శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగమునకు మీ గోత్రనామాలు పంపండి

>> Saturday, December 21, 2019

భగవద్బంధూ !

           ఈడిసెంబర్ ఇరవై ఆరు న సంభవిస్తున్న సూర్యగ్రహణం  ,షష్ఠగ్రహ కూటమి భూమిపై  మానవులజీవితాలపై  దుష్ప్రభావాలను చూపనున్నది. ,వ్యక్తిగతంగానూ సామాజికంగాను అలజడులు,ప్రమాదాలకు కారణము కానున్నదని పెద్దలు సూచించున్నారు.   గ్రహస్ఠితులను మార్చగల శక్తి మనకు లేకున్నా భగవంతుని శరణుచొచ్చటం ద్వారా ఉపద్రవాలనుండి రక్షింపబడతామన్నది  వాస్తవం.  కనుకనే భక్తజనుల క్షేమముకోసమై 
"హనుమత్ రక్షాయాగం " ను ద్వాదశావృతిగా   ప్రారంభించటం జరిగినది. ప్రతిసంవత్సరం జరుగుతున్న ఈ క్రతువులో పాల్గొనటం ద్వారా  స్వామి అనుగ్రహంతో తమ సమస్యలను పరిష్కరించికున్నవారు  శీఘ్రముగా శుభములను పొందినవారెందరో ఉన్నారు. ఇందుకోసం ఎవరికి ఏమి ఇవ్వనవసరం లేదు. కేవలము భక్తితో  హనుమాన్ చాలీసా.. శ్రీరామనామ జపము, లేఖనము ద్వారా  హనుమత్ప్రభుల రక్షణను పొందవచ్చు. ఇందులకు నిదర్శనముగా  అనేకమంది భక్తుల జీవితములలో స్వామి చూపిన లీలలను ఈ బ్లాగులో వ్రాస్తూనే ఉన్నాము.
మీరు కూడా స్వామికి మీ సంకల్పమును నివేదించుకుని ,హనుమాన్ చాలీసా పారాయణము, శ్రీరామ నామ లేఖనము ప్రారంభించి  మీ గోత్రనామాలను పీఠమునకు పంపండి. మీ తరపున ఇక్కడ స్వామికి   పూజలో విన్నవించుట జరుగుతుంది.
అలాగే  9-2-2020   మాఘపౌర్ణమి నాడు జరిగే పూర్ణాహుతికి మీరుస్వయముగా రావచ్చును .అలా అవకాశం లేనివారు మీరు వ్రాసిన శ్రీరామ నామ లేఖన ప్రతులను పీఠమునకు చేరునట్లుగా  పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపవచ్చు. మీ గోత్రనామములతో  మీ తరపున యాగములో సంకల్పం చెప్పబడుతుంది.
ఇక చాలామంది గోత్రనామాలు పంపటంవరకు చేస్తున్నారు. కానీ నామలేఖనము గానీ పారాయణముగానీ చేయుటకు ఆసక్తి చూపటం లేదు. అంత బద్దకస్తుల కోసంమేము స్వామిని వేడుకొనుట పాడికాదు అనుపించుచున్నది. కనుక  మీరు మీ ఇంటివద్ద నామ లేఖనమో పారాయనమో,జపమో! చేయగలిగినవారు మాత్రమే గోత్రనామాలు పంపవలెనని మనవి
మీ కందరకు స్వామి రక్షకుడై కాపాడాతుండాలని ,సర్వశుభాలను ప్రసాదించాలని వేడుకుంటున్నాము
జైశ్రీరాం


-------------------------------------------------------------------------------------------------------
గోత్రనామాలను
durgeswara@gmail.com       or     9948235641  watsap  ద్వారా పంపగలరు.ఇంకా వివరాలు క్రింద ఇచ్చిన పత్రికలో చూడగలరు.


 



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP