శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చమురు ధరలు ....వాస్తవం

>> Tuesday, May 29, 2018

చమురు బ్యారెల్ ధర 130 డాలర్లు ఉన్నా కూడా UPA 60₹కే లీటర్ పెట్రోల్ ఇచ్చింది అంటున్నారు..అద్భుతం..

కానీ ఎలా ఇచ్చింది..?
సోనియాగాంధీ ఏమైనా ఇటలీ నుంచి డబ్బు తెచ్చి పెట్టిందా..?? లేకపోతే రాహుల్ గాంధీ సంపాదించి పెట్టిండా..? లేకపోతే మా కమ్మిలు చైనా నుండి తెచ్చారా..?? మా దొంగ సిక్కులర్లు అటు అమెరికా నుండో, ఇటు పాకిస్థాన్ నుండో డబ్బు తెచ్చారా..??

పాకిస్థాన్ లో 50..??ఎవరు చెప్పారు నీకు..
http://pakbiz.com/finance/petroleumprices.html
గల్ఫ్ లో తక్కువ, అమెరికా లో కూడా తక్కువే నా..? అవును ఐతే ఏంటి..?? వాడికి క్రూడ్ ఫ్రీ గా దొరుకుతుంది, పైగా ప్రతి అమెరికన్ అంటే 100% అమెరికన్లు 40% టాక్స్ కడతారు, మరి మన దేశంలో టాక్స్ కట్టేది 3% అది కూడా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాకే పెరిగింది...

కొంతమంది పెట్రోల్ ధరలు మన దేశం లోనే ఎక్కువ అని మిగతా దేశాల లో తక్కువగా ఉన్నాయని అబద్దపు  ప్రచారం చేస్తున్నారు...

అందులో నిజం ఎంత...? అన్ని దేశాలకంటే మన దేశం  లో పెట్రోల్ ధరలు ఎక్కువగా నే ఉన్నాయా...?  అన్ని దేశాలలో తక్కువ అన్న మాట లో  నిజం ఏమిటి...?
కొన్ని దేశాలలో పెట్రోల్ ధరలు రూపాయిలలో మీ ముందుకు ఇవ్వబోతున్నాము.

2017 ₹~$ లెక్కలను అనుసరించి..

నేపాల్ : 67
పాకిస్తాన్ :80
బంగ్లాదేశ్ :76
జర్మనీ :98
ఫ్రాన్స్ :98
డెన్మార్క్ :108
ఇస్రాయెల్:104
ఇటలీ :109
జపాన్ :78.28
సింగపూర్ :96
టర్కీ:101
బ్రిటన్:100
అమెరికా::45
ఫిన్లాండ్:108
చైనా:66
మెక్సికో :54.22
భూటాన్: 56
న్యూజిలాండ్ : 96
నెదర్ల్యాండ్ :111
స్వీడన్ :105
స్విజర్లాండ్: 96
స్పెయిన్ :92
గ్రీస్:115
హాంగ్ కాంగ్:127
నార్వే :129
పోర్చుగల్:112
బెల్జియం:105
ఆస్ట్రియా:91
మారిషస్:86
క్యూబా:81
హంగేరి:88

మన దేశంలోనే కాదు మిగతా అన్ని దేశాలలోను అవే సమస్యలు ఉన్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బారెల్ రేట్ ల అనుసారం. మారకం విలువ అనుసారం పెట్రోల్ ధరలు ఉంటాయి.. పెట్రోల్ ను ఉత్పత్తి చేసే దేశాలలో సాధారణంగానే తక్కువ ధరలకే పెట్రోల్ అమ్మకం జరుగుతుంది. ఈ మధ్య వారు కూడా ధరలు బాగా పెంచారు. తెలుసుకోండి. ఆలోచించండి.. కొంతమంది  చిలక గాళ్ళు  పెట్టె అబద్దపు పోస్టులు నిజమా అబద్దమా అని నిర్ధారణ చెసుకొవడానికి ఇంటర్నెట్ ని ఆశ్రయించండి ...!

http://www.kshitij.com/research/petrol.shtml

https://www.rvcj.com/petrol-prices-100-countries-around-world-check-india-stands/

ఇక నోటికి ఏది వస్తే అదే రాసేయ్యడం, ఫోన్ ఉంది FACEBOOK ఉందని ఎవరో రాసిన పోస్టులను కాపీ పేస్టు చెయ్యడం, పోజులు కొట్టడం.

UPA పాలనలో ఇరాన్ నుంచి తెచ్చిన (మీరు చెప్పే బ్యారెల్ రేటు 100 ఉన్నది కానీ) వాటికి 42 వేల కోట్ల రూపాయల ఉద్దెర ఖాతా పెట్టి దేశం ఇజ్జత్ తీశారు. ఉద్దెర ఎందుకు అంటే, ధరలు పెంచితే జనాల నుంచి నిరసన వస్తుంది కదా దానినుండి తప్పించుకోవడానికి ఇరాన్ కు డబ్బులు ఇవ్వకుండా అప్పు తెచ్చి చమురుని దిగుమతి చేసుకున్నది. లేకపోతే అప్పుడే లీటర్ 100 రూపాయలు దాటేది.!

ఇక మోడీ వచ్చాక మరి ఆ 42 వేలకోట్ల రూపాయల అప్పుని మొదట సంవత్సరంలోనే తీర్చేశాడు.
సర్దుబాటు చేసిన ఆ సొమ్ముని ఎవరు చెల్లించాలి.?? మోడీ ఏమైనా నెహ్రూ కుటుంబమా..? వేల కోట్లు వెనకేసుకున్నవాడా..?? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కట్టే పన్నులే ప్రజల అవసరాలను తీరుస్తాయి.  కాబట్టి  బ్యారెల్ ధర తగ్గినప్పటికీ ధరలు తగ్గించలేకపోయారు. దీనికి ఇంకో కారణం కూడా ఉన్నది, UPA పోతూ పోతూ రోజువారీ ధరల సవరణ ను తెచ్చింది.

ఇకపోతే, ఇప్పుడున్న ధరల ప్రకారం పెట్రోల్  పై వేస్తున్న పనుల్లో దాదాపు 75% (36 రూపాయలు )రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే. అడ్డగోలుగా అదనపు పన్నులు వేస్తూ ధరల పెరుగుదలకు రాష్ట్రాలు పరోక్ష కారణం అవుతున్నాయి. కానీ జనాలు మాత్రం కేంద్రం ధరలు పెంచుతుందని అపోహపడుతున్నారు. ఇక ఇతర పార్టీల కార్యకర్తలు, కూడా కేంద్రాన్ని బదనం చేస్తూ చెత్తరాతలు రాస్తున్నారు.(వీళ్లకు 5% అవగాహన కూడా ఉండదు)

2003 లో 23 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధరను, 2014 లో 73 రూపాయల వద్ద NDA కు అప్పగించారు, 42 వేల కోట్ల అప్పుతో.. ఇది కేవలం ఇంధన ధరలు సబ్సిడీ ల అప్పు, అసలు అప్పు కొన్ని లక్షల కోట్ల పై మాట.. ప్రతి భారతీయుడు దాదాపు50 వేల₹, అంటే దాదాపు 130 కోట్ల జనం*50,000= లెక్కపెట్టుంకోండి, దేశంపై సబ్సిడీల అప్పు, ఎవరు తీర్చుతారు ఇది..?? ఎవరూ తీర్చలేక పోతే, మరోసారి బానిసత్వమే, అర్ధం అవుతుంద..?? Read this for more information..
https://tradingeconomics.com/india/external-debt

#పెట్రోల్ ఫై మన రాష్ట్రం తినేది 26₹
కేంద్రం పొందేది 12₹
(నింద కేంద్రం ఫై రాజభోగలు రాష్ట్రాలకు)
లెక్కలతో సహా మీ ముందుకు...

#చాలామంది సామాన్యులకు ఇప్పుడు పెట్రోల్ రేటు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడికి భారంగా పరినమిస్తున్న సమయంలో ఎంతోమంది కేంద్ర ప్రభుత్వంని తిట్టడం పరిపాటి అయిపోయింది సరే అది వారి ఇష్టం అనుకోండి,

#ఇక అసలు విషయానికి వద్దాం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని #విజయవాడ ని కొలమానంగా తీసుకుందాం, ఈరోజు విజయవాడలో పెట్రోల్ ధర 82₹ ఇది సామాన్యుడికి చాలా భారమే అయితే ఇంత ధర దేనికి అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రెట్లు తక్కువే ఉన్నప్పటికీ ఈ భారం ప్రజలపై మోపడం చాలా తప్పు అని మెజారిటీ వర్గం వారి వాదన,

#ఇకపోతే ఇక్కడ మీకు అన్ని లెక్కలతో వివరిస్తాను కావాలి అంటే వాటిని మీరు కూడా నిర్దారణ చేసుకోవచ్చు.. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు 78$, బ్యారెల్ అంటే 159లీటర్లు, రూపాయి విలువ మార్కెట్ లో ఈరోజు 68₹ గా ఉంది డాలర్ తో పోల్చుకుంటే, అనగా ఒక బారెల్ ఆయిల్ 78$×68₹=5304₹(159లీటర్లు కి)+1.5$ షిప్పింగ్ చార్జెస్(1.5×68=102) టోటల్ గా 5304+102=5406÷159=34₹ కి లీటర్ క్రూడ్ ఆయిల్ మనదేశానికి #చేరుతున్న ధర...

ఈ 34₹ కి ఎంట్రీ టాక్స్-రిఫెయినరీ ప్రాసెసింగ్&లాండింగ్ కాస్ట్ 2.70₹. OMC మార్జిన్,ట్రన్సుపోర్టెషన్&Fright చార్జెస్ 3.30₹ ఇక్కడితో టోటల్ 34+2.70+3.30=40₹ కి రిఫెయినరీ నుండి ట్యాంకర్ల ద్వారా బయటికి వస్తుంది...

#ఇలా వచ్చినడానిఫై కేంద్రం 20₹ Excise Duty+రోడ్ సెస్ విదిస్తుంది, అనగా 40+20=60₹ తో ఆయా రాష్ట్రాలకు పెట్రోల్ ట్యాంకర్లు చేరుకుంటాయి,

#ఇక_అసలు_కథ_ఇక్కడే_ఉంది
ఇలావచ్చిన పెట్రోల్ ఫై ఆయ పెట్రోల్ బంక్ యజమానుల కమిషన్ 4₹ సో టోటల్ గా 64₹ కి చేరింది,
ఇక 64₹ ఫై మన రాష్ట్రం విదిస్తున్న #వాట్ 27%(అప్రాచ్మేట్లై) + 0.25పైసా పొల్యూషన్ సెస్
అంటే 64₹ లో 27% అనగా 17.5₹(విత్ 0.25పైసా) టోటల్ గా ఇప్పుడు పెట్రోల్ ధర 81.5₹ కి మనకు లభిస్తుంది(ఇక్కడ ట్రన్సుపోర్టు ని బట్టి పైసల్లో తేడా ఉంటుంది ఒక్కో నగరానికి)

#అందరు అనుకుంటున్నట్టు ఈ 82₹ లో కేంద్రానికి 20₹ టాక్స్ ల ద్వారా అందినది కదా అలా వచ్చిన 20₹ లో 14th కమిషన్ ద్వారా 42% ని కేంద్రం #మరలా రాష్ట్రాలకు తిరిగి ఇస్తుంది అంటే అటు-ఇటుగా 8₹ కేంద్రం తిరిగి ఆయా రాష్ట్రాలకు బదిలీ చేస్తుంటుంది...

అసలు విషయం ఏంటి అంటే మనం చెల్లించే లీటర్ పెట్రోల్ 82₹ లో #కేంద్రానికి పోయేది అంతిమంగా 12₹ అదే #ఆంధ్రప్రదేశ్ పొందేది దాదాపు లీటర్ కి 26₹ ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరు #దోచుకుంటున్నారు ప్రజలను రాష్ట్రాలా-కేంద్రమా..??

#ఒకవేళ అన్ని రాష్ట్రాలు ఒప్పుకుని పెట్రోల్ ని GST లోకి తెస్తే మనకు లీటర్ 50-55₹ కె అందుతుంధి బట్ రాష్ట్ర ప్రభుత్వాలు అస్సలు ఒప్పుకోవు కారణం ఇప్పుడు అందే 26₹ కాకుండా GST లోకి చేర్చుతే రాష్ట్ర ప్రభుత్వలు 10₹ లోపే పొందుతాయి అంటే లీటర్ కి రామారమి 16₹ కోల్పోతాయి. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకి అడిగింది.

లెక్కలప్రకారం మన రాష్ట్రంలో రోజు 2 కోట్ల లీటర్ ల ఇంధనం వాడుతున్నారు అలా చూసుకున్నా 2×16=32 కోట్లు రోజు ఆదాయం కోల్పోతుంది రాష్ట్రం సంవత్సరం కి ఉచితర్దంగా ప్రజలనుండి 10,000 కోట్లకు పైగా ఆదాయం కోల్పోవడం రాష్ట్రప్రభుత్వాలకు ఇష్టంలేదు కాబట్టే GST లోకి ఇంధనాన్ని ఒప్పుకోవడం లేదు,

#అందరు కేంద్రాన్ని నిందించడం మానేసి ఒక్కసారి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఆయ రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి #GST లోకి ఆయిల్ ని తీసుకురమ్మని పోరాటం చేయండి కొంచెం ఉపయోగం ఉంటుంది. అంటే తెలుగు తముళ్లూ ముందు తెలుగు రాష్ట్రాల సీఎం ల చేత అన్పిస్తే, కేంద్రం చేత తర్వాత అన్పించవచ్చన్న మాట.. మొదలెట్టండి..

ఇక నాకైతే, రెండు కార్లు ఉన్నాయి, ఇంటి నిండా బైక్ లే, ఐనా సరే, నాకు పెట్రోల్ సబ్సిడీ వద్దు.. కానీ BPL, అంటే పేదవారికి నెలకు ఇన్ని గ్యాస్ సిలిండర్ లు సబ్సిడీ కి ఇస్తున్నట్లు గా పెట్రోల్ కూడా ఇన్ని లీటర్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి, అని మా విన్నపం.. ఇక ప్రజలు తప్పని పరిస్థితుల్లో తప్ప ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ ని వాడాల్సిందిగా విన్నపిస్తున్నాం.. ఎందుకంటే ధనికులకే కార్లు ఉంటాయి, వారికి సబ్సిడీ లు అవసరం లేదు గా..? పైగా చమురు రానున్న 100 సం. లో ఐపోద్ది, కాబట్టి సోలార్.. విద్యుత్ మరియు శాశ్వత వనరులపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ..

చివరిగా, ఆయా దేశాల్లో ప్రయాణ ఖర్చులు మన దేశంతో పోలిస్తే, చాలా చాలా ఎక్కువ. ఉదాహరణకు: వైజాగ్ నుండి హైదరాబాద్ కి అత్యధిక ధర ₹2000/- అంటే ₹2/Km అదే దూరం ఇతర దేశాల్లో చేయాలంటే దాదాపు ₹20 నుండి ₹100 కి పైగానే సుమా, ఇక తిండి ధరలు.. ఇంటి ధరలు కూడా అధికమే..

ఈ ఆర్టికల్ అందరు చదవాలి అని మా కోరిక..ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రాసింది. నిజం అందరూ తెలుసుకొవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాసాడు..కాపీ ఐనా పర్లే, షేర్ ఐనా పర్లే, విషయ పరిజ్ఞానం అందరికీ అందాల.. ఇదొక్కటే పరమావధి. అంటున్న Krishna Kumar Suman

ఇక చర్చలకు.. మేము రెడి..!

1 వ్యాఖ్యలు:

nmrao bandi June 11, 2018 at 12:59 AM  

మీ వాదన, విశ్లేషణ, సహేతుకంగా, సోదాహరణంగా ఉంది. అభినందనలు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విషయాల్లో చొరవ
తీసుకుని, తన విచక్షణతో, అధికారంతో, దీన్ని తానే gst పరిధిలోకి
తీసుకోవచ్చు కదా ? ఆ పని చేయకపోవడంలో అర్ధం, విశాల ప్రజా
ప్రయోజనాల కన్నా కేంద్రానికి రాష్ట్రాల సంకుచిత ప్రయోజనాలే మిన్న
అని అర్ధం చేసుకోవాలేమో!?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP