శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అంతా శివ సంకల్పమే ....ఇదొక శివలీల

>> Tuesday, February 23, 2016

శివసంకల్పమస్తు

శివుని ఆజ్ఞ  లేనిదే చీమైనా  కుట్టదని అంటారు పెద్దలు . అది ముమ్మాటికీ వాస్తవం . మన ఆలోచనలు ఎంతగొప్పగా ఉన్నా చివరకు శివసంల్పము ఎలాఉంటే అలానేజరిగితీరుతుంది . ఇది నాకు జీవితంలో ప్రతిసారీ అనుభవం లోకొస్తూనే ఉంది.

ఇదొక  శివలీల గా భావిస్తూ మీ ముందుంచుతున్నాను.

పీఠం లో దేవతా మూర్తులను ప్రతిష్ఠించేసమయంలో    విగ్రహాలు తెచ్చేప్పుడు  నంది విగ్రహం చెవిభాగం కొట్టి వేసింది. సమయం లేకపోవటం వలన  అప్పటికప్పుడు దుర్గి  నుండి ఒక నందివిగ్రహం  తెప్పించి ప్రతిష్ఠాకలపానికి ఆటంకం లేకుండా చూసుకున్నాము.  ఐతే దుర్గి శిల్పులు శిల్పాలు బాగా చెక్కుతారు గాని  రాయి మాత్రం మెతక.
అందువలన ఈ తొమ్మిది సంవత్సరాలలో అభిషేకాలకు  రాయి  నాని విగ్రహం పెచ్చులు పెచ్చులుగా ఊడటం మొదలైంది.  మూడూ సంవత్సరాలనుండి ఇది ఎక్కువవటం వలన గత మూడు సంవత్సరాలుగా నందీశ్వర విగహ పునః ప్రతిష్ఠ కోసం ముహూర్తం నిర్ణయించుకోవటం ఏదో ఒక ఆటంకం వలన ఆగిపోవటం జరుగుతూ వస్తున్నది.    అప్పటిలో అమ్మవారిముందు పంచలోహ ములతో తయారుచేసిన మేరువు ను తెప్పించాలని  సంల్పించగా      మిత్రులు అయ్యంగారినాగేంద్రకుమార్ గారు మోహన్ కిశోర్ గారు గిరీష్ కుమార్ గార్లు  పదిహేనువేల రూపాయలు అందజేశారు. కానీ  ఆసంకల్పానికి ఆటంకాలు రావటం వలన వారిని అడుగగా భగవత్కార్యానికి సమర్పించాం కనుక మీరు ఎలాగైనా వినియోగించండి అన్నారు. ఆడబ్బును నందీశ్వర ప్రతిష్ఠకు వాడాలని నేను అనుకున్నాను.  . ఐతే ఈమూడు సంవత్సరాలనుండి నాప్రయత్నం అలానే మిగిలిపోతున్నది.

ఈసంవత్సరం   మిత్రులు మోహన్ కిశోర్ గారు పీఠానికొచ్చి   నాగ ప్రతిష్ఠ చేసుకోవాలని సంకల్పించటం . పనిలోపనిగా   నందీశ్వరప్రతిష్ఠకూడా జరిపితే బాగుంటుందని    ఆలోచించి   ముహూర్తాలుచూడటం జరిగింది. ఐతే అనుకోకుండా ఆకార్యక్రమం వాయిదా పడింది.  
ఏమిటిది ? నందీశ్వరా ! శివభక్తుడవు . భక్తుల కోర్కెతీర్చడానికి ఇన్ని ఆటంకాలేమిటీ ? అని మనసులో చెప్పుకుని బాధపడుతున్నాను.
  మాష్టారూ ! మాఘపౌర్ణమికి   ప్రతిష్ఠ జరుపుదామా? అని మా భట్టుగారు  హఠాత్తుగా ముహూర్తం నిర్ణయించారు. శివసంకల్పం  ఎలాఉందో కానిద్దమన్నాను. ఐతే మనసులో ఈసారిమాత్రం సాగుతుందా అని బెరుకు. ఎందుకైనా మంచిదని నందీశ్వర ప్రతిష్ఠ జరగాలని సంకల్పం చెప్పుకుని శివదీక్ష తీసుకున్నాను .
అడుగు ఎత్తు విగ్రహం కోసం ఎంక్వయిరీ చేసాను. శివదీక్షధారణలో ఉన్న ప్రభాకర్ రెడ్డివాళ్ళు యాత్రకు వెళ్ళీ ఆళ్లగడ్డలో విగ్రహాలు చూశాం బాగున్నాయని చెప్పారు. వాళ్ళు పంపిన ఫోటోలనుచూసి నిర్ణయించుకోలేకపోయాము.
 చివరకు శ్రీనివాసరెడ్డిని తీసుకుని ఆళ్లగడ్డ బయలుదేరాను . ముందుగా అహోబిలం దర్శించుకుని ఆళ్లగడ్డ లో శిల్పశాలలన్నీ చూశాం కానీ మేమడిగిన సైజులో  విగహాలు మాకు సంత్రుప్తి కలిగించలేకపోయాయి. ఈలోగా  ఇక్కడ నాతోపాటు  ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పున్నమాచార్యులు గారు వారిఊరు తెనాలిలో అక్కలమంగయ్య గారి శిల్పశాలలో  ఒక విగ్రహం చూశానని బాగుందని ఫోటొలు వాత్స్ అప్ లో  పంపగా ఆవిగ్రహం బాగుందనిపించి తిరుగు ప్రయాణం లో   సప్తనదీసంగమమయిన సంగమేశ్వర ఆలయం  శ్రీశైలం జలాశయంలో నీరు తగ్గటంవలన  బయటపడిందని తెలసి వెళ్ళి దర్శించుకుని ఇంటి కొచ్చాను .
తెనాలి స్వయంగా వెళ్లటానికి వీలుకాక అక్కడ   తెలిసిన వారిద్వారా డబ్బుపంపి నందివిగ్రహం బస్సులో వినుకొండవరకు తెప్పించాను. విగ్రహం బాగుందనిపించినది . గురువారం సాయంత్రం మాతమ్ముడు నేనుమాట్లాడుకుంటూ పరిశీలించగా విగ్రహం కింద దవడ భాగంలో  పెచ్చు లేచిపోయిఉంది  . బాగా నల్లరంగు దట్టించటం వలన కనపడలేదు.  వరల్డ్ ఫేమస్ శిల్పులు అని మేము నమ్మి పంపితే ఇలా చేశారేమిటని ఫోన్ లో అడుగగా  ముందు  మాకు సంబంధం లేదు అని, మీవాళ్లు చూసే తీసుకెళ్లారని ఇలా మాట్లాడాశిల్పి . మరుసటిరోజు    మాత్రం  మీరు విగ్రహాన్ని పంపండి సరిచెస్తాను అని బాలేకుంటే వేరే విగ్రహం ఇస్తానని నన్ను రమ్మని అన్నాడా శిల్పి.
పూర్తిగా నిరుత్సాహం కమ్ముకుంది . సోమవారం ప్రతిష్ఠ . ఎప్పుడవుతుంది ఇది  . వాయిదా వేసుకుందామని  నిర్ణయించుకుని మాభట్టు గారిని ఫోన్ లో సంప్రదించాలని ప్రయత్నిస్తే   కొచ్చెర్ల గ్రామంలో ప్రతిష్ఠా కలాపంలో నిమగ్నమై ఫోన్ లు  పక్కన పడవేశాడాయన. మాట్లాడటం కూడా కుదరలేదు.
ఒకపక్క మాఊరి కొండగురునాథ స్వామివారి తిరుణాళ్ల మాఘపౌర్ణమికి . ఇక్కడ జనం హడావుడి సెలవలు పెట్టడానికి నేను సింగిల్ టీచర్ను . మామండలంలో టీచర్ల కొరతవలన డిప్యుటేషన్ కుకూడా ఎప్పుడుపడితే అప్పుడు కుదరని స్థితి.
అనుకోకుండా రాజమండ్రి దగ్గర పందలపాకలో ఉన్న వీరభద్రరావుగారికి ఫోన్ చేశాను  రాజమండ్రిలో నంది విగ్రహాలు దొరుకుతాయా రడిమేడ్ గా అని. ఓ ! బోళ్డు దొరుకుతాయి . నేను తిరునాళ్లకు బయలుదేరివచ్చేశాను వినుకొండదాకా . ముందుగా చెప్పుంటే వచ్చేప్పుడు పట్టుకువచ్చేవాడిని కదా! అన్నాడాయన.
 రాజమండ్రిలో ఎవరున్నారబ్బా! అని ఆలోచించి    బెంగళూర్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి  చింతలపాటి శ్రీ క్రిష్ణకు ఫోన్ చేశాను. క్రుష్ణా అక్కడెవరినన్నా కాస్త ఈపనిపై పంపగలవా అని అడిగాను . మాష్టారూ ! నేనిప్పుడు రాజమండ్రిలోనే ఉన్నాను. నాన్నగారికి బాలేకపోతే హాస్పిటల్ లో చూపించటానికి వచ్చాను అని చెప్పి  అంతపని వత్తిడి లోకూడా విగ్రహాలకోసం   తిరిగి కొన్ని చోట్ల చూసి ఫోటోలు పంపాడు .  ఆతరువాత వారి తండ్రిగారికి  మిత్రులైన ప్రతిష్ఠాచార్యులు ఒకాయన వస్తున్నారని వారిచేతకూడా చూపించి విగ్రహం  నిర్ణయిస్తానని చెప్పాడు.
ఇక్కడ భట్టుగారు అందలేదు. కనీసం కావలసిన వస్తు సామాగ్రి లిస్ట్ కూడా రాలేదు. అయితే అంతకుముందునుండే ఆయన యంత్రం తెప్పించి జపాలు చేపిస్తున్నారట ఏపనిలో ఉన్నా కూడా.
మరుసటి రోజు శ్రీక్రిష్ణ    హాస్పటల్ పనులతో బిజీగా వున్నాడు .ఐనా నేననుకున్న విగ్రహం కంటే పెద్ద విగ్రహం మాట్లాడీ అడ్వాన్స్ ఇచ్చేశాడు. నాకూ బాధ వేసింది . అవతల వాళ్ల నాన్నగారి కోసం వచ్చి బిజీగా ఉన్నమనిషిని ఈపనిపై ఇబ్బంది పెడుతున్నానేమో నని.అదీగాక ఆయనిచ్చిన నంబర్ ప్రకారం శిల్పి కి ఫోన్ చేయగా  విగ్రహం స్వయంగా తీసుకు వెళ్ళాలి . అలంకరణ, చెవులు భాగంలో సున్నితంగా ఉంటాయి కనుక ఏ మాత్రం అజాగ్రత్తగావున్నా ట్రాన్స్ పోర్ట్ లో ఇబ్బందే అన్నాడు. అప్పటికప్పుడు ఇక్కడినుండి మనిషిని పంపటం అసాధ్యం నాకు. కార్యక్రమం ఆపటమే మంచిదనిపించింది నాకైతే
హనుమత్ రక్షాయాగం లోనో మరో ముహూర్తమో చూద్దాం  . ఇప్పుడు వాయిదా వేసుకుందాం అని మెసేజ్ పంపాను.
మస్టారూ !  పని వత్తిడిలో ఫోన్ తీయలేకపోయాను.  వాయిదావద్దు.  మీకు విగ్రహం చేర్చే పూచీనాది. మీరన్నట్లు ఇది శివసంకల్పమే . వాస్తవానికి నేను  రెండురోజులు అమెరికాలో ఉంటే రెండురోజులు దుబాయి లో ఉంటాను. అలాంటిది  మీరు ఫోన్ చేసిన సమయానికి  ఇక్కడ ఉండటమేమిటి ? మీరు ఇంతదూరంలో రాజమండ్రిలో విగ్రహాలకోసం ఆలోచించటమేమిటి?   అని చెప్పి   సాయంత్రానికి విగ్రహం పాక్  చేసి  జాగ్రత్తగా శ్రీశైలం వెళ్ళే బస్సులో ఎక్కించాడు.    నేను అప్పటికప్పుడు [శనివారం సాయంత్రం]  మా తమ్ముణ్ణీ  కొచ్చెర్ల లో ఉన్న భట్టుగారి దగ్గరకు పంపి  సామాగ్రి లిస్ట్  తెప్పించి  సిధ్ధపరచాను .    తెల్లవారు ఝామున  నాలుగు గంటలకు  బాగా బరువున్న ఆవిగ్రహాన్నివినుకొండలో ఉండే  ప్రభాకర రెడ్డి మా బామ్మర్ది చంద్రశేఖర్ , అలాగే సుబ్బారావు  వెళ్ళి జాగ్రత్తగా దించి కారులో తీసుకొచ్చారు 

ఆవిగ్రహం పైన స్టీల్ సామానుల లగేజీ కూడా వేసి ఉందండి. ఆ బరువంతా  విగ్రహం చెవుల మీద వాలి ఉంది  .ముందు  విగ్రహానికేమయిందోనని భయపడ్డానన్నాడు ప్రభాకర్ రెడ్డి. శివసంకల్పం వలన ఏమీ కాలేదు.
 ఆదివారం ఉదయాన్నుండి    కలాపం మొదలుపెట్టి   సశాస్త్రీయంగా మాఘపౌర్ణమి సోమవారం ఉదయం ప్రతిష్ఠించారు   నందికేశ్వరుని .కార్యక్రమంలో అనుకోకుండా శివదీక్షాధారులొచ్చి సేవావిధులు అందుకున్నారు. శనివారం సాయంత్రం హోమం జరుగుతుంటే  మా నందు గాడు  తల్లిదగ్గరనుంచి  యాగస్థలి లోకొచ్చి గంతులు వేయటం మొదలు పెట్టాడు నాలుగు కాళ్లపై చెంగుచెంగున.   ఆయన మంత్రం జరుగుతోంది కదండీ ! అందుకే ఆ ఉత్సాహం అన్నారు భట్టుగారుమామూలుగా ప్రతిష్ఠాకలాపంలో జనం వత్తిడి ,వాళ్ల మర్యాదలు, యజమానులుగా ఉన్నవారి సందేహాలు తీర్చటం, వాళ్లకు చెప్పి చేపించటం తో మా మనసును పూర్తిగా మంత్రభాగం మీద కేంద్రీకరించటం కుదరదు. ఇప్పుడు మాత్రం మాకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం, పూర్తిగా మామీదే భారం ఉండటం వలన చాలా చక్కగా స్వామిపై మనసు లయమయ్యింది కార్యక్రమం పూర్తయ్యేవరకు అని భట్టుగారు సంతోషించారు,
అంతకుముందు యంత్రం తెప్పించారు మంత్రజపాలు జరిపించారు.. ఈకలాపంలో వారిశిష్యులతో వచ్చి అంతా తానే అయి చూసుకున్నారు  .అంతాకలిపి  ఏదో కేవలం పదివేలుమాత్రమే సాంప్రదాయాన్ననుసరించి దక్షిణగా ఇచ్చినా  సంత్రుప్తిగా ఇది దైవకార్యం  ,మీకోసం చేయలేదుకదా ఏంపరవాలేదు అని   సంత్రుప్తి చెంది   ధర్మంపట్ల తప్ప ధనం పట్ల ఆసక్తిలేని నిబధ్ధత గల నిజమైనబ్రాహ్మణ్యం మూర్తీభవించిన ఆయన పాదాలకు నమస్కరించాను.
నందీశ్వర ప్రతిష్ఠ తో నిండుగా     ఉన్న స్వామిని చూడటానికి రెండు కళ్ళూ చాలట్లేదు.
ఆపై కుమారీ పూజకూడా  నిర్వహించుకున్నాము.   నమః శివాయ4 వ్యాఖ్యలు:

సురేష్ బాబు February 23, 2016 at 6:43 PM  

ఇది శివ లీల కాక మరోటి కాదండి...ఓం నమశ్శివాయ...

deepika gogisetty February 26, 2016 at 12:00 AM  

ఓమ్ నమః శివాయ

deepika gogisetty February 26, 2016 at 12:01 AM  

ఓమ్ నమః శివాయ
Deepika
http://deepika-neerajanam.blogspot.in/

santosh March 6, 2016 at 3:01 AM  

Antha Bhagavath Krupa...Shivoham !!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP