శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వానలు కురిపించాలంటావా మాకోసం ! ? ఎందుకులే స్వామీ !?

>> Sunday, July 12, 2009



ప్రకృతి దయతలచి ప్రసాదించిన సంపదలను సవ్యంగా వినియోగించుకోలేని మాకు ఇప్పుడు వర్షాలు కురిపించాలా !? అని సందేహం స్వామీ . నువ్వేమో బిడ్దలపై కరుణతో ఇలా అన్నీ ప్రసాదిస్తూ వున్నావు .మరి మేమేమో నోటికాడ కూడు కాల్లతో తన్నుకునే పనులు చేస్తున్నాము అహంకారులమై . అలాంటప్పుడు మరలా నువ్వు వండి వార్చినా ఉపయోగమేమున్నదిలే స్వామీ !
మొన్న నాలుగు సంవత్సరాలక్రితమ్ వరుసగా మూడేల్లు కరువు వచ్చినప్పుడు చూడాలి ! గ్రామాలలో గొ్డవలు లేవు.పోలీస్ స్టేషన్లలో చీటికి మాటికి గొడవలు పడి కేసులు వేసుకునేవారు తగ్గారు. ఊర్లలో బాంబుల తయారీ వార్తలు తగ్గాయి పేపర్లలో .అయ్యో బిడ్డలేడుస్తు న్నారు కదా అని కరుణాంతరంగునువి కనుక కనికరించి వర్శాలు కురిస్తే జీవ జలాలు జలజల పారిస్తే మరలా మొదలైనది మా అహం .
ఇప్పుడొచ్చి చూడు మా పల్లెలలో ప్రతి పిల్లవాడూ తాగేటోడే .అదేమంటె కష్టపడితే సాయంత్రానికి రెండొందలు సంపాదిస్తున్నాం .అవి అనుభవించకుంటే ఎందుకు అంటున్నారు. సర్దా లేని జీవితమెందుకనే ఫ్యాషన్ మాటలు వల్లిస్తున్నారు. ఇక పట్టణాలైతే చెప్పనక్కరలా పబ్బులంటూ గబ్బు పనులు చేస్తూ అది నాగరికత అంటున్నారు. నాగరికత అంటే జంతువుల ప్రవర్తన కంటే భిన్నంగావుండటమనుకుంటున్నాము కానీ ,మనిషి కూడా ఒక జంతువేననే మేధావుల సిద్ధాంత రాధ్ధాంతాలతో మతి్ పోతున్నది. పశుత్వం లో ఆనందం వెతుక్కునే నీఛస్తాయి మాకెలా వచ్చిందో స్వామీ ?
పంటలు బాగా పండితే పూర్వం గుడు లు గోపురాలు కట్టుకునేటోళ్ళం.ఇప్పుడేమో బెల్ట్ షాపులు ,బార్లు నిర్మించుకుంటున్నాం. మిగిలిన నాలుగు మెతుకులు అన్నసంతర్పణలని దానాలని చేసేవాల్లం అప్పుడు మరిప్పుడో మద్యం పంచుకుని వేడుకలు చేసుకునే వెర్రి ఆనందానికి అలవాటు పడ్డాము.
ఇది తప్పు అది ఒప్పు అని చెప్పి శాసిచాల్సిన రాజులు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజలను మద్యం మత్తు్లో ముంచుతుంది. ధర్మ విరుధ్ధమైన కార్యక్రమాలన్నీ తప్పేంకాదనే ప్రచారాలకు ఊతమిస్తున్నది. దాంతో మాస్థితి కొండముచ్చులను రాజుగ కొలచిన కోతుల సామితై పోతుండె. అప్పుడెప్పుడో తాతగారు బ్రహ్మం గారు చెప్పినట్లుగా మత్తులోమునగటం నోట కొరువులు పట్టుకుని తిరుగుతూ చేయకూడని పనులన్నీ చేసి వావివరుసలు మరచే హీనజనులు పెరిగి అకార్యాలు చేస్తున్నా నోరు మెదపలేని స్వార్ధ జీవులమై పాపభారం పెరగటానికి పాలు పంచుకుంటున్నాము. కామ ,జిహ్వ చాపల్యాలను ప్రేరేపించే అదర్మ సిద్ధాంతాలన్నీ గొప్పవని ప్రచారం చేస్తుంటే అగీంకారం తెలుపుతూ వుంటిమి.
మేలు చేసే చెట్లను నరికి ,తల్లి భూమాత గర్భకోశాన్ని తొలచి తొలచి హింసించి ..హింసించి .నీ సృష్టి రచనకు అలంకారమైన అన్యజీవరాశిని సమూలంగా తుడిచివేస్తూ రాక్షసానందాన్ని పెంచుకుంటున్నాము
అంతటితో ఆగామా పరమ పవిత్రమైన నీ ఏడుకొండలకే ఎసరెట్టి ఇన్ని పాపాలకు పాల్పడ్తూ మల్లా మా అవసరాలకు యాగాలు చేసి నిన్ను మాయపుచ్చాలనే మహా మేధావులమైతిమి .ఒల్లు బలుపు పనులకు తెగబడుతుంటిమి.

అసలు నువ్వప్పుడేమి చెప్పావు ? ఇచ్చిన ప్రకృతి సంపదను పరస్పర శ్రేయో దాయకంగా పంచుకోమని చెప్పిన మీ మాట మేము వింటున్నామా ,కనీసం తెలుసుకుంటున్నామా ? పాపపు పనులు చేయటమే కాదు ,వాటిని చూస్తూ మౌనంగా వుండటం కూడా పాపమేననే మాట పాటించలేక పోతిమి. ఇప్పుడేమో ఈపాపపు భారము తో ప్రకృతి మాత క్రోధముతో వేడినిట్టూర్పులు విడుస్తూంటే విలవిల లాడుతుంటిమి . ఒకవంక నిన్ను లెక్కచేయక నీవునికే లేదని హేళన చెస్తూ , ఇప్పుడేమో నువ్వు వర్షాలకురిపించటం లేదని నిందిస్తుంటిమి.

నువ్వేమో పరమ భోళావైతివి ఏదో కొద్దిమంది భక్తులకు బాధకలుగుతుందని నాలాంటి పాపులందరిని ఉదారంగా క్షమిస్తుంటివి. ఇంకెప్పుడు అర్ధమవుతుండి స్వామీ మాకు నీ లీల .
మాకు కడుపులు నిండితే కామపు పొరలు కమ్మే జబ్బుతగ్గాలంటె ,కడుపు కాలుతూ వుండాలేమో అప్పుడప్పుడూ !
ఉఛ్ఛనీచాలు మరచి నిన్నే ధిక్కరించే మాకు చెంప దెబ్బ కొట్టి సరి చేసే ప్రకృతి మాత పాఠాలు అవసరమేమో నని పిస్తుంది . మరొక కోట్లాది మంది ఆకలి కేకలు నిన్నెంత బాధిస్తాయోనని బాధగాను ఉంది . అజ్ఞానులం ప్రభూ .తల్లివైఅ తండ్రివై ,గురువువైఅ మాకు సన్మార్గాన్ని చూపించు స్వామి ఆచరణ లోకి అనుభవం లోకి వచ్చేలా .........ఇది తప్పో ఒప్పో నా మూర్ఖత్వాన్ని మన్నించు స్వామి .


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP