శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

క్రైస్తవాన్ని ఎందుకు విమర్శించాలి?

>> Wednesday, February 28, 2018

క్రైస్తవాన్ని ఎందుకు విమర్శించాలి?

క్రైస్తవాన్ని విమర్శిస్తూ నేను పెడుతున్న పోస్ట్లు చదివి చాలా మంది, “మీరెందుకు వేరే మతం గురించి? ఇతర మతాల గురించి మాట్లాడటం తప్పు” అని అంటున్నారు. నేను కూడా కొంత కాలం క్రితం వరకూ  అలానే అనుకునే వాడిని.

మత మార్పిడి అనేది దేశానికి ప్రమాదం అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ కేవలం మతం అనే ఒకే ఒక్క కారణం వలన మన దేశం నుండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు వేరు పడ్డాయి. అంతే కాక జమ్మూ కాశ్మీరు లో వేర్పాటు వాదానికి కూడా కారణం మతమే. ఇవి అందరికీ తెలిసిన విషయాలే, చాలా మందికి తెలియని ఇంకో ముఖ్యమైన విషయం నాగాలాండ్ లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం. ఇక్కడ క్రైస్తవులు 90%. ఈ ఉద్యమానికి చర్చి సహకారం ఉంది. మరి మతాన్ని ఉపయోగించి మన దేశాన్ని ముక్కలు చెయ్యాలి అని ప్రయత్నిస్తుంటే మనం చూస్తూ కూర్చోవాలా లేదా దానిని ఆపడానికి ప్రయత్నం చెయ్యలా?

విషయాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. మత మార్పిడులకి మొదటి దశలో వాడే ముఖ్య ఆయుధం చరిత్ర వక్రీకరణ.

చరిత్ర వక్రీకరణ

దీనిలో భాగమైన ఒక ముఖ్యమైన వ్యూహం, లేని జాతులని సృష్టించడం, వాటిలో ఒక జాతి వల్ల మరో జాతి అణచివేతకి గురి అయ్యింది అని అబద్దపు చరిత్రని సృష్టించడం, దీనికి సాకుగా చూపి అణచివేతకి గురియ్యిందని నమ్మించిన జాతికి చెందిన వారిని క్రీస్టియన్లుగా మార్చడం. దీనివలన అంతర్యుద్ధాలు, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోవడం కూడా జరిగింది. ఈ వ్యూహాన్ని భారతదేశం, శ్రీలంక, రవాండా లాంటి ఎన్నో దేశాలలో అమలుచేసారు. శ్రీలంక లో తమిళ – సింహళ ఘర్షణ, రవాండా లో హుటు – టుట్సీ జాతుల మధ్య జరిగిన ఘర్షణల వెనక చర్చి హస్తం ఉంది. 5 - 10 లక్షల మంది చావుకి కారణం అయిన రవాండా నరమేధం లో తమ పాత్ర గురించి కాథలిక్ చర్చి ఈ మధ్యనే క్షామాపణ కూడా చెప్పింది.

 (http://edition.cnn.com/2017/03/20/africa/pope-apology-rwanda-genocide/index.html).

మాధ్యమ రంగం, విద్యావ్యవస్థ, సినిమా వంటి రంగాలని నియంత్రించి, ప్రభావితం చేసి తాము సృష్టించిన అబద్దపు చరిత్రని ప్రజలు నమ్మేలా చేస్తారు. భారతీయులని ఆర్యులు – ద్రవిడులుగా విడగొట్టడానికి ప్రయత్నాలు దాదాపు 100 సం. లుగా సాగుతున్నాయి. ఉత్తర భారతీయులని అలానే బ్రాహ్మణులని, విదేశాల నుండి వచ్చిన ఆర్యులుగా, చేడుగా చూపించడం, తద్వారా దక్షినాది వారిని  క్రైస్తవం లోకి మార్చడం వీరి లక్ష్యం. అలానే లేనేలేని ద్రావిడ అనే ఒక జాతినే సృష్టించారు. విదేశాల నుండి వచ్చిన ఆర్యులు వీరిని అణగదొక్కి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారత దేశానికి తరిమేసారని, దక్షిణ భారతీయులే స్థానిక భారతీయులని, ఉత్తరాది వారు విదేశీయులనీ ఈ సిద్ధాంతం చెప్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం విదేశి ఆర్యులు స్వదేశీ ద్రవిడులని అణగదొక్కారు. వేదాలు కూడా ఆర్యుల ద్వారానే విదేశాల నుండే వచ్చాయి. అంటే హిందూ మతంకూడా విదేశాల నుండే వచ్చింది. ఆర్యులు రాక ముందు స్థానిక ద్రవిడుల మతం క్రీస్టియానిటీలో ఒక భాగం అని కూడా కొంత ప్రచారం జరిగింది. కాబట్టి ద్రవిడులందరూ విదేశీ హిందూ మతాన్ని వదిలేసి తమ అసలు మతానికి మూలమైన క్రీస్టియానిటిలోకి మారిపోవాలి, అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన కొందరు క్రైస్తవ మిషనరీలకి చెందిన వ్యక్తులు ఆంగ్లికన్ చర్చి కి చెందిన బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్, స్కాటిష్ మిషనరీ సొసైటీకి చెందిన రెవరెండ్ జాన్ స్టీవెన్సన్, సొసైటీ ఫర్ ప్రొపగేషన్ అఫ్ గోస్పెల్ కి చెందిన జార్జ్ ఉగ్లో పొప్ తదితరులు. జన్యుశాస్త్రం, పురావస్తు శాస్త్రం, భాషా శాస్త్రం ఆధారంగా ఈ సిద్ధాంతం తప్పు అని ఇప్పుడు రుజువైనా దానివలన జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. అంతే కాకా ఇది నిజం అని నమ్మే వారు ఇప్పటికీ ఉన్నారు. సామాజిక మాధ్యమాలని ఒక స్థాయిని మించి నియంత్రించలేరు కాబట్టి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ వంటి వాటి ద్వారా ఇప్పటికైనా హిందువులు నిజం తెలుసుకో గలుగుతున్నారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంత లక్ష్యం హిందువులని ఉత్తర, దక్షిణ భారతీయులుగా విడదీయడం. దీని ప్రభావం మనకి తమిళ నాడు లో చాలా ఎక్కువగా కనబడుతుంది. ఒకప్పుడు వారు మాకు ప్రత్యెక దేశం కావలి అని కూడా అన్నారు. అక్కడ రాజకీయ పార్టీల పేర్లు ద్రవిడ, ద్రవిడ అని ఉండటానికి, హిందీ పట్ల అంత వ్యతిరేకత ఉండటానికీ ఇదే కారణం. హిందూ ధర్మం పట్ల అక్కడ వ్యతిరేకత ఎంత స్థాయికి వెళ్ళింది అంటే, ఒకప్పుడు హిందూ దేవుళ్ళ చిత్రపతాలకి చెప్పులు వేసి రోడ్డు మీద ఊరేగించారు. తమ మతం పెంచుకోడానికి మన వాళ్ళ మనసుల్లో మన సంస్కృతి మీద, ధర్మం మీద అంతలా విషం నింపేశారు. ఎంతో పరిణితి గల బలమైన సంస్కృతి, ధర్మం కాబట్టి మనం నిలబడగలిగాం కానీ వేరే ఇంకో దేశం అయితే అంతర్యుద్దం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే వారు.

అయితే ఇందంతా వారు ఎలా చెయ్యగలుగు తున్నారు?

హిందూ ధర్మంలా కాక క్రైస్తవ మతం వ్యవస్థీకృతం. క్రీస్టియానిటీలో కొన్ని వందల శాఖలున్నాయి. వాటిని డినామినేషన్స్ అంటారు. ప్రతీ క్రీస్టియన్ ఎదో ఒక శాఖలో, ఆ శాఖకి చెందిన చర్చి ద్వారా సభ్యత్వం కలిగి ఉంటాడు. అంటే ప్రతీ క్రీస్టియన్ ఒక శాఖకి మాత్రమే కాక ఆ శాఖకే చెందిన ఒక నిర్ణీత చర్చికి చెందినవాడై ఉంటాడు. ఈ క్రీస్టియన్ శాఖల పరిపాలనా వ్యవస్థ కార్పొరేట్ పరిపాలనా వ్యవస్థని పోలి ఉంటుంది. వీటి ప్రధాన కార్యాలయాలు ఎక్కువ శాతం అమెరికా, యూరోప్ లలో ఉంటాయి.  ఆయా శాఖలకి చెందిన చర్చిలలో జరిగే ప్రధాన నియామకాలన్నీ విదేశాలలో ఉండే ప్రధాన కార్యాలయాల ఇష్టం ప్రకారమే జరుగుతాయి. అంతే కాక మన దేశంలో ఉన్న ఆయా శాఖలకి చెందిన చర్చీలు మత మార్పిడులకి, ఇతరమైన వాటికి పాటించాల్సిన వ్యూహాలు, ధనమూ, సాహిత్యమూ కూడా ఎక్కువ శాతం విదేశాల నుండే వస్తాయి.

ప్రస్తుతం మన దేశంలో 5 – 10 కోట్ల మంది క్రీస్టియన్లు ఉన్నారని అంచనా. క్రీస్టియానిటీ వ్యవస్థీకృత విదానంలో నడవటం వలన, మన దేశంలో ఉన్న ఈ కోట్లాది మంది క్రీస్టియన్లని ఆయా క్రీస్టియన్ శాఖలకి చెందిన, విదేశాలలో ఉన్న ప్రధాన కార్యాలయం ప్రభావితం చెయ్యగలవు. అంటే వాటికన్ సిటీ లో ఉండే కాథలిక్ పోప్ మన దేశంలో ఉన్న వారి చర్చిల ద్వారా ఇక్కడ ఉన్న వారిని ప్రభావితం చెయ్యగలరు. ఇన్ని కోట్ల మంది భారతీయులని కొందరు విదేశస్తులు, విదేశీ సంస్థలు ప్రభావితం చెయ్యగలిగి ఉండటం తప్పకుండా ప్రమాధకరమైననదే. ఒక ప్రాంతంలో, జిల్లాలో, రాష్ట్రంలో క్రైస్తవుల జనాభా పెరిగిపోతే, ఓట్లు పడవేమో అనే భయంతో, అక్కడి ప్రజా ప్రతినిధులు కూడా చర్చి మాట వినక తప్పదు. ఇది దేశ భద్రతని ప్రభావితం చెయ్యగలిగే అంశం.

నాగాలాండ్ లో ప్రస్తుతం ఎం జరుగుతోండో ఇప్పుడు చూద్దాం

క్రీస్టియన్ జనాభా అధికంగా ఉన్న నాగాలాండ్ లో ప్రత్యేక క్రీస్టియన్ దేశం కావాలని సాయుధ పోరాటం సాగుతోంది. దీని కోసమై పోరాడుతున్న “ది నాగా సేపెరేటిస్ట్ గొరిల్లాస్” తమ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. నాగాలాండ్ ఫర్ జీసస్ అనేది వారి నినాదం. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఫర్ నాగాలాండ్ అనే ఇంకో తీవ్రవాద సంస్థకి బాప్టిస్ట్ చర్చి ప్రోత్సాహం ఉంది. నాగా ల కోసం ఒక ప్రత్యెక బాప్టిస్ట్ క్రైస్తవ దేశం వీరి లక్ష్యం.

వాట్స్ అప్ ఫార్వర్డ్

1 వ్యాఖ్యలు:

Srivenkateswarlu Vabilisetty March 6, 2018 at 5:31 AM  

జజైశ్రీరా. హిందువుల చాలామందిలో ఉన్న జబ్బు హిందుత్వాన్ని ఇతర మతాలవారు ఎంత విమవిమర్శిం చినా వారికి ఎలాంటి సంసంబం లేనట్లు వుంటారు.ఎవరైనా హిందువు ఇతర మతాల విమర్శలు తిప్తికొడితే మనకెందుకు అంటారు.మనకికలిగేనష్టంఅంతా ఇటువంటి పాపాత్ములవలనే.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP