శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవాలయాల్లో పూజారులుగా చేయాలా...ఎవరొద్దన్నారు? ఇలా సిద్ధంకండి మరి

>> Friday, April 10, 2026

7-11 ఏళ్లకే ఉపనయనం చేసుకొని వేద పాఠశాలలో చేరి తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఏ కాలములో అయినా చన్నీళ్ల స్నానం మాత్రమే చేసి గురువు చెప్పే వేదాలు వల్లె వేసి కనీసం 7-11 ఏళ్ళు కర్మలు, అప కర్మలు. నిత్య పూజ విధానాలు, హోమ విధానాలు నేర్చుకుంటారు. అందరూ నేర్చుకోవచ్చు. TTD వేద పాఠశాల, వివిధ వేద పాఠశాలలు అందరికీ నేర్పుతున్నాయి. కఠిన నియమాలతో నేర్చుకుంటాం అంటే ఎవరు అడ్డుపెట్టారు ? దాదాపు 30,40% దేవాలయాల్లో బ్రాహ్మణ ఇతరులు పూజారులు . ఊరి గ్రామ దేవత లు, చెన్న కేశవ ఆలయాలు, వీరభద్రుడి ఆలయాల లో బీసీ, SC , ST కులం వారు, గిరిజనులు పూజారులుగా ఉంటారు. ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి! అయ్యప్ప స్వామి దేవాలయాల్లో గురు స్వామి కులము ఎవరూ చూడరు. రిజర్వేషన్ ఎక్కడుంది? అన్ని విద్యా విధానాల లాగా దానికి ఒక విద్య విధానం ఉంది. చక్కగా నేర్చుకోండి.దానికి పరీక్షలు, సర్టిఫికెట్ లున్నాయి. చదువుకోండి, పాస్ కాండీ. అసలే పూజారులు లేక నిత్య దీప ధూప విధానాలు చేసే వారు లేక చాలా దేవాలయాలు పాడు పడుతున్నాయి. చక్కగా నేర్చుకోండి, వాటిని జీర్ణోద్ధరణ చేద్దాము, శ్రద్ధగా దేవుడిని అంటి పెట్టుకొని ఉంటాం అంటే ఎవరు కాదు అన్నారు ?

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP