శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనివారములలో జరుగుతున్న చాలీసా పారాయణములలో పాల్గొనండి

>> Tuesday, April 26, 2016

హనుమత్ రక్షాయాగం   పూర్ణాహుతికి ఇంకా నెలరోజుల సమయం ఉంది. ఇప్పుడు పలుచోట్లనుండి భక్తులు పారాయణములు చేయటం రామనామాన్ని లిఖించటం జరుగుతూ ఉంది. ఇప్పటి నుండి యాగపూర్ణాహుతి సమయానికి ఐదు శనివారాలు  ఉన్నాయి . 30-42016    7-5-16   14-5-16   21-5-16    28-5-16       లు  శనివారములు .
ఈ ఐదు శనివారములు  సాయంత్రం ఐదుగంటలనుండి  ఇరవై ఏడు సార్లు  సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము జరుపాలని సంకల్పం కలిగినది. అంతకుముందు స్వామికి విశేషార్చనలుంటాయి .పారాయణం లో  ఇక్కడ కార్యకర్తలు,హనుమద్దీక్షాధారులు,స్వామి భక్తులందరినీ పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాము. పారాయణానంతరం భక్తులకు ప్రసాదవితరణ హనుమద్దీక్షలో ఉన్న వారికి  బిక్ష ను ఇవ్వాలని  నిర్ణయించుకున్నాము.

చివరి శనివారం భక్తులందరి తరపున అభిషేకములు పూజలు జరిపి, పూర్ణాహుతి   అనంతరం   భక్తులందరికీ   అన్నప్రసాద వితరణ ఉంటుంది.
 ఈ కార్యక్రమములో తామూ భాగస్వాములవ్వలనుకునే భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. శనివారము లలో హనుమాన్ చాలీసా పారాయణ సమయమములలో ప్రసాదములు వితరణ చేయదలచుకున్నా  ,అన్నదానము,పూజలలో వారితరపున పూజాద్రవ్యాదులు సమర్పించదలచుకున్నవారందరినీ ఈ క్రతువులో భాగస్వాములను చేస్తున్నాము .   ఏవరైనా  ఈ కార్యక్రమములో పాల్గొనదలచుకున్నట్లైతే వారు ఫోన్ లో సంప్రదించవచ్చు.
9948235641      durgeswara@gmail.com
ఇక  గోత్రనామాదులు పంపే వారందరకూ ఒకమనవి . గోత్రనామాదులు పంపిన వారి తరపున పూజ చేయాలంటే మీరు తప్పనిసరిగా రామనామము లిఖించి పంపాలి. ఇదే మీరిచ్చే యాగదక్షిణ .ఎందుకంటే  ఇది మనశ్రధ్ధా సక్తులకు ప్రతీక. రామనామము లిఖించటం స్వామికి ఇష్టం. ఇందువలన మీకూ సద్యోఫలితములు వస్తాయి, మీరు ప్రత్యక్షంగా యాగంలో పాల్గొన్నఫలితం వస్తుంది..

జైశ్రీరాం


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP