mention those. Don't undermine our heritage with your lack of knowledge. Learn first, become authority in the subject, then you would be entitled to critisize.

Regards

Seetharam

Seetharam February 1, 2011 at 12:29 PM  

One clarification.. My comment is in response to that 'tamil' texted name :)

Regards

Seetharam

Sandeep P February 1, 2011 at 1:26 PM  

బ్రాహ్మణ్యం అనేది గుణకర్మలను అనుసరించి వస్తుంది. బ్రాహ్మణవిద్వేషం ఎంత పెరిగినా, భక్తి, ధర్మం ఉన్నంతకాలం బ్రాహ్మణ్యం ఉంటుంది. అవి లేనివాడు ఎవరికి పుట్టినా అబ్రాహ్మణుడే. ఇంకా మనం కలియుగం ఆదిలో ఉన్నాము. అందుకేనేమో, కొంత్మంది బ్రాహ్మణులైనా సంధ్యావందనం చేసుకుంటున్నారు.

Praveen Mandangi February 1, 2011 at 5:12 PM  

ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే law అని అర్థం. మీ దృష్టిలో ధర్మం అంటే సనాతన ధర్మం. మాకు (నాస్తికులకి) ఉన్నది బ్రాహ్మణులపై ద్వేషం కాదు. ఈ ఒక్క విషయంలో మీరు చెప్పినది నిజమే.

Anonymous February 1, 2011 at 5:27 PM  

@ Prraveen SARRRRRMA
Thats why U R #1 BLOG-JOKER, here.
:))))

Anonymous February 1, 2011 at 5:40 PM  

చాలా చక్కగా చెప్పారు. అన్ని రంగాల్లో అంతో, ఇంతో నిబద్దతతో ఉన్నది బ్రాహ్మణులే. కబ్జాలు చేసి, అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బితినే వాళ్ళలో బ్రాహ్మణులు ఎవరూ లేరు.

Ayyagari Surya Nagendra Kumar February 1, 2011 at 6:47 PM  

ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది. ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులే తత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాజ్ఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
ఇక శర్మ అని పేరు చివర గొప్పగా పెట్టుకుని నాస్తుకుణ్ణి అని చెప్పుకోవటం ఎందుకు? ముందు ఆ పేరు తొలగించుకోండి.
ఇక సాంబారుగాడు బ్లాగు నిర్వాహకులకు చెప్పేది ఏమంటే, ధర్మం ఏది అని మీరు చెప్పనవసరంలేదు కొత్తగా విభేధించడానికి ఏం లేదు. వేదవిహితమైనదే ధర్మము, వేదం ప్రతి ఒక్కడూ చదివలేడు (ఎలాగైతే హెవీ డ్యూటి విద్యుత్ స్తంభం పై తీగ తెగిపోతే అర్హత శిక్షణ లేనివాడు ఎలా దానిని ముట్టుకోలేడో/ ఆ వ్యక్తి క్షేమం కోసం ఎలా ముట్టుకోనివ్వరో అలా) ధర్మ శాస్త్ర వ్యాఖ్యానాలు, పురాణాలు ఇతిహాసాలు చదవండి తెలుస్తుంది.
కుతర్కం చేయడం మానండి, మీకు సనాతన ధర్మం పై నమ్మకంలేకపోతే లేకపోయె అనవసర చర్చలకు తావీయకండి. మిమ్మల్ని ఎవరూ మారమని చెప్పరు ఆ అవసరం కూడా లేదు మీ నమ్మకాలు మీవి, అవసరం వచ్చినప్పుడూ తెలుస్తుంది మీకు. దయచేసి మీ కామెంట్స్ ని మీ దగ్గరే ఉంచుకోండి. లేకపోతే కొత్తగా సనాతన ధర్మంలో ప్రవర్తించాలనుక్కునేవాళ్ళు అనవసరంగా మీ కామెంట్స్ చూసి నిజమనుక్కుని భ్రమ పడే అవకాశం ఉంది. మీరు చెడిందే కాక పక్కవాళ్ళాను చెడగొట్టే పనులు చేయకండి. కాస్త పెద్దల సత్సంగులతో సహవాసం ఏర్పరుచుకోడానికి ప్రయత్నించండి. బుద్ధికి వ్యవసాయం నేర్పండి. కుహనా లౌకిక వాద భావాలను సాహిత్యాన్ని త్యజించండి. ఆపై మీఇష్టం, అనర్థం అనుభవంలోకి రాకముందే................. సరి చేసుకోండి.

Anonymous February 1, 2011 at 7:14 PM  

/ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే law అని అర్థం. మీ దృష్టిలో ధర్మం అంటే సనాతన ధర్మం. మాకు (నాస్తికులకి) ఉన్నది బ్రాహ్మణులపై ద్వేషం కాదు. /

అంటే.. ధర్మన్ని వ్యతిరేకించే అధర్మపరులు, 'లా(న్యాయ)' వ్యతిరేకులు కూడానా? బాగుంది. :) ఇల్లీగల్ ఫెలోస్ అంటారు! న్యాయవ్యతిరేకులు అంటే చట్ట వ్యతిరేకులు కూడా, 'బొక్కలో తోసేయాల్సిందే తప్పదు ' అంటారు... అలాగే .. అలాగే కానిద్దాం, కాని కాస్త ఆలోచించనీయవయ్యా, మహానుభావా! 'మార్తాండ ' తేజా! :P

Rao S Lakkaraju February 1, 2011 at 8:13 PM  

మనము చేసే ఏ పనిలోనన్నా రాణించాలంటే ఒక నిబద్ధత,క్రమశిక్షణ, ఒక కట్టుబాటు కావాలి. అవే ధర్మాలు. సూక్ష్మంగా చూస్తే జీవితంలో మన ఉనికికి కారణమయిన వాళ్ళని మనము గౌరవించే విధానాలు. ఆ లక్షణాలు వంశపారంపర్యంగా, అందరూ అన్నీ ఆచరించినా ఆచరించక పోయినా, ఎక్కువగా కనపడేది బ్రాహ్మణుల లోనే అని నేననుకుంటాను. అవి ఆచార వ్యవహారాలలో మిళితమయినాయి. కాలక్రమేణా వాటిల్లో మార్పులు వస్తున్నాయి. ఎవరెంత తిట్టుకున్నా, ద్వేషించినా కట్టుబాట్లు లేని జీవితం రాణిం చదు.

Anonymous February 1, 2011 at 8:14 PM  

"ఈరోజు కోట్లరూపాయల సమాజసంపదను దోచి దాచుకున్నవాల్లంతా ఎవరు బ్రాహ్మణులొక్కరేనా ?అధికారం చేజిక్కించుకుని అడ్డమైన పనులుచేస్తున్నవారంతా ఎవరు?." అబ్బే మాకు ప్రస్తుతంతో పని లేదండీ...మాకు బుర్ర వుంటే కదా....!!! ఒకప్పుడు మమ్మల్ని తొక్కేసారు.. (మాకు నిజం తెలీక పొయినా ఇది నిజం.....).....ఇప్పుడూ తొక్కుతున్నారు..... అదంతే.... ఎక్కడ చూసినా ప్రతిభను కలిగి వుండే వాళ్ళంటే మాకు అదో కుళ్ళు అంతే....!!! వేరే అగ్రకులాల వాళ్ళనంటే వాళ్ళు మమ్మల్ని వుతికి ఆరేస్తారు...అందుకే ఈ రచ్చ....!! ఎది ఎమైనా మళ్ళ మేము అణగదొక్క పడ్డాము....అదంతే...

Rajasekharuni Vijay Sharma February 1, 2011 at 10:32 PM  

నమస్కారం."గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు" అని నినదించే పరిపూర్ణహృదయమున్న మీవంటి వారు నేటికీ ఉన్నారు కనుకనే బ్రాహ్మణులు ఈ పాటిగా నైనా నిలబడ గలుగుతున్నారు. ఈ ఒక్క పాలు ఎప్పటికీ ఉండేదే. దానికే సత్యమని పేరు. అది ఏ యుగములోనైనా అంతరించనిది.

durgeswara February 1, 2011 at 11:17 PM  

అయ్యా
ప్రవీణ్ గారికి సిద్దాంతపరంగా సమాధానం చెప్పండి అంతేగాని వ్యక్తిగతంగా ధూషణలొద్దు.
ఆయన మనసోదరుడే నేడు ఉన్న నాస్తికత్వం శాశ్వతమా?

durgeswara February 1, 2011 at 11:21 PM  

ఇక ముఖ్యంగా మురుగేశన్ అన్నగారికి సందేహాలకు మరొక పోస్ట్ లోసమాధానం ఇస్తాను

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ February 1, 2011 at 11:29 PM  

గురువు గారూ,

నిజాన్ని సూటిగా చెప్పారు. అభినందనలు.

@Surya Nagendra Kumar Ayyagari

చాలా బాగా చెప్పారండీ.

>>బుద్ధికి వ్యవసాయం నేర్పండి.>>
అది చేతగాకే ఈ గోలంతా

@சித்தூர்.எஸ்.முருகேசன்

మీరు మాట్లాడదమనుకునే ముందు పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే నవ్వులపాలు కాకా తప్పదు.

>> సిద్దాంతపరంగా సమాధానం చెప్పండి అంతేగాని వ్యక్తిగతంగా ధూషణలొద్దు>>

కొందరికి సిద్ధాంత పరంగా చెప్తే అర్ధంకాదు.

రాజేష్ జి February 2, 2011 at 4:21 AM  

$దుర్గేశ్వర గారు
చక్కని టపా, మా తరం తెలుసుకోవాల్సిన సంగతులు ఎన్నో పంచుకున్నారు. కృతజ్ఞతలు.

కానీ నాకు టపా టైటిల్ కొద్దిగా తికమకగా ఉంది. అది అసలు బ్రాహ్మణ ద్వేషమే లేదన్నట్లుగా ఉంది. పోనీ "ఒకప్పుడు హిందూధర్మద్వేషానికి తొలిమెట్టుగా వాడుకున్న బ్రా.ద్వే నేడు తమ స్వార్థానికి వాడుకుంటూ బ్రాహ్మల మీద ద్వేషం కక్కుతున్నారు కొందరు" అని చెప్పినా బావుండేది. అన్యధా భావించకండి, నా మనసులోమాట చెప్పా. సర్లెండి నా బాధ నా బ్లాగులో.. చెప్పుకుంటా!

చివరగా అప్రస్తుతమైనా ఒకటి మిగిలిన చదువరులకి:
ఈ ప్రవీణ్ శర్మ గారు నిజానికి ఒరిస్సా ప్రాంత "కొంద్" గిరిజనుడిగా చెప్పుకుంటాడు. ఇక శర్మ అనేది రంగనాయకమ్మ అర్థంలేని ఇజాల మాటలు వినిలేదా ఆ పదాన్ని అవమానపరచడానికి పెట్టుకున్నాడని నా అభిప్రాయం. ఏదైమైనా మంచివ్యక్తి, ఆదర్శవాది. ఇంకా ముందుకు వెళితే ఇతనికున్న సామజిక అవగాహన అసామాన్యం.
నిజానికి పైన దుర్గేశ్వర గారు చెప్పినట్లు "కూర్చునే కొమ్మను నరుక్కునే" నిజమైన శర్మ/శాస్త్రి ల కన్నా ఇతను(పెట్టుడు శర్మ:)) వందరెట్లు మేలు.
అసలు సిసలు నాస్తికుడు, అలాఅని అకారణ ద్వేషీ కాదు. "ఆస్తి"కులై జ్యోతిష్యం మాటున జీవితాన్ని గడుపుతూ వేదాల్ని తుంగలో తోక్కమనే మూర్ఖసిఖామణుల కన్నా ఎంతో మేలు!

అందువల్ల వారితో వైరం కాకుండా, తన సామాజిక అవగాహనని మనతో పంచుకోవడానికి దారి ఇస్తే మంచిది అని నా నమ్మకం.
చూస్తూ ఉండండి "చివరి రోజుల్లో చలం" గారి లాగా మారతారు :).

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 2, 2011 at 5:06 AM  

దుర్గేస్వర గారూ,

మీరు విమర్శించిన వాళ్ళ లాగే మీరూ ఇంకోవైపునించి మాట్లాడారనిపిస్తుంది నాకు. ఈ రెండు వాదనలూ ఎవరికిష్టమయ్యింది వాళ్ళు మాట్లాడుకోటానికి సరిపోతాయి గానీ అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించాలనుకునేవారికి అంతగా ఉపయోగ పడట్లేదనిపిస్తున్నాయి?

సరే నేను మీ టపా లోని కొన్ని అంశాల మీద నా సందేహాలు అడుగుతాను. మీకు తెలిసినంతలో వివరణ ఇవ్వండి, చదివేవాళ్ళకు బావుంటుంది:

(గమనిక: ఈ ప్రశ్నలు వేశానుగదా అని అటువైపువాళ్ళు అది తమకు మద్దత్తు అనుకుంటే వారి అమాయకత్వానికి జాలి పడగలను)

>>ఇక ప్రతిసమాజం లోనూ ఉండే సామాజి విభాగాలలాగే ఈ పుణ్యభూమిలో శ్రమ విభజన వర్ణాశ్రమ రూపంలో జరిగింది.

1. శ్రమ విభజనతో బాటు శ్రామికుల విభజన కూడా జరిగింది కదా! ఆ యుగ ధర్మాన్ని అనుసరించి అది మంచిదే అంటారా?

2. స్వభావాన్ని బట్టి లభించే బ్రాహ్మణ్యం పొందే అవకాశం నీటి మీది రాత కాకుండా ఉండాలంటే అన్ని వర్ణాల మధ్యా కనీస సంబంధాలు ఉండి తీరాలికదా?

3. గత జన్మల కర్మఫలాన్ని అనుసరించి ఒక వర్ణంలో జన్మమించిడం జరుగుతుంది అనేదాన్ని మీరు అంగీకరిస్తున్నారా ? సనాతన ధర్మం దీని గురించి ఏమి చెప్పింది?

4. బ్రాహ్మణ్యం అనేది స్వభావాన్నిబట్టి పొందేదయితే మరి నేను బ్రాహ్మణున్ని అని ఎవరికి వారే చెప్పుకోవడం ఎలా సాధ్యం? ఎంత ఆత్మ వంచనా, అఙానం ఉంటే అది సాధ్య పడుతుంది?

5. ఆ యుగంలో మంచి చెడ్డల గురించి ఇప్పుడు నిర్ణయించడం కాదు నా ఉద్దేశ్యం. అప్పటి వాళ్ళ ఊహకీ విఙానానికీ, విఙతకీ అందినంతలో ఒక సామాజిక నిర్మాణాన్ని ఏర్పరచుకున్నారు. తన సమకాలీన ప్రపంచంలోని మిగతా సమాజాల కంటే కొన్నడుగులు మనసమాజం ముందు ఉండేది అని తెలుస్తుంది. అదే పరమ పవిత్రమైన ఏర్పాటు అని చెప్పడం, కాలానికతీతమైన ధర్మం లో అది ఒక భాగం అనుకోవడం ఎలా సమంజసం ?

6. సనాతన హైందవ ధర్మం అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? సనాతన కాలం నుండీ పరిణతి చెందుతూ, మనతోటీ మన ముందు తరాలతోటీ ఇంకా సంస్కరించబడబోయే మన హైందవ సమాజ ధర్మమనా?

లేక

ఎప్పుడో సనాతన కాలంలో అద్భుతంగా నిర్వచించబడి తరువాత ధ్వంసమయిపోయిన ధర్మమనా? ఒకవేళ మీ ఉద్దెశ్యం ఇదయితే సనాతన కాలం తరువాత మన హైందవ సమాజం అతి దారుణంగా దిగజారిపోయిందనుకోవాలి. అలా అయ్యుంటే అసలు మనం సనాతన హైందవ సమాజానికి వారసులమెలా అయ్యాము?

I do not intend to judge things here. I am just trying to understand తమసోమా జ్యోతిర్గమయ..

Anonymous February 2, 2011 at 7:07 AM  

The time is come to remove all Caste(s) from Hindu Religion. Caste system divide Hindus.

If you start defending one Caste, then you have to defend 100s of Castes. As long as there is a Caste consciousness among Hindus, it is very difficult to unite them.

"Others" intentionally keep alive the Caste consciousness among Hindus to keep them divided.

Anonymous February 2, 2011 at 8:41 AM  

athirathram yajna

http://www.athirathram.org/

Praveen Mandangi February 2, 2011 at 9:07 AM  

కుల వ్యవస్థని మాయం చెయ్యడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. మొన్న మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లినప్పుడు నన్ను అడిగారు "నువ్వు గిరిజనుడివయ్యుండీ పేరు చివర శర్మ అని ఎందుకు పెట్టుకున్నావు? MRPS వాళ్లు పేరు చివర మాదిగ అని పెట్టుకుని బహిరంగంగా తిరగడం లేదా? మాదిగోళ్లకి ఉన్న కులాభిమానం నీకు లేదు" అని. నాకు ఎలాగూ వ్యాపారం ఉంది. రిజర్వేషన్ల పేరుతో వచ్చే కొద్దిపాటి అవకాశాల కోసం కులం కార్డ్ ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను.

కత పవన్ February 2, 2011 at 9:33 AM  

రిజర్వేషన్ల పేరుతో వచ్చే కొద్దిపాటి అవకాశాల కోసం కులం కార్డ్ ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను.
-------
ఈ ఒక్క విశయం లో మాత్రం నువ్వు correct ప్రవీణ్.. good

రాజేష్ జి February 2, 2011 at 9:41 AM  

నిజమే అన్యా!
You are excellent and what you want to shout is reservations meant for needy one, not for self-exploit one. good!

Praveen Mandangi February 2, 2011 at 10:01 AM  

వ్యాపారం చేసేవాళ్లకి రిజర్వేషన్లు అవసరమా? ఇక్కడ నేను చేసినది త్యాగం కాదు. కులం విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే తమిళనాడు, కర్నాటకలలో కులతత్వం ఎక్కువ. అక్కడ బ్రాహ్మణుడికి వేరే ఊరు వెళ్లే ముందు దళితుడు ఎదురొస్తే అపశకునం అనుకుంటారు. మన ఆంధ్ర ప్రదేశ్‌లో అలాంటివి చూడలేదు.

Rao S Lakkaraju February 2, 2011 at 10:02 AM  

Reservations should be like that for the needy.

Praveen Mandangi February 2, 2011 at 10:12 AM  

రిజర్వేషన్ల వల్ల ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య జనాభాలో 1% అనుకుందాం. దళితుల సంఖ్య జనాభాలో 16%, గిరిజనుల సంఖ్య జనాభాలో 8% (చిన్నప్పుడు చదివిన డేటా, ఇప్పుడు జనాభా కొంచెం పెరిగి లేదా తరిగి ఉండొచ్చు). కేవలం 1% మందికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల కోసం 24% మందికి పోటీపడమంటే ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి?

కత పవన్ February 2, 2011 at 10:18 AM  

కాని రిజర్వేషన్ల అంటే ఎవో వాళ్ళ జన్మ హాక్కులా ఫీల్ అవుతున్నారు కదా ప్రవీణు మరీ వాళ్ళనేం అంటావు .. ఇవి సరిపోక ఇంకా కావాలంటున్నారు గా

రాజేష్ జి February 2, 2011 at 10:20 AM  

@ప్రవీణ్ అన్యా
వ్యాపారం కానీ.. మరోటి కానీ..రిజర్వేషన్లు దేనికోసం ఉద్దేశించబడి తొలుత ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశ్యప్రయోజనాలు ఒక వ్యక్తికి కలిగాక వాటిని స్వచందముగా వదులుకోవాలి. అంతేకానీ నీకు లక్ష రూపాయలు వస్తే వదులుకుంటావా అనే కుత్సిత రాగాలు తీయకూడదు.

#..ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే..

I dont agree. Did you forget tripuraneni raamaswamy chowdary period and aftermath's?
#..వేరే ఊరు వెళ్లే ముందు ..
Whereever it is, that is unberable and must be condemnable If it is true!

Praveen Mandangi February 2, 2011 at 10:28 AM  

గూడ్స్ ట్రెయిన్ నుంచి జారిపోయిన బొగ్గు ముక్కలు పేదవాడికి దొరికితే వాటిని అమ్ముకుంటాడు లేదా ఇంటికి తీసుకెళ్లి పొయ్యిలో వేసుకుంటాడు. తెల్ల చొక్కాలు వేసుకున్న ఇద్దరు డబ్బున్నవాళ్లు బొగ్గు ముక్కల కోసం కొట్టుకుంటే వాళ్లని ఎవడూ మార్చలేడు అనుకుని ఇగ్నోర్ చేసేయ్యడమే మేలు. రిజర్వేషన్లు తమ జన్మ హక్కు అనుకునే వైట్ కాలర్‌వాళ్లని మనం ఇంత కంటే ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు.

రాజేష్ జి February 2, 2011 at 10:32 AM  

@..1% మందికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల కోసం..

I believe the % had grown up much.
Also It is not just SC/ST, Now a days reservations are prevailed for all the castes and penetrating to all areas not just gov. jobs.
And tommorow may be to private industries.. a preamble already started!

Wonder fact for me is, in TN everybody is getting reservations except 1-2 castes includes brahmins. That's so funny pain.

రాజేష్ జి February 2, 2011 at 10:37 AM  

@ప్రవీణ్ అన్యా!

Amazing and astute saying!

#.. డబ్బున్నవాళ్లు బొగ్గు..కొట్టుకుంటే ..ఇగ్నోర్ చేసేయ్యడమే మేలు.
Not just ignoring, No one should treated them as ambassadors to the community the belongs to when crying wolf.

Praveen Mandangi February 2, 2011 at 10:39 AM  

లక్ష రూపాయలు ఇస్తే ఫ్రీగా తీసుకోవడం అనే కాన్సెప్ట్ తెచ్చినది మహేశ్ గారు. నేను కాదు. మత ఆధారితమైన కుల ఐడెంటిటీతో వచ్చే రిజర్వేషన్లు మన నాస్తికులకి ఎందుకు అని అప్పట్లో మహేశ్ గారితో వాదించాను.

రాజేష్ జి February 2, 2011 at 10:47 AM  

@..లక్ష రూపాయలు ఇస్తే ఫ్రీగా.. గారు.

I know అన్యా and I meant same! I never even dreamt that you will raise it. chill out!

$మత ఆధారితమైన కుల ఐడెంటిటీతో వచ్చే రిజర్వేషన్లు మన నాస్తికులకి...

Yep, I too wonder! We may need coin and group them as "మత నాస్తికులు -కుల ఆస్తికులు" :).

In fact the same happend in tripuraneni raamaswamy era, that relinquish religion but use your caste to get unite then grow up and get on! very vicious mantra!

Mauli February 2, 2011 at 11:16 AM  

దుర్గేశ్వర గారు

మీరు చూస్తూ ఊరుకోకు౦డా, ఒక ధర్మ౦ ప్రకార౦ చెప్పవలసినది చెప్పారు ..

కాని మీరు బ్రాహ్మణ్యం గురి౦చి మాత్రమే చెప్పారన్న అపోహ తో మళ్ళీ అదే వాద౦ లోకి వెళ్ళడ౦ మ౦చిదా..

అలాగని మీరు బ్రాహ్మణ్యం అనే పద౦ ప్రక్కకు పెట్టి వివరి౦చినా ప్రయోజన౦ సున్నా ...దయచేసి మ౦చి వ్యాసాన్ని వ్యాఖ్యలకు బలి చేయవద్దు ..

...అ౦దరూ మీ అభిప్రాయాలను టపా రూప౦ లో చెప్పడమే మ౦చిది ...నచ్చని వారు దయచేసి వాది౦చవద్దని మనవి..

ఇప్పుడు ౪ కులాలు పై వాద౦, తరువాత ౪ యాసలు మాట్లాడే వారు వాది౦చుకొటే అప్పుడు కూడా, బ్రాహ్మణ తెల౦గాణా, రాయలసీమ కమ్మ అని బోల్డన్ని విషయాలు పె౦డి౦గ్ లో వచ్చేస్తాయి ...

బ్లాగులని ఆ పర౦గా కూడా గ్రూపులు పెట్టే ప్రమాదాలు మనకి అవసరమా...బ్రాహ్మణ్యం మాత్రమే ఎ౦దుకు..అన్ని కులాలు, మతాలు ఒక్కో టపా పెట్టి మన౦ అనుకునేవి వ్రాద్దా౦ ...

ఇ౦కా నయ్య౦ ఇవి టై౦ పాస్ టపాలు అనుకొని యెవ్వరూ భలే వ్రాసారు, సూపర్..అనలేదు ...

Mauli February 2, 2011 at 11:28 AM  

@Praveen

well said...

@all

బ్రాహ్మణ్య౦, రిజర్వేషన్లు కలిపి మాట్లాడి తే...వాళ్ళు బ్రాహ్మణ్య౦ గురి౦చి మాట్లాడి చేసే పొరపాటు ..రిజర్వేషన్లు గురి౦చి మాట్లాడి మనమూ చెయ్యకూడదనే ..నా పై వ్యాఖ్య ..

ఊరికే వచ్చేవి వదులుకొనే వారు సమాజ౦ లో బహు తక్కువ ..అది బ్రాహ్మణులయినా...ఇ౦కా మిగిలిన వారైనా ..ఇన్ని మాట్లాడే మనము..ప్రభుత్వాన్ని ఆర్ధిక స్తితి ప్రకార౦ రిజర్వేషన్లు అమలు చెయ్యమని అడిగామా..ఒక్క ఎలక్షన్ అన్నా బహిష్కరి౦చామా...తీసికొనే వారితో వాది౦చడ౦ వల్ల ప్రయోజన౦ ఏము౦ది ..వారికి మనకి దూర౦ పె౦చుకోవడ౦ తప్ప ...

Durgeswara gaaru,

తప్పు గా ఉ౦టే ఈ వ్యాఖ్య లు తొలగి౦చగలరు ..

కత పవన్ February 2, 2011 at 2:23 PM  

రిజర్వేషన్లు తమ జన్మ హక్కు అనుకునే వైట్ కాలర్‌వాళ్లని మనం ఇంత కంటే ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు.
--------
excellent praveen totally agree with you .

Praveen Mandangi February 2, 2011 at 5:18 PM  

మౌలి గారు అన్నట్టు ఫ్రీగా ఇచ్చేవాళ్లదే తప్పు కానీ తీసుకునేవాళ్లది కాదు కదా. రిజర్వేషన్లకి వ్యవస్థ యొక్క ఆమోదం ఉంది. దొంగతనం చేసేవాడు లేదా వ్యభిచారం చేసేవాడు ఆ పని చేసే ముందు కొంచెమైనా భయపడి ఆ తరువాత ఆ పని చేస్తాడు. కానీ రిజర్వేషన్లు తీసుకునేవాడు అలా సంకోచించడు కదా. వ్యవస్థ యొక్క ఆమోదం ఉన్న పనులు చేసేటప్పుడు ఎవడికీ సంకోచం కలగదు. డబ్బున్న కుటుంబంలో పుట్టి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం చేసేవాళ్లకైనా ఇంతే.

Anonymous February 2, 2011 at 5:43 PM  

>> రిజర్వేషన్ల పేరుతో వచ్చే కొద్దిపాటి అవకాశాల కోసం కులం కార్డ్ ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను.>>
రిజర్వేషన్లు వద్దనుకుంటే మాత్రం, నాయుడు, రెడ్డి, రాజు, గుప్తా అని ఆయా కులం అవకున్నా, పేరుకు తగిలించుకోవాలా? శర్మ అనే ఎందుకు తగిలించుకున్నారనే ప్రశ్నకు మీ సమాధానం పేలవంగా, సూటిగాలేదు. నాస్థికుడు అని గొప్పలు(అయినట్టు) చెప్పుకున్నా మీకు ఆ కులం మీద అంతర్గతంగా వున్న దురభిమానం అనిపిస్తోంది. అసలు బ్రామ్మలే చాలామంది అలా కులసూచిత లాస్ట్ నేమ్ బాహాటంగా ప్రదర్శించకుండా వుంటే, ఏదీ కాని మీరు తగిలించుకుని బ్లాగుల్లో నిర్లజ్జగా వూరేగడం, పిచ్చోళ్ళు దారిలో కనపడిన ప్లాస్టిక్ డిప్ప,కోడీకలు అలకరించుకుని తిరుగడంలా వుంది. నిజమైన నాస్థిక మేధావే ఐతే మీ ఈ వున్మాదానికి దారితీసిన బలహీనమైన పర్థితులను చెప్పగలరు. మీ అభిమాన నగ్న-బ్లాగ్-స్పార్టకస్ కూడా అలా ఓ రెడ్డి, చౌదరి, గుప్తా, శర్మ, లను తగిలించుకుని కులగజ్జి మీదైన పరిష్కారం ఫాలోఅయిపోవచ్చు కదా?

Praveen Mandangi February 2, 2011 at 5:53 PM  

పేరు చివర మాదిగ అని పెట్టుకుంటే దళితులకి గౌరవం రాదు అని MRPSవాళ్లకి చెప్పడానికే నా పేరు చివర శర్మ అని పెట్టుకున్నాను. MRPSవాళ్లు తమకి అందే కొద్దిపాటి రిజర్వేషన్ అవకాశాల కోసం రాజకీయ పార్టీల వెనుకాల తిరుగుతారు. వాళ్లకి కావలసింది కులం పేరుతో వచ్చే కొద్దిపాటి సౌకర్యాలు కానీ సామాజిక సమానత్వం కాదు.

Praveen Mandangi February 2, 2011 at 6:16 PM  

దళితవాదాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఒక కులంలోని డబ్బున్నవాళ్లు తమ కులంలోని పేదవాళ్లతో పెళ్లి సంభంధం కలుపుకోవడానికి ఒప్పుకోరు. అది దళితులైనా, అగ్రకులాలవాళ్లైనా. పెళ్లి చేసుకుంటే జీవితంతో పాటు ఆస్తిలో కూడా భాగం వస్తుంది. కొన్ని కుటుంబాల్లో అయితే తమ ఆస్తి బయటివాళ్లకి పోకూడదని మేనరిక వివాహాలు చేసుకుంటారు. తమ ఆస్తిని వేరేవాళ్లకి ఇవ్వడం ఇష్టం లేనివాళ్లు తమకి ఉన్న రిజర్వేషన్ అవకాశాలని తమ కంటే పేదవాళ్లకి ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంటారు? ఇలాంటి వాళ్లే దళిత ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్నారు. వీళ్లు రాజకీయ పార్టీలకి బాడుగ నాయకులు అనే నిజం చెపితే కేసు వేస్తారు.

Malakpet Rowdy February 2, 2011 at 6:42 PM  

దళితులని ఏమీ అనకుండా "దళిత్ క్రిస్టియన్ ఎజెండా" అనే మాట వాడినందుకు కేసు పెట్టి భంగపడిన పెద్దమనిషా బ్రాహ్మినిజాన్నంటే బ్రాహ్మణులని అన్నట్టుకాదని అంటొంది? :))

Praveen Mandangi February 2, 2011 at 7:23 PM  

Mahesh was never inclined towards christianity. As his disciple, I can clearly certify it.

Anonymous February 2, 2011 at 8:30 PM  

>>As his disciple, I can clearly certify it.

"కోతి బట్టి తెచ్చి క్రొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నితిహినునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరమ వినుర వేమ !"

ROFL

Anonymous February 3, 2011 at 12:46 AM  

నేను దుర్గేశ్వరగారి అభిమానిని. కానీ ఈ విషయంలో నా అవగాహనా, ఆయన అవగాహనా కొంత సంవదిస్తాయి కానీ పూర్తిగా ఒకటి కావు. అయినా నేను ఇక్కడ ఆ విషయమై వ్యాఖ్య వ్రాయబోవడం లేదు. నేను చెప్పాలంటే చాలా ఉంది. అదంతా ఇక్కడ సాధ్యం కాదు.

ఇహపోతే వీకెండ్ పొలిటీషియన్ గారి వ్యాఖ్య :-

క్ఌప్తంగా వ్రాస్తాను. కానీ ఇదే సర్వస్వం కాదు.

వర్ణమూ, కులమూ ఒకటి కాదు. వర్ణాలు ఏ దేశంలో నైనా, ఏ కాలంలో నైనా నాలుగే. కులాలు మట్టుకు కొన్నివేలుంటాయి. ఎందుకంటే కులాలన్నీ ట్రేడ్ యూనియన్లు మాత్రమే. ఒకే వృత్తికి మనమెన్ని ట్రేడ్ యూనియన్ల నైనా సృష్టించుకోవచ్చు. వర్ణాల్నిమాత్రం సృష్టించలేం. నాశనమూ చేయలేం. అవి ఉన్నాయంతే ! ఎందుకంటే అవి ప్రకృతిలో సహజంగా ఉన్న అనాది సంస్కారాల సనాతన Elements. వృణోతి (He selects) ఇతి వర్ణమ్. వర్ణం అంటే ఎంచుకునేది. మనుషులు తమ స్వభావం ద్వారా, తమ అభిరుచులూ, ఇష్టానిష్టాలూ, అనుభవాలూ, సంస్కారాల ద్వారా కొన్ని సంకల్పిత/ అసంల్పిత ఎంపికలు (conscious or unconscious choices) చేసుకుంటారు. వాటిని సకలప్రాణి హృదయ కమల నివాసుడూ, సర్వాంతర్యామి అయిన భగవంతుడు రహస్యంగా గ్రహిస్తాడు. అందు కనుగుణంగా మరణానంతరం వారి ఆత్మల్ని వారి సంస్కారానికి తగిన తల్లిదండ్రుల గర్భాలలో ప్రవేశపెడతాడు. కర్మఫలా న్ననుసరించి కుటుంబాలలోనూ, కులాల్లోనూ జన్మించడం అంటే ఇదే. పూర్వకాలంలో మనుషులక్కూడా జంతువులకు మల్లే సామూహికత్వాలే తప్ప వ్యక్తిత్వాలు ఉండేవి కావు. కనుక ఒక కులస్థులంతా దాదాపు ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉండేవారు. కనుక ఈ పని (సంస్కారానికి తగిన గుంపులోకి తీసుకెళ్ళి పడేయడం) భగవంతుడికి ఇదివఱకు సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు వ్యక్తులు మానసికంగా తమ సమూహం నుంచి వేఱుపడ్డారు గనుకా, గుంపులుగా ఆలోచించడం లేదు గనుకా ఆయన ఇప్పుడా పనిని కుటుంబాల ప్రాతిపదికన చేస్తున్నాడు.

బ్రాహ్మణత్వం ఒక వ్యక్తి యొక్క జ్ఞానస్థాయిని బట్టే కాక అనేకమైన ఇతరేతర వేరియబుల్స్ ద్వారా కూడా సిద్ధిస్తుంది. కనుక జ్ఞాన బ్రాహ్మణులతో పాటు వంశపారంపరికంగా బ్రాహ్మణులమని చెప్పుకుంటున్నవారంతా కూడా నిజంగా బ్రాహ్మణులే. అయితే బ్రాహ్మణత్వం అనేది ప్రయోగాత్మక పరీక్ష (Practicals' exam) వ్రాయడానికి ఒక ప్రవేశ యోగ్యతే (Hall Ticket) తప్ప అదొక పట్టా (Degree) కాదు. పట్టా వేఱే ఉంది. కొంతమంది ఈ Hall Ticket లేకుండానే తరగతిగదిలోకి నేరుగా వెళ్ళి కూర్చుని పట్టా పొందగలరు. పట్టా చేతికొచ్చాక Hall Ticket తో పనిలేదు.

రాజేష్ జి February 3, 2011 at 4:23 AM  

@ప్రవీణ్ అన్యా

#పేరు చివర మాదిగ..గౌరవం రాదు అని MRPS..శర్మ..
మీరిచ్చిన పై స.ధా కొద్దిగా సందేహాస్పదంగా ఉన్నది. 2002-03 ప్రాంతంలో రాణి శివశంకర శర్మ గారు రాసిన "ది లాస్ట్ బ్రాహ్మిన్ " సమయంలో పెద్దరచ్చ జరిగింది. ముఖ్యంగా వార్తా, జ్యోతులలో స్వ.ప్ర. మేథావులు పు౦ఖాను పుంఖాలుగా బ్రాహ్మణ కుల౦ మీద చెత్తచెత్తగా రాసేవారు. అదే సమయంలో దళితులకు మేలు చేస్తానంటూ పేరులో వెనక "శర్మ" ఏంటి అని కొందరు మేతావాలు అడగ్గా ఆయన దానికి మీరూ మాదిగ అని పెట్టుకుంటున్నారు కదా, అలానే అది అన్నారు. దీనికి అప్పుడు ఆ మేథావులు కనిపెట్టింది "మాదిగ" అనేది ఆత్మగౌరవ౦ కోసం, కులం కాదు అని. అప్పుడు శర్మగారు కూడా ఇప్పుడు మేం ఉన్న పరిస్థితులలో ఇదీ ఆత్మగౌరవమే అని. ఆ తర్వాత ఈ వాదాలు సద్దుమణిగాయి అనుకుంటా!

ఆ తర్వాత కొద్దిసంవత్సరాలకి అదే స్వ.ప్ర మేథావి వర్గానికి చెందిన రంగనాయకమ్మ కొత్త వాదాన్ని తెచ్చారు. అది నవసమాజ నిర్మాణ౦ జరిగి సామాజిక అసమతుల్యతలు తొలగిపోవాలంటే బ్రాహ్మణులు పారిశుద్ధ్య పనులు చేయాలి అని.. మరి కార్ల్ మార్క్స్ చెప్పాడేమో ఇది.
అయితే అలా అన్న ఆమె అదే వాదాన్ని ఇప్పటి బలిసినవర్గాలకి వర్తింపజేయలేక పోయింది. మరి ఆ వర్గాలనలాంటే భయమో, ఇతర కారణమో తెలియదు! పోనీ అది నిజమనుకున్నా 2007-08 ప్రాంతంలో వచ్చిన ఫ్రాంకోయిస్ అనే ఫ్రెంచ్ జర్నలిస్ట్ చేసిన పరిశోధన ప్రకారం దేశరాజధాని మరియు మిగిలిన చోట్ల బ్రాహ్మణులు అన్ని పనులు చేస్తున్నారని. అందులో ఒకటి సులభశాలని వారే నిర్వహిస్తున్నారని. మరి నవసమాజ స్తాపన జరిగిందా?
అదే మూసలో వచ్చిందే ఈ "శర్మ" అనేది కూడా. ఆమె చెప్పింది ఇలా "శర్మ అనేది బ్రాహ్మణుల గౌరవనామ౦, మాదిగ అనేది అగౌరవ వాచకంగా వాడుతారు. అందుకని మాదిగ బదులు "శర్మ" అని పెట్టుకోవాలని. మరి ఎవరు ఎంతవరకు పాటించారో తెలీదు. అసలు అగౌరవ వాచకాన్ని గౌరవప్రదం చేయడానికి కృషి చేయాలి గాని ఇలా వితండవాదాలు తెస్తే ఎవరికి మింగుడుపడుతాయి? నాకు తెలిసి ఆమె ఉద్దేశ్యం బ్రాహ్మల్ని ఇంకేదో ఏదేదో చేయాలని అనుకుంటా!

కొసమెరుపు: మొదలుపేర్కొన్న శర్మనుంచి, తర్వాత శర్మ ఎందుకని ప్రస్నిచిన కొంతమేథావులు, ఆ తర్వాత ఈ రంగనాయకమ్మ వరకు అందరూ పుట్టుకతో బ్రాహ్మణులే! కాకపొతే వీరంతా బ్రాహ్మణ్ కులాన్ని వదిలేసి అదే కులాన్ని నిరంతరం ద్వేషిస్తూ బతికేవాళ్ళు. అంటే నే చెప్పోచేది ఏంటి అంటే కూర్చున్న కొమ్మలు మావే.. అవి నరికినవారు మావారే అని! ఇందులో అన్యకుల దూషణ ఏ మాత్రం లేదని :).

Praveen Mandangi February 3, 2011 at 4:33 AM  

నువ్వు రంగనాయకమ్మ గారి రచనలు చదివావో లేదో? ఇప్పటికీ చాలా ప్రాంతాలలో పారిశుధ్య పనివాళ్లు చేతులకి గ్లోవ్స్ వేసుకోకుండా, ముఖానికి ముసుగులు వేసుకోకుండా పారిశుధ్య పనులు చేస్తున్నారు. అగ్రకులాలవాళ్లకి శరీరానికి కవచాలు పారిశుధ్య పని చెయ్యడానికి కూడా నామోషీయే. ఈ శ్రమ విభజనని ఆవిడ విమర్శించారు. రంగనాయకమ్మ గారు దళితురాలు కాదు. ఆవిడ భూస్వాముల కులమైన వెలమదొరల కుటుంబం నుంచి వచ్చారు. భూస్వాముల కులం నుంచి వచ్చినవాళ్లకి ఉన్న సామాజిక చైతన్యం కొంత మంది స్వయం ప్రకటిత దళిత నాయకులకి లేదు.

రాజేష్ జి February 3, 2011 at 4:52 AM  

$రంగనాయకమ్మ..వెలమ..
ఊప్స్.. my mistake! just confused with saraswati gora, mother of dr.samaram. బ్రాహ్మల్ని తెగ విమర్శిస్తుంటే ఖచ్చితంగా ఈవిడ బ్రహ్మలామే అనుకునేరకంగా తయారయానేమో! :)

#..గ్లోవ్స్ వేసుకోకుండా, ముఖానికి ముసుగులు వేసుకోకుండా..
Whose problem is this? Anyhow, this is not my main point
#భూస్వాముల..ప్రకటిత దళిత నాయకులకి లేదు
May be!

durgeswara February 3, 2011 at 5:39 AM  

మిత్రులందరికీ
ఒకమనవి . నాది పాత డొక్కుసిస్టమ్ .అదీగాక బి ఎస్ ఎన్ ఎల్ వాడిచ్చిన విల్ ఫోన్ తో కనెక్షన్ చాలాస్లో.
ఆపై నేను దైవకార్యక్రమాలు,పొట్టకూటికోసం చేసుకోవలసిన పనులు చూసుకుని ఆతరువాత సిస్టమ్ దగ్గరకొస్తుంటాను. మోడరేషన్ పెడితే చర్చలలో పాల్గొనదలచిన వారికి ఇబ్బంది కనుక మోడరేషన్ పెట్టటం లేదు. సమాజంలో నావంతుగా నాస్పందనలను వ్రాసినప్పుడు చాలామంది మిట్రులు చక్కని చర్చలు చేస్తున్నారు. అయితే కొద్దిమంది ఆవేశానికి లోనై వ్యక్తిగత విమర్షలు ధూషణలతో తమ సమయాన్ని వృధాచేసుకోవటమే కాక అసలు చర్చ పక్కదారి పట్టేలాచేస్తున్నారు. దీనిని నేనంగీకరించను అని పలుమారులు విజ్ఞప్తి చేసి ఉన్నాను. దయచేసి చర్చను పక్కదారి పట్టనివ్వకుండా లక్ష్యంవైపు సాగనివ్వమని మరొకసారి వేడుకుంటున్నాను.ధన్యవాదములు

Praveen Mandangi February 3, 2011 at 6:35 AM  

Practically how many of the people can follow brahmin dharma? If you really believe in pure brahmin dharma, vedic schools should be introduced in place of schools and colleges.

tankman February 3, 2011 at 7:48 AM  

బ్రాహ్మణులపై కాదు ధర్మంపైద్వేషమే అసలు కారణం ....అవునండి ధర్మం పైనే ద్వేషం అంతా..మనిషిని వాడి గుణగాణాలని బట్టి కాకుండా వాడి పుట్టుకని బట్టి గౌరవించమని చెప్పే ధర్మం మీదే ద్వేషం.

/"It is believed that if cows and people who perform the Yajnas and teach to society are good, the whole world would get benefited."/

ఏమి యజ్ఞయాగాదులు మాష్టారు? ఇంద్ర మూవీ లో వర్షం పడాలని చిరంజీవి యజ్ఞం చేయిస్తాడు...వెంటనే వర్షం పడుతుంది ..అలాంటివా?

/"ఇంకా మనం కలియుగం ఆదిలో ఉన్నాము. అందుకేనేమో, కొంత్మంది బ్రాహ్మణులైనా సంధ్యావందనం చేసుకుంటున్నారు."/ ... అవునండి బ్రాహ్మణులు మారుతున్నారు ..బయట ప్రపంచం చూస్తున్నారు , హేతు వాదాన్ని ఒంటబట్టిన్చుకున్తున్నారు, కులం రొచ్చు లేకుండా వేరే కులాల వారిని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు ...త్వరలో ఈ సంధ్యా వందనం చేసే వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది అని ఆశిద్దాం.

/"చాలా చక్కగా చెప్పారు. అన్ని రంగాల్లో అంతో, ఇంతో నిబద్దతతో ఉన్నది బ్రాహ్మణులే. కబ్జాలు చేసి, అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బితినే వాళ్ళలో బ్రాహ్మణులు ఎవరూ లేరు."/ అంటే మీరు కూడా కాంగ్రెస్సు వాళ్ళ లాగే ప.వి. నరసింహారావు గారిని మర్చిపోతున్నారా?

/"వేదవిహితమైనదే ధర్మము, వేదం ప్రతి ఒక్కడూ చదివలేడు (ఎలాగైతే హెవీ డ్యూటి విద్యుత్ స్తంభం పై తీగ తెగిపోతే అర్హత శిక్షణ లేనివాడు ఎలా దానిని ముట్టుకోలేడో/ ఆ వ్యక్తి క్షేమం కోసం ఎలా ముట్టుకోనివ్వరో అలా) ధర్మ శాస్త్ర వ్యాఖ్యానాలు, పురాణాలు ఇతిహాసాలు చదవండి తెలుస్తుంది.
కుతర్కం చేయడం మానండి, మీకు సనాతన ధర్మం పై నమ్మకంలేకపోతే లేకపోయె అనవసర చర్చలకు తావీయకండి. మిమ్మల్ని ఎవరూ మారమని చెప్పరు ఆ అవసరం కూడా లేదు మీ నమ్మకాలు మీవి, అవసరం వచ్చినప్పుడూ తెలుస్తుంది మీకు."/ ... బాగా సెలవిచ్చారు...నిజమే వేదాలు కరెంటు తీగ లాంటివేమో...అందుకునే వాటి జోలికి ఎవడు వెళ్లడం మానేసాడు...మీరేమో వెళ్లి వాటిని ముట్టుకో అంటున్నారు ....మమ్మల్ని మారమని మీ లాగే వేదాల పేరు చెప్పి RSS వాళ్ళు చెబుతున్నారు ..మారి కుల వివక్ష చూపించాలా ఒద్దా అని నాలా చాలా మంది ఆలోచిస్తున్నారు ..మీరేమంటారు?

durgeswara February 3, 2011 at 8:12 AM  

రోజుకు రెండుసార్లు స్నానమెందుకు రెండేనెలలకొకసారి గబ్బుపట్టినదాకా ఆగి మరీ చేస్తాము అంటే ఎవరొద్ద చెబుతారు మీకు. అది మీఇష్టం . తేనెటీగకు మకరందమిష్టమైతే ఇంకొంచెం దిగజారితే ఆయాజంతువులకు ఆయాపదార్ధాలిష్టం .అదికాదు సమస్య తేనెటీగలు కూడా మకరందం మానుకుని మలినాలే తినాలి అని డిమాండ్ చేయటం బాగుంటుందా ? మానసికంగా ఎప్పుడో మెకాలే మానసికపుత్రులుగా మారినవారికి ధర్మం అంటే ఏమర్ధమవుతుంది ?
ఆఫ్ నాలెడ్జీ చాలాప్రమాదకరం .

tankman February 3, 2011 at 8:39 AM  

అది నిజమేలెండి, half knowledge is dangerous, కాని ప్రజలకి అవగాహన తీసుకురావలసిన పని బ్రాహ్మణుల మీదే పడింది కదండీ. నేర్చుకొనే వాడికి చాలా సందేహాలు వస్తుంటాయి , అవి విడమరిచి నెమ్మదిగా చెబితే తీరుతాయి కదా...ఓపిక లేని వాళ్ళు సరైన గురువులు కాలేరు ఎప్పటికి.

Rao S Lakkaraju February 3, 2011 at 8:43 AM  

@sanju-The King గారూ

పుట్టుకని బట్టి గౌరవించమని చెప్పే ధర్మం మీదే ద్వేషం.
---------
No wonder. అందుకనే తల్లి తండ్రుల మీద గౌరవం తగ్గి పోతోంది. చదువు నేర్పిన గురువుల మీద సరే సరి.

ఆ ధర్మాన్ని పాటించవలసిన అవుసరం లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళెవరూ పట్టుకుని జరిమానా వెయ్యరు. కానీ ద్వేషించవలసిన అవుసరం లేదు.

రాజేష్ జి February 3, 2011 at 8:59 AM  

Durgeswara gaaru,
Please forgive me this time!

$sanju -The king!!!
#..ప్రజలకి అవగాహన..పని బ్రాహ్మణుల మీదే పడింది ..విడమరిచి నెమ్మదిగా చెబితే తీరుతాయి

బాబూ చిట్టి! మా తర౦ ఈ భారం మోయలేదు, మాకూ పెళ్ళాం బిడ్డా ఉన్నారు! మీద పడటాలు..కింద పడటాలు వద్దులే!

ఏం అన్నీ ఎవరో ఒకరు నేర్పిస్తే నేర్చుకున్నారా? వీటికి మటుకు ఇంకోల్లవసరం. పెడమరుపులకి విడమరిచి చెబితే అస్సలు అర్థం కావులే!

tankman February 3, 2011 at 9:03 AM  

@రాజేష్ .. :)

veera murthy (satya) February 3, 2011 at 9:42 AM  
This comment has been removed by the author.
Malakpet Rowdy February 3, 2011 at 8:39 PM  

మనిషిని వాడి గుణగాణాలని బట్టి కాకుండా వాడి పుట్టుకని బట్టి గౌరవించమని చెప్పే ధర్మం మీదే ద్వేషం.
________________________________________________________

ఏ ధర్మం చెప్పింది అలా?


ఇంద్ర మూవీ లో వర్షం పడాలని చిరంజీవి యజ్ఞం చేయిస్తాడు...వెంటనే వర్షం పడుతుంది ..అలాంటివా?
_________________________________________________________

అబ్బే కాదు. అదేదో తొక్కలో సినీమాలో బాబూమోహన్ చేయించే యజ్ఞం. Happy?


త్వరలో ఈ సంధ్యా వందనం చేసే వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది అని ఆశిద్దాం.
________________________________________

దానివల్ల మీకొచ్చిన నష్టమేంటో?


అంటే మీరు కూడా కాంగ్రెస్సు వాళ్ళ లాగే ప.వి. నరసింహారావు గారిని మర్చిపోతున్నారా?
_________________________________________________

సరే మీ దగ్గర ఉన్న ఆధారాలేవో చూపించండి మరి.

మారి కుల వివక్ష చూపించాలా ఒద్దా అని నాలా చాలా మంది ఆలోచిస్తున్నారు ..మీరేమంటారు?
____________________________________________________

ఆలోచించటం మానెయ్యండి.

Malakpet Rowdy February 3, 2011 at 8:48 PM  

పెడమరుపులకి విడమరిచి చెబితే అస్సలు అర్థం కావులే!
_____________________________________

LOL

durgeswara February 3, 2011 at 11:19 PM  

నేర్చుకోవాలి అనుకునేవానికి ఆసక్తి ఉంటుంది .ప్రశ్నిస్తాడు.
కానీ అసూయతో విమర్శించడు . ఇక మీరు శిష్యలక్షణాలను కలిగిలేరు . ఇంకాముఖ్యమయిన విషయమేమిటంటే మేము మీకు నేర్పటానికి గురువులముకాదు. వ్యక్తిగా నాధర్మం పట్ల నానిబద్దతను చూపిస్తున్నానంతే !

tankman February 4, 2011 at 12:57 AM  

@durgeswara "ఇక ప్రతిసమాజం లోనూ ఉండే సామాజి విభాగాలలాగే ఈ పుణ్యభూమిలో శ్రమ విభజన వర్ణాశ్రమ రూపంలో జరిగింది" అని మీరే అన్నారు, నాకు తెలిసినంతవరకూ అందరికి విషయాలని బోధించే శ్రమ బ్రాహ్మలకి కి అప్పగించాపడింది...నాకు తెలిసింది తప్పు అయితే నన్ను సరిదిద్దవలసిన్డిగా కోరుతున్నాను.

/*ఆలోచించటం మానెయ్యండి.*/
ఆలోచించడం మానేస్తే అవతలి వ్యక్తి చెబుతున్నది నాకు అర్థం కాదు, అల అర్థం కాకపోతే ఇద్దరి మధ్య ఆలోచనా వ్యత్యాసం తరగదు. ఆలోచించడం మానేసి చెప్పింది విను అంటే కథ మళ్ళి మొదటికే వస్తుంది...బ్రహ్మలు ఇంకోల్లని అలోచిన్చుకోనివ్వారు, విద్య చెప్పారు, ఎదగానివ్వారు అని .

తరతరాలుగా బ్రహ్మలు మిగిలిన కులాల వారిని తోక్కిపెడుతున్నారు లాంటి generalizing sweeping statements ఇవ్వలేను. ఎందుకంటే నేను తరతరాలుగా బ్రతికిలేను...నేను పుట్టినదగ్గరనుంచి వింటున్నది ఏమంటే...ఎప్పటినుంచో బ్రహ్మలు అందరిని తొక్కిపెట్టారు...కాబట్టి వాళ్ళు ద్వేశించబడటానికి అర్హులు లాంటి విషయాలు, ఈ బ్లాగ్ లో కానీ రాజేష్ గారి బ్లాగ్ లో కాని ఈ ద్వేషం మీద చర్చ సాగింది. ఈ బ్లాగ్ లో ద్వేషం దర్మం మీద తప్ప అసలు ద్వేషం బ్రాహ్మణుల మీద కాదు అని చర్చించారు...అసలు ఆ ధర్మాన్ని అయిన ఎందుకు ద్వేషిస్తున్నారు? అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను...మలక్పేట్ రౌడీ గారు చెప్పినట్టు ఆలోచించడం మానేస్తే అర్థం అయ్యే విషయం అని నేను అనుకోడం లేదు .

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 4, 2011 at 1:54 AM  

LBS తాడేపల్లి గారు,

మీ సమాధానానికి ధన్యవాదాలు. మీరు ముందుగానే ఉటంకించినట్టుగా అదే సర్వస్వం కాకపోయినా మీ అభిప్రాయాల్ని కొంతవరకైనా చెప్పినందుకు ధన్యవాదాలు.

దురదృష్టవశాత్తూ, నాప్రశ్నలకి సమాధానం దొరకలేదు. మీ వ్యాఖ్యలో ఈ కింది వాక్యం నాకు చాలా బాగా నచ్చింది.

>>"మనుషులు తమ స్వభావం ద్వారా, తమ అభిరుచులూ, ఇష్టానిష్టాలూ, అనుభవాలూ, సంస్కారాల ద్వారా కొన్ని సంకల్పిత/ అసంల్పిత ఎంపికలు (conscious or unconscious choices) చేసుకుంటారు."

అసలు సనాతన ధర్మమని చెప్పబడుతున్న దాని మీద నేను వేసిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం మీరు తప్ప ఎవరూ చెయ్యకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Anonymous February 4, 2011 at 3:18 AM  

>>సనాతన ధర్మమని చెప్పబడుతున్న దాని మీద నేను వేసిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం మీరు తప్ప ఎవరూ చెయ్యకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది.>>
మాకలాంటి ఆశ్చర్యాలు, తబ్బిబ్బులూ లేవు. మీ తింగరి ప్రశ్నలకు ఎవరో ఒకరు స్పందించారని సంతోషించండి, లేదంటే ప్రవీన్ అన్యాతోనో, నగ్నస్పార్టక్స్ గారితోనో తగురీతిలో స్పందింపచేయాల్సొస్తుంది.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 4, 2011 at 3:51 AM  

@Anonymous,

looolz...:))

Malakpet Rowdy February 4, 2011 at 4:10 AM  

తరతరాలుగా బ్రహ్మలు మిగిలిన కులాల వారిని తోక్కిపెడుతున్నారు లాంటి generalizing sweeping statements ఇవ్వలేను.
____________________________________________________

What about these sweeping statements then?

మనిషిని వపుట్టుకని బట్టి గౌరవించమని చెప్పే ధర్మం.
________________________________________________________

ఇంద్ర మూవీ లో వర్షం పడాలని చిరంజీవి యజ్ఞం
________________________________________________________


త్వరలో ఈ సంధ్యా వందనం చేసే వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది అని ఆశిద్దాం.

Malakpet Rowdy February 4, 2011 at 4:12 AM  

లేదంటే ప్రవీన్ అన్యాతోనో, నగ్నస్పార్టక్స్ గారితోనో తగురీతిలో స్పందింపచేయాల్సొస్తుంది.
___________________________________________________

LOLOZ, as such your "Anyaa" is weekend's leader. So it might not be a bad idea at all.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 4, 2011 at 4:18 AM  

Loolz Malak,

I thought you know better than that...

hmm.. you keep your opinion.. I will keep my observations..

Malakpet Rowdy February 4, 2011 at 4:29 AM  

Yeah I do know much better than that about your double game and pretentions. What I said was about only a part of your dirtier side :) You know very well there is much more to it.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 4, 2011 at 4:43 AM  

hmm..
Blessed as I am..I am aware of dirtier side in me and have a control on it:) Sooo.. you can relax

I am glad that, I am seeing only one side in you and honestly.. I don't think its dirty..

Malakpet Rowdy February 4, 2011 at 4:50 AM  

Ahha, only when you wear your wild ranger mask :))

Malakpet Rowdy February 4, 2011 at 4:51 AM  

I mean, you get to see my dirty side only when you wear your wild ranger mask!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 4, 2011 at 4:55 AM  

ohhh.. :))))

That you can ask Wild ranger himself buddy.

Just as in you, I see only one side in him too and that too is not dirty ;)

Malakpet Rowdy February 4, 2011 at 4:58 AM  

Yeah :)))

Thats what I am doing buddy. Speaking with Wild Ranger in his Weekend mask :))

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) February 4, 2011 at 5:07 AM  

I have no problem with your opinions. I will leave it to you and Wild to sort it out between you.

btw, how are the things going? hope wheather is fine in the parts that you are in..

got to go.. c u later..

Malakpet Rowdy February 4, 2011 at 5:09 AM  

Pretty much fine. Thanks for asking.

Yeah sure see ya in your wild ranger mask soon :)

veera murthy (satya) February 4, 2011 at 7:12 AM  

మనకి పాలిచ్చి పోషించేదేదైనా తల్లితో సమానం కాబట్టి గోవుకి శుభం కలుగాలి...(అలాగే మనపోషణ కోసం కష్టపడే వాన్ని తండ్రితో సమానం గా చూస్తాం..అందుకే ఎద్దులకి తండ్రిలాంటి గౌరవమిస్తారు.)
బ్రహ్మ జ్ఞానం కలిగిన వాన్ని(ఆత్మా అనాత్మా వివేకం కలిగి, పరమాత్మ పట్ల విజ్ఞ్తత కలిగిన వాడు) మాత్రమే బ్రాహ్మణుడన్నది వేదం..నిజంగా వాడికి శుభం జరగాలి...

సమాజాన్ని...
రక్షించడానికి క్షత్రియులు(పాలన, రక్షణ)
అభివృద్దికి వైశ్యులు (వాణిజ్యం, గోసంరక్షణం)
మార్గ దర్శ్ణణానికి బ్రాహ్మ్ణణులు (వైదిక మైన యజ్ఞ-క్రతువులు ,సన్మార్గదర్శణం)
మహత్తరమైన సేవా కార్యానికి శూద్రులు ( క్షుద్రమైన పనులతో గొప్పదైన సేవ)..


(వైదికం లో పంచములు లేరు...)

ఇవి వారి గుణాలని కర్మలని బట్టి ఎంచుకునే మార్గాలు...జన్మ తహా వచ్చేవి కావు....

కృపాచార్యుడు బ్రాహ్మణుడు ...కానినేర్చింది..నేర్పింది క్షత్రియ విద్య!
గాందీగారు వైశ్యుడు...కాని నిమ్మకాయ ముక్కలతో కుష్టి వారికి చేసింది క్షుద్రమైన(తక్కువ స్థాయికి దిగి చేసే) సేవ!

వృత్తిని బట్టి కులం ... కులం, చేసే వృత్తిలో నైపుణ్యాన్ని మెరుగు పరిచి, వారి ముందు తరాలకి అందించడానికి పని కొస్తుంది...(కొట్టుకొని చావడానికి కాదు!)

ఓ ఉన్నత కులస్తుడు బాటా చెప్పుల షాప్ లో పని చేస్తే వాడిది ఏ కులమనాలో...
ఓ ఉన్నత కులస్తురాలు బ్యూటీ సెలూన్ పెడితే, తనది ఏ కులమనాలో...
కిరాణా కొట్టు పెట్టుకుంటే ఏ కులమనాలో ...
బట్టల షాప్ పెడితే ఏకులమనాలో..
మునిస్పల్ ఉద్యోగిది ఏ కులమో...
పోలిస్ వాడిది ఏకులమో...
వారి వారి విజ్ఞతకి సంబంధిచిన విషయం...
పని ఏదైనా చిన్నది కాదు...అది పరమాత్మతో సమానం..

దాదాపు వెయ్యి సంవత్సరాలు పరాయి పాలనలో బ్రతికీ బ్రతికీ ఇప్పుడిప్పుడే దార్మిక సంస్కృతిని సహేతుకంగాతెలుసు కుంటున్నారు జనాలు...నాకు తెలిసి ఇంకా సంమయం పడుతుంది...
జాబాలి లాంటి నాస్తికులు రాముని కాలం లో కూడా ఉన్నట్టే భావదారిద్ర్యం తో కూడిన నాస్తికులు ఇఫ్ఫుడూ ఉన్నారు...వారి గోల వారిది...


సహేతుకంగా అలోచించాలన్నా కనీస సంస్కారం అవసరం...

ఇలాంటి మంచి బ్లోగ్ ని useless debates కి ఉపయోగించడం బాధాకరం..

-satya

durgeswara February 4, 2011 at 8:30 AM  

సనాతన హైందవ ధర్మం అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? సనాతన కాలం నుండీ పరిణతి చెందుతూ, మనతోటీ మన ముందు తరాలతోటీ ఇంకా సంస్కరించబడబోయే మన హైందవ సమాజ ధర్మమనా?

లేక

ఎప్పుడో సనాతన కాలంలో అద్భుతంగా నిర్వచించబడి తరువాత ధ్వంసమయిపోయిన ధర్మమనా? ఒకవేళ మీ ఉద్దెశ్యం ఇదయితే సనాతన కాలం తరువాత మన హైందవ సమాజం అతి దారుణంగా దిగజారిపోయిందనుకోవాలి. అలా అయ్యుంటే అసలు మనం సనాతన హైందవ సమాజానికి వారసులమెలా అయ్యాము?


పై అభిప్రాయంలో ధర్మంధ్వంశమయి పోయింది అని,హైందవసమాజం దిగజారిపోయిందనే అభిప్రాయాలు మీమనసులో స్థిరపడ్డాయి కనుక ఇక దీనిఉన్నతి మీకు స్పురించదు. మీ భావాలకు మీరు చూసిన స్థాయి వ్యక్తులకు ఆకొలతలకు మాత్రమే హైందవధర్మం అందదు. ముందు హిందువుగా ఆలోచించగలిగితే గాని సత్యం బోధపడదు.
సమాజంలో నేటిస్థితి రాగిచెంబుకు పట్టిన చిలుములాంటిది మాత్రమే .నిప్పును కప్పిఉన్న పైపై బూడిదపొరలను చూసి లోపల నిప్పులేదనుకుని తీర్మానించుకుంటే సత్యం వ్యక్తంకాదు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా తాముపట్టిన కుందేటికి మూడేకాల్లనేవాళ్ళు వినరు.కనుక ఇది వాదనవుతుందేకాని సత్యాన్వేషణ మార్గం ఎన్నటికీ కాదు.
విశేషమేమిటంటే ఈస్థితిని పూసగుచ్చినట్లుగా వేలసంవత్సరాలక్రితమే మనమహర్షులు చెప్పిఉండటం .

tankman February 4, 2011 at 8:42 AM  

నేను అనుకుంటున్నది , నాకు అర్థం అయింది మాత్రం రెండోదే.. "ఎప్పుడో సనాతన కాలంలో అద్భుతంగా నిర్వచించబడి తరువాత ధ్వంసమయిపోయిన ధర్మమనా? ఒకవేళ మీ ఉద్దెశ్యం ఇదయితే సనాతన కాలం తరువాత మన హైందవ సమాజం అతి దారుణంగా దిగజారిపోయిందనుకోవాలి. అలా అయ్యుంటే అసలు మనం సనాతన హైందవ సమాజానికి వారసులమెలా అయ్యాము?"

అదే నాకు కూడా ఎప్పుడు వచ్చే doubt ...చేస్తున్న పనిని బట్టి ఒక వ్యక్తి వర్ణాన్ని నిర్దేశిన్చేతట్టయితే, పుట్టుకతో సంబంధం లేకుండా army లో పని చేసే అందరిని మనల్ని పాలించే రాజకీయనాయకులని క్షత్రియులు అనాలి, teaching profession లో అందరిని, బ్రాహ్మణులూ అనాలి, MBA graduates అందరిని వైశ్యులు అనాలి కదా....

Malakpet Rowdy February 4, 2011 at 8:59 AM  

పుట్టుకతో సంబంధం లేకుండా army లో పని చేసే అందరిని మనల్ని పాలించే రాజకీయనాయకులని క్షత్రియులు అనాలి, teaching profession లో అందరిని, బ్రాహ్మణులూ అనాలి, MBA graduates అందరిని వైశ్యులు అనాలి కదా....

______________________________________

Who is responsible for this? Its the people like you and me. So blame the people for that instead of spewing venom on Dharma.

veera murthy (satya) February 4, 2011 at 9:33 AM  

దుర్గేశ్వర్ గారు...
దయచేసి ఋణాత్మకంగా తీసుకోకండి...

నేను చేప్పేది అదే...
"చెంబుకు పట్టిన తుఫ్పు తొలగాలన్నా
బూడిద పోయి నిఫ్ఫు మిగలాలన్నా"
సమయం పడుతుంది..

మాటలకి మాటలే సమాధానం కాదని... వ్యవహారం, ప్రవర్తన లు మాత్రమే సమాధానమౌతాయని తెలిపే ప్రయత్నం చేసా.....
వివేకానందుడిని అర్థం చేసుకోవాలంటే ఇంకో వివేకానందునికే సాధ్యం --రవీంద్రనాధ్ ఠాగోర్ అన్నట్టు
హైంధవధర్మాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మనమూ హిందులమవ్వడమే మార్గం....

అయినా జీర్ణోధ్దరణ లేకుండా కొత్తనిర్మాణాలు ప్రమాదాలకి దారితిస్తుంది...
(ధర్మమంటే అవతలి (ఎదుటివారి)వైవునుండి అలోచించి, ఆచరించేది-- వ్యాసమహర్షి)...

నాది శ్రీకార్యం!..


ఇక మిగిలింది మీ కార్యం!! ...కొనసాగించండి...

Anonymous February 4, 2011 at 4:54 PM  

//అదే నాకు కూడా ఎప్పుడు వచ్చే doubt ...చేస్తున్న పనిని బట్టి ఒక వ్యక్తి వర్ణాన్ని నిర్దేశిన్చేతట్టయితే, పుట్టుకతో ... వైశ్యులు అనాలి కదా//

అనుకో.. అంతే! సింపుల్. అలాగే రెండుమూరు తరాలు అదేవృత్తిలో కొనసాగిన వాళ్ళను ఆయా వర్ణాలుగా వర్గీకరించారు, అంతే. అలా అనుకోవడం మనకు అదోలాంటి తుత్తి ఇస్తుందంటే, అలా అనుకోవడం తప్పుకాదు. :))
ఓ ఆటవికుడు కోడి ఈకలు (శర్మ అని) అలంకరించుకుని తిరగడం లాంటిదన్నమాట, ఇక్కడ ఆనందం ముఖ్యం.

Unknown February 4, 2011 at 11:12 PM  

తాదేపల్లి గారు చాలా చక్కగా వివరించారు...
అర్థం చేసుకోగలిగితే అందులో, చాల సత్యాలే బోధ పడతాయి.
ఎవరినీ నొప్పించని, అందరికీ ఆదరణీయమయిన సమాధానం అది.
దానికి కొన సాగింపు గా నా వ్యాఖ్య.

మానవుడు సత్య , రజో, తమో గుణాల ప్రాతి పదికన నిర్మింప బడ్డాడు అన్నది అందరికి తెలిసినదే.
ఈ మూడు గుణాల నిష్పత్తి ఆధారం గానే మనిషి గుణగణాలు నిర్ణయించ బడతాయి.

ఇక్కడ కొన్ని ఉదహరణలు చూద్దాం.
బ్రహ్మ మానస పుత్రుడయిన, కశ్యప ప్రజాపతి,కొడుకయిన రావణుడు సద్భ్రాహ్మణ సంజాతుడే.
వేద వేదాంగాల్లో, నిష్ణాతుడు, గొప్ప రాజకీయవేత్త. కానీ రావణుడి గత జన్మకర్మ వల్ల బ్రహ్మణుడీ గా జన్మించినా,ఇహ జన్మ లో పర స్త్రీ వ్యామోహం అన్న చెడు కర్మ వల్ల దైత్యుడయ్యాడు.. చెర బట్టడం తో రాక్షసుడయ్యాడు. హరి ద్వేషం వల్ల ముల్లోకాలకు కంటకుడయ్యాడు. మరి ఇతడిని బ్రాహ్మణుడు అందామా? ఖచ్చితం గా అనలేము.

అదే రాక్షస కులం లో జన్మించిన ప్రహ్లదుడిని తీసుకుందాం.ఇతడు పుట్టుక తో బ్రాహ్మణుడు కాడు. రాక్షస కులమే.కానీ సత్వ గుణ అధిక్యత వల్ల పరమ భాగవతోత్తముడయ్యాడు. మరి ఇతడి కులాన్ని బట్టి రాక్షసుడు అనగలమా?.?

ఇలా వాల్మికి, శబరి, త్రిజట, హిడింబి, కైకేయి, కనకదాసుల వారు.... వీళ్ళ పుట్టుకని బట్టి కులాన్ని నిర్ణయించలేము.
- Sudha-Bangalore

Rao S Lakkaraju February 5, 2011 at 4:48 AM  

@Sudha-Bangalore
మానవుడు సత్య , రజో, తమో గుణాల ప్రాతి పదికన నిర్మింప బడ్డాడు అన్నది అందరికి తెలిసినదే.
ఈ మూడు గుణాల నిష్పత్తి ఆధారం గానే మనిషి గుణగణాలు నిర్ణయించ బడతాయి.
---------
మీ విశ్లేషణ చాలా బాగుంది. How true it is !

krishna February 5, 2011 at 8:35 AM  

తాడేపల్లి గారు,
// బ్రాహ్మణత్వం ఒక వ్యక్తి యొక్క జ్ఞానస్థాయిని బట్టే కాక అనేకమైన ఇతరేతర వేరియబుల్స్ ద్వారా కూడా సిద్ధిస్తుంది. కనుక జ్ఞాన బ్రాహ్మణులతో పాటు వంశపారంపరికంగా బ్రాహ్మణులమని చెప్పుకుంటున్నవారంతా కూడా నిజంగా బ్రాహ్మణులే.//
దయచేసి ఈ విషయం పై మరింత వివరించగలరని ప్రార్ధన

రాజేష్ జి February 6, 2011 at 6:05 AM  

@ప్రవీణ్ అన్యా

$Practically how many..brahmin dharma?

Do you mean Hindu dharma or brahmin tradition?

If Hindu dharma, Would It make sense If I seek your response by triggering same question but placing Marxism instead of bhahmin dharma? If the answer is few, Then should we relinquish Marxism?
W.r.t. Hindu dharma, It is just everyone's sheer interest in what path they want to follow and not to that is far better than insane bashing!

If you meant brahmin tradition,
Come on, cheer up anya!
ప్రతిచోటా ఆదర్శం, ఆధునికం కావాలి అంటావు ఇక్కడా అదే జరిగిందనుకోలేవా? కాకపొతే ఆనుపానులు మరిచే౦త ఆధునికం అక్కర్లేదు అనే దగ్గరే గొడవ! అసలు ఈప్రశ్న మీ దగ్గరనుంచి ఉదయిస్తుందని అనుకోలేదు.

$..vedic schools should be introduced..

Hmm.. How many schools did you guys introduces that teach purely about Marxism?
okay! There are considerable number of vedic schools up and running by wealthy temples and maths, but with less number of students placing with interest and other are fear of future. Whose fault is this?
As the money and his sibling need ruling the world and ruining ancient traditions, technically vedic dharma is not exception.

And who knows? May be there is day where everyone runs after vedas when learning of those turns into lucrative business :).

Also, ppl who having keen interest and sharing vedas along with their common chores, There are mnay ways and the one I already posted in my blog. Did you read?

OOT, BTW No show up in my blog. Showing untouchability? Mind you I can file a case If it is :))

Anonymous February 6, 2011 at 8:39 AM  

Praveen,
good analysis. Why dont you be like this forever?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP