అసలు మనకేం కావాలి ?
>> Friday, June 12, 2009
అన్ని ప్రాణులలకు లాగే మానవుని ప్రథమ లక్ష్యం జీవించడమే.అంటే ఎలాగైనా మృత్యువునుండి తప్పుకోజూడటమే.అందువల్లనే జీవితము అన్నింటికంటె ప్రియమని తలుస్తాము.కాని ఇది నిజమా? మానవుడు జీవించడం తో మాత్రమే తృప్తి పడగలిగితేనే అలా తలచడం సాధ్యం .వాస్తవానికి కేవలం జీవించడం మాత్రమే కాక కొరతలేని తృప్తి .శాంతులతో జీవించాలని తలుస్తాము. మనం ధనమూ,కీర్తీ,పదవి,హోదాలను పొందటానికి యత్నిస్తున్నామంటే వాటిద్వారా తృప్తి శాంతి లభిస్తాయన్న ఆశే కారణం.అందుకే వాటి కోశం మానవుడు ఎన్ని కష్టాలకైనా ఓరుస్తాదు.కని ఎన్ని సాధించినా ప్రతివాడూపొందవలసినదేదో తనకింకా లభించలేదన్న కొరతకు గురవుతాడు. ఇంకా ఏదో సాధస్తే దానిద్వారా తృప్తి,శాంతి లభించవచ్చని భ్రమిస్తూ మరణించేదాకా కాలం గడిపేస్తాడు. కాని ఎన్ని కోట్లమంది మానవులు ఎన్ని యత్నాలు చేసినా ఎన్నింటిని సాధించినా వారికింకా ఇట్టి కొరత మిగిలిండటమే చిత్రం.
ఇలా అని కొరతలేని తృప్తనేది ఒక ఊహా కల్పన మాత్రమేనని .అట్టిదసంభవమని భావించి ఊరుకొగలమా? అట్టినిశ్చయం ఏర్పడిననాడు జీవితం అర్థరహితమనిపించి మానవుడు ఆత్మహత్యకు గానీ ,ఉన్మాదానికి గాని ,మత్తు పదార్ధాలకు గాని పాల్పడతాడు. .అంటే కొరతలేని తృప్తి పొందటం జీవించటం కంటే కూడా మానవునికి ముఖ్యమన్నమాట. కాని అట్టితృప్తి ఇంతమంది లో ఎవరికీ కలగక పోయినా అందరూ జీవించాలని తాపత్రయపడటానికి రెండూ కారణాలున్నాయి. ఒకటి అట్టితృప్తి ,శాంతి ఎవరికీ లభ్యం కాలేదన్న ఎరుక కలగక తమకు లేనిదానినుఇ పొందితే అవి లభిస్తాయన్న భ్రాంతి,రెండు అంతకంటె బలీయమైన కారణం మృత్యువంటే భయం.
కాని మృత్యువంటే ఎందుకు భయం? దాని నిజరూపం తనకేమి తెలిసిమానవుడు భయపడతాడు.? మృత్యువులో తనకేమి జరుగుతుందో తెలియదు.అలా తెలియక పోవతమే భయానికి కారణం.
అట్టి మృత్యుభీతివలన జీవితానికంటిపెట్టుకుని వుంటాడే గాని,తీరా జీవించబోతే కొరత ,అసంతృప్తి మాత్రమే ఎదురౌతాయి. చావుకు పెడితే లంఖణానికొప్పుకున్నట్లు ,ఏమీ తెలియని మృత్యువుకంటే ఎంత అసంతృప్తిగావున్నా కొంతవరకైనా తనకు పరిచయమైన జీవితమే మేలనుకుంటాడు.మానవుడు. "ఏడావలేక నవ్వుతూ " వున్నట్టు చావలేక బ్రతుకుతాడు. అట్టి జీవితం లోని కొరతను ,అసంతృప్తిని ఎలా అతిక్రమించాలో తెలియక దానిని విస్మరింపజూస్తాడు.సినిమాలు ,నవలలు మొ// కాలక్షేపాలన్నీ అసంతృప్తి కరమైన అనుభవాల పరంపరలుగా గడిచే కాలగతిని మరిచే యత్నాలు మాత్రమే . వైద్యులిక తగ్గదని నిర్ణయించిన రోగబాధను మత్తుమందులతో మరుగు పరుచుకోజూట్టం లాంటిదే కాలక్షేపం. నానాటికీ ఆమత్తుమందుల ఆమత్తు మందుల మోతాదు పెరగవలసి వచ్చినట్లే కాలక్షేపాల మోతాదు కూడా పెరగవలసి వస్తుంది. కాని వాటిననుభవించాలంటే డబ్బు అవసరం. ఎక్కువ డబ్బుసంపాదించాలంటే అదికంగా శ్రమింఛాలి . కాని కాలక్షేపం మత్తుమందులకు అలవాటు పడినవాడు చిత్తశుద్ధితో శ్రమించలేడు. అట్తివాడు అవినీతికి పాల్పడాల్సివుంటుంది. తృప్తినీ ,శాంతినీ ప్రసాదించేవిగా తోచే కీర్తి ధనము పదవి ,హోదాలను పొందాలన్నా అట్టివారికి అవినీతే సులభమైన మార్గమనిపిస్తుంది. ఇదే సమాజం లో అవినీతికంతకూ మూలం .వీటికి తోడు వ్యక్తులలోని బలహీనతలను వినియోగించుకుని లాభాలను గడించే వారు అంటే మనకు కాలక్షేపాన్నందించేవారు ,ఈదౌర్భల్యానికి మరీ. దోహదం చేస్తారు.
కనుక ఇంత అస్తవ్యస్తానికి దారితీసే కాలక్షేఅపాలు జీవిత సమస్యకు నిజమైన పరిష్కారాలు కావు .కాలగతిలో సామాజిక ధర్మాన్ని తారు మారు చేసి జీవితం దుర్భరమయ్యేలా చేసేవి పరిష్కారాలెలా అవుతాయి ? కేవలం సమస్యనుండి పారిపోవటం అవుతాయి.మృత్యువును నుండి తప్పుకోజూడటానికి కారణం భీతి అనీ ,భీతికికారణం మృత్యువంటే ఏమిటో తెలియక పోవడం అని గుర్తించాము. కాలక్షేపాలద్వారా మానవుడు జీవితానుభవాలనుండి తప్పుకోజూడ్డం వలన అతనికి జీవితమన్నా భయమేనని అంగీకరించాలి.జీవితమంటే ఏమిటో తెలియక పోవటమే అట్టి భయానికి కారణం కాగలదు. జీవితమంటే అనుభవాలను గుర్తించే ఎరుక .దానినే "నేను" అంటాం .నేను "అంటే ఏమిటో దాని తత్వమేమిటో మనకు స్పష్టంగా తెలియకపోవటమే మనం కాలక్షేపాల మాటున దాక్కోజూట్టానికి కారణమన్నమాట.మరణ భీతిచేత జీవితానికంటిపెట్టుకుంటాం.తృప్తి కోసం ఆజీవితాన్నుండి కాలక్షేపాలచాటుకు తప్పుకోజూస్తాం.
కాని గాఢనిద్రలో నున్నపుడు కొరతలేని తృప్తిని ,శాంతిని ప్రతివాడు అనుభవిస్తాడు. అందరికీ ఒకేరీతిలో అనుభవమవుతుంది కాబట్టె, ఈజగత్తు సత్యమని మనం అంగీకరించినట్టే ,గాఢనుద్రలో తృప్తీ,శాంతి సత్యమని మనం అంగీకరించాలి. జీవితం లో ఎన్ని కోట్లమంది ఎట్టి శాంతిని తృప్తిని ఆశించి నిరంతరం< యత్నిస్తారో ,కానీ పొందలేరో అట్టిది గాఢనిద్రలో ఎక్కడనుండివస్తుంది .? అది తెలిస్తే దాన్ని మెలుకువలో సహితం పొందవచ్చు. మనకు జీవితం లో లభించే కష్టాలు ,సుఖాలు ఇంద్రియాలద్వారా మెలకువలో లభిస్తాయి. కానీ మనస్సు ఇంద్రియాలు గాఢనిద్రలో కట్టుబడతాయి. కనుక ఆస్థితిలోని తృప్తీ శాంతి మనకు వేరొకలభించేవి కావన్నమాట. అంటే మనలోనే స్వతహాగా వున్నవన్నమాట. అమ్టే కాదు గాఢనిద్రలో ,శాంతి వెరుగను,దానిననుభవించేమనం వేరుగను వుండం. అట్టి శాంతేమనమయ్యుంటాం. ! మనలోనేవున్న తృప్తిని శామ్తిని గమనించక దానికై బాహ్యవస్తువులలో వెతికితే ఎలా లభిస్తుంది? ఇదే జీవిత కొరతకు కారణం. చమ్కలో మేకపిల్లనుంచుకుని ఊరంతా వెతికితే దొరుకుతుందా? మనలో కొరతలేనితృప్తీ శాంతీ వుంటే మనకవి మెలకువలోకూడ అనుభవానికిరావాలికదా? ఈప్రశ్నకు దృష్టాంతంగా చూడండి. ఒక తొట్టిలో నీరుపోశామనుకోండి . ఆనీరు నిశ్చలంగా వున్నప్పుడు అడుగు స్పష్టగా కనపడుతుంది. కానీ నీరు కలతజెందినప్పుడు తొట్టిడుగు స్పష్టంగా కనపడదు. మరుగున పడుతుంది. మానవుడు తొట్తివంతివాడు. మనస్సేనీరు .తొట్టిఅడుగే గాఢనిద్రలో అనుభవమయ్యే తృప్తీ,శాంతి , ఆ నీటి సంచలనమే చిత్తచాంచల్యంతో కూడిన మెలుకువ. కాబట్టి మెలకువలో మనస్సును నిశ్చలమ్ చేస్తే ప్రతివారికీ తామనుక్షణం కోరుకునే తృప్తి,శాంతి లభిస్తాయన్నమాట. అందుకవసరమైన క్రమశిక్షణే ఆథ్యాత్మికత అంతా. కానీ ఆథ్యాత్మిక మానవుని నిష్క్రియాపరునిగా చేయదు. సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు ఎవరైనా పలకరిస్తే దిగవలసిన ఆవస్యకత వుంటుంది. . కారణం మనస్సు ఆమాటలపైన పనిచెస్తే సిఅకిల్ తొక్కటం పైఅ పనిచెఅయదు కనుక వాడు పడిపోయేప్రమాదం వుంది. కాని సైకిల్ తొక్కటం పూర్తిగా వస్తే సంభాషిస్తూ కూడా తొక్కుతాడు. అలానే ధ్యానంలో నిలకడ కుదిరాక జీవిత కర్తవ్యాన్ని కొనసాగిస్తూకూడా ఆంతర్యం లో తృప్తిని,శాంతిని అనుభవించగలుగుతాడు. ఆస్థితినే జీవన్ముక్తి అన్నారు. జీవించివుండగనే అసమ్తృప్తి రూపమైన దు:ఖాన్నుండి విముక్తి పొందుతాడు. ఆదు:ఖానికి కారనమైన తానేమిటో తెలియని అజ్ఞానం నుండి విముక్తుడౌతాడు. తృప్తే,శాంతే తానని ప్రత్యక్షంగా తెలుసుకుంతాడు. కనుక ట్రుప్తి శాంతులకోసం నాడు బాహ్యంగా అన్వేషించాల్సిన అవసరం వుండదు. శరీరం తన ప్వృత్తి ననుసరించి తనను తానే పోషించుకునే కృషిని చేస్తుంది. అట్టివ్యక్తి సమాజం లో అవినీతిపరుడు కాజాలడు. నీతికీ ,ధర్మానికీ దోహదమౌతాడు. గాఢనిద్రలో అంటేపరిపూర్ణమైన శాంతిలో ,తానంటె ఈదేహమేనన్న భ్రాంతి తొలగినట్టే జీవన్ముక్తుడికీ( తొలగుతుంది. కనుక మరనభీతి తొలగుతుంది. కనుక ఝివితాన్నణ్టిపెట్టుకోవలసిన ఆవస్యకత వుండదు. జీవించినంతకాల్ం తృప్తీ శాంతీ తానై జీవిస్తాడు. ఆతరువాత నిర్భయంగా మరణిస్తాడు. అంతేకాదు, జనన జీవన ,మరనాలు కాలబద్దమైనవి .కాలం గాఢనిద్రలో అవాస్తవమైనట్లు జీవన్ముక్తుడికి కాల్ంతోపాటు జననమరనాలు కూడా అవాస్తవమవుతాయి .కనుక అతను మరణిస్తాడనటం కూడా అతనిదృష్టిలో వాస్తవం కాదు. ఆథ్యాత్మికత అంటే ఇట్టిదని గుర్తించక ,దానిపేరిట ప్రపంచంలో చలామ్ణి అయ్యే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ,ఆథ్యాత్మికతనే అసత్యమని నిరూపించినట్లు నేటి నాస్తికులు భ్రమిస్తున్నారు.డబ్బుకోసం ప్రపంచంలో జరిగే అన్యాయాలను చూసి సమాజంలో డబ్బే వుంశ్డకూడదనే కుతర్కం వంటిదే వీరివాదం. ఆథ్యాత్మికతే అవసరం లేదనేవారు ,సర్వజీవులూ ఏతృప్తికోసం అన్వేషిస్తున్నాయో దానినే అవసరం లేదంటున్నారు. అప్పుడు తమ నాస్తికవాదాన్ని మాత్రం చెప్పటమెందుకు.? దేన్నాసించి చెప్పాలి? ప్దార్ధవాదులు చైతన్యమేలేదంటున్నారు.ఆధునిక భౌతిక రసాయన శాస్త్రాదులలో దాని యొక్క ఆస్తిక్యం నిరూపించబదలేదంటున్నారు . కానీ అట్టి శాస్త్రీయ పరిశోధన చేయాలన్నా ,అట్టి నిర్ధారన చెయ్యాలన్నా చైతన్య మావశ్యకంకదా! అట్తి చైతన్యమే నిజంగాలేకుంటె ,సమాజానికి సత్యాన్ని బోధించాలని తలచేది ఎవరు? అట్టిచైతన్యం గలవ్యక్తులే లేకుంటే ఎవరికి బోధిస్తారు? చైతన్యమ్లేని భౌతిక రూపాలకు మనుగడ చేకూర్చడమేమిటి? కనుక వారి వాదం పైవారికి విశ్వాసముంటె వారెవరికీ ఏమీబోధించకూడదు. చైతన్యమే లేదంటే దాని కనుభవమయ్యే తృప్తీ,శాంతి లేనేలేవన్నమాట. ఈసూత్రాన్ననుసరించి వారు నిత్యజీవితన్ని కొనసాగించగలిగితే వారి సిద్ధాంతంపై వారికి విశ్వాసమున్నట్లు. కాని అలాచేయాలన్నా చైతన్యమావ శ్యకమే ! అంటే ! ఆథ్యాత్మికవాదం అప్రతిహతమన్నమాట.
----------ఆచార్య ఎక్కిరాలభరద్వాజ గారి రచనలనుండి
1 వ్యాఖ్యలు:
ఈ టపా లో చాలా మంచి విషయాలు చెప్పారు.. ఎక్కిరాల భరద్వాజ్ గారి రచనను పాఠకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
Post a Comment