అఫ్జల్‌గురుని సమర్థించే నేతలు నాడు అంతమయ్యేవారు
>> Saturday, February 27, 2016
అఫ్జల్‌గురుని సమర్థించే నేతలు నాడు అంతమయ్యేవారు
27-02-2016 00:50:40

- ఉగ్రవాది విజయం కోరుతున్నారు
- అదే జరిగితే వారిలో ఎంతలేదన్నా 50మంది ఎంపీలు హతమయ్యేవారు
- అఫ్జల్‌కు మరణదండన విధించిన రిటైర్డు హైకోర్టు జడ్జి థింగ్రా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: అఫ్జల్‌గురును
సమర్థిస్తున్న రాజకీయ నాయకుల్లో కొందరు, నాడు పార్లమెంటులో దాడి విజయవంతం
అయినట్టయితే.. మరణించి ఉండేవారని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్
ఎస్.ఎన్.థింగ్రా అన్నారు. జస్టిస్ థింగ్రా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు
బెంచ్ అఫ్జల్‌గురుపై విచారణ జరిపి మరణదండన విధించింది. జేఎన్‌యూ వివాదంపై
జస్టిస్ థింగ్రా స్పందిస్తూ.. ‘‘అఫ్జల్‌గురు బృందానికి విజ యం చేకూరితే
బాగుండేదని చాలామంది ఇప్పుడు కోరుకొంటున్నారు. ఒకవేళ అదేజరిగి,
పార్లమెంటుపై దాడి సఫలం అయినట్టయితే.. ఇప్పుడు అఫ్జల్‌ను సమర్థిస్తున్న
వారిలో ఎంతలేదన్నా 40-50 మంది ఎంపీలు హతమయి ఉండేవారు. అప్పుడు భారతదేశ
దృశ్యమే మారిపోయి ఉండేది’’ అని వివరించారు. అఫ్జల్‌గురు, అతని బృందం చేసిన
పనికి 15మంది అమాయక పౌరులు మరణించారని.. ఇంత తక్కువమంది చనిపోయారన్న
కారణంగా మనమంతా అమరుడి దినోత్సవం జరుపుకోవాలా అని ప్రశ్నించారు. అఫ్జల్‌ది
చట్టబద్ధ హత్య అన్న వాదనని జస్టిస్ థింగ్రా తప్పుబట్టారు.
‘‘న్యాయవ్యవస్థకు
మనిషిని చంపే హక్కు ఉంది. సమాజానికి ప్రమాదకరంగా మారినవారిని చంపడం కోసం
న్యాయస్థానానికి ఈ అధికారం కట్టబెట్టారు. ఒకవేళ దీన్ని చట్టబద్ధ హత్య
అన్నటట్టయితే, జైలుశిక్షలను ఏమనాలి? జీవితాన్ని ధ్వంసం చేస్తున్నారని అనలా
లేక చట్టబద్ధ పునరాగమనంగా భావించాలా?’’ అని ప్రశ్నించారు. దేశద్రోహం కేసు
పెట్టేంత తప్పు జేఎన్‌యూ విద్యార్థులు చేయలేదన్న వాదనపై స్పందిస్తూ..
చట్టం(దేశద్రోహం) అలా చెబుతున్నదని, కాకపోతే దానికి కాలం
చెల్లిపోయిందన్నారు. ‘‘నినాదాలు చేయడం కాదు.. కనీసం నోరువిప్పి మాట్లాడినా
దేశద్రోహం కేసు పెట్టవచ్చు. విప్లవాన్ని ఎగదోసే చర్యలకు ఈ మాటలు తోడయితే
చాలు.. అది హార్దిక్ అయినా జయప్రకాశ్ నారాయణ్ అయినా బోను
ఎక్కాల్సిందే.’’ అని వివరించారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment