మంచు మృత్యువును కౌగిలించుకున్న వెర్రిబాగులఅన్నయ్యలారా .జైహింద్
>> Tuesday, February 9, 2010
మేమేమో దుప్పట్లో వెచ్చగాముడుక్కుని మరగుజ్జులమై స్వార్ధం తో ఇక్కడ
మీరేమో మంచుమృత్యువుని రొమ్మువిరుచుకుని ఎదిరించి త్యాగంతో అమరులై అక్కడ.
మాకోసం మీరు అన్నీ మరచిపోయారు
మీకుటుంబ ఏమవుతుందని
సుఖపడటానికి సంపదలెలా పోగేసుకోవాలని
సరదాగా సినిమాలు షికార్లు కొట్టాలని
వాదనా బలాలతో ప్రతిభా ప్రదర్శనాలెలా చేయాలని
వృధాగా వాచా నీతులుబోధిస్తూ
వివిధ సిధ్ధాంత రాద్ధాంతాల కండూతులను ప్రదర్శించాలనే విషయాలన్నీ
మరచిపోయారు.
సోదరులారా !
మేమూ మరచిపోతాము
మిమ్మల్ని
పేపర్ చదువుతూ తాగే ఈకాఫీ కప్పు ఖాళీ అయ్యాక
సాయంత్రం పసందయిన టీవీ కార్యక్రమాలు మొదలయి
మీ త్యాగానికి టివీ వాళ్ళిచ్చిన చిన్న వార్త
మామెదల్లో ఎక్కడో మరుగనపడిపోయి
మా భోగాలు మమ్మావహించి మెదళ్లు మొద్దుబరచినతరువాత .
అసలింతకీ ! ఎందుకిలా వెళ్ళిపోతారు మీరు . వెర్రిబాగులోల్లారా
ఆమాత్రం జీతం ఇక్కడ ఏపని చేసుకుంటేరాదు.
తిక్కలోల్లాలా ! ఇక్కడ చూడండి
పబ్బులు ,గబ్బులు.క్రికెట్లు , కంప్యూటర్లు
రాజకీయాలు ,రాష్ట్రవిభజనలు
బంద్ లు ,బస్సులు తగలెట్తుకోటాలు
ఎంత సరదాగా
ఎంత ఆనందంగా బ్రతుకు తున్నమో !
ఇక్కడుండక అక్కడకెందుకెళ్ళారు ?
.............................................
ఏంటో ? అన్నయ్యా చిన్నప్పుడు మీగూర్చి చదివి
మాతృభూమికోసం ప్రాణాలొదలే మీ అదృష్టానికి పొంగిపోయి
కనీసం మీకోసం టీ అందించే అదృష్టమన్నా పట్టాలని
ప్రయత్నించి .. ప్రాప్తం లేక
ఇలా మిగిలినా
మీ రు నాసోదరులని మరువలేక
మనసు కరగి కన్నీరై కారిపోతోంది
............. నవ్వకు సోదరా ! ఆదివ్య ధామంనుంచి నన్ను చూసి
వీడు వృధాప్రగల్భాలు పలుకుతున్న ఉత్తరకుమారుడా ! అని
8 వ్యాఖ్యలు:
జైహింద్.........జైహింద్.........జైహింద్.........
కన్నీళ్ళు పెట్టించారు కదండీ.
జైహింద్
మీరు శత్రుదేశస్థులు మనపై దాడిచేయకుండా మంచులో,చలిలో ఎన్నో కష్టాలు పడుతూ మమ్మల్ని రక్షిస్తూ ఉంటే ,ఇక్కడ మనవాళ్ళనుకునేవాళ్ళే మా ఊర్లలోకి అడుగుపెడితే తోలు ఒలుస్తామంటున్నారు,ఏమిటీ దౌర్భాగ్యం.
అమరులైన జవానుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
అమరవీరులకు స్మృత్యంజలి.. జైజవాన్..
నేను ఇక్కడ రాసాను చూడండిఃhttp://saamaanyudu.wordpress.com/
జైహింద్
అమరులైన జవానుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
జైహింద్
Post a Comment