హనుమంతుని భక్తజన పాలనకొక ప్రత్యక్ష ప్రమాణం ఇదిగో !
>> Wednesday, June 24, 2009
భక్త జనపాలకుడైన హనుమంతుల వారు ప్రయాణించటం లోనే కాదు భక్తుల పాలించటం లోనూ తన వేగాన్ని ఈ చర్యద్వారా నిరూపించారు. చూడండి ఆయన భక్తుల పట్ల ఎంత కరున కలిగి వున్నారో.
మావూరిలో శ్రీనివాసరెడ్డి అనే యువకుని కుమారుడు చదువుతున్న రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పారిపోయా
డని ,ఆతల్లిదండ్రుల దు:ఖాన్ని చూడలేకపోతున్నామని మొన్న పోస్ట్ లో వ్రాసాను కదా. ఇక చదవండి.
మంగళ వారం అంటే నిన్న ఉదయాన్నే అతను పీఠము వద్దకు వచ్చాడు. ఈ రోజు నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణము చేయమని చెప్పానుకదా! కాని అతను చేయలేనన్నాడు. బావా ! నాకు కాలి మీద గడ్డపార పడటం వలన అప్పటి నొప్పి ఎక్కువ సేపు కూర్చుంటే తిరగ బెడుతున్నది. నూట ఎనిమిది సార్లు చేయలేను అన్నాడు. సరే ! నీకు సాధ్యమైనంత సేపు చేయి అని చెప్పాను. అతను నిష్ఠగా స్వామి వారికి అభిషేకము చేసుకుని ఆయన దగ్గరే కూర్చుని ఎంతో ఆర్తితో స్వామిని వేడుకుంటూ పారాయణం చేసాడు ,తదనంతరం ప్రదక్షణలు చేసాడు. ప్రస్తుతం పారి పోయిన వాని జాతకం లో శుక్ర మహా దశ లో శని అంతర్దశగా జరుగుతున్నదని చెప్పారు ,కాబట్టి శని దోషనివారణార్ధం గంగ సింధూరం లో నువ్వుల నూనె కలిపి హనుమంతునికి అభిషేకము చేయమని చెప్పి చేపించాను.తరువాత రుద్రభిషేకము లో నూపాల్గొన్నాడు. అక్కడ మాఊర్లో అతని భార్య కూడా ఊరిలోవున హనుమదాలయం లో తెల్లవారు ఝాముననే ప్రదక్షినలు ప్రారంభించినదట. ఒరే అబ్బాయి ! తల్లి బాధను అసలు చూడలేడు స్వామి . కనుక నీసమస్యను ఆయన తప్పక తీరుస్తాడు చూడు అని చెప్పాను.
చిత్రాతి చిత్రం గా ఆయన మహిమ ఎంత వేగంగా ప్రసరించినదో చూడండి. నిన్న సాయంత్రం ఏడుగంటల సమయం లో ఆపారి పోయిన పిల్లవాడు ,తిరుమల నుండి ఫోన్ చేసి నేను గుడివద్ద వున్నాను అని చెప్పాడు. వీళ్ళు నువ్వు అక్కడనేవుండరా అని చెప్పి వీళ్ళు నాకు ఫో్న్ చేసి చెప్పిఎంతో ఆనందం తో స్వామి మహిమను మరి మరి పొగిడారు. అదృష్ట వశాత్తూ వీళ్ళ బంధువులు తిరుమల వెళ్ళినట్లు తెలిసి వాల్లకు ఫోన్ చేసి మన పిల్లవాడి ఇలా ఫోన్ చేసాదని తెలియ జేశారు. అక్కద వాళ్ళు పోలీసులకు తెలియజేసి అనౌన్స్మెంట్ చేసి మొత్తానికి పిల్లవాన్ని పట్టుకున్నారు.దిగువతిరుపతికి వచ్చాము అని చెప్పారు. ఇక్కడనుండి రాత్రే ఒక జీపు మాట్లాడుకుని మాతమ్ముని కూడా తీసుకుని పదిమంది దాకా తిరుమల వెళ్ళారు. ఇప్పుడే ఫోన్ చేశారు .కాణిపాకం వెళ్ళివచ్చి మరలా తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వెళుతున్నాము అని చెప్పారు.
కూడూ నీళ్లు లేకుండా పది రోజులుగా ఏడ్చి ఏడ్చి కుంగి పోయిన ఆతల్లి ముఖం లో ఆనందం పొంగి పొరలుతోంది .తనబిడ్డను చూడాలని తల్లడిల్లుతున్నది. నిజంగా స్వామి మహిమను తలచుకుని మాకు నోటమాట రావటమ్ లేదు.
ఈ బిడ్డ మరలా తల్లిదండ్రులను చేరాలని కోరుకుని స్వామిని ప్రారధించమని కోరాను మిమ్మలను .మీలో వున్న భక్తుల ప్రార్ధనలు ,స్వామి దయ ఆతల్లి కడుపు శోకాన్ని ఉపశమింపజేసాయి . మీకు ,స్వామికి మరలా మరలా ప్రణామాలు తెలియ పరచుకుంటున్నాను.
నీవు సీతాశోక నివారకుడవు. అంటే జగన్మాత శోకాన్నే నివారించిన నీవు ఈ తల్లి శోకాన్ని నివారించావంటె చిత్రమేమున్నది. ధన్యమైనది స్వామీ నాజన్మ ,నీమహిమను మరొకసారి లోకానికి చాటిన ఈ సన్నివేశము లో పాల్గొని.
6 వ్యాఖ్యలు:
ఎలాగయితేనేం, వాళ్ళ శోకం తీరింది.
జై హనుమాన్.!
అందుకే ఏం కష్టం వచ్చినా జై ఆంజనేయా అని ఒకసారి అనుకోమంటారు పెద్దలు.
జై హనుమాన్ !
జై హనుమన్
జై హనుమన్
Chala adbhuthamina mahimanu teliyachesinaduku dhanyavaadalandee.
Lakshmi
Inta manchi mahimanu panchukunnaduku hridayapurvaka dhanyavadAlu. DInivalla mAku Bhakti lo erppdde vaiklabyalu tolagipoyi, viswasam marintha dridham avvadaniki todpadutundi.
Namaskaralato,
Lakshmi
Post a Comment