శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మేం హిందువులం

>> Wednesday, September 23, 2015

నీ కడుపు చీల్చి సాగు చేసి మమ్మల్ని పోషిస్తున్నావు.......లోకమంతా నిన్ను మట్టి అంటుంది..
మేము నిన్ను భూమాత అంటాం...మేము హిందువులం..
నీ స్పర్శతో బీడుభూములు బంగరుభూములయ్యాయి...నీ చలువతో దాహార్తుల ఆర్తనాదం చల్లారింది..అన్యులు నిన్ను జలప్రవాహం అన్నారు..
మేము నిన్ను నదీమతల్లి అంటాం. మా ఇంటి ఆడబిడ్డలా లాంచనాలిస్తాం.....హారతులిస్తాం...ఆదరిస్తాం..పుష్కర సంబరాలు చేస్తాం....మేము హిందువులం..

లోకమంతా వెలుగునిచ్చావు..మా బ్రతుకు దీపమై నిలిచావు...ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు..
మేం ప్రత్యక్షదైవం అన్నాం..సూర్యనారాయణుడు అన్నాం..సూర్య భగవానుడు అన్నాం..మేము హిందువులం..
జన్మనిచ్చిన తల్లి,నడవడిక నేర్పిన నాన్న, విద్య నేర్పిన గురువులకి అది వాళ్ళ బాద్యత అనుకున్నారు అంతా..
మేము మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ అన్నాం..మేము హిందువులం..
"హిందుత్వం మతం కాదు జీవన విధానం....  ఉత్తమమైన జీవన విధానం"
ఇతర మ్లేచ్య జాతులు హిందూ జాతిని దోచుకున్నాయి కాని...హిందువులు ఎవ్వరినీ దోచుకోలేదు..ఆ అవసరం కూడా లేదు..
ఇది రత్నగర్బ..వేదభూమి..దన సంపదకి,జ్ఞ్యాన సంపదకి పుట్టినిల్లు...అడిగితే బిక్ష పెట్టేవాళ్ళం....
పంచి ఇచ్చే అవుదార్యం మనది ...దోపిడీ సంస్కృతి వాళ్ళది....
పాశ్చాత్య దేశాలు చీమిడిముక్కుతో, చింపిరి బట్టలతో తిరిగేటప్పుడే పట్టు వస్త్రాలు కట్టిన చరిత మాది ..
నాగరికతలో ప్రపంచం కళ్ళుకూడా తెరవకుండా పసికూనగా ఉన్నప్పుడే అంబరాన్ని అంటిన ఘనత ....మాది
మేము హిందువులం..మహోన్నతమైన సనాతన సంస్కృతికి వారసులం అని తలచునున్నప్పుడల్లా.....
"మా హృదయం ఉప్పొంగుతుంది..మా కళ్ళల్లో వెలుగొస్తుంది....మా నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది....
ప్రపంచమంతా ప్రతిద్వనించేలా గర్వంగా ఘర్జిస్తున్నాం".....
"హిందువులం - ప్రియ బందువులం"......
 తుట్టగుంట నాగ పవన్ శ్రీధర్



1 వ్యాఖ్యలు:

sarath September 26, 2015 at 9:27 AM  

అవును మేము హిందువులం :)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP