శివతత్వం
>> Monday, January 25, 2016
వీటిలో మొదటిదానికన్నా రెండోది, రెండోదానికన్నా మూడోది ఫలితాలరీత్యా శ్రేష్ఠమైనవి. దీన్ని ‘ఉత్తరోత్తర ఉత్కర్ష’గా చెబుతారు. జన్మజన్మల పాపాలను రుద్రి పోగొడుతుందంటారు. లఘురుద్రం- యమలోక దర్శనాన్ని నివారిస్తుందంటారు. ఇక మహారుద్రం- సోమయాగంతో సమానమని చెబుతారు. అతిరుద్ర హోమ ఫలం అయితే- అది అపరిమితం అన్నారు. రుద్ర జప హోమం కేవలం రుద్రప్రీతికే కాదు... సమస్త దేవతానుగ్రహ ప్రాప్తికీ అది మార్గం- అని శాస్త్రవచనాలు చెబుతున్నాయి. రుద్రుడు సర్వదేవతా సమష్టి రూపంగా ఆరాధనలు అందుకుంటున్నాడు. చెట్టు మొదట్లో పోసిన నీరు- కొమ్మలకు, ఆకులకు, కాయలకు అందినట్లే శివారాధనతో సకల దేవతానుగ్రహం సాధించగలమని ‘సూత సంహిత’ వివరిస్తోంది.
రెండు శరీరాలున్న శివుడికి అయిదు ముఖాలున్నాయని వేదం చెప్పింది. తూర్పువైపు ముఖం- తత్పురుషం. దక్షిణంవైపుది- అఘోరం. సద్యోజాతం- పశ్చిమ ముఖం. వామదేవం- ఉత్తర ముఖం. ఈశాన్యం- వూర్ధ్వ ముఖం.
పంచ అంటే ‘విస్తరించు’ అనే మరో అర్థం ఉంది. అయిదు రూపాలతో విశ్వమంతటా శివచైతన్యం విస్తరించి ఉందని వైదిక భావన.
నిజానికి యజ్ఞయాగాదులు వైదిక సంస్కృతికి చిహ్నాలు. శివ వైష్ణవ మతాల ఆవిర్భావానికన్నా అవి చాలా ముందువి. యజ్ఞం అందించే దివ్యప్రసాదం- భస్మం! అంటే విబూది. విబూది ధారణం శైవమత ప్రతీక కాదు- అది వైదిక చిహ్నం. శివనామ స్మరణం, రుద్రాక్ష ధారణం, విబూది పూత... మూడూ శివచిహ్నాలు. వాటిని పాటించేవారిని ‘తీర్థ దేహులు’ అంటారు. అంటే- తరించినవారు అని అర్థం. మాలగా ధరించడానికి వీలుగా రుద్రాక్ష రెండు రంధ్రాలతో తయారుగా ఉంటుందనేది శివకారుణ్యానికి గుర్తు.
జన్మకు మూల కారణం కాముడు- అంటే మన్మథుడు. మృత్యువుకు కారణమయ్యేవాడు కాలుడు- అంటే యముడు. కాముణ్ని, కాలుణ్ని శివుడు సంహరించాడని పురాణాలు చెబుతాయి. వారిద్దరినీ తొలగించాడంటే-జీవుడికి జననం, మరణం లేని కైవల్య స్థితిని పరమశివుడు ప్రసాదిస్తాడన్నది పురాణ కథల్లోని అంతరార్థం. అభిషేక ప్రియుడైన శివుణ్ని లోబరచుకోవడం భక్తులకు చాలా సులభం. కనుకనే ఆయనను ‘భక్తసులభుడు’ అంటారు. వరాలిచ్చేయడం శివనైజం. దీన్ని గ్రహిస్తే, శివతత్వం సులువుగా బోధపడుతుంది!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
from eenadu daily
0 వ్యాఖ్యలు:
Post a Comment