శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ శృతులలో సాయిబాబాకు కానీ పుట్టపర్తి ఆయనకు కానీ పని ఏమిటని ఒకాయనప్రశ్నయట!

>> Tuesday, January 19, 2016

సాయిబాబా
ఆయనకో విగ్రహం
చాలా బాగుంది
పుట్టపర్తి సాయిబాబా
ఆయనకో ఫ్రేము
ఇంకా బాగుంది

భజనలు, ఆరతులు
మరింత బ్రహ్మాండంగా ఉన్నదట
సరే! ఇక రుద్రము - నమకము, చమకము
శృతి, శివయ్య ఆరాధనకు ఆపాదించిన శృతి
ఇయ్యందులో,  ఈ శృతులలో సాయిబాబాకు కానీ పుట్టపర్తి ఆయనకు కానీ పని ఏమిటని ఒకాయనప్రశ్నయట!
వీరిని నమక చమకాల్లో దూర్చడమేమిటనియట ఆ ప్రశ్నయట!
అంతా మాయలా ఉన్నదట
ఒకానొక ఊళ్ళో వున్న గుళ్ళో గురువారప్పూట జరిగే సమూహికసంఘకోలాహలం చూట్టానికి కళ్ళు చాలవుట
ప్రసాదములు తినుటకు నోళ్ళు చాలవుట
కళ్ళు, నోళ్ళు తప్పితే ఇంకేవియును చాలవుట
సరే, ప్రదోష దినము వచ్చెనట.
అందరిని యానందపరుస్తూ గురువారపు పూట వచ్చెనట.
ఆ రోజు రుద్రాభిషేకము జరుగునని శాస్త్రము
రుద్రాభిషేకము జరిగిన రోజున నమకము చమకము చదువుట జరుగును
సామూహికసంఘ సభ్యులు కూడా వారూ వీరూ అని లేకుండా అందరూ సంతోషముగా రుద్రపఠనపారాయణ చేయుదురు.
చాలా మంచి విషయము. ఆనందకరము అయిన విషయము
ఆడువారు కోకిల స్వరములతో, మగవారు గోరువంక గొంతులతో రుద్రము చదువుదురు
రుద్రపారాయణ మధ్యమధ్యలో శ్రుతిలో లేని ఒకానొక శృతి వాక్యముతో, కాకున్న రెండు వాక్యములతో సాయిబాబాను వీలుంటే పుట్టపర్తిని జొనిపించి పారాయణిస్తురు
అదియొక వింత - ఏమానందము భూమీతలమున అని పెద్ద గురువు గారు తల పట్టుకొనెదరు
తల పట్టుకొనుట లోపల లోపల జరుగును
బయటకు కనపడినచో గురువారపు భక్తులు గుడికి రాక తమ తమ ఇండ్లలో సుఖాసీనులై పఱుండెదరని, గుడికి వచ్చు ఆదాయము అంతమేరకు తరగిపోవునని భయము
అందువలన ఓం తత్ సత్ జరిగెను
ఇది యొక కథ!
నిజమైన కథో కాదోనన్నది ఆ శివయ్యకే తెలవవలె.

vamsi maganti   

2 వ్యాఖ్యలు:

harsha January 19, 2016 at 9:38 PM  

Nenu ade prashna adigi ma atthagari cheta chivatlu thinnanandi. Emito shivaleela

durgeswara January 20, 2016 at 8:17 AM  

పుట్టపత్రిసాయిబాబా వారి భక్తులు మాబంధువులలో ఉన్నారు. వారి ఇతరదేవీ దేవతలకంటే సత్యసాయే సర్వోన్నతుడని వాదిస్తుండేవారు. ఆయనే ఈస్వరుడని బలంగా నమ్మి మిగతావారిని నమ్మించాలనే సిధ్ధాంతంతో ఉండేవారు. ఆయన చివరిదశలో వారి ఆరోగ్యం కోసం రుద్రాభిషేకములు మ్రుత్యుంజయ మంత్రజపములు జరిపిస్తున్నవార్తలు చూసి ఈశ్వరునికే ఈశ్వరార్చన ఎందుకు ? అని ప్రశ్నిస్తే బాధపడ్డారు కానీ సరైన సమాధానం కోసం అన్వేషించలేదు. గురువును గురువుగాను ఈశ్వరాన్వేషణకు మార్గదర్శనం చేసేవారిగా నమ్మే స్థితి ప్రస్తుత గురుభక్తులకు రాకపోవట మేమిటో! అంతా ఈశ్వరలీల.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP