తిరుమలలో ఏంజరిగింది ఏమి జరుగుతోంది.
>> Thursday, May 17, 2018
Detailed report
తిరుమలలో ఎం జరిగింది ఏమి జరుగుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్వం నుండి వరకు తిరుమల ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వహించే అర్చక కుటుంబాలు 4ఉన్నాయు ఈ నాలుగు కుటుంబాల వారు తిరుమలకు నడకదారికూడా సరిగా లేని రోజులనుండి అర్చకత్వం చేస్తున్నారు. 1900 దశకం నుండి ఆదాయం బాగా రావడం ప్రారంభమైనది. అప్పటి బ్రిటిష్ పాలకులు కూడా స్వామివారి పట్ల మంచి శ్రద్హనే చూపారు. క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ నిర్వహణ కు కొంతమంది అధికారుల అవసరం ఉందని గుర్తించి కలెక్టర్ స్థాయి అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. తరువాత వారే హథీరాం జి మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆలయానికి వచ్చేభక్తులకు సౌకర్యాలు చేయడం దర్శన వేళలు పర్యవేక్షణ వారిబాధ్యతలు. స్వాతంత్రం వచ్చాక మనప్రభుత్వాలు రావడం జరిగింది. 1950 లో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనకు ప్రత్యేక పాలకమండలి అధికారులను ప్రభుత్వం నియమించడం వారు వచ్చే హుండీ ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతూ ఉండేది. కానీ ఎవరు స్వామివారి కైంకర్యాల విషయాలలో కలగజేసుకునేవారు కాదు. ఆబాధ్యతలు అర్చకులు జీయర్ స్వాములు ఆచార్యపురుషులు నిర్వహించేవారు. సందేహాలు వస్తే ఆస్థాన పండితులు ఉండేవారు . స్వామివారికి కైంకర్యానికి వచ్చే ద్రవ్యములు ప్రసాదములు అర్చకులకు వచ్చేవి ప్రత్యేక జీతభత్యాలు ఏమి లేవు కానీ ఆద్రవ్యములు ప్రసాదాల ఆదాయం తో అర్చకులు జీవనం చేసేవారు రాను రాను ఆలయంలో భక్తులు పెరగడం ద్రవ్య లాభం పెరుగుతుండటంతో అర్చకులకు మంచి ఆదాయం సమకూరేది. ఇలా ఉండగా n t రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుఫు అర్చక వ్యవస్ధ గురించి ఒక కమీషన్ వేశారు. ఆకమిషన్ ఇచ్చిన సిఫార్సు ఏమంటే అర్చకులు వంశపారంపర్య హక్కు ద్వారా వారి కుటుంబాలవారే అర్చకులు గా ఉంటున్నారు ఇది తప్పు ఆలయాలలో అర్చకులకు జీతభత్యాలు ఇచ్చి అక్కడ ద్రవ్య ఆదాయం తీసివేయాలి అని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు పరగణన లోకి తీసుకున్న ప్రభుత్వం అర్చకులకు వంశపారంపర్య హక్కు తీసివేసి ద్రవ్య ఆదాయ స్థానంలో జీతాలు ఇస్తామన్నారు. ఇది తిరుమలకు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వర్తించింది. అప్పుడు అర్చకులు వారి వాదన ఇలా వినిపించారు. ఈ నిర్ణయమ్ వలన దేవాలయాన్ని నమ్ముకొని కొన్ని తరాలుగా మనది అదే వృత్తి అని చిన్ననాటి నుండి ఈ శాస్త్రాన్ని గుడిని నమ్ముకున్న వారికి తమ తదనంతరం ఈ అర్చకత్వం మన అబ్బాయికి రాదుఅంటే మరి ఆలయాలు ఎవరు చూస్తారు. ప్రతిఒక్క ఆలయ సంప్రదాయాలు ఎలా కాపాడబడతాయి. పురాతన ఆలయాలలో ఉన్న అనేక కట్టుబాట్లు ఎవరు అర్థం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తిరుమల ఆలయానికి రాబడి వస్తుంది జీతాలు ఇస్తారు మిగిలిన ఆలయాలకు జీతాలు ఎలా ఇస్తారు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తారు కానీ ప్రభుత్వ నిర్ణయం మారలేదు. దానితో తిరుమల అర్చకులు కోర్టు మెట్లు ఎక్కారు. 1987నుండి. 1996 వరకు 9 సంవత్సరాల కాలం కోర్టులో కేసు జరిగింది. ఈ 9సంవత్సరాలు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నారు. హుండీ డబ్బు ఖర్చు తో దర్జాగాప్రభుత్వ లాయర్లు వాదించారు. ఈ 9 సంవత్సరాలు తిరుమల అర్చకులు ద్రవ్య ఆదాయాన్ని తీసుకుంటేనే ఉన్నారు. 1996 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ వంశ పారంపర్య హక్కు అర్చకులకు లేదని కానీ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని వారికి ద్రవ్య ఆదాయం మినహా అన్ని గౌరవమర్యాదలు ఇవ్వాలని ఆగమ కైంకర్యాలు వారు చెప్పినట్లే నిర్వహించాలని సూచించారు. దానితో అర్చక కుటుంబాలకు నిరాశ ఎదురైంది. దానినే మిరాసివ్యవస్థ రద్దు గా చెప్తారు. రోజురోజుకు కేసు ప్రభుత్వం వైపు మల్లుతుండడం ఎంతో.మంది లాయర్లు చక్కగా అర్చకుల దగ్గర డబ్బులు స్వాహా చేయడం జరిగిపోయాయి. ప్రయోజనం దక్కలేదు. దీని వల్ల తిరుమల అర్చకుల మాట ఎలా ఉన్నా మిగిలిన దేవాలయాల అర్చకుల పిల్లలు ఎవరూ ఆగమ శాస్త్ర అధ్యయనం చేయడం మానేశారు. మనకు ఆలయం లేనప్పుడు అన్నం దొరకాలంటే వేరొక వృత్తి చేయాలికదా అని ఇతర లౌకిక విద్యలకు వెళ్లిపోయారు. చాలా ఆలయాలు అర్చకులు లేక మూతపడ్డాయి. టీటీడీ వారు ఇంతటితో వదలక కేసుజరుగుతున్న రోజులలో ద్రవ్య ఆదాయాన్ని అర్చకులు తీసుకున్నారు గనుక తిరిగి కట్టాలని కోర్టులో కేసు వేసి గెలిచారు. దానితో అప్పటినుండి అర్చకులకు సంబంధించిన 4 ఇల్లు తనకా పెట్టుకొని వారికి ఇచ్చే జీతంలో ప్రతినెలా డబ్బు పట్టుకొని ఇస్తున్నారు. ఇప్పటికి 9మంది అర్చకుల జీతంలో ఈ డబ్బు కట్ అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్పుడు ఉన్న అర్చకులను తీసివేయకూడదు అలాగే వారు చెప్పినట్లే కైంకర్యాలు నిర్వహించాలి వారి గౌరవం వారికి ఉండాలి అని చెప్పినందున ఆతీర్పు వచ్చే నాటికి ఎంతమంది దేవాలయం లో పని చేస్తున్నారో వారిని టీటీడీ తమ ఉద్యోగుల లాగా భావిస్తూ జీతాలు ఇవ్వడం ప్రారంభించింది. శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వంశపారంపర్య హక్కు కు సంబంధించి ఎండోమెంట్ లో ఒక జీవో తెచ్చారు దాని సారాంశం ఏమంటే పూర్వము నుండి దేవాలయాన్ని నమ్ముకున్న అర్చక కుటుంబాలలో సమర్థులైన అంటే ఆగమ శాస్త్రాన్ని చదువుకున్న వారసులు ఉంటే ఇప్పుడు వారు చేస్తున్న అర్చక ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వమని సిఫార్సు చేయవచ్చు అతను సక్రమంగా చదువుకొని ఉంటే ఆ ఉద్యోగం అతనికే ఇవ్వాలిఅన్నారు. దాని వల్ల తిరిగి అర్చక కుటుంబాలలో మళ్ళీ ఆగమ శాస్త్ర అధ్యయనం జరగడం కూడా కొంత పెరిగింది. శుభపరిణామం అని అందరూ సంతోషించారు 2010 లో శ్రీ కృష్ణారావు గారు తిరుమల మరియు గోవిందరాజస్వామి అర్చకుల జీతాలను కొంతమందికి 33000 చేసి పుణ్యం కట్టుకున్నారు అప్పటిదాకా 8000 మాత్రమే ఉండేది. ఇప్పటికి టీటీడీ లో పనిచేసే350మంది అర్చకుల జీతం 17000 మాత్రమే. ఇది ఇలా ఉండగా 1999 లోనే అర్చకులు సుప్రీం కోర్టు3జడ్జి ల బెంచి కి కేసు పునపరిశీలనకు అడిగారు. 3 జడ్జీల బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది. 2012 దాకా దాని విచారణ కొనసాగుతూనే ఉంది 2012లో సుబ్రమణ్యం గారు ఈఓ గా ఉండగా మీకు మంచి జీతాలు ఇస్తున్నాం గౌరవంగా చూస్తున్నాం మీ తరువాత యోగ్యులైన మీ కుమారులకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కదా మరి మీరెందుకు ఇంకా కేసు వాడిస్తారు వెనక్కి తీసుకోమని కోరారు. దానితో అర్చకులు కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ జడ్జి గారు అడిగారు మీకు అన్ని మర్యాదలు జరుగుతున్నయా మీ కుమారులకు అర్చకత్వం ఇస్తున్నరా ఒకవేళ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా 3బెంచి జడ్జీల దగ్గరకు రావచ్చని చెప్పి కేసు వెనక్కు ఇచ్చారు.సాధారణంగా ఒకకేసు లో ఎవరూ అలా అనరు కానీ ఇప్పటికీ అర్చకుల హక్కులైన ఆలయ కైంకర్యాల నిర్వహణ ఉత్సవాల నిర్వహణ వంశ పారంపర్య హక్కు ద్వారా గల మర్యాదలు అర్చకులకు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది. వంశపారంపర్య హక్కు గురించికూడా మేము చదివాము అది తీసివేయడం వల్ల వచ్చిన పరిణామాలు కూడా బాగలేవని సుప్రీం కోర్టు అన్నారు. తరువాత కేసు ఆగిపోయింది కానీ చిలుకూరు సౌందరరాజన్ గారు వేరొక కేసువేసి దీని గురించి పోరాడుతూనే ఉన్నారు.ఇంకొక కేసు అయిన చిదంబరం అర్చకుల కేసులో 2016లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఆగమశాస్త్రాలను అనుసరించే ఆలయాలలో అర్చక నియామకం ఉండాలి ఎవరిని కావాలంటే వారిని నియమించకూడదనిఅన్నది. మొత్తానికి తిరుమల అర్చకులకేసు సుప్రీం కోర్టు నుండి బయట పడ్డాక అధికారుల రాక్షస క్రీడ ప్రారంభమైనది. ఆలయంలోపలి అన్ని విషయాలలో అధికారుల హవా మొదలైనది. భక్తుల రద్దీ సాకుగా కైంకర్యాలు వేళలు మార్చడం స్వామివారికి ఏ ఆభరణాలు అలంకరించాలి. బ్రహ్మోత్సవాలు ఎవరు చేయాలి పవిత్రోత్సవాలు ఎవరుచేయాలి ఇటువంటి ఎన్నో ఆగమ పరమైన నిర్ణయాలను అవగాహనా రాహిత్యం తో తీసుకున్నారు. ప్రధాన అర్చకులు వ్యతిరేకించిన లెక్కలేదు.ప్రస్తుతం తిరుమలలో అర్చకుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన పరిస్తితి ఉంది.మిరాశీ అర్చకులు మా కుమారులు ఉన్నారు కదా వారిని తీసుకోవాలని మిరాశీ అర్చకులు విజ్ఞప్తి చేశారు. టీటీడీ వారు ఒప్పుకోలేదు. జి.ఓ. ప్రకారం మీరు టీటీడీ ఎంప్లాయిస్ గా ఉంటే మీకు మేము స్కెలు జీతం ఇచ్చి అప్పుడు మీరు 65 ఏళ్ళు వచ్చాక విరమణ చేస్తే ఇస్తాము లేకపోతే లేదు అంటారు. మేము ఉద్యోగులం కాదు గౌరవస్తానంలో ఉండే అర్చకులము మాకు ఇచ్చే డబ్బు ని జీతం అనవద్దు సంభావన ఆనండి. మాకు ఉద్యోగం కాదు ఇది బాధ్యత మాకు మీ రూల్స్ ఎలా పెడతారు. అని అడిగి హై కోర్టులో వేశారు హై కోర్ట్ తీర్పు చెప్తూ మిరాశీ అర్చకుల కుమారులను వెంటనే విధులలోకి తీసుకోవాలిని సుప్రీంకోర్టు వారికి ఆ విధమైన సౌకర్యాలు ఇచ్చిందని కైంకర్యాలు ఉత్సవాలు వారు చెప్పినట్టే చేయాలని వారి గౌరవం కాపాడాలని మళ్ళీ తీర్పు ఇచ్చింది. ఇలా ఉండగా అధికారగణం మెల్లగా అర్చక వర్గాలలో చీలిక తెచ్చింది.మీకు మీరు చేరినప్పటి నుండి స్కెలు జీతం ఇస్తాము మీరు 65 ఏళ్ళ వరకు ఉద్యోగం చేయొచ్చు తరువాత మీ పిల్లలు ఉంటే వారికి ఇస్తాము కదా మీకు ఒక 20లక్షలు అరియర్స్ వస్తాయి.రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది ఎందుకు మీకు హక్కులు వీటివల్ల మీకు ఏమి ఒరిగింది. దేవుడికి జరిగేది జరుగుతుంది ఎవరో ఒకరు చూస్తారు ఇలాంటి మాటలు చెప్పి అర్చకులలో ఒక వర్గాన్ని ఉద్యోగులుగా మార్చడానికి రంగం సిద్ధం చేసింది దీని వల్ల బాధ ఏమిటంటే ఎప్పుడైతే అర్చకుడు ఉద్యోగిగా మారతాడో తనకన్నా ఎక్కువ జీతం తీసుకునే ప్రతిఒక్కరికి అతను సబ్ ఆర్డినెట్ అవుతాడు సర్వీస్ రూల్స్ ప్రకారం తిరుపతి అర్చకులను బొంబాయికి ఢిల్లీకి కూడా ట్రాంఫర్ చేయొచ్చు వారు చెప్పినది వినక పోతే ఏమైనా చేయొచ్చు.కైంకర్యాలు వారు చెప్పినట్టు చేయాలి ఉత్సవాలు వాళ్లు చెప్పినట్టు చేయాలి మొత్తం అధికారుల చేతిలోకి వెళ్ళి పోతుంది. అప్పుడు ఈ రాజకీయ నాయకులు దొంగ ఆఫీసర్ చేతికి మొత్తం పోతే ఇప్పటికె కొన్ని దేవాలయాలు ఏరకంగ ఎండోమెంట్ వారు నాసనం చేస్తున్నారో చూస్తున్నాం కదా అదే గతి తిరుమలకు పట్టబోతింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఆలయ కైంకర్యాల అర్చకుల విషయంలో అధికార జోక్యం ఎంతప్రమాదమో గుర్తించిన రమణదీక్షితులు గారు ఎదురు తిరిగారు. తరువాత ఎం జరుగుతుంది మీకు తెలుసు
Contd ...
పవిత్రమైన తిరుమల ఆలయంలో స్వామివారి కైంకర్యాల విషయంలో , ఆభరణాల విషయంలో జరుగుతున్న అపచారాల గురించి గళమెత్తిన టి.టి.డి. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ను ఉన్నపళాన తొలగించటం సహించరాని నిరంకుశత్వం. హిందూ దేవస్థానంలో జీతం తీసుకుంటూ చర్చికి పోయి ప్రార్థనలు చేసే అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డా ఊరుకుని కడుపులో పెట్టుకుని కాపాడే టి.టి.డి. ... అనాచారాలను, ఆగమ విరుద్ధ అపచారాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడికి ఆగమేఘాల మీద ఉద్వాసన చెప్పటం శ్రీవారి భక్తులకు, హిందువులు యావన్మందికీ ఒళ్ళు మండించే కండ కావరం. ఇది కేవలం టి టి డి అధికారుల పుర్రెకు పుట్టిన బుద్ది అనుకోలేము. పై స్థాయిలో రాజకీయ పాలకుల ఆమోదం, ప్రేరేపణ లేకుండా ఇటువంటి తీవ్ర చర్యకు పాల్పడ తారని నమ్మలేము.
రమణ దీక్షితులు నిన్న చెన్నై లో మీడియా ముందు చెప్పిన మాటలను తేలికగా తీసివేయటానికి వీల్లేదు. ఇన్నాళ్ళూ మిన్నకుండి ఆయన ఇప్పుడే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు , ఆయన వెనక ఎవరున్నారు అంటూ పాయింట్లు లాగి దురుద్దేశాలను ఆపాదించటం మూర్ఖత్వం.
రమణ దీక్షితులు మచ్చ లేని సచ్చరిత్రుడు అవునా కాదా అన్నది కాదు ప్రశ్న. వి ఐ పి ల సేవల రంధిలో స్వామివారి సేవల పవిత్రతకు అపచారం చేస్తున్నారు అని ఆయన అధికారులపై ఇప్పుడు చేస్తున్న అభియోగం లాంటిది గతంలో ఆయన మీద కూడా వినవచ్చిన మాట నిజం. తన కుమారులకు ఆనువంశిక అర్చకత్వం దక్కకుండా స్థానభ్రంశం కలిగించినండువల్లే ఆయన ఆగ్రహించాడన్న అభిప్రాయం లో నిజమెంత అన్నది ఇక్కడ ప్రధానాంశం కాదు.
ప్రాతఃకాలాన చేయవలసిన సుప్రభాత సేవను అర్ధరాత్రే కానివ్వమని వి.ఐ.పి.ల సేవలో తరించే అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారనీ ..
తోమాల సేవ వంటివి కూడా సరిగా చేయనివ్వకుండా తొందర పెడుతున్నారనీ ..
ఆగమ నియమాలకు విరుద్ధంగా ఎన్నో అపచారాలు జరుగుతున్నాయనీ ..
కృష్ణ దేవరాయల కాలం నుంచీ ఉన్న అపురూప ఆభరణాలకు సరైన లెక్క , భద్రత కరవైందనీ ..
ఆలయ పవిత్రతను ఇక భక్తులే కాపాడుకోవాలనీ ...
సాక్షాత్తూ శ్రీవారి ప్రధాన అర్చకుడే బాహాటంగా మొత్తుకున్నాడంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థమవుతుంది. నిజానికి ఇవన్నీ కొత్తగా ఇప్పుడే ... రమణ దీక్షితులు చెప్పటం వల్లే లోకానికి తెలిసినవి కావు. మీడియాలో చాలా కాలంగా బయట పడుతున్నవే , ఎందఱో పెద్దలు, ప్రముఖులు ఎప్పటినుంచో తీవ్రాందోళన వెలిబుచ్చుతున్న అవకతవకలే ఇవి ! ఇప్పటిదాకా ఇతరులు చెబుతూ వస్తున్నవి ఎంతవరకూ వాస్తవమన్న విషయంలో కొంత సంశయలాభానికి ఆస్కారం ఉండేది. స్వయానా ప్రధాన అర్చకుడే అపచారాలను ధృవీకరించటంతో ఆ అసందిగ్ధతా తొలగింది. ఇక మావల్ల కాదు మీ గుడిని మీరే కాపాడుకోండి అని ప్రధానార్చకుడే చేతులెత్తేసే పరిస్థితి ఎందుకొచ్చింది , ఎవరివల్ల దాపురించింది , దీనిపై ఏమి చేయాలన్నది భగవంతుడి మీద , సనాతన ధర్మం మీద భక్తీ, విశ్వాసం ఉన్న ప్రతి హిందువూ తనకు తాను ఆలోచించాలి.
వెంకటేశ్వరుడి సొమ్ముతో బతుకుతూ చర్చికి , మసీదుకు పోయి అన్యమతాలకు భజన చేసే ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారని తెలిసినా చేమ కుట్టినపాటి అయినా చలించని అధికారులూ ..
హిందూ దేవస్థానాలలో వేరే మతస్థులు కొలువు చేయటం లో తప్పేమిటని ప్రశ్నించే న్యాయమూర్తులూ ...
వేరే మతస్థులైన ఉద్యోగులకు న్యాయం చేయటానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పే దేవస్థానం చైర్మన్లూ ...
పెద్ద పెద్ద జడ్జీల , రాజ్యాంగేతర అధికార కేంద్రాల ప్రాపకంతో ఏళ్ల తరబడి కొండ మీద పాతుకుపోయిన ఉన్నతాధికార గ్రంథ సాంగులూ ..
బాగ్ లో , కారు లో ఎప్పుడూ బైబిల్ పెట్టుకుని తిరుగుతామనేవారినీ , క్రైస్తవ మత వేడుకలలో గెస్టులుగా పాల్గోనేవారినీ ఏరికోరి బోర్డు మెంబర్లను చేసే రాజకీయ మారాజులూ ...
అనాదిగా వస్తున్నపవిత్ర సంప్రదాయాలనూ, విదివిధానాలనూ ఇష్టానుసారం మార్చేసే అధికార మదాంధులూ , అపర ఔరంగజేబుల్లా వెయ్యికాళ్ల మంటపం లాంటి ప్రాచీన కట్టడాలను కూల్చిపారేసే గుడి పెత్తందారులూ ...
ఇతర మతాల పవిత్రాలయాలు వేటికీ లేని దిక్కుమాలిన ప్రభుత్వ కంట్రోళ్ళను దిక్కులేని హిందూమతానికి మాత్రమే తెచ్చి రుద్దిన పాపిష్టి చట్టాలూ ...
ఆ చట్టాల ఆసరాతో అడ్డూ అదుపూ లేకుండా బరితెగించిన అవినీతిమయమైన అధికార పిశాచాలూ చల్లగా ఉన్నంత కాలం ...
తమ పవిత్ర మత సంస్థలనూ , ధార్మిక వ్యవస్థ లనూ, మహిమాన్విత పుణ్య క్షేత్రాలనూ తామే పరిరక్షించుకోవాలన్న తెలివి, చేవ , మగటిమి హిందూ సమాజానికి కలగనంతవరకూ..
హిందూ మత సంస్థలుగా చలామణీ అయ్యే దుకాణాలకు బద్ధకం , పిరికితనం వదలనంతవరకూ ...
ఈ కథ ఇంతే. అవినీతిపరులదీ , దైవ ద్రోహులదీ ( దేవుడి ఆగ్రహానికి గురి కానంతవరకూ ) ఆడింది ఆటే.
చెప్పా పెట్టకుండా , ఎలాంటి విచారణా లేకుండా , గుడి పెత్తందారులు, వారి రాజకీయ యజమానులూ తలచిందే తడవుగా ప్రధాన అర్చకుడిని తొలగించటం పవిత్ర ఆలయ వ్యవస్థకు అపచారం .మొత్తం హిందూ సమాజానికి అవమానం.
Save Hinduism from Hindu secular leaders.
🕉ధర్మో రక్షతి రక్షితః🕉

2 వ్యాఖ్యలు:
గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్
సుజనుల పైన జంగ గొను చుండెనదే తితిదే సుమా జిలే
బి! జవము బోవ నేడు మన వేదపు నీమము లెల్ల త్రోసిబు
చ్చి జరఠ గుంట నక్క మజ చిందులు వేసెను భారతమ్మునన్ !
జిలేబి
dear sir very good blog very good content
Telugu News
Post a Comment