శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహిళా కళాశాల లో పురుషువిద్యార్థులకు ప్రవేశం లేకపోవటం సమానత్వానికి విరుద్ధం

>> Friday, February 8, 2019

శబరిమల కేసు - హిందువులపై దాడి

శబరిమల కేసు విషయంలో హిందూ సమాజం పై  క్రైస్తవ మిషనరీల కొత్త రకం దాడి .....

తమిళనాడు లోని ఒక క్రైస్తవ మహిళా కళాశాల లో కొత్త రకం దాడి జరుగుతోంది. అది ఎలా చాప కింద నీళ్ల లాగా జరుగుతోందో చూద్దాం.

తమిళనాడు లోని ఒక క్రైస్తవ మహిళా కళాశాల లో "శబరిమల కేసు స్త్రీల హక్కులు' అనే విషయంపై చర్చలు పెట్టి అందులో పని చేసే ప్రొఫెస్సర్స్ ఈ విషయంపై 'Freedom of Expression and Women"s Rights'  అనే ముసుగులో హిందూ బాలికలలో తప్పు దోవ పట్టించే విధంగా హిందూ సమాజం లో మహిళలపై వివక్ష అంటూ విషం నూరి పోస్తున్నారు.

ఆ చర్చల్లో పాల్గొన్న హిందూ బాలికలు ఈ విషయంపై హిందూ సమాజంలో(కేవలం హిందూ సమాజంలో మాత్రమే) నిజం గానే మహిళల పట్ల వివక్ష చూపుతున్నారనే భావన కలిగించి తద్వారా హిందూ సమాజమాన్ని బలహీన పరిచే ప్రయత్నం జరుగుతోంది.

ఈ విషయంలో ఆ కళాశాలలో చదువుకునే ఒక బాలికకు మరొక వ్యక్తికి జరిగిన సంభాషణ చూద్దాం.

వ్యక్తి : "మీరు ఎందుకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారు?"

బాలిక : "అది మా హక్కు. మహిళలు ఎందుకు ఆ ఆలయంలోకి ప్రవేశించరాదు?"

వ్యక్తి : "ఐతే మీ దృష్టిలో మహిళలకు సమాన హక్కులు లేవని భావిస్తున్నారా? ఎందుకు అలా భావిస్తున్నారు?"

బాలిక : "మా కాలేజీ లో మా ప్రొఫెసర్స్ చర్చ గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది".

వ్యక్తి : "ప్రతి దేవాలయానికి కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు ఆగమ శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. అలాగే అనేక తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ఆచారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మరి మీరు ఈ విషయంలో స్త్రీల హక్కులు-సమానత్వం అనేది ఎక్కడ చూసారు?"

బాలిక : "మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. ఆ ఆచారంలో లాజిక్ లేదు".

వ్యక్తి : "కానీ అయ్యప్ప దేవాలయాలు దేశంలో అనేక చోట్ల ఉన్నాయి. అక్కడ ఎక్కడ ఇటువంటి ఆచారాలు లేవు కదా? అక్కడికి వెళ్ళవచ్చు కదా?"

బాలిక : "అన్ని చోట్ల లేని నియమాలు ఒక్క శబరిమలలోనే ఎందుకు ఉండాలి?"

వ్యక్తి : "ఓకే. మీ వాదనే తీసుకుందాం. మీ కళాశాల మహిళా కళాశాల కదా, మీరు మీ management ను బాలురను కూడా చేర్చుకొమ్మని అడగవచ్చు కదా? దానికి మీ management  ఒప్పుకుంటుందా?"

బాలిక : "అదెలా సాధ్యం? మాది మహిళా కళాశాల. అందులో బాలురను ఎలా చేర్చుకుంటారు?"

వ్యక్తి : "ఐతే మీ management  బాలురకు సమాన హక్కులను నిరాకరించినట్లే కదా?"

బాలిక : "hmmmm .... బాలుర కళాశాలలు చాలా ఉన్నాయి కదా? అక్కడ చదువుకోవచ్చుగా? అదీ కాక కేవలం మహిళలకే ప్రవేశం అనేది మా కళాశాల నియమం".

వ్యక్తి : "కదా !!! మరి అయ్యప్ప దేవాలయాలు అన్ని ఉండగా శబరిమలలోనే ఎందుకు ప్రవేశించాలని అనుకుంటున్నారు?"

బాలిక : "నిజమే .... మీరు చెపిన దాంట్లో లాజిక్ ఉంది. నేనూ ఒప్పుకుంటాను".

వ్యక్తి : "హిందూ సమాజంపై మిషనరీస్ చేస్తున్న ముసుగు యుద్ధం ఇది. మీరు అందులో తెలియకుండానే పావులుగా మారుతున్నారు. ఆలోచించుకోండి".

అసలు మహిళలలకు దేవతా స్థానం ఇచ్చి పూజించేది కేవలం హిందువులు మాత్రమే...

బాలిక : "ఔను. మీరు చెప్పింది నిజమే. ఈ విషయం మా స్నేహితులందరికీ చెబుతాను. అలాగే మా ప్రొఫెసర్స్ కు కూడా చెబుతాను".

వ్యక్తి : "మంచిది. అనుక్షణం హిందూ సమాజం జాగరూకతతో మెలగవలసి సమయం ఇది".

కాంగ్రెస్, కమ్యూనిస్ట్స్, హిందూ వ్యతిరేక భావజాలం ఉన్నవారు ఈ రకమైన ప్రచారాలతో హిందూ బాలికల, బాలుర మనసులలో విషం నూరి పోస్తున్నారు. సర్వదా హిందూ సమాజాన్ని బలహీన పరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. జాగరూకులై ఉండవలసిన సమయం ఇది.


వెయ్యి కళ్ళతో గమనిస్తూ ఉండాలి.

(వాట్సప్ లో వచ్చిన మెసేజ్ కు తెలుగు అనువాదం)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP