శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వెంకన్నతో పెట్టుకున్నవాడు.. ఎవడూ బాగుపడలేదు... పరవాలేదు ఈవిషయం బాగా గుర్తుందికదా?........

>> Friday, May 25, 2018

ఈమధ్య పెద్ద నాయకులందరి నోటా   ఈమాటే . అటు ఆరోపణలు చేసేవారు...ఇటు ఎదురు దాడి చేస్తున్నవారు కూడా .  పవిత్రంగా ఉండాల్సిన ఆలయ వ్యవస్థను  రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నాక ..ధర్మం పట్ల తప్ప వేరెవరికోసం తలవంచకూడనివారు కూడా   భుక్తికోసం   ..నాయకుల భజనపరులుగా మారాక ..   తమగురువులు బోధించిన వేదాభ్యసన అంతరార్ధం  పక్కనబెట్టి    ధర్మాన్నే సర్వనాశనం చేయాలనుకునే హిరణ్యకశిపుని వంటి   నాయకులకోసం  వారి బలాన్ని పెంచేలా యాగాలు ..మంత్రానుష్ఠానాలు నిర్వహించటం  జరుగుతున్న ఈ రోజులలో  ... తమబోడిగుండ్లు ..కొబ్బరిచిప్పలు,..  తప్ప... స్వధర్మం పట్ల అవమానకర చర్యలు జరుగుతున్నా చీమకుట్టినట్లు లేని భక్తజన సందోహం  ..నేటి కాలంలో
అందరూ  ఒకే మాట అంటున్నారు    ..ఆయనజోలికెళితే బాగుపడరు అని .
నిజమే  అది   వాళ్ల నోటివెంట రావటం కాదు. కర్మదేవతలు     ఇలా పలికిస్తున్నారు
చేసుకుంటున్న కర్మలకు భయంకరమైన శిక్షలు విధించబడబోతున్నాయి అని.  
రాజు తప్పుచేస్తే ఆరాజ్యంలో ప్రజలందరూ పర్యవసాన ఫలితాలను అనుభవించి తీరవలసినదే .. ఇది తప్పదు
మనం అందరం ఇప్పుడు జరుగుతున్న  కలిపురుషుడి విక్రుత లీలలను ...నాకేం పని  అని పట్టించుకోకుండా వదిలేస్తున్నాం కనుక   తిలాపాపం  ... తలా పిడికెడు  అని పంచుకోవలసినదే .. ఇది  కర్మదేవతల శాసనం 
నేను గతంలో వ్రాశాను  తిరుమలలో   సాక్షాత్తూ స్వామి ముందు అధికార దర్పం ప్రకటించి పాదనమస్కారాలు చేపించుకున్న  ఒక మహా నాయకునికి ఎంత దీనస్థితి దాపురించినదో ....దీనిని పర్యాటక స్థలంగా మార్చాలని చూసిన ఇంకొకాయనకు ఊర్ధ్వలోకాలు కనపడి స్వామి వారి అనుగ్రహంతో  భూమ్మీద నూకలు దక్కిన వైనం..... తన గాలికి ఎదురేముందని విర్రవీగి    తిరుమలకొండకే ఎసరు బెట్టబోయి  గాలిలో కలసిపోయిన ఇంకొక నేత    చరిత్ర మనకు తెలుసు.
ఎవడైతే నాకేంటి అని చెప్పులతోనే శ్రీవారి ఆలయంలోకి ప్రవేసించి      సాక్షాత్తూ ఆయన సన్నిధి లోనే తనకు జేజేలు కొట్టించుకున్న    నేత కు   ..  గత ఎన్నికలలో    విశ్లేషకులంతా .. వార్ వన్ సైడ్   అని అన్నప్పుడు   ...గాడిదగుడ్డేంకాదూ......   స్వామి దగ్గర చేసిన అపచారానికి నోటి కాడ కూడు  నేలపాలవబోతోంది అని  అప్పుడే నాబ్లాగులో వ్రాశాను.. పాత పోశ్ట్ లు చూడండి.

ఇక ఇప్పుడు   ముఖ్యమంత్రిగారు  తిరుమల విషయంలో ఇంత పొరపాటు [అభిమానులకు కోపం రావచ్చు] ఎందుకుచేశారో అర్థం కావటం లేదు. అక్కడి  పొరపాట్లకు పర్యవసానాన్ని ఒకరకంగా ప్రత్యక్షంగా అనిభవించిన వారాయన .  రాజకీయ క్రీడకు ప్రయోజనాలకు తిరుమల ను వేదిక చేసుకోవటం ఎవరికీ మంచిది కాదు. ఒకపక్క ఇతరమతస్థులు  ఉద్యోగులుగా తిరుమలలో తిష్ఠవేసుకున్నారని ఆరోపణలు వస్తున్నప్పుడు    అక్కడ ప్రక్షాళన చేపట్టాల్సింది పోయి  నేరుగా ఇతరమతాభిమానులనే   కమిటీమెంబర్లుగా నియమించటం   .......ఏందుకు
ఇక్కడ రాజకీయ ప్రయోజనాలకంటే  స్వామివారు ముఖ్యం అని భావించలేదా?
పాయకరావుపేట ఎమ్మెల్యే వీడియో దొరికినదాకా  నియమింపబడ్డ వారి చరిత్రఏమిటో ఇంటీల్జెన్స్ వారు చెప్పలేదా?
కులాల ప్రయోజనాలు ఆశిస్తే    ఎంతోమంది స్వామికి అంకిత భక్తులైనవారు ఆయాకులాల్లో ఉన్నారే..... వారెవరిని నియమించినా    స్వకార్యం స్వామికార్యం  రెండు నెరవేరేవికదా ?
ఇక   ప్రతిపక్ష నేత ..ఆయన ఓట్లకోసం నేడు బొట్లు పెట్టినా గుళ్ళూగోపురాలు తిరిగినా  ధర్మం పట్ల అనురక్తితో అని నమ్మే స్థితి కాదు. నిజంగా ఆయనకు  స్వామి వారి పట్ల భక్తి ఉంటే  గతం లో నుండి  ఇప్పటి దాకా తిరుమలలో జరిగిన అన్ని ఆరోపణలపైనా   విచారణ కోరాలి.    అలా చేయాలి.

ఇక ఇప్పటివరకు ధర్మానికి  స్వామివారి క్షేత్రానికి హానిచేయబూనిన వారికోసం  కూడా హోమాలు జరిపి రాక్షసబలం పెరగటానికి సహకరించిన  సాక్షాత్తూ శ్రీవారి ప్రథమసేవకుడు ప్రధానార్చకులవారు రమణదీక్షితులవారికి  నేడు ధర్మసూక్ష్మం   తమదాకా వస్తేగాని   అర్ధమవలేదా >>>

స్వామివారి సొమ్ముతింటూ  ... పెల్లాంపిల్లలను పోషించుకుంటూ సుఖంగా ఉద్యోగాలు చేస్తున్న టిటిడి ఉద్యోగులు స్వామి వారిముందు  నల్ల రిబ్బన్లతో  నిలబడతారా ? తిండిపెట్టిన స్వామి వారి పైన నిరసనా ? మొక్కులరూపంలో మేము ఇస్తున్న ముడుపుల పైన  మాపైన  నిరసనా ? ఎవరిపట్ల ?
ఎంత అపచారం  ....... ఏనాడైనా స్వామివారికి జరుగుతున్న అపచారాలకు ప్రత్యక్ష సాక్షులు మీరు  ...ఒక్కనాడైనా నోరు విప్పి నిరసన తెలిపారా ?




ఇప్పుడూ.. అప్పుడు కూడా  నాయకుడు తమకులంవాడైతే చాలు  ఏతప్పులు చేసినా వెనుకేసుకురావాలనుకునే  భక్తజనం  .....
కష్టమొస్తే స్వామి     ..నష్టమొస్తే    స్వామీ     అని  తిరుమల పరిగెడతాం .. ఆయన ఇచ్చిన వసతులు అనుభవిస్తున్నారు ఆయనపెట్టిన  బువ్వ తింటున్నారు  .. మీపిల్లలకు పాలు.. బంధువులకు ప్రసాదాలు ... మీకు అన్నికష్టాలుతీరుస్తూ  నిలువుగాళ్లమీద నిలబడి   ఉన్న మనస్వామి పట్ల జరిగే అపచారాలకు  నిరసనగా గెంతెత్తి ఒక్కమాట మాట్లాడరేమి?  మాధర్మం పట్ల మీ పెత్తనమేమిటని  ఈ నీచరాజకీయులను నిలదీయరేమి?   మీభావాలను  ఒక్క కంప్లైంట్ రూపంగా టిటిడి కి రాజకీయ పార్టీలకు ఒక ఉత్తరం,ఒక్కమైల్  ఒక్కమెస్సేజ్ రూపంలో పంపవచ్చుగదా ?
ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా స్వామివారిని సేవించిన సేవకులను మర్యాదలేకుండా దూషించటం అవమానించటం  అపరాధం .


మహాభారత సమయంలోనూ తప్పును తప్పు అనిచెప్పకుండా  మౌనంగా ఉన్నందుకు మహాత్ములనబడ్డవారికి కూడా మరణదండన తప్పలేదు .. మనమెంత ?

ఇప్పుడు జరిగే అపచారాలకు మూల్యం చెల్లించుకోవలసివచ్చేది  ఈ రాజకీయ నాయకులే కాదు.. వీరిని నాయకులను చేసిన మన జనం కూడా  ....

కర్మదేవతలు కాచుకుని ఉన్నారు  .. పుణ్యస్థలాలలో జరిగే అపచారాలకు భూమిపై ఘోర పరిణామాలు తప్పవు. అవి అనుభవించవలసినది మనమే...    కనుక అన్ని భేషజాలు వదలివేసి  రాజకీయనాయకులు  స్వామికి క్షమాపణలు చెప్పుకుని  పుణ్యక్షేత్రాలనుండి  వైదొలగాలి ... అక్కడ తిష్ఠవేసుకుని అపచారాలకు పాల్పడుతున్న ఇతరమతస్థులకు హెచ్చరిక   ... మీరుచేసే తప్పు మీ మతస్థాపకులెవరూ చెప్పనిది. అది సద్గురువులైన వారెవరిచేతా ఒప్పబడదు . భగవంతుడి ద్రుష్టిలో క్షమించరాని నేరం . దీనికి వంశనాశనం తప్పదు.
ఇందుకు వీరెవరు అంగీకరించకపోయినా  ఫలితాలు మాత్రం ఆగవు
ముందుగా స్వామి భక్తులంతా ఇప్పటివరకు తమ నిరాసక్తతకు క్షమాపణ చెప్పుకుని మీమీ ధర్మాగ్రహాన్ని వివిధరూపాలుగా వ్యక్తం చేయండి. అది మనవిధి . హక్కు కూడా  పుణ్యక్షేత్రాలలో రాక్షసగణం వైదొలగి ధర్మవ్రుద్ధి కావాలని .... స్వామి శీఘ్రంగా దుర్మార్గులను తరిమివేయాలని ప్రార్ధించండి  
ఒక ఉత్తరం ముక్క వ్రాయండి మీరు మీకుటుంబ సభ్యులు,బంధువులు అందరూ    పదిరూపాయలు ఖర్చుపెట్టి  తలా ఒక ఉత్తరం వ్రాయండి సుప్రీంకోర్టుకు  రాజకీయపార్టీలకు   అధికారులకు
ప్రభుత్వాలకు   తలా ఒక ఉత్తరంలో మీ నిరసన తెలియపరచండి
ఇలా చేసేప్పుడు కులంపేరుతో ఎవడన్నా మిమ్మల్ని నిలువరించాలని చూసినా చెప్పుతోకొడతానని     చెప్పండి
మాకు స్వామే కులం... స్వామే బలం   అని చాటండి

జైశ్రీరాం

4 వ్యాఖ్యలు:

bonagiri May 25, 2018 at 6:42 AM  

Excellent sir. చాలా బాగా చెప్పారు.

SD May 25, 2018 at 6:55 AM  


ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్

తాత్పర్యం[మార్చు]

సారమైన ధర్మం పాపం చేతా, ఏ మాలిన్యమూలేని సత్యం బొంకు చేతా గట్టెక్కలేక చెడిపోయే దశను సమర్థులైనవారు ఉపేక్ష చేస్తే అది వారికి చేటు తెస్తుంది. కాని ధర్మాన్ని గట్టెక్కించేది సత్య శుభస్థితిని యోగ్యులకు సమకూర్చేదీ అయన దైవము ఎల్లవేళలా ఉంటుంది.[1]

https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AA%E0%B1%81_%E0%B0%A7%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B2_%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81

Aruna May 25, 2018 at 12:05 PM  

🙏

KIRAN KUMAR May 26, 2018 at 11:29 AM  

చక్కగా చెప్పారు....

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP