శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మనం కోల్ఫోయిన భూభాగం ఎంత?

>> Friday, December 15, 2017

అఖండ భారతం !

అలాంటి తల్లి .. ఎందుకు ముక్కలైంది ?

ఒకప్పుడు మన దేశం అఖండ భారత దేశంగా యుండేది.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది నా తల్లి భారతి. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ భారతం, ఇలాంటి తల్లి భారతి ఎందుకు ముక్కలైంది. కాదు.! ముక్కలు చేసారు. చేయడానికి కారణం ఎవరు కారకులు ఎవరని మనందరికీ తెలిసిందే.
తన స్వంత ప్రాభల్యం కోసం తల్లి భరతమాతను ముక్కలు చేసారు. ఒకప్పటి భరతమాత భూభాగం 39,47,700 చదరపు కిలో మీటర్లు కాగ ప్రస్తుతం మనకున్న భూభాగం 32,93,200 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం.

మనము కోల్పోయిన భూ భాగ ప్రాంతాలు
• గాధారదేశం ( ఆఫ్ఘనిస్తామ్ )
విడిపోయిన సంవత్సరం 1739
చదరపు కిలో మీటర్లు 6,52,100

• సింహళము ( శ్రీ లంక )
విడిపోయిన సంవత్సరం 1912
చదరపు కిలో మీటర్లు 65,600

• బ్రహ్మదేశం ( మయన్మార్ )
విడిపోయిన సంవత్సరం 1937
చదరపు కిలో మీటర్లు 6,76,600

• సింధుదేశం ( పాకిస్తాన్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 8,80,300

• వంగదేశం ( బంగ్లాదేశ్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 1,42,600

• నేపాలం ( నేపాల్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 1,47,200

• భూటాన్
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు46700
• పాక్ ఆక్రమిత కాశ్మీర్
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 78,000

• త్రివిష్టానం ( టిబెట్ )
విడిపోయిన సంవత్సరం 1960
చదరపు కిలో మీటర్లు 12,21,000

• చైనా ఆక్రమిత లడర్
విడిపోయిన సంవత్సరం 1962
చదరపు కిలో మీటర్లు 37,600

కోల్పోయిన భూభాగం మొత్తం
39,47,700

ప్రస్తుత భూభాగం భారతదేశం ది
32,93,200

మనం కోల్పోయిన భూభాగం అంతా ఇంతా కాదు.ఒక్కసారి ఆలోచించండి. మనం మన ఎకరం పొలం దగ్గర గొడవ ఐతే గొడ్డల్లు, గడ్డ పారలు పట్టుకుని గొడవకు దిగుతాం. ఇది భరతమాత భూభాగమే మనం కోల్పోయింది భరతమాత భూభాగమే. కానీ దేశభక్తి ఉన్నోళ్ళకే ఈ బాధ అర్ధం అవుతుంది.

దేశభక్తి అంటే ప్రతీ ఒక్క భారతీయుడికి పుట్టుకతో రావాలి. ఈనాడు మన ధౌర్భాగ్యం ఏంటంటే, కన్నతల్లికి జై కొట్టడానికి కూడా వీళ్ళు అదే “భారత్ మాతా కీ జై” అనడానికి నోరు రావడం లేదు.

ఇక్కడి తిండి తింటారు, ఇక్కడి గాలి పీలుస్తారు, ఇక్కడే జీవిస్తారు కానీ కన్న తల్లి ఋణం తీర్చుకోరు. ఇలాంటి వాళ్ళ వల్లే ఈ తల్లి భారతి ఇన్ని ముక్కలు అయ్యింది. ఇంకా ఇప్పటికీ చేపకింద నీరులా ఎన్నో కుతంత్ర చర్యలు మన దేశాన్ని సర్వ నాశనం చెయ్యడానికి చూస్తున్నాయి. అదీ మత పరమైన వివక్షతో ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి. వీటిని ఆపడం భారతీయుడిగా మనందరి ప్రథమ లక్షణం.

From watsap

2 వ్యాఖ్యలు:

Chiru Dreams December 15, 2017 at 6:01 AM  

మీరు చెప్పిన దేశాలన్నీ భరత ఖండములో(ఏలాగైతే ఇప్పుడు ఆసియాఖండమనే పేరుందో ) భాగాలే గానీ.. భారత దేశంలో కాదు.. బ్రిటీషువాలు వొచ్చేంతవరకు, ఇక్కడ చిన్న చిన్న రాజ్య్యలు మాత్రమే ఉండేవి. వాళ్ళు అందరినీ జయించి, అన్ని రాజ్యాలని ఒక దగ్గరికి చేర్చారు. వసుదైక కుటుంబం అన్నారని.. ప్రపంచంతా మా దేశమే అనగలమా?

GKK December 15, 2017 at 8:19 AM  

చాలా బాధాకరం సార్. మనదేశం ముక్కలవ్వటానికి అంతర్గత దేశద్రోహులే ముఖ్య కారణం.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP