శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!

>> Tuesday, February 27, 2018

"
విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!

పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది.
విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు  ' ఠ్ఠ ' అనే  అక్షరం నుండి  వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది.
రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది.
పదిరోజులపాటు , రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.

కాబట్టి ఈ రోగాలున్నవారు పదిరోజులపాటు విఠ్ఠల నామస్మరణ  మొదలెట్టండి. పోతే  రోగం పోవచ్చు లేదా పుణ్యం వస్తుంది. ఏం జరిగినా మంచిదేకదా!

2 వ్యాఖ్యలు:

Srivenkateswarlu Vabilisetty March 6, 2018 at 4:13 PM  

జైశ్రీరామ్. నామజపం వల్ల పుణ్యం పురుషార్థం రెండు లభించుతాయు. అందులో ఎటువంటి సందేహం లేదు.

Srivenkateswarlu Vabilisetty March 8, 2018 at 11:37 PM  

జైశ్రీరామ్. "మననాత్ త్రాయతే యితి మంత్రహ".ఇది ఆర్యవాఖ్యం, అనేకసార్లు ఇది ఋజువయ్యంది

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP