శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎందుకీ పరుగు ? ఏమిటీ దారుణం ? ఇదేనా తీర్థయాత్రలు చేసే పద్దతి?

>> Wednesday, July 15, 2015

నిన్న గోదావరమ్మ సన్నిధిలో జరిగిన ప్రమాదం,మరణించిన వారి బంధువుల వేదనాభరిత రోదనలు చూస్తుంటే మనసు కల్లోలమైపోతున్నది.  ఎందుకు జరిగినది  అంటే ఎవరో ఒకరిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకోవటం మనకలవాటై పోయింది. ఇక శవాలపై కూడా రాజకీయాలుచేసే మన నాయకులతీరు పరమ అసహ్యం కలిగిస్తున్నది. వాల్లుమాత్రం ఏంచేస్తారు ? వాల్ల నైజమే అది.

జనం భారీగా వచ్చేక్షేత్రాలలోనూ ,యాత్రాస్థలాలలోనూ విఐపీ ల కోసం జనాన్ని ఆపే దౌర్భాగ్య సంస్కృతి బాగా వేళ్ళునుకుని ఉంది. అందుకోసం  నెలజీతాలతోబతికే ఉద్యోగులు కరవమంటే కప్పకుకోపం,వదలమంటే పాముకు కోపం లాంటి పరిస్థితులమధ్య వత్తిడితో విధులు నిర్వహిస్తుంటారు..  ఇలా కూడా మనం ఆలోచించవచ్చు

కానీ .............. నిజాయితీగా ఆలోచించి చూస్తే  నేడు పుణ్యక్షేత్రాలలో కొందరుభక్తుల ప్రవర్తన  ఉన్మాదులను తలపిస్తున్నది . తిరుమల లాంటి క్షేత్రాలలో సేవాకార్యక్రమాలలో దగ్గర ఉండి చూస్తే ఎంతబాధవేస్తుందో. అప్పటిదాకా కూర్చున్నవారు దర్శనానికి క్యూలు వదలగనే  దెయ్యాలమాదిరిగా అరుచుకుంటూ పరుగులు తీస్తారు. పిల్లలు,వృధ్ధులు, అని చూడరు. ఇందులో మగవాళ్ళెకాదు ఆడవాళ్ళు కూడా పరిగెడుతుంటారు, క్యూలైన్లలోకి దూకటానికి సిధ్ధపడతారు. అవతలవాల్లకు ఇబ్బంది కలుగుతుంది,వాళ్ళు మనలా దైవదర్శనానికొచ్చారు అనే ఇంగితమ్ ఉండదు. పొలో.... మని పరిగెత్తేపనే!   వికలాంగుల లైన్ వదలి అదేసమయంలో మిగతాభక్తులను కూడా దర్శనానికి వదిలినప్పుడు క్యూలైన్లలో  వారుపడే బాధవర్ణనాతీతం. సహాయంచేద్దామని ప్రయత్నిస్తున్న మమ్మల్నికూడా తొక్కుకుంటూ వెళ్లడమే. గోవిందా అని మనసారా స్మరించుకోవలసిన సమయంలో కూడా వివాదాలు ,తోపులాటలతో  వీళ్ళు చేసుకునే దైవదర్శనం వలన ఏ ఫలితం వస్తుంది? పుష్కరాలైనా కుంభమేళాలైనా ఇదేపద్దతి మనది. నేను కేదారనాథ్,బదరీనాథ్ లకు వెళ్లినప్పుడు కూడా చూశాను ,అక్కడ మనవాళ్ళు ఏరాష్ట్ర మైనా పద్దలు మాత్రం తేడా లేదు. ఒకరినొకరు వెనుకకు నెట్టి ముందుగా వెళ్ళాలనే మూర్ఖత్వం లో మార్పులేదు.
   తీర్ధయాత్రలు,క్షేత్రదర్శనాలు మనస్సును శుధ్ధిపరచి మనలో పాపాలు పోగొడతాయి, నిజమే ! కానీ  అక్కడకు వెళ్ళినా   అందరినీ తోసుకుని,తొక్కుకుని అడ్దదారులలో ప్రయత్నించి చేసే దైవదర్శనాలు, పుణ్యస్నానాలు   పాపం మూటగట్టుకునేలా చేస్తాయన్నది సత్యం. ఇది మనసుకు పట్టినదాకా ఈ యాత్రలు నిష్పలం

[ అమావాస్యముందు  మంగళవారం  ప్రారంభమవుతున్నాయి పుష్కరాలు. ఏదో కీడు శంకించినది మనస్సు. అందువలనే ప్రతి ఆథ్యాత్మిక కార్యక్రమాలగూర్చి  పోస్ట్ వ్రాసేనేను ఎందుకో   పోస్ట్ వ్రాయబుధ్ధి కాక వ్రాయలేదు ఇప్పటివరకూ]

ఈ దుర్ఘటనలో ప్రానాలు కోల్పోయినవారందరికీ పుణ్యలోకాలు ప్రాప్తించాలని ప్రార్ధిద్దాము. అంతకంటే మనం చేయగలిగినదేమీ లేదు

జైశ్రీరాం

     


3 వ్యాఖ్యలు:

Marripoodi Mahojas July 15, 2015 at 2:50 AM  

మన హిందువులు పుణ్యమంటే ఆత్మపరిశుద్ధి అని మర్చిపోయి తీర్థక్షేత్రాల్లో ఇలాంటి ప్రవర్తనతో ఇతరుల్ని బాధపెడుతూ పుణ్యానికి బదులు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. నిన్న రాజమండ్రిలో పడిపోయిన మనుషుల మీద తొక్కుకుంటూ నడిచి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారకులైన "భక్తులు" హంతకులు కారా? హంతకులకి వేసే శిక్ష వాళ్ళకి పరలోకంలో దేవుడు రిజర్వు చేసిపెట్టడా? మతం రెండో విషయం. మానవత్వమే మొదటి విషయం. మంచి హిందువులం అవ్వడానికి ముందు మంచి మనుషులం అవ్వాలి. పుణ్యం కోసం పడే ఈ పాకులాట కూడా ధనవాంఛలాగానే ఒక అపవిత్ర స్వార్థం.

శ్యామలీయం July 15, 2015 at 10:33 PM  

సరిగా చెప్పారు.

కమనీయం July 16, 2015 at 7:50 AM  
ఈ దుర్ఘటనకు ప్రభుత్వం,అధికారయంత్రాంగం బాధ్యత చాలా ఉంది.అంతేకాక మనప్రజల్లో క్రమశిక్షణపూర్తిగా లోపించింది.ఇటువంటి సమయాల్లో ఒకరినొకరు తోసుకొంటూ ,తొక్కుకొంటూ పరుగుపెట్తారు.మనం జపాన్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవలసి ఉంది.సునామీలో నష్టపోయినవారికి సహాయం అందించినప్పుడు,వాళ్ళు క్యూ సిస్టం పాటించి చాలా క్రమశిక్షణ పాటించారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP