శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ అనుమతిలేకుండా ఆ యముడైనా మనలను తీసుకెళ్ళలేడు కదా !!

>> Monday, December 3, 2018

ఈరోజు  సంధ్యాహారతి సమయంలో ఓ చిత్రం జరిగింది.  ఏదో కుటుంబ విషయాలగురించి  మా ఆవిడ మధ్యాహ్నం నుండి కొద్దిగా బాధపడుతున్నది. సాయంత్రం సంధ్య హారతికి సిద్దమవుతున్నప్పుడు  మందిరంలోకి వఛ్చి అన్నీ చూడగలిగేది అమ్మ మాత్రమే లెండి ... మనం ఎన్ననుకున్నా జరగాల్సినవన్నీ ఆవిడ సంకల్పమేకదా  అని అంటున్నది . అవును కాపాడేది ఆమ్మే ... కరుణించేది అమ్మే కదా మనకు ఆ  దిగులెందుకు ? అని చెబుతూ  సంధ్య హారతి మొదలుపెట్టాను.
ముందుగా మందిరంలో   శ్రీవారికి,పరమశివునకు, అమ్మలగన్నయమ్మ  కనకదుర్గమ్మకు  హారతి ఇఛ్చి ముఖమండపంలో  వేంచేసివున్న గణపతి ,అయ్యప్ప ,కుమారస్వాములకు  అటునుండి ప్రదక్షిణాపథంలో ఆవరణలో  ఉన్న మహాగణపతి మండపానికి  ఆతరువాత నవగ్రహ మండపానికి చేరుకొని అక్కడనుండి క్షేత్రపాలక స్వామి హనుమంతులవారి సన్నిధిలో రోజుట్లాగానే హారతి సమర్పించాను .   . మందిరానికి పడమర ఉన్న వాటర్ ప్లంట్   గదిలో లైట్ స్విచ్ వేయలేదెవరూ మరచిపోయారు. . సహజంగా నేను ఇలాంటప్పుడు చీకట్లోనే వెళ్లి స్విఛ్  వేస్తుంటాను . స్విచ్ వేయాలని కదలాగానే  ఎందుకో మనసులో హారతి  కూడా తీసుకెళ్ళు అని  వినిపించింది . ఎప్పుడూ లేనిది హారతి ని పట్టుకునే ఆగదిలోకి వెళ్లాను .  తలఎత్తి చూసేసరికి  స్విచ్ వద్దనే  పెద్ద కట్లపాము   ఉంది. చేయి వేసుంటే  కాటువేసేది
  ఆహా ! ఏమమ్మా నీలీల ! అన్ని ప్రమాదాలను అడ్డుకుంటూ నేనున్నాను అని నిరూపించడానికా తల్లీ ! ఇలా హెచ్చరించావు అనుకుని  .. మా ఆవిడను కేకవేసి పిలిచాను .  వెదురు కర్ర  ఒకటితీసుకుని కదిలించగానే  పాము కర్రకు చుట్టుకుంది .    నాభార్య దీనిని కొడతారా అని అడిగితే ..వద్దులే  బయట పారవేస్తాను అని చెప్పి రోడ్డు మీదకెళ్ళి పొలాలలోకి విసిరివేశాను దానిని.

ఎక్కడో ఉన్నావని  నిన్ను ధ్యానం చేయాలట .. ఒక్క క్షణం కూడా అది నావల్ల కానీ పని అయిపోయే కదా అని ఈమధ్య బాధపడుతున్నాను .. నేనిక్కడే  నీపక్కనే ఉన్నానురా నాన్నా .... అని అమ్మ  తన కారుణ్యాన్ని చూపిస్తూ వస్తున్నది  ఈ అథముడిపై .. ఎంతైనా అమ్మకదా!!           అమ్మ తత్వమంతే

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP