శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అత్తగారింట్లో తిష్టవేస్తే !!?అల్లుడి పాపాలన్నీ పోతాయట [ఇదిచదవండి]

>> Thursday, January 13, 2011

అత్తగారింట్లో ఎక్కువకాలం ఉంటే అల్లుడి పాపమంతా పరిహరించ బడుతుందా !!? అనే సందేహానికి అవుననే సమాధానం వస్తుంది మహాకవి భారవి చరిత్ర చూస్తే .
భారవి కవి చిన్నతనం నుంచి చదువులో చక్కని ప్రతిభ కనపరచేవారు . ఆయన గురువులు ,సహాధ్యాయులు, జనం అంతా ఆయన ప్రతిభను మెచ్చుకుని గౌరవించేవారు . అయితే అదేమిటో గాని ఆయన తండ్రిగారు మాత్రం ఏమాత్రం దానిని గుర్తించేవారు కారు . వయసు వచ్చి పెద్దవాడై భారవి తన పాండిత్యం తో అందరినీ మెప్పిస్తున్నారు ఏరోజుకైనాసరే తండ్రిని మెప్పించాలని శ్రధ్ధగా అధ్యయనం చేస్తూ శ్రమింస్తున్నాడు. కానీ తండ్రిలో మాత్రం మార్పులేదు , అంతేనా ఎంతగొప్పగా కవిత్వం చెప్పినా ? ఇదీ ఒక పాండిత్యమేనా ? అని తేలికగా కొట్టిపారేస్తుండేవారు . చిన్నతనం నుంచి ఒక్కమెప్పుకోలుగూడా తండ్రినుంచి పొందని భారవి గారికి తండ్రంటే ద్వేషం కూడా మెల్లగా పెరుగుతున్నది . తన ఎదుగుదల చూసి కూడా సంహిచని వాడేమో తండ్రి ? అనే అనుమానం ప్రబలుతున్నది.
పెళ్లయింది . ఆయన పాండితీ ప్రకర్షకూడా చుట్టుపక్కలకుపాకుతున్నది . పదిమంది పండితులు కూర్చున్నచోటకూడా ఈ యువకవి గూర్చిన ప్రస్తావన వస్తున్నది. ఓసారి ఒక పండిత సభలో ఈయన పాండితీ ప్రకర్ష ఎల్లరకు తెలిసింది . గొప్ప పండితులు ఈయనను గుర్తించి గొప్పగా సత్కరించారు . ఎంతో సంతోషిస్తూ తనస్నేహితులతో కలసి వస్తూ ఎదురైన తండ్రికి ఈవిషయాన్ని తెలి్యపరచినమస్కరించాడు. కానీ తండ్రి మాత్రం . ఆహా ! ఈమాత్రం దానికే నీవు గొప్పపండితుడవైపోయావా ? నీకంటే చాలా గొప్పపండితులున్నారు లోకంలో అని విమర్శింఛాడు. చిన్న మెప్పుకోలు లేకపోగా స్నేహితులముందు కూడా తండ్రి అవమానపరచటం వలన దు:ఖం ముంచుకొచ్చింది ఆయనకు . అది తీవ్రక్రోధంగా మారింది . ఇటువంటి తండ్రి ఉంటేనేమి లేకుంటేనేమి ? ఇతడు తండ్రి కాదు శతృవు . ఇతనిని అంతం చేస్తేనేకాని నాకు మనశ్శాంతి లేదు ,అనే నిర్ణయానికొచ్చాడు . ఇంటికొచ్చాడు . పెద్దరాయి ని తీసుకుని అటకమీదకెక్కి కూర్చున్నాడు . తండ్రి ఇంటిలోకి రాగానే ఆరాయిని తండ్రి తలపై వేసి చంపాలని కోపంతో ఊగిపోతూ ఎదురు చూస్తున్నాడు .

మధ్యాహ్నం వేళకు తండ్రి భార్యను పెద్దగా పిలుస్తూ ఇంటిలో కొచ్చాడు . ఎదురెళ్ళిన భార్యను పట్టుకుని చూసావా ! చూసావా ! నాకొడుకు ఎంత ఎదిగిపోయాడో ! ఊర్లో పండితులంతా నాకొడుకును పొగుడుతున్నారు . అటువంటి కొడుకును కన్న నీవు అదృష్ట వంతుడవంటున్నారు ..అబ్బాయి ఏడి ..ఎక్కడ ? అని ఉబ్బితబ్బిబ్బవుతూ అడుగుతున్నాడు. విషయాన్ని చుట్టుపక్కల వారిద్వారా విని ఉన్న ఆవిడ భర్త సంతోషం చూసి ఆనందించింది. ఏమిటోనండి ! మీపద్దతి ,పిల్లవాణ్ణి ఎదురుగా ఒక్క ముక్క మెచ్చుకోరు .వాడెంత బాధపడుతున్నాడొ మీకుతెలియదు. ఈరోజు స్నేహితులముందర కూడా ఏదో అన్నారట ,పాపం వాడెంత చిన్న బుచ్చుకున్నాడో ! ఈరోజు భోజనానికి కూడా రాలేదు బిడ్డ . అయినా ఊరంతా మెచ్చుకున్నా మీకుమాత్రం నాబిడ్డ ప్రతిభ నచ్చటం లేదు ని ముక్కుచీదుతూ వాపోయింది. అప్పుడాయన . ఓసీ ! పిచ్చిదానా ! బిడ్డ ప్రతిభ తండ్రికి గిట్టదా ? నాబిడ్డ గూర్చి జనం మెచ్చుకుంటుంటే నాకెంత సంతోషమో నీకేం తెలుసు . అయినా సరే తండ్రి బిడ్డయొక్క పాండిత్యాన్ని మెచ్చుకుంటూ వారి ఎదుట మాట్లాడకూడదు ,అలాచేస్తే బిడ్డలు ఎదగరు. నేను విమర్శిస్తుండ బట్టే నాకొడుకు పట్టుదలతో ఈస్థాయికి ఎదిగాడు . ఇంకా గొప్పవాడవుతాడు అని చెబుతున్నాడు.
ఇవన్నీ పైన అటకమీద కూర్చుని ఉన్న భారవి వింటున్నాడు. తండ్రి హృదయం అర్ధమయ్యేసరికి ఆయన కళ్ళుతిరిగినేలకొచ్చాయి. అక్కడనుండి ఒక్క ఉదుటనకిందకు దూకి తండ్రిపాదాలపై వాలి భోరున విలపించటం మొదలెట్టాడు . తలబాదుకుంటూ తన పాపపు ఆలోచనను చెప్పి దుఖిస్తూ తల్లిదండ్రి పాదాలను చుట్టి దు:ఖిస్తున్నాడు.
ఆ దంపతులు కుమారుణ్ణి కౌగిలించుకుని ఎంత ఓదార్చినా ఆయన మనసు శాంతించలేదు.
తండ్రీ ! తల్లీదండ్రిని మించిన దైవం లేదు . కంటికి పొరలుగమ్మి గర్వం తలకెక్కి మూర్ఖుడినై నిన్నే చంపబోయాను . నాపాపానికి పరిహారం చెప్పండి వేదనతో వేడుకున్నాడు .
అప్పుడు మహాపండితుడైన ఆతండ్రి నాయనా ! తెలిసిచేసినా తెలియక చేసినా పాపం అనుభవించవలసినదే . కనుక పాపపరిహారం కోసం పరిహారక్రియలు చేసుకుని ఆపాపం నుంచి బయటపడే ఉపాయం మహర్షులు తెలియపరచి ఉన్నారు అన్నాడు. అయితే తండీ ! తండ్రిని మించిన గురువులేడు . నాకు తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు భారవి కవి
నీవు ! వెంటనే మీ అత్తగారింటికి వెళ్ళు .అక్కడ నీ భార్యకుకూడా చెప్పకుండా ,ఎవరినీ ఎదిరించకుండా ఎవరిమాటా కాదనకుండా ఎన్నిరోజులక్కడ ఉంటావో చెప్పకుండా నాలుగు సంవత్సరాలు గడుపు .దీనితో నీపాపం పరిహారమవుతుంది. గడువు పూర్తికాగానే ఒక్కక్షణం కూడా ఆగకుండా మాదగ్గరకొచ్చేయి నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటాము అని అప్లికాడాయన. ఇదేమిటి ? అత్తగారింట్లో నివాసమంటే పరమ సుఖం కదా . కాలుకింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు అక్కడ . దీనివలన నాపాప మెలా పరిహార మవుతుంది ? అని అనుమానం వచ్చినదాయనకు. కానీ గురువు చెప్పినమాటకు ఎదురాడరాదనే శాస్త్రవచనాన్ననుసరించి తల్లీదండ్రికి నమస్కరించి బయలుదేరాడాయన . బిడ్డను వదలలేక కన్నీటితోనే సాగనంపారాదంపతులు భారవిని .

ఇక భారవి గారు అత్తగారింటికి వెళ్ళగనే అత్తమామలు, బావమరుదులు ఎంతగానో సంతోషించారు .ఇక ఆయన భార్య ఆనందానికి అవధులు లేవు. మామగారు పెద్ద భూకామందులలో ఒకడు ఆగ్రామంలో .ధనధాన్యాలు పశుసంపద సమృద్దిగా ఉన్న కుటుంబం అది. పనివాల్లతోటి పాలేర్లతోటి సందడిగా ఉండే ఇల్లు. ఇక రాకరాక వచ్చిన అల్లుడికి మహారాజవైభోగాలు అమరుతున్నాయి . అత్తగారు అల్లునికి ఏమికావాలో అడిగి రోజుకో పిండివంట చేపిస్తున్నది. బావమరుదులు అణకువగా అడుగులకు మడుగులొత్తుతున్నారు. అయన కాలు కదిపితేచాలు ఏంకావాలని అడిగి అది సమకూర్చే వాల్లు . తనభర్త కు తనపుట్టింట ఏమాత్రం లోపం జరగకూడదని జాగ్రత్తగా చూసుకుంటున్నది . ఇక రోజులు గడుస్తున్నాయి. వారాలు అయిఫొయాయి , నెలలు గడుస్తున్నాయి . అల్లుడుగారు తిరుగుప్రయాణం ఉన్నట్లు గుర్తులేనట్లుంది పోనీలే పిల్ల సుఖంగా మనముందరే ఉంది అని సర్దుకున్నారు. నెలలు దాటిపోతున్నాయి .ఇక పిండివంటలలో నెయ్యిశాతం తగ్గింది . ఏమిటీ ! విషయం అని కూతురిద్వారా విచారించారు .
ఏమండీ ! అత్తయ్య,మామయ్య ఒక్కల్లే ఇంటిలో పనులన్నీ ఎలాసవరించుకుటున్నారో ! నన్ను మన ఇంటికి ఎప్పుడుతీసుకెల్తారు ? వారిసేవకోసం ఎదురు చూస్తున్నాను అని అమ్మాయి లౌక్యంగా ప్రశ్నించింది . ఆ ..వెళదాంలే ..తొందరేముంది అన్నాడు భారవి. విషయం తెలిసిన అత్తామామలు పాపం అల్లుడేదో మనదగ్గరే నాలుగురోజులు ఉండాలనుకుంటున్నాడు పోనీలే ఉండనీ. అని సర్దుకున్నారు. సంవత్సరం దాటింది . ఇక అనుమానం పెరిగింది మామగారికి ఇతగాడేదో తల్లీదండ్రితో గొడవపడి వచ్చినట్లున్నాడు ...ఇల్లరికం ఉన్నా మనకేమీ కొదువలేదులే ఉండనీ అనుకున్నాడు. బావమర్దులకు కాస్త చనువు పెరిగింది . గౌరవం తగ్గింది . కాస్త చెణకులు విసురుతున్నారు. ఇక రానురాను మర్యాదపలచబడటం మొదలైంది. పొద్దస్తమానం ఇంట్లో ఏంకూర్చుంటావు బావా! నీకూ విసుగుకొడుతుందికదా మన పొలాలు చూసొద్దాం రా అని తీసుకెల్లే వాళ్ళు . అక్కడికెళ్ళాక అందరూ పనిచేస్తుంటే ఊరికే సోమరిపోతులా కూర్చో లేడుకదా ? బావమరుదులు వద్దని వారిస్తున్నా వినకుండా పనిలోకి వంగేవాళ్లు . ఇప్పట్లా అపుడు కూలీల కొరత ఉందేమో ! మొదటమొదటిలో ఇంట్లో నలుగురిలో బావగారి పనితీరును మెచ్చుకుంటూ పొగిడి చిన్నగా పొలం పనులకు తీసుకెళ్ళెవాళ్ళు. ఎంతైనా అలవాటులేని పనికదా పనిసరిగా చేతకాదు. దానితో ఆటపట్టించడం దగ్గరనుండి అవహేళనవరకు సాగి పనిచేతగానివానిక్రింద సోమరికింద జమకట్టి అవమానకరంగా మాట్లాడటం మొదలైంది . ఇంట్లో కూడా చద్దన్నం పెట్తటం కూడా దండగనే భావన కనిపిస్తున్నది. ఇదంతా చూస్తూ భార్యకు కాస్త బాధనిపించినా పుట్టింటివారి నేమీ అనలేక భరత్ను మనప్రయాణ మెప్పుడని అడిగినప్పుడల్లా ఆయన నవ్వుతూ వెళదాంలే ....అని దాటవేస్తున్నాడు. క్రమేపీ ఆవిడకు కూడా మన ఇంట్లో మనకు మర్యాదలేంటి . ఇదీ నాయిల్లేకదా అనే సర్దుబాటు ధోరణి వచ్చేసింది . ఇక మామగారి చీత్కరింపులు పనివాల్లమీద వంకపెట్టి తిట్లుకూడా అప్పుడప్పుడు తప్పటం లేదు. పాపం ఈ వ్యవసాయ పనులెలా చేతనవుతాయి ఆయనకు ,ఏదో నాలుగుపద్యాలైతే రాయగలడుగాని కాడి మోయమంటే సాధ్యమా ?
ఇక ఏపని చేతకానివాడు ,ఊరికే కొంపమీద పడితింటున్నాడనే ముద్రపడి్పోయిందాయనకు చేతైనంత పనిచేస్తున్నా, ఊరి వాల్లలో కూడా పలనావారల్లుడు పనికి మాలినవాడనే గుర్తింపు వచ్చేసింది . బయటకు వెళితే వీడేరోయ్ అని నవ్వుకుంటున్నారు . భార్యకూడా మనపని మనం చేసుకోవటం లో తప్పేముందండి అని గొప్ప సత్యం తెలియపరుస్తున్నది. ఎప్పుడు చేయని కఠినమైన పనులనుచేసి బొబ్బలెక్కిన చేతులను చూసి బాధపడుతున్నప్పుడు దానికంటే అత్తగారింట్లో తనను ఉద్దేశించిన చీత్కారాలే మనసును తూట్లు పొడిచేవి . క్రమేపీ తండ్రి ఎందుకు ఈశిక్ష విధించాడో అర్ధమవసాగింది . వారి అవమానాలతో గుండెను కోస్తున్న బాధకలుగుతున్నా పశువులపాక ఊడ్చేపనితో సహా చేయసాగాడు. ఇక ఇతనికి వ్యవసాయంపని సరిగా చేతకాదుకనుక పశువులను కాచేందుకు పంపటం మొదలెట్టారు . రాత్రి మిగిలిన చద్దన్నం కాస్తతిని మరికాస్త చద్ది కట్టుకుని పశవుల కాపరులైన పిల్లలతో కలసి అడవికి పశువులను తోలుకుని వెళ్ళేవాడు.
ఇక ఈ గోపాలక వృత్తిలో ప్రవేశించాక అయనకు గొప్పవెసులుబాటు లభించింది . పిల్లలంతా ఆడుకుంటూ ఈయన పశువులనుకూడా కాస్తుంటారు కనుక అక్కడ తాటిఆకులను తెచ్చుకుని చెట్టుక్రింద కూర్చుని వేదనాభరితమైన హృదయం నుంచి కసిగా తన కవిత్వాన్ని లిఖితం చేసేవాడు . ఆ తాళపత్రాలను అక్కడే చెట్టి కొమ్మలను కట్టి ఇంటికి వెళ్ళేవాడు . ఈవిధంగా సరస్వతీ దేవి ప్రవాహంగా ఆయన ఘంటం నుండి అనుగ్రహరూపంలో ఆవిర్భవిస్తున్నది.
గడువు పూర్తయినది . ఆయన పశుకాపరులైన మిగతా పిల్లలకు నాయనా నేను అత్యవసరంగా వెళుతున్నాను సాయంత్రం మీ పశువులతోపాటు మావికూడా తోలుకురండి అని చెప్పి ,ఇంటికొచ్చాడు . మధ్యాహ్నం వేళ ఇలా వచ్చిన భారవిని చూసి ఇంటిలో ఆడవాళ్లు ఆశ్చర్య పోయారు . రాగానే భార్యను పిలచాడు నేను వెళుతున్నాను . నిన్ను కాపురానికి తీసుకురావటానికి మాతల్లిదండ్రులు వస్తారు అని చెప్పి బయలుదేరాడు .ఇదేమితండి భోజనం చేయకుండా అంటున్నా వారించి ,ఇప్పటివరకు మీఇంటిభోజనం చేయటం వలన నేనుచేసిన ఘోరపాపం నుండి విముక్తుడనయ్యాను , చాలు. ధన్యవాదములు అని చెప్పి ఎంచక్కా వెల్లిపోయాడు .
ఇక ఆ రోజు ఆదేశ మహారాజుగారు ఆ అడవిదారిన పల్లకీలో వెళుతున్నారు , మధ్యాహ్నం వేలవటం వలన బోయీలు అలసిపోయి పల్లకిని దించారు. భారవి గారు తనరచనావ్యాసంగాన్ని కొనసాగించిన చెట్టుక్రిందే రాజుగారికి విడిది ఏర్పాటుచేశారు. ఆచెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారికి చెట్టికొమ్మలకు కట్టి వేలాడుతున్న తాటిఆకులు కంతబడ్డాయి .ఆయన వాటిని సేవకులచేత దించి చూశాడు . అందులోని సాహిత్యప్రతిభకు ఆస్చర్యపోయాడు . ఎవరీ మహాపండితుడు ? ఇంతగొప్ప కవి ఎవరు ? అని ఉద్వేగభరితుడై ఈ కవి ఎవరో కనుక్కొమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వాల్లు అక్కడ ఉన్న పశువులకాపరులైన పిల్లలను పిలచి ఇవి చెట్టుకు కట్టినవారెవరని ప్రశ్నించారు.
పలానా ! వాల్ల అల్లుడు రోజూ తమతో పశువులకొచ్చి అవి వ్రాసుకుని చెట్తుకు కడుతుంటాడని ఇప్పుడే ఇంటికెళ్ళాడని చెప్పారు.
ఆహా ! ఇంత గొప్పపండితుడు మాదేశం లో ఉన్నారా ? అయినా ఆయన నివురుగప్పిన నిప్పులా ఇక్కడ పశువులకాపరిరూపంలో గుప్తంగా ఉన్నారంటే ఏదో రహస్య ముంది . వారిని మాఆస్థానానికి సగౌరవంగా తోడ్కొని పోవలసినదే అని నిర్ణయించుకుని ,సకల మర్యాదలతో వారిని తోడ్కొని రమ్మని సేవకులను మేనాను మంత్రులను పంపారు. రాజపరివార కోలాహలం తో గ్రామం లో కలకలం రేగింది . జనమంతా గుమిగూడారు . పశవుల కాపరులైన పిల్లలు దారిచూపిస్తుండగా అధికారులతో వచ్చిన మేనా భారవి గారి అత్తగారింటిముందు ఆగింది . భయపడుతూ వచ్చిన ఆయన మామగారిని మంత్రులంతా అభినందించారు . అయ్యా ! తమరి అల్లుడు గారు మహా కవి .అయినా ఇంత నిరాడంబరంగా రహస్యంగా ఉన్నారంటె వారు మహానుభావులు . వారిని సకలమర్యాదలతో తీసుకురమ్మని మాహారాజావారి ఆజ్ఞయింది అని విన్నవించారు . మామగారికి ముచ్చెమటలు పోసాయి . అల్లుడు అలిగిఫొయాడనుకుంటున్నాడాయన ......................................................................ఇక తరువాత కథ వదిలేద్దాం
కిరాతార్జునీయం అనే గొప్పకావ్యాన్ని రచించిన భారవిమహాకవి జీవితంలో సంఘటన ఇది

కాబట్టి అత్తగారింట్లో గౌరవంపోనంతకాలం మాత్రమే ఉండాలనేది పెద్దలమాట ..

[ నోరూవాయీ లేని అత్తమామల అల్లుల్లు అత్తగారిల్లలో తిష్టవేసి వేధింకు తింటుంటారు అదేదో సినిమాలో బ్రహ్మానందం లాగా .. వాల్లకు మాత్రం పాపమంతా తలపైబడి చండాలపు జన్మలొస్తాయి జాగ్రత్తండోయ్ . మామగారు తమ సంతృప్తి కొద్దీ ఇచ్చినవి స్వీకరించాలేగాని .అడుక్కుతినేవాల్లలాగా అదికావాలి ఇదికావాలని వేధించకూడదు]

5 వ్యాఖ్యలు:

బాలు January 13, 2011 at 6:46 AM  

అయితే ఈ కథ మహాకవి భారవిదన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ ఈ కథ చెప్తుండేది కానీ వివరాలు తెలీవు. భారవి అని కాకుండా‘ఒకాయన’ అని ఉదహరిస్తూ చెప్పేది. ఓ కొత్త విషయం తెలియజెప్పినందుకు నెనర్లు.

January 13, 2011 at 7:23 AM  

చల్ల చెలియల కట్ట దాటనంతవరకు అక్కడ ఉండమంటారు వాళ్ళ నాన్న. చివరికి వాడికి మజ్జిగ విసురుగా పోయగానే వచేస్తాడు... ఇది నాకు తెలిసిన కథ.

విరిబోణి January 13, 2011 at 8:06 AM  

మొదటిసారిగా మీ బ్లాగ్ లో కామెంట్ పెడుతున్నా!
మంచి కధ చెప్పారు,చిన్నప్పుడు నేను విన్నా ఈ కధ ని.. కధలో నాయకుడు వేరే పేరుతో వుంటాడు ..ఐనా మంచి విషయాన్ని గుర్తు చేసారు .
మీరు నవంబర్ లో కార్తీక మాసం లో చెప్పినట్టు నేను కూడా జ్యోతిర్లింగార్చన చేసుకున్నా .. 54 దీపాలతో .వీలు కుదిరినప్పుడు పూజ ఫొటోస్ నా బ్లాగ్ లో పెడతాను . పూజ విదానాల పరం గా మంచి విషయాలు తెలుస్తున్నై మీ బ్లాగ్ ద్వారా .

లలిత (తెలుగు4కిడ్స్) January 13, 2011 at 1:12 PM  

ఇది భర్తృహరి విషయంలో జరిగింది కాదా?
రాజు గారి గురించి తెలియదు కానీ, మా అమ్మమ్మ చెప్పిన ప్రకారం:
ఆయన ఒక సారి తను రాసిన శ్లోకానికి బదులుగా ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని భార్యని ఊళ్ళోకి పంపిస్తాడు, డబ్బులు అవసరమై. అప్పుడామె ఆ శ్లోకాన్ని ఒక వైశ్యుడి భార్యకి అమ్ముతుంది.
ఆమె అది తన పడక గదిలో గోడకి వేళ్ళాడ దీస్తుంది.
ఎప్పుడో కొడుకు చిన్నప్పుడు దూర దేశాలకు వెళ్ళిన ఆమె భర్త, తిరిగి వచ్చి ఆమె పక్కన ఎదిగిన కొడుకుని చూసి అపార్థం చేసుకుని గోడకు తగిలించి ఉన్న కత్తి తియ్యబోతే ఆ శ్లోకం కనిపించి, ఆగి పోతాడు.
ఆ శ్లోకం ఏమన్నా తెలుస్తుందేమో అని వెతుకుతున్నాను.
అందులో ఆవేశంలో ఏ పనీ చెయ్య కూడదు అని అర్థం ఉంటుంది.

Anonymous January 14, 2011 at 7:27 AM  

ఈకథ నాకు తెలిసినంతవరకు కిరాతార్జునీయం రచయిత మహాకవి భారవి జీవితంలో జరిగినదని అనుకుంటూన్నాను . దీనినిపోలిన కథలకు మన సుసంపన్న సాహిత్యంలో కొదువలేదు.

దుర్గేశ్వర

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP