శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చెడ్డీ గ్యాంగ్ ....... కండువా గ్యాంగ్

>> Wednesday, February 6, 2019

గాంగ్ –కండువా గాంగ్
హైదరాబాద్ చెడ్డీ గాంగ్ హల్ చల్ –దోపిడీలూ,దొంగతనాలూ, చైన్ స్నాచిన్గ్లూ –అంటూ మీడియా ఓవర్ యాక్షన్ చేసేసరికి పోలీసులు కంగారు పడి ఆ గాన్గ్స్ ని పట్టుకోటానికి పాతిక టీమ్ లు ఏర్పాటు చేసారు.
వారం రోజుల్లో ఆ గాంగ్ ని పట్టుకుని మీడియా ముందు నిలబెట్టక పోతే నాపేరు రాం చందర్ కాదు-అన్నాడు పోలీస్ అధికారి.
వారం అవగానే ప్రెస్ వాళ్ళు ఆయన ఆఫీస్ కి వచ్చారు.
అదేంది సార్ –వారమై పాయె –ఒక్క దొంగను పట్టలేదు?
అవ్ జరంత లేటయింది.అందుకే పేరు మార్చినా.ఇప్పుడు నా పేరు భీమ చందర్ .
మరి ఆ చెడ్డి గాంగ్ సంగతేంది సార్ ?
మా వోళ్ళు ఆ గాంగ్ ల గురించి ఇతర రాష్ట్రాలకు పోయిన్రు.ఆల్లను తోల్క రాంగానే ఫోన్ జేస్తాం.
ఇక వన్ వీక్ ల వెంటనే ఆ టీం వాళ్ళు రంగం లోకి దిగి ఇతర రాష్ట్రాలకు చెందిన ఆ గాంగ్ మెంబర్స్ పది మందిని హైదరాబాద్ లాక్కొచ్చి ప్రెస్ మీట్ లో పడేసారు.
వెంటనే వాళ్ళను ఇంటర్వ్యూ చేయటం మొదలు పెట్టారు ప్రెస్ వాళ్ళు.
మీదే రాష్ట్రం అసలు?
మా దొంగలకు రాష్ట్రమేంది, దేసమేంది సార్ –పూరా దునియా మాదే.
అంటే మీది ఇంటర్నేషనల్ గాంగా ?
అవ్ సార్ –ఇయాల రేపు బిజినెస్ లన్నీ ఇంతర్నేషనల్లే గద్సార్.
మీరు ఈ దొంగతనం వృత్తి చేపట్ట టానికి ప్రేరణ ఎవరు?
మన రాజకీయనాయకులే సార్ .
అదేంటి? అవున్సార్ .వాళ్ళల్లో మెజారిటీ చేస్తోంది మా దొంగతనం వృత్తే కద్సార్.బాoకుల్లో దొంగతనాలూ, దోపిడీలూ,లూటీలూ,మనీ లాండరింగ్లూ, మా వృత్తి లోని మెలకువలన్నీ వాళ్ళను చూసే నేర్చుకున్నాం సార్ –
మీరు ఈ చెడ్డీలు ఎందుకు వాడుతున్నారు?
అది మా డ్రెస్ కోడ్ సార్ –రాజకీయ పార్టీలన్నిటికీకండువాలు ఎలా డ్రెస్ కోడ్ గా వాడుతున్నారో అలాగే మేము చెడ్డీ ని డ్రెస్ కోడ్ గా చేసుతీసుకున్నాం
మిమ్మల్ని మీరు రాజకీయ నాయకులతో పోల్చుకుంటున్నారు కదా –భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టె ఆలోచన ఏమైనా ఉందా?
అవున్సార్. ఆ ఆలోచనతోనే చెడ్డీ గాంగ్ ప్రారంబించాం .
మరి రాజకీయ పార్టీ ప్రారంబించాలంటే మీకు అనుభవం కావాలి కదా.
అందుకే గదా ఇప్పుడు దొంగతనాలూ,లూటీలూ, దోపిడీలూ రేప్ లూ చేస్తోంది. ఈ అనుభవం తో రాజకీయ పార్టీ తేలిగ్గా ప్రారంబించగలం .
కాని ఇప్పుడు పోలీసులకు దొరికిపోయారుకదా. మీ చెడ్డీ గాంగ్ లీడర్లందరూ జైలు కెళ్తే ఇంకా పార్టీ ఎవరు నడుపుతారు?
ఇప్పుడున్న పార్టీల నాయకులు కూడా చాలా మంది జైలు వెళ్తూన్నారు కదా సార్.అయినా మిగిలిన వాళ్ళు పార్టీలను నడపటం లా?అలాగే మేమూ నడుపుతాం సార్ .అయినా మా చెడ్డీ గాంగ్లో ఇంకా వేలమంది కార్య కర్తలు దేశo నలు మూలలా వున్నారు. వాళ్ళని పోలీసులు పట్టుకోవటం చాలా కష్టం.
ఒకవేళ వాళ్ళందరినీ కూడా పోలీసులు జైల్లో వేసారనుకోండి. అప్పుడేం చేస్తారు?
మిగతా పార్టీల నాయకులను మా పార్టీలో చేర్చుకుంటాం –ఇప్పటికే అన్ని పార్టీల వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం.
అదేంటి? మీరు దొంగలు. రాజకీయ పార్టీల నాయకులు మీ పార్టీలో ఎందుకు చేరతారు?
ఇప్పుడు అనేకమంది పార్టీల నాయకులు వేరే అవినీతి పార్టీల కండువాలు ఎందుకు కప్పుకుoటున్నారు సార్?
ఎందుకంటే వాళ్ళని కొన్ని కోట్లు పెట్టి కొనుక్కొంటున్నారు.
మేమూ కొంటాం సార్. మేము దొంగతనాలతో దోపిడీలతో పోగు చేసిన డబ్బు చాలా వుంది. ఇప్పటికే ఎన్నికయిన అనేకమంది ఎమ్పీలూ, ఎమ్మెల్యేలూ,ఎమ్మేల్సీలూ మా చెడ్డీలు తొడుక్కోటానికి సిద్ధంగా వున్నారు.రేటు కూడా ఫిక్స్ అయిపొయింది.
అయితే మీ ఎలక్షన్ మానిఫెస్టో ఏమిటి?
విదేశాలకు పారిపోయిన దొంగలూ, దోపిడీ దారులకూ క్షమా భిక్ష ఇస్తాం. వారందరికీ మంత్రి పదవులిస్తాం. దేశంలో వున్న ప్రజలందరినీ దొంగలుగా మార్చేస్తాం.
వాట్? ప్రజలందర్నీ దొంగలుగా మార్చేస్తారా? ఎలా?
వాళ్ళందరికీ ఉచితంగా చెడ్డీలు సప్లై చేస్తాం. దొంగతనాలలో సామూహిక శిక్షణలు ఇస్తాం. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ నెలకు పది వేల చొప్పున నాన్ సిన్సియారిటీ పెన్షన్లు ఇస్తాం.
కాని అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?
ఎడ్యుకేటేడ్ యూత్ అందర్నీ నైజీరియా కి పంపించి ఆన్ లైన్ ఫ్రాడ్ లో ట్రైనింగ్ ఇప్పిస్తాం. వాళ్ళందరూ అభివృద్ధి చెందిన దేశాలలోని బాంక్ అకౌంట్స్ హాక్ చేసి విదేశీ మారకం సంపాదిస్తాం.
అయినా గాని నూట ముప్పయ్ కోట్లమంది ని దొంగలుగా మార్చటం కష్టం కదా?
హలో.ఇప్పుడున్న జనాభాలో 90 శాతం దొంగలే. ఇంతవరకూ మనల్ని పరిపాలించిన ప్రభుత్వాలు ఇప్పటికే 90 శాతం జనాభా ని దొంగలుగా మార్చేసాయ్.ఇక మేము దొంగలుగా మార్చాల్సింది పది శాతాన్నే కదా.
వాట్? ఇప్పుడు మన దెస ప్రజల్లో 90 శాతం దొంగలా?
కాదా? లెక్క చెప్తా రాసుకో. నూటికి 90 శాతం ప్రభుత్వోద్యోగులు దొంగలా కాదా?
దొంగలే-
అలాగే మన దేశంలోని వర్తకులు 90 శాతం దొంగలా కాదా?
దొంగలే-
కార్పోరేట్స్ లో 90 శాతం డొల్ల కంపెనీలు పెట్టి దొ౦గతనం చేస్తున్నారా లేదా-
చేస్తున్నారు.
హాస్పిటల్స్ గురించి వేరే చెప్పాలా?
వద్దు. 95 శాతం దొంగలే.
మన మీడియా లో 90 శాతం దొంగలా కాదా? కంట్రాక్టర్లూ,ఫార్మసీ కంపెనీలూ, డైరీ ఫాంస్, పౌల్ట్రీ ఫాంస్ ,వంట నూనెల వర్తకులూ,కూరగాయలు పండించే వాళ్ళూ,....
పోలీస్ ఆఫీసర్ కంగారు పడ్డాడు.
ఇంకా ఆపండి ఇంటర్వ్యూలు.మా ఉద్యోగాలకే ఎసరు తెచ్చేట్లున్నారు మీరు.పొండిక –చల్ అరేయ్ –ఈ చెడ్డీ గాంగ్ ని లోపటకు తోసెయ్ -
__________________________
    మంగళ వారంన 9:33 PMకి

    0 వ్యాఖ్యలు:

      © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

    Back to TOP