శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వివేకానంద సుభాషితాలు

>> Sunday, January 12, 2014

వివేకానంద సుభాషితాలు

·         లే! లేచి నిలబడు! ధైర్యంతో ముందుకు సాగు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో.  నీకు దోహదపడే శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయని గుర్తించు.

·         జ్ఞానం, శీలంతోనే వ్యక్తుల జీవితం చరిత్రగా రూపు దిద్దుకుంటుంది.

·         ఆత్మ శక్తి బహిర్ముఖమైతే బాహ్య సంపదలనిస్తుంది.  అదే శక్తి అంతర్ముఖ మైతే, సాధనా సంపత్తి నిస్తుంది.

·         భగవంతుణ్ణి నమ్మని వాడే నాస్తికుడంటాయి మతాలు. కాని, ఆత్మ విశ్వాసం లేని వాణ్ణే నాస్తికుడంటాయి భారతీయ దర్శనాలు.

·         విశ్వాసమే జీవితం! అనుమానమే మరణం.

·         ఇతరులను పాపి అనడమే నువ్వు చేసే ఘోరమైన పాపం.

·         మాటలను వృథా చేసుకోకు.  వాటిని మంత్రాలుగా వాడితే, ఇతరులకు మార్గాదర్శకాలవుతాయి.

·         ఆచరణ కొరవడిన సిద్ధాంతాలే ఈ దేశపు పునాదులను దెబ్బతీస్తాయి.

·         భగవంతుడనేది ఓ పదార్ధం కాదు. వ్యక్తీ అంతకన్నా కాదు.  అఖండమైన శక్తి, అనంతమైన తత్వం.  దానిని గుర్తించాలంటే, చిత్తశుద్ధి కావాలి. జ్ఞానసిద్ధి కలగాలి.

·         లౌకిక సుఖాల కొరకు భగవంతుడిని ఆశ్రయించడం కూడా ప్రాపంచికతే.

·         సంకల్పిమ్చే మనసు, పనిచేసే చేతులతో వ్యక్తి తప్పక విజయాన్ని అందుకోగలడు.

·         బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే సులువైన మార్గం.

·         లక్ష్యం పై ఉండే శ్రద్ధను, లక్ష్య సాధనలో చూపే వాడినే విజయం వరిస్తుంది.

·         సేవకునిగా ఉండడం అలవర్చుకుంటే, నాయకుడయ్యె యోగ్యత లభిస్తుంది.

·         సహృదయం నుండి ‌‍భగవద్వాణి వినిపిస్తుంది.  సంకుచిత బుద్ధి నుండి స్వార్థమే వెలువడుతుంది.

·         ఈ ప్రపంచం పిరికి పందల కోసం కాదు.  పారిపోవడానికి ప్రయత్నించకు.  నిన్ను గమ్యానికి చేర్చగలిగే వజ్ర సంకల్పాన్ని వెతికి పట్టుకో.

1 వ్యాఖ్యలు:

ybr (alias ybrao a donkey) July 12, 2015 at 10:37 PM  

ఈ తెలుగు వాళ్ళకి వివేకానందుడే కాదు ఏదైనా చాలా తేలికగా అంటుకుంటుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలం మనం. తెలుగు వాళ్ళే కాదు భారతీయులలో పలువురు స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలను సరిగా అధ్యయనం చేయలేదు. ముఖ్యంగా ఆయన వ్రాసిన లేఖలను మీరు లోతుగా అధ్యయనం చేస్తే, ఎన్నో తెలియని విషయాలు బయటకు వస్తాయి. మీకు ఓపిక ఉంటే నేను కష్టపడి పరిశోధించి వ్రాసిన click అనే బ్లాగ్ ను పరీక్షగా చదవండి. దురదృష్టవశాత్తు ఇది ఇంగ్లీషులో ఉంది. దీనిలోని కొన్ని అంశాలను నా త్రిభాషా బ్లాగ్ click లో తెలుగులో పెట్టాను. తెలుగు వాళ్ళందరిచేత తిట్టించుకోటానికే నేను వీటిని వ్రాస్తున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP