సజ్జనుల పని పాపులను క్షమించడమే
>> Saturday, July 11, 2009
లోకహింసావిహారాణాం కౄరాణాం పాప కర్మణాం ,కుర్వతామపి పాపాని నైవ కార్యమశోభనమ్
లోకం లో కొంతమంది మనస్సు చాలా కౄరంగా వుంటుంది . ఎప్పుడూ ఏదో ఒక పాపపు పని చేయడమే వారి పని. లోకం లనందరినీ ఏదో విధంగా - మానసికంగానో ,శారీరకంగానో -హింసిస్తూనే వుంటారు,వారు. అది వారి నైజం .జన్మగత సంస్కారం .అయినా ,మనం వారికి అశుభం కలిగించకూడదు అంటుంది వాల్మీకి రామాయణం .
శ్రీరాముడు రావణ సంహారం చేసి ,విభీషణుని రాజ్యాభిషిక్తున్ని చేసాడు. ,సీరకీ విషయం చెప్పిరమ్మని హనుమంతున్ని పంపించాడు. హనుమంతుడు ఆ ఆనందకరవార్త చెప్పగనే సంతోషం తో ప్రసంసించింది సీత.సీత ఆనందాన్ని చూసి నతరువాత హనుమంతుడు ఆమెకు నమస్కరించి అమ్మా! నాకు మీరు అనుమతివ్వండి .మీకు కాపలాగావున్న రాక్షస స్త్రీలందరూ మిమ్మలను ఎంతో బాధపెట్టారు. రావణాసురుడు చేయమన్నదల్లా చేశారు .వీళ్ళనిప్పుడు నా పిడికిల్లతో గుద్ది,కాళ్ళతో తన్ని మోకాళ్ళతో నలిపి చంపాలనుకుంటున్నాను.వీళ్లపళ్ళు విరగగొడతాను ,జుట్టు పీకేస్తాను ,నిన్ను నానారకాలుగా పీడించిన వారందరినీ నానరకాలుగా హింసించి చంపుతాను అని అడిగాడు ఆవేశంగా.
సీత ఒక్కక్షణం ఆలోచించినది. వానరోత్తమా ! వీరు ప్రభుసేవాపరాయణులు ..
రాజసంశ్రయవశ్యానాం కుర్వతీనాం పరాజ్ఞయా విధేయానాం చ దాసీనాం క: కుప్యేత్ వానరోత్తమ
వీరంతా రాజాశ్రయం లో బ్రతికేవారు. అతని ఆజ్ఞననుసరించి ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళ విధేయతతతో వారి వారి కర్తవ్యాలను నిర్వహించుకునే వారిపై ఎవరైనా కోపిస్తారా? నా అదృష్టం లో వున్న ఎగుడు దిగుడు ఫలితాలవల్ల,నాగ్రహస్థితిని బట్టి ,దశాయోగావల్లను నేను అనుభవించాల్సివచ్చినది బాధలను అంతే!
ఆరోజు తమరాజు ఆదేశించాడు చేశారు. ఈరోజతను చనిపోయాడు కనుక ఏమీ భయపెట్తనవసరం లేదు కనుక ఈ దాసీ జనాన్ని నేనుక్షమిస్తున్నాను .అని సందర్భోచితంగా ఒక కథ చెబుతుంది హనుమంతునికి.
ఒకప్పుడు ఒకవేటగాడు పులితరమగా భయపడి చెట్టెక్కాడు. అప్పటికే ఆచెట్టుపైన ఒక ఎలుగుబంటివున్నది.
అప్పుడు పులి ఎలుగుతో "వీడు మనిద్దరికీ శత్రువు వీడిని క్రిందకు తోసెయ్ తినేసి వెల్లి పోతాను అన్నది.
ప్రాణభీతితో వీడు చెట్టెక్కాడు అంటే నన్ను శరణు వేడాడు. కనుక వీణ్ణీ నేను తోసి వేయను అన్నది ఎలుగు.
కొంతసేపటికి పులి ఎలుగు నిదురపోయాయి .అప్పుడు కల్లుతెరిచిన పులి మనిషితో ఆ ఎలుగును క్రిందకు తొయ్ తినేసి వెళతాను నిన్నేమీ చేయనని ఆశపెట్టినది. మనిషి వెంటనే ఎలుగును క్రిందకు నెట్టాడు. అయితే అది ఒక కొమ్మపట్టుకుని క్రిందపడకుండా వేలాడింది ..
"చూశావా ! ఏంజరిగిందో ! ఇప్పుడైనా ఆమనిషిని క్రిందకు నెట్టమన్నది. అప్పుడు ఎలుగు
"న పర: పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం ,సమయో రక్షితవ్యస్తు సంత శ్చారిత్ర్త భూషణా: "
సజ్జనులు పాపాత్ములు చేసే పాపం లో పలు పంచుకోరు. ప్రతిజ్ఞాపాలనముఖ్యం .కనుక నేను వీణ్ణి తొయ్యను గాక తొయ్యను అన్నది. . ఈవిధం గా కథముగించింది సీత.
పాపానాం వా శుభానాం వా వధార్హాణామధాపి వా , కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి.
ఎదిటివాళ్ళు పపులు కానీ ,పుణ్యాత్ములు కానీ ,వారు చెసిన తప్పుకు చంపదగినవారే కానీ జాలి చూపించటం పూజ్యుల పని --అంది.
ఇతరుల పాపం లో పాలు పంచుకోకుండావుండటం. క్షమాగుణాన్ని అలవరచుకోవడం మన కర్తవ్యం .
3 వ్యాఖ్యలు:
బావుంది
గురువు గారూ, పొరపాటున మీ టపాలో ఒకే విషయం మూడు సార్లు వచ్చింది.
అలాగే మీరు టపాలో గురునానక్ ఫొటో పెట్టారు, కానీ రామాయణంకి సంబందించిన కద చెప్పారు. గురునానక్ కి సంబందించిన కద ఏదైనా చెబితే బావుంటుంది కదా!!!
ధన్యవాదములు. ఇక గురు నానక్ మన గురు పరమ్ పరలొ ఒకరు కనుక వాల్లమ్దరు చెప్పేది ఒకటె
Post a Comment