శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వీని దుంప తెగ. ...... వీడె వడో గాని...ఇలా వర్గీకరణ చేశాడు

>> Sunday, December 2, 2018

Forwarded
*భక్తులు పలు రకములు*

☀☀☀☀☀☀☀☀☀☀☀

1. *భంగు భక్తులు:-*
వీరు భంగు,గంజాయి మొదలైన మత్తు తీసుకొని దేవుడి కోసం వెతుకుతుంటారు.. దేవుడిని చూడాలనిపించినప్పుడు ఒక దమ్ము లాగి పైకి చూస్తారు..

2. *రంగు భక్తులు:-*
వీరు తమ భక్తిని రంగు రూపంలో ప్రదర్శిస్తారు .. డ్రెస్ కోడ్ కి importance ఇస్తారు.. ఈ రకమైన భక్తులు మాలలు వేసుకుంటారు..

3. *హంగు భక్తులు:-*
వీరికి తమ భక్తిని రిచ్చిగా చూపించాలనే పిచ్చి ఎక్కువగా ఉంటుంది .. వీళ్లు బాగా వైభవంగా ఉండే ఆలయాలని మాత్రమే ఇష్టపడతారు.. ఒక రకంగా వీళ్లు Megalomaniacs ..

4. *మింగు భక్తులు:-*
ఈ టైప్ భక్తులు తమ "తిండిపిచ్చి"నే భక్తి అనే భ్రమలో బతికేస్తుంటారు .. గుడి గురించి వీళ్లని అడిగితే వీరు అక్కడ దొరికే "ప్రసాదం" గురించి చెప్పేటప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనపడుతుంది .. అది చూసి ఈ టైప్ భక్తులని గుర్తుపట్టొచ్చు.. తిండి కక్కుర్తికి భక్తి రంగు వేస్తారు..

5. *పొంగు భక్తులు:-*
ఈ టైప్ భక్తులు ప్రతిదానికి పొంగిపోతూ ఉంటారు .. వీరు అల్పసంతోషపరులు .. టెంకాయలో పువ్వొచ్చినా .. దండంపెట్టేటప్పుడు గంట మోగినా చాలు పొంగిపోతుంటారు .. వీరి మీద Placebo Effect బాగా పని చేస్తుంది...

6. *లొంగు భక్తులు:-*
వీరికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి.. అందుకని వీరు భక్తి లో పీక్స్ కి వెళ్లిపోతారు.. మతం పేరుతో జరిగే కొన్ని దురాచారాలకి వీరు కొంత కారణం...

7. *ఒంగు భక్తులు:-*
వీరు కూడా లొంగుభక్తుల లాంటి వాళ్లే.. ఇంకా చెప్పాలంటే .."అంతకుమించి" .. వీరు ఎక్కువగా దొంగబాబాలని నమ్ముతారు. ఎక్కువ మతదురాచారాలకి వీళ్లే ఎక్కువ కారణం..

8. *సాంగు భక్తులు:-*
వీళ్లకి భక్తి పాటల పిచ్చి. కీర్తనలు,స్తోత్రాలు .. ఇవే వాళ్ల లోకం..

9. *పింగ్ పాంగు భక్తులు:-*
వీళ్లని చూస్తే ఎవరూ భక్తులనుకోరు .. పబ్ లో DJ అనుకుంటారు .. బాగా స్టైలిష్ గా టాటూలతో ఉంటారు.. అల్ట్రామోడర్న్ భక్తులు.. భక్తిలో technology వాడతారు.. Virtual పూజలు చేసే బ్యాచ్..

10. *కొంగు భక్తులు:-*
దరిద్రపు భక్తులు వీళ్లు .. కేవలం అమ్మాయిలని చూడటానికి మాత్రమే గుడికి వెళతారు.వీరినే "చొంగ భక్తులు" అని కూడా అనవచ్చు ...

11. *రాంగు భక్తులు:-*
వీళ్లకి ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలీదు .. అందుకని తెలిసిన ప్రతిదాన్ని తమకిష్టమైన పద్ధతిలో మొక్కుతారు.. Comedy piece లు

12. *కింగు భక్తులు:-*
వీరికి రాజుల్లాగా మందిరాలు నిర్మించడం అంటే ఇష్టం.. వీరిలో మందిరాలు కట్టలేని వారు విరాళాలు ఇచ్చి తమ ఆనందం తీర్చుకుంటారు.. వీరికి డబ్బు విలువ తెలీదు .. పబ్లిసిటీ పిచ్చి... వీరిలో బాగా బల్సినోళ్లు ప్రసాదాలని వేలం వేసినప్పుడు ఎక్కువ ఖర్చు చేసి కొంటారు..

13. *వాకింగు భక్తులు:-*
పుణ్యక్షేత్రాలకి మైళ్లకి మైళ్లు నడిచి వెళ్లే బ్యాచ్ .. పాదయాత్రలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని వీళ్ల నమ్మకం..

14. *జాగింగు భక్తులు:-*
ప్రదక్షిణల పిచ్చి ఎక్కువ.. 100+ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ కేటగిరి కిందకి వస్తారు..

15. *ట్రెక్కింగు భక్తులు:-*
భక్తిలో పీక్స్ చూడాలంటే కొండలెక్కాలని నమ్మే భక్తులు.. వీళ్లందరికీ ఉండే common goal హిమాలయాలు వెళ్లడమే అయ్యుంటుంది..

16. *సఫరింగు భక్తులు:-*
వీళ్లు దేవుని ముందు ఏడ్చి భక్తిని ప్రదర్శిస్తారు..వీరినే 'బెంగ భక్తులు' అని కూడా అనవచ్చు..

17. *కటింగు భక్తులు:-*
వీరికి శాస్త్రసంబంధ విషయాల్లో బాగా గ్రిప్ ఉందని తామే గొప్ప భక్తులమని అందరికీ తెలిసేలా విజ్ఞాన ప్రదర్శనలు చేస్తుంటారు..

18. *మీటింగు భక్తులు:-*
వీరికి సమారాధనలు,ప్రవచన ప్రసంగాలు అంటే చాలా ఇష్టం.. కోసేసుకుంటారు ..

19. *కేర్ టేకింగు భక్తులు:-*
వీరు "మెరిట్ భక్తులు".. మిగతా భక్తుల కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బ్యాచ్.. వీరు ప్రవచనకర్తలు గా,మతగురువులుగా ఉండి తమ ప్రసంగాలతో మతాన్ని,దేవుళ్లని బతికిస్తూ ఉంటారు మహానుభావులు ..

20. *షాకింగు భక్తులు:-*
వీరు తమ భక్తిని విచిత్రంగా చాటుకుంటూ ఉంటారు.. నాలుక కోసుకోవడం..నిప్పుల మీద నడవడం లాంటివి చేస్తుంటారు.. భక్తి ముదిరిపోయి ఉంటుంది వీళ్లకి..

21. *బెగ్గింగు భక్తులు:-*
వీళ్లు చాలా మంది ఉన్నారు.. దేవుడిని అడుక్కుంటూ ఉంటారు అదివ్వు..ఇదివ్వు అని.. Quid Pro Quo కూడా అవలంబిస్తారు .. దేవుళ్లకి లంచం ఇచ్చి పనులు జరగాలని కోరుకునే బ్యాచ్.. ముడుపులు,బలులు etc ఇస్తారు..

22. *షిఫ్టింగు భక్తులు:-*
వీళ్లు మతం మారిన భక్తులు.. వీళ్లు మనశ్శాంతి లేదా డబ్బు లేదా అమాయకత్వం లేదా అజ్ఞానం లేదా వివక్ష వగైరా కారణాల వల్ల వేరే దేవుడికి షిఫ్ట్ అవుతారు..

23. *కేటరింగు భక్తులు:-*
వీళ్లు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటుకుంటారు.. వీరి భక్తి కొంతమంది కడుపు నింపుతుంది.. ప్రసాదాల పిచ్చి ఉన్నవాళ్లు వీళ్లని టార్గెట్ చేస్తారు..

24. *రీజనింగు భక్తులు*
వీళ్లు దేవుడున్నాడని నిరూపించడం కోసం లాజిక్కులు తీసి నాస్తికులని ఇబ్బంది పెడుతూ ఉంటారు.. "గాలి చూపించు?? చూపించలేవ్ కదా!! కాబట్టి దేవుడున్నాడు" ఇలా ఉంటాయి వీళ్ల లాజిక్కులు...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

(నెట్ లో సంచరిస్తున్న ఈ పోస్ట్ వల్ల ఆస్తికులెవరూ బాధపడవద్దని మనవి.జీవితంలో ఎదురయ్యే విమర్శలన్నింటినీ సీరియస్ గా తీసుకోరాదు. మనకెవన్నా పనికొస్తే ఆలోచించటం లేదంటే నవ్వుకుని వదిలేయటమే)

2 వ్యాఖ్యలు:

nmrao bandi December 2, 2018 at 3:23 AM  

వారెవ్వా ... మహాద్భుతంగా ఉంది మీ పోస్ట్ ...
నా దుంప కూడా తెంచుతానని మీరన్నారన్న భరోసాతో ...
నేను కూడా నాకు తోచిన భక్తాగ్రే'సురుల' లిస్ట్ ను అతికించాను చూడండి సర్... :)


25. *రోపింగ్ భక్తులు*
వీళ్ళు ఎదుటి మతంలోని భక్తులకి వలవేసి తమ మతంలోకి మార్చుకుని, తమ దేవుడికి భక్తి మార్పిడి చేయిస్తారు, ఖచ్చితంగా ముక్తి మార్పిడి దొరుకుతుందని నమ్మించి, దణ్ణాలు పెట్టె విధానాన్ని దిగ్విజయంగా మార్పిస్తారు.

26. *కలరింగ్ భక్తులు*
వీళ్ళు ఎదుటి వాళ్ళది ఏ మతమో తామే డిసైడ్ చేసి డిక్లేర్ చేసేస్తారు. ఒకోసారి అవతలి దేవుడి రంగు చొక్కా వేసుకుని ఆ గుంపులో జొరబడొచ్చు వీళ్ళు. సైడ్ క్యాటగిరీ లో కొందరు భక్తులు కాని భక్తులు (వ్యక్తులు) ప్రత్యేకంగా మత కలహాలు రేపెట్టే బాచ్ క్రింద వస్తారు.

27. +కటింగ్ భక్తులు*
వీళ్ళు గుళ్ళల్లో గుండు కొట్టించుకుందామని హుషారుగా వచ్చిన భక్తులను, గుండు కొట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేకుండా బొంద పెట్టేస్తారు.

28. *సిట్టింగ్ భక్తులు*
ఈ తరహా భక్తులు రోజూ గుడికి వెళ్లి లోపల దేవుడికో నమస్కారం పడేసి, బయటికొచ్చి రెడీగా ఉన్న డైలీ బాచ్ తో అరుగు మీద బాతాఖానీ లో జాయిన్ ఐపోతాడు. వీళ్ళని అరుగు భక్తులు అనొచ్చు.

29. *రేటింగ్ భక్తులు*
వీళ్ళు ఏ స్వామి భక్తులకు ఎక్కువ మంది భక్తులొచ్చారో వేళ్ళ మీదే లెక్కేసి సక్సెస్ సూపర్ సక్సెస్ రేటింగ్ లు ఇస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విషయాలపై మీటింగులు, చర్చలు జరుగుతున్నాయో రోజూ పేపర్ ద్వారా, ఇతర విధానాల ద్వారా తెలుసుకుని, అక్కడికి వెళ్లి తమ అటెండన్స్ ద్వారా నిర్వాహకులకు ఫర్వాలేదు మనం మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టినా జనాలకు కొదవలేదు అనే భరోసా కూడా కల్పిస్తారు.

30. *ఫ్లోటింగ్ భక్తులు*
అలా దారంపేట పోతూ గుడి కనబడినా, దేవుడు తన దారిన తాను పోతున్నా, తమను పట్టించుకోకున్నా,
తాము పట్టించుకుని, నడిచెళ్తుంటే రెండు చేతుల్తో, బండి మీద వెళ్తుంటే ఒంటి చేత్తో ఓ నమస్కారవం విసిరేస్తారు.

31. *చాటింగ్ భక్తులు*
వీళ్ళు ఉదయం కోసం కాసుకొని, మేల్కోగానే సెల్ చేతిలోకి తీసుకుని, రకరకాల దేవుళ్ళ ఫోటోలని వాట్సాప్ లో అందరికీ షేర్ చేసి అవతలోళ్లతో పొద్దున్న పొద్దున్నే తప్పిచ్చుకోలేని దణ్ణాలెట్టిస్తారు.

32. *కోటింగ్ భక్తులు*
వీళ్ళు జాతర్లలో ఒళ్ళంతా రంగు పులుముకుని చేతిలో కొరడాతో తమకు తామే కోటింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు.

33. *వోటింగ్ భక్తులు*
ఈ తరహా భక్తులు ఎలాగోలా గుళ్ళలోని కమిటీల్లో చోటు సంపాయించుకుని, ఆ కమిటీ ఎలెక్షన్స్లో వోట్లేస్తూ, వేయించుకుంటూ అధికారం చెలాయిస్తూ ఉంటారు.

nmrao bandi December 2, 2018 at 3:31 AM  

...మీరనరన్న్న భరోసాతో ...
:)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP