శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తన నలుగురి పిల్లల సంతాన విషయం లో ఈ తండ్రి ఏం చేయాలి ? మీ సలహా ఏ మిటి ?

>> Friday, September 25, 2015


[మిత్రులు జాజి శర్మ గారి ప్రశ్న ఫేస్ బుక్ ప్రశ్న ]
ఓ తండ్రి కధ.
అనగనగా ఓ తండ్రి. ఆతండ్రి కి నలుగురు కొడుకులు.
నలుగురు కొడుకులు తండ్రికి ఆసరాగా ఉంటారని తలో పనికి పురమాయించాడు.
తను పెద్దలు ఇచ్చిన వేదాన్ని చదువుతూ ఉండమని పెద్దవానికి ఇచ్చాడు.
తన చుట్టూ ఉన్న పరివారాన్ని పంటలను, కౄరమృగాలనుండి కాపాడమనే బాధ్యత రెండోవానికి ఇచ్చాడు.
తనకి ఇంటి ఆదాయము, ఖర్చు వ్రాయటానికి మూడో కుమారునికి బాధ్యత అప్పగించాడు.
తన వ్యవయసాయ పనిముట్లు, వ్యవసాయములో సహయపడమనే బాధ్యతను నాలుగో కుమారునికి అప్పగించాడు.
కుమారులు అందరూ తల్లిదండ్రులకు నమస్కారము చేసి తమతమ బాధ్యతలకు వెళ్ళేవారు.
ఉదయమే అందరు కలిసే ఫలహారము చేశేవారు. అలాగే మద్యాహ్న భోజనము, రాత్రి భోజనము
చేశేవారు.
ఇలా సాగుతున్న సంసారము పెద్దది అవుతూ వచ్చింది. ప్రతివారు తమతమ భాద్యతలను చక్కగా నిర్వహిస్తూ వస్తూండగా, అందరికి పెళ్ళీళ్ళు జరిగి వారివారి సంసారాలు పెద్దవి అవుతూ వచ్చాయి. వేదం చదివే వాడి పని సులువని
రక్షణ భాద్యతలు తీసుకున్న వాడు భావించటము, లెక్కలు వ్రాశేవాని సులువని పొలం పనులు చేశేవాడు భావించటము జరుగుతూవచ్చింది. తండ్రి ఇవి గమనించి ప్రతి రెండు మాసములకొకసారి వారి వారి బాధ్యత లు మార్చుతూ వచ్చాడు. అప్పుడు సోదరులకు ఇతరుల చేశే పని లోని కష్టము అర్ధమయ్యి, అందరూ ఒకరునొకరు అర్ధము చేసుకుని తల్లిదండ్రులకు ఆనందము చేకూర్చారు.
ప్రియ భగవాత్ బంధువుల్లారా!

ఈ సంసారములో పెద్ద కుమారుడు చేశేపనిని బ్రాహ్మణత్వము అని, రెండో కుమారుడు చేశేపనిని క్షాత్రమని, మూడోకుమారుడు చేశేపనిని
వైశ్యత్వమని, నాలుగో కుమారుడు చేశేపనిని శూద్రము అని అంటూ వచ్చారు. కాని, అందరి పనులు సంసారాని ముక్యమైనవే కదా!
అయితే ఇక్కడో పెనుమార్పు సంభవించింది.
సంసారాలు పెద్దవి కావడంతో నాలుగోవాడి మీద అధికమైన పని వత్తిడి పడటం మొదలయ్యింది. ప్రతి వాడు వచ్చి తనకు కావలసిన వస్తుసామగ్రి అవసరాలన్నీ నాలుగోవాడే సమకుర్చాలి అని తండ్రి కట్టుబాటు చేశాడు, కాబట్టి వాడేనే అడుగుతూ ఉండేవారు. నాలుగోవాడు కూడా ఎవరినీ ఏమీ అనకుండా, తన స్వార్ధం చూచుకోకుండా అన్నీ ఇతరులకు సమకూరుస్తూండేవాడు. ఓక్కోసారి భోజనానికి కూడా సమయము దొరకక, అవస్థలు పడుతూండేవాడు. భోజనానికి సమయానికి రాలేకపోతూండేవాడు. అలా సోదరులతో కలిసి భోజనము చేయటానికి తన శుభ్రతనుకూడా లెక్కచేయక వాళ్ళతో పక్కన కూర్చునేవాడు. పరిశుభ్రంగా లేని తమ్ముని వారు దూరం చేసుకున్నారు.
తన స్వార్ధం కూడా చూచుకోకుండా వాళ్ళకి అన్నీ అమర్చిపెడితే, తననే దూరం చేసినవారి పట్ల నాలుగోవాడు కూడా తన భావజాలాన్ని మార్చుకుని ద్వేషించసాగాడు. ఇలాగే ఒకరికొకరు దూరం కాసాగారు. ఎవరి సంసారాలు వారు చూసుకుంటూ ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఒకరికొకరు దూరమైపోసాగారు.
ఈ పరిస్థితి తండ్రికి నచ్చలేదు. ఇప్పుడు చెప్పండి ఆ తండ్రి ఏమి చెయ్యాలి? ఈ సంసారం బాగు చెయ్యటము ఎలా?

4 వ్యాఖ్యలు:

Anonymous September 25, 2015 at 11:59 PM  

రోజులో కొంత కొంత భాగం, నలుగురూ నాలుగు పనులూ చెయ్యాలి.
చెయ్యలేనివాళ్ళు పరస్పర అంగీకారంతో పనిమార్పిడి చేసుకోవాలి.

P S Ravi Kiran September 26, 2015 at 2:19 AM  

గురువుగారూ సమాధానం మధ్యలో మీరే చెప్పారు. "తండ్రి ఇవి గమనించి ప్రతి రెండు మాసములకొకసారి వారి వారి బాధ్యత లు మార్చుతూ వచ్చాడు." కానీ అది నిజంగా చేస్తే, ఈ ఇబ్బందే ఉండేది కాదు.
సంసారం పెరిగినప్పుడు 4వ పని మాత్రమే ఎక్కువైనప్పుడు మిగిలిన 3రు కూడా 4వ పని చెయ్యాలి. వాడికి సహాయపడాలి అని తండ్రి తీర్మానించాలి. మిగిలిన పనులు ఎక్కువైనప్పుడు కూడా అంతే.

astrojoyd September 26, 2015 at 9:18 PM  

tHE DISTANCE AND HATREDNESS OF AGRA VARNAS AND NIMNA VARNAS EXPLAINED IN A NICE WAY..

durgeswara September 26, 2015 at 11:16 PM  
This comment has been removed by the author.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP