శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"కోహం రండే ?" అని తిట్టిన కాళిదాసును కూడా కరుణించిన అమ్మ .

>> Tuesday, January 4, 2011


మానవమాత్రురాలైన తల్లికే బిడ్డమీద అపారమైన ప్రేమ ఉంటే ఇక జగన్మాతకు తనబిడ్డలమీద ఎంత కరుణ ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం .


కాళిదాసు ,దండి, భవభూతి మహాకవులు . ఇందులో కాళిదాసు కాళీ్వరప్రసాది .అమ్మకు ముద్దుబిడ్డ. ఓసారి అనుకోకుండా ఈ మహానుభావులమధ్య పాండితీస్పర్ధ ఏర్పడినది . అది పెరిగి పెద్దదై వివాదమైనది. తమలో ఎవరుగొప్పో తేల్చుకోవాల్సినదేననే పట్టుదల పెరిగినది . అయితే ఈ మహాకవులలో ఎవరు గొప్పో తేల్చి చెప్పగల సమర్ధత ఎవరికుంది ?కనుక భోజరాజుకు కూడా ఎటూపాలుపోలేదు. అందరూ కలసి ఆజగన్మాత నే తీర్పుకోరాలని నిర్ణయించుకున్నారు. జగన్మాత ఆలయానికి చేరుకుని అమ్మకు తమలో ఎవరుగొప్పో చెప్పాలని నివేదించారు.

ఉత్కంఠతతో చూస్తున్నారు అందరూ .
అప్పుడు అమ్మ విగ్రహం నుండి
" కవిర్దండి...కవిర్దండి , భవభూతిస్తుపండిత: అని వినిపించిందట

అంతే ! మహాకవి ని అమ్మవరప్రసాదిని అనుకుంటున్న కాళిదాసుగారికి తీవ్రమైన అవమానమైనది . తలవాలిపోయింది దు:ఖం ముంచుకొచ్చింది .అది తీవ్రకోథంగా మారింది . పెదవులు వణుకుతూ కన్నీరుకన్నులను కమ్ముకొనగా "కోహం రండే " [ నేనెవరినే ముండా ?] అని ఘీంకరిస్తూ అడిగాడట.

తనను పట్టించుకోలేదన్న కోపంతో తల్లినితిట్టే పసివానిలా తనను నిందిస్తున్న కాళిదాసుగారిని చూస్తూ అమ్మ నవ్వుతూ
" త్వమేవాహం ...త్వమేవాహం " అని బదులిచ్చిందట .
అంతే ఆ దివ్యప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న కాళిదాసు కాళీమాత పాదాలపైబడి పసిబిడ్డలా విలపించి ఉంటాడు .
జయజయ భవానీ...

2 వ్యాఖ్యలు:

రమణ January 4, 2011 at 8:55 AM  

కాళిదాసు, భవభూతి సమకాలీనులు కాదనుకుంటాను. "కాళిదాసు, భవభూతి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ...." ఇలా సాగుతుంది మా తెలుగు వాచకంలోని ఒక పాఠం - 'ఆంధ్రుల అణా అసలు కధ'.నిజానికి వారిద్దరు వేర్వేరు కాలాలకు చెందిన వారని గుర్తు. అందుకే సందేహంతో అడిగాను.

నిత్యాన్వేషి October 20, 2013 at 11:21 AM  

'ఆంధ్రుల అణా అసలు కధ' పూర్తిగా తెలియగోరుతాను .. ఈ కథ మీద నాకు మక్కువ ఎక్కువ . ఇంకాగుర్తుంది ..

'' తూర్ణిమా నీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే ''

మిగతా కథ తెలియగోరుతున్నాను .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP