శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్త్రీ కుటుంబానికి గురువు.సంస్కర్త

>> Thursday, September 4, 2008

కుటుంబం లో సత్ప్రవృత్తులను పెంపొందించటం లో స్త్రీ కంటే ఉత్తమోత్తమమయిన ,ఉత్కృష్టమయిన పాత్రమరొకటిలేదు. మదాలస తన ముగ్గురు బిడ్డలను బ్రహ్మజ్ఞానులుగా తీర్చిదిద్ది,భర్తకోరిక మేరకు ఒక కుమారునకు రాజతంత్రములో శిక్షణనిస్తుంది. తల్లియొక్క సుసంస్కారం ద్వారా ఉద్భవించిన మూడురత్నాలే వినోబా,విఠోబా,బాలకోబా. అల్లరి పిల్లవాడయిన కృష్ణుని పట్ల యసోద ఎంతటి అపార వాత్సల్యాన్ని చూపించింది మనందరికీ తెలుసు. అదేవిధంగా అతడిని సంస్కరించటంపట్లకూడా ఆమె అత్యంత సావధానంగా ఉండేది. మహా భారతములో పరిపూర్నులైన మాత్రుమూర్తి ఎవరని అడిగితే కుంతీ మాత అని నిస్సంశయంగాపేర్కొనుటజరిగినది.
పిల్లల అకృత్యాలపట్ల అంకుశాన్ని ఉపయోగించక ప్రేమ పాశంతో ప్రోత్సహించేవారు భారతం లో దృతరాష్ట్రునివలె దు:ఖిస్తూ చివరకు సర్వ నాశనంకాక తప్పదు.

!!సామాజికేషు చామూల్యం కురీతీనాం విధిష్ట్వలం
భవత్యేవ తథైకస్య కాలస్యరీతయో మునే!!
అయోగ్యా అపరేకాలే హానిదాశ్చాపి సంమతా:
జీర్ణతాయాం వరోమాన్యో నరో రుగ్ణ: స్తదోభవేత్ !!
రీతీనాం విషయేస్యేవం జీర్ణోద్ధార ఇవక్రమ:
సంశోధ్యయా అధత్యాజ్యాస్త్యాజ్యా:సాహస పూర్వకం.!!

పరంపరలు కాలానుగుణమయినవేకాని,శాశ్వతమయినవికావు. సంస్కర్తలు అనేవారు సమయానుకూలముగా సాహసంతో పరంపరలలలో మార్పులు చేర్పులుచేసి అవసరమయిన వాటిని ఉపయోగిస్తూ అనవసరమయిన వాటిని తొలగిస్తూ ఉండాలి .శిథిలగృహం నేలమట్టం గాకుండా తప్పించలేము. ఈనాడు సమాజం లో వ్యాపించిన పరంపరలుకూడా శిథిల గృహాలవలెనేవున్నాయి. బుద్ధుడు ,ఆదిశంకరులు,వీరబ్రహ్మేంద్రులు, వేమనవంటి అవతార పురుషులు ,శూరులు, వీరులు సంస్కర్తలు కూలిపోతున్న సమాజానికి ఎన్నోవిధాల పరివర్తనలుగావించి ఊపిరి పోసినిలబెట్టటం జరిగింది. వారునడచిన బాటలో నడుస్తూ సంస్కర్తలు సాహసంతో ముందుకూరికి ఈబాధ్యతలను చేప్పట్టవలసిన అవసరం ఎంతయినాఉంది. ఏచర్యలన్నిటికీ మూలాధారం తల్లేనని ఆస్త్రీ తనశక్తిని గ్రహించి తనబాధ్యత నిర్వర్తించగలగవలసివుంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP