శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం

>> Wednesday, August 19, 2015





 పరమాత్మ ప్రక్రుతి  అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు.  భావన బలంగా ఉండాలి.

అందుకే పెద్దలు   శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా  మారాలి అంటారు. అదే మహన్యాసం  గా సాగుతుంది శివాభిషేకం లో
ఇక్కడ శివతత్వాన్ని తన అన్ని అంగములలో భావన చేస్తాడు సాధకుడు.
ఇక్కడ పీఠం లో జరుగుతున్న హనుమంతుని ఉపాసనా ,వచ్చేసాధకుల స్థితి ననుసరించి ఆయన అనుగ్రహప్రసారం ఎలాఉంటున్నదో  అనేక ఉదాహరణలద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాము. స్వామి ఉపాసనను చూసి పులకించి తామూ స్వామి భావాన్ని ధ్యానిస్తున్నాయేమో ఇక్కడ  చెట్లు. తీయని ఫలములనిస్తున్న నేరేడు చెట్లు కూడా అలానే ధ్యానించి స్వామి  పట్ల అపార ప్రేమతో ఉన్నాయో గాని  ఓఫలం లో స్వామి రూపాన్ని ఆవిష్కరించాయి .
ఈరోజు  పూజసమయంలో నివేదన చేయటానికి మాతమ్ముడు పీఠం లో గల నేరేడు పండ్లు కోసితెచ్చాడు. అనుకోకుండా చేతిలో పండ్ల లో ఓ పండు హనుమ ముఖ రూపంతో  కనపడింది. వేంటనే  నాదగ్గరకొచ్చి చూపాడు. నల్లని నేరేడు ఫలానికి ఓవైపు ఎర్రని పెదవులుగా దానిపైన రెండు కన్నులుగా ప్రకృతిమాత చెక్కి ఇచ్చిన ఆరూపం . ఆనందాన్ని కలుగ జేసింది.
ఆ ఫలాన్ని ఇచ్చిన చెట్టు స్వామిని ఎంతగా ధ్యానిస్తున్నదో కదా !  ఎంతటి అదృష్టమో కదా  ఆవృక్షానిది 


నాగపంచమి సందర్భంగా పూజలందుకున్న  నాగదేవతలు  

3 వ్యాఖ్యలు:

Zilebi August 19, 2015 at 6:59 PM  



చూడ గలిగిన మానవుడు 'నేరేడు' లోను చూడ గలడు
చూడ కూడ దనుకున్న వాడు 'నేరెదురు' గ వచ్చిన చూడ లేడు

బాగుందండీ మీ వ్యాసం + ఫొటోస్

జిలేబి

astrojoyd August 19, 2015 at 9:02 PM  

నేన్తమాత్రమున నెవ్వరు దలచిన నంత మాత్రమె నీవూ ..పిండల్ తేనేపటి అనినట్ట్లూ....

hari.S.babu August 22, 2015 at 2:42 AM  

హరి సర్వాంతర్యామి!
ఇందు గలడందు లేడను సందేహము వలదు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP