గురువు అవసరమా ? కాదా?
>> Thursday, June 11, 2009
ఆథ్యాత్మిక తాత్విక రంగాలలో కొందరు ప్రముఖులు గురువు అవసరం లేదనివాదిస్తారు .వారిలో జిడ్డుకిష్ణమూర్తిగారు ప్రముఖులు.ఆథ్యాత్మిక సంచలనం గా గుర్తింపబడిన వారిని ఆశ్రయించిన వారు అర్ధంకాకపోతే ప్రశ్నించి తెలుసుకుంన్నారు. ఆయనకూడా తన శక్తియుక్తులన్నీ వినియోగించి శ్రోతలలో ,అడిగేవారి లోనూ సత్యాన్వేషణ రేకెత్తించడానికి తీవ్రంగా కృషిచేశారు..ఆవిధంగాచూస్తే ఆయన నిజమైన వేదాంతగురువుగా భాసిస్తారు. ఆయనే ఒకచోట ఇలాఅంటారు " నిజమైన గురువు నిన్ను నీవు అర్థం చేసుకొమ్మని చెబుతాడు" [ if he is real guru he will tell you understand yourself "] .కృష్ణమూర్తిగారు గురువు కిచ్చిన నిర్వచనానికి ఆయనా సరిపోతున్నారు.
గురువులు అవసరం లేదంటూ శ్రీకృష్ణమూర్తిగారు చేసే తర్కం ఇలావుంటుంది. " భ్రమలో చిక్కిన ప్రజలు తమ రాజకీ్య నాయకులను ఎన్నుకుంటారు . వారి ఎన్నిక కూడా భ్రమలో భాగమే .అలానే అజ్ఞానం లోచిక్కిన ప్రజలు తమ గురువునెన్ను కోవడం ఇలాంటిదే .అజ్ఞానం లో వున్న ప్రజలెన్ను కొన్న నాయకుడెలావుంటాడో అలానే అజ్ఞానం లో వున్న శిష్యుడెన్నుకున్న గురువు కూడా అలానే కాక మరేమవుతాడు? [why spiritual Teachers in the first and last freedom] . చూచేదానికి ఈతర్కం బాగున్నా అది ఎంత అసంబద్దమో ఆవాదాన్నే కొంచెం పొడిగిస్తే తెలుస్తుంది.
ఆయన చెప్పేదెలావున్నదంటే ..........
అనారోగ్యం తో బాధపడుతున్న రోగి ,రోగియైన డాక్టర్ నే ఎన్నుకుంటున్నాడు .రోగం లో వున్నవాడు మరొకరి రోగాన్ని ఎలా బాగుచేయగలడు? కనుక డాక్టర్ ను చికిత్సకై ఆశ్రయించడం అనవసరం !
మరి జిడ్డు కృష్ణమూర్తిగారు అంత సులభంగా పొరబడ్డారా? వారి ప్రసంగాలను జాగ్రత్తగా చూస్తే శ్రీకృష్ణమూర్తిగారు ద్వజమెత్తేది నిజమైన గురువులమీదకాదని ,గురువుల పేరుతో అమాయకులను తప్పుదోవపట్టించే వారిపైనని అర్ధమవుతుంది.అమ్దుకే ఆయన ఒకసారి ఆవేడనతో ఇలాఅంటారు ." నిజమైన గురువులను మనమిప్పుడు ఎక్కద చూడగలం ? అని. ఆమాట సత్యం. శ్రీ సాయి కూడా అన్నారు కదా "నిజమైన ఫకీరు అరుదు అని .
- ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ప్రసంగాలనుండి .
4 వ్యాఖ్యలు:
గురువులలో దోంగ గురువుల గురించి చేసిన ప్రసంగం అండి అది,నిజమే ఈ రోజులోలొ నిజమైన గురువులు కష్టం అలాగే గురువులను జోకర్లు గా కేవలం విద్యర్ధుల హేలన కోసమే అన్నట్లు నేటి సినిమాలా ప్రభావం కుడా.
గురువులని దైవంగా భావించే కాలనికి తిరిగి వేలాలి అని ఉంది.
కృష్ణమూర్తి గారు, గురువు అన్న శబ్దం మీద (గు - అంధకారం, రు - తొలగింపు), ఉపనిషద్ మహావాక్యాల మీద, స్వామి వెంకటేశానంద అనే ఒక అధ్యాత్మిక గురువుతో అత్యద్భుతమైన ప్రసంగం (సంవాదం) చేశారు. మీకు వీలు చిక్కితే, ఆ సంవాదం వినగలరు. (ఆ సంవాదం చదవడం కంటే వినడం ఓ గొప్ప అనుభూతి).
గురువు నావ దాటడానికి వాడబడే తెప్ప లాంటి వాడని బుద్ధదేవుడే అన్నాడు. అయితే ఈ పాఠాల సారాంశం గురుద్రోహం చేయమని, ఒకరిని ధిక్కరించమని కాదు. ఒక విషయం పఠితకు ఎలా అర్థమవుతుందనేది, ఆ పఠిత మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. కృష్ణమూర్తి వంటి గురువు కాని గురువుల విషయంలో ఇది మరింత నిజం.
Go and meet Jaggi vasudev.
గురువన సాయి యొక్కఁడగు. కూర్మిని బోధలు సేయు సాయి సద్
గురువు.నిజంబు. కూటికిని, గుడ్డకు జీవన మార్గమెన్ని సద్
గురువులమంచు బోధనలు కోరుచు చేయు గురున్ గురుండనన్
కరరుహమున్ ఘనంబనుట కాదొకొ శ్రీ షిరిడీశ దేవరా!
(నాచే రచింపఁబడిన శ్రీ షిరిడీశ దేవ శతకము 27 వ పద్యము)
Post a Comment