శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హరివరాసనం చరిత్ర*

>> Tuesday, January 10, 2023

*హరివరాసనం చరిత్ర*
                    ➖➖➖✍️


అయ్యప్ప పూజ చివరిలో *"హరివరాసనం"* లేదా *"శ్రీ హరిహరాత్మజాష్టకం"* గానం చేయడం ఒక సంప్రదాయం.

 శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు.

ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు.

ఈ స్తోత్రాన్ని
*"కుంబకుడి కులతూర్ అయ్యర్"* రచించాడు.

1955వ సంవత్సరంలో *స్వామి విమోచనానంద* ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు.

 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో *వి. ఆర్. గోపాలమీనన్* అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు.

అప్పట్లో *"ఈశ్వరన్ నంబూద్రి"* అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత *గోపాలమీనన్* శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన *ఈశ్వరన్ నంబూద్రి* ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో *"హరివరాసనం"* స్తోత్రం చదివాడు. 

అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క దీపం మాత్రం ఉంచుతారు. 

ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది.

శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, *"స్వామి శరణు"* అని కూడా చెప్పుకోవద్దని చెబుతారు.

*ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.*


*హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం* *ఆరాధ్యపాదుకం*
*అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం* *నర్తనాలసం*
*అరుణభాసురం* *భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం* *సుప్రభాంచితం*
*ప్రణవమనీద్రం* *కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*తురగవాహనం సుందరాననం - వరగధాయుధం* *వేదవర్ణితం*
*గురుకృపాకరం* *కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం*
*త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం*
*ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం*
*కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*

*శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం* *సాధుజీవనం*
*శృతిమనోహరం* *గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే*

*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*
*శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP