శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీగోత్రనామాలు పంపి హనుమత్ రక్షాయాగం లో పాల్గొనండి

>> Monday, December 18, 2017భక్తజన రక్షకుడైన హనుమత్ ప్రభువు అనుగ్రహాన్ని వర్షింపజేసే  హనుమత్ రక్షాయాగం ప్రారంభమైనది. ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ఆవృతు ల కాలంలో   ఈ సాధనలో పాల్గొన్న ఎంతోమంది స్వామి అనుగ్రహాన్ని చవిచూశారు. విశ్వాసంతో స్వామినాశ్రయించిన వారి కష్టములు,గ్రహదోషములు తొలగి మనోభీష్టములు నెరవేర్చుకున్న వారి గుండెలలో స్వామి స్థిరమై నిలిచారు. 
ఇప్పుడు జరిగే పదవ  ఆవృతిలో  పాల్గొనదలచినవారు  మంచిరోజు న స్వామికి తమ సంకల్పం చెప్పుకుని,ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ,శ్రీరామనామ లేఖనం  ,చేసి జపసంఖ్యను వారి గోత్రనామాలు తెలుపుతూ యాగస్థలికి పంపించాలి. వారి తరపున కుడా ఆహుతులివ్వబడతాయి . యాగంలో ప్రత్యక్షంగా పాల్గొనదలచినవారు  యాగానికి పదకొండు రోజుల ముందునుండి  శుధ్ధ సాత్వికాహారం,తోనూ బ్రహ్మచర్య పాలనతో నియమంగా గడిపి యాగంలో పాల్గొనవచ్చుఁ. యాగం  లో పాల్గొనదలచినవారు ముందుగా మాకు తెలియపరచి వారి పేర్లు నమోదు చేసుకోవాలి. 
ఇంకా ఇతరవివరాల కొరకు మాతో  మాట్లాడవచ్చుఁ .   
durgeswara@gmail.com
9948235641
8074288641 0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP