శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈదేశంలో హిందుత్వం ఉడకూడదట.. వేదాలను లేకుండా చేయాలట.. పుష్కరాలకు వెళ్లనీయకూడదట... ఏంచేయాలీ నికృష్టులను

>> Thursday, July 16, 2015

ఈ దేశంలో హిందుమతం లేకుండా చేయాలని... వేదాల కు వ్యతిరేకంగా రచనలు చేయాలని ఈ తెలివి బలహీనవర్గాలకు లేదుకనుక  క్రిష్టియనులు,దళితులు చేయాలి.. పుష్కరాలకు వీరు వెళ్లకుండా చూడాలని ... స్వయంప్రకటిత మేధావులలో ఒకరైన కుంచితపు బుద్దుల ఐలయ్యగారు నిన్న హైదరాబాద్ లో పిలుపునిచ్చారు.
ఇలాంటి నికృష్టులవలన సమాజంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి?

ఇదే ఏ ముస్లింలపట్లో వాగిఉంటే  ఇతని తలకు వెలకట్ట బడేది.
కిరస్తానీలైతే రోడ్లెక్కి గోలగోల చేశేవారీ సరికే

విదేశీలు విదిలిమ్చే కుక్కబిస్కెట్లుకు ఆశపడి  స్వంతధేశానికి,సంస్కృతినీ ,ధర్మాన్ని ధ్వంసం చేయటానికి సిధ్ధమై బహిరంగంగనే తెగబడి మాట్లాడుతున్న ఇలాంటి విదేశీ ఏజంట్ల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి.

ఎన్ని అవమానాలు  ..దాడులు జరుగుతున్నా శాంతిసహనాలతో ఉన్న హిందువులు ఎప్పుడన్నా ఎదురు తిరిగితే  ఇదిగో మతోన్మాదం  అంటూ   గోలగోల  చేసే    మేధావులారా ! ఎక్కడున్నారు మీరు? చెవులు పూడుకుపోయాయా? మాట్లాడరేం ?

http://www.andhrajyothy.com/ImageRetrive.aspx?FileName=C://Inetpub//vhosts//andhrajyothy.com//ajnews.andhrajyothy.com//AJNewsImages//2015//Jul//20150716//Hyderabad//635726099554651453.jpg

 హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వేదాలు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు చేయాలని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య పిలుపునిచ్చారు. ఐఆర్‌టీఎస్‌ రిటైర్డ్‌ అధికారి అప్పికట్ల భరత్‌ భూషణ్‌ రచించిన ‘మెమొరీస్‌ ఆఫ్‌ దళిత్‌ సివిల్‌ సర్వెంట్‌’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి. ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ప్రసంగిస్తూ... ‘‘ఈ దేశంలో బ్రాహ్మణ, అగ్రకుల ఆధిపత్యం నశించి... అంబేద్కర్‌, జ్యోతిబా పూలే కలలు నెరవేరాలంటే వేదాలకు వ్యతిరేకంగా రచనలు చేయాలి. బ్రాహ్మణులపై పోరాడే తెలివి వెనుకబడిన వర్గాలకు లేదు. క్రైస్తవులు, దళిత మేధావులే ఆ పని చేయాలి’’ అని సూచించారు. ఈ దేశంలో హిందుత్వం ఉండరాదని కూడా అన్నారు. గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా వెళ్లకుండా క్రైస్తవులు, దళితులు చూడాలన్నారు. భరత్‌ భూషణ్‌లో మంచి సేవాగుణం ఉందని ప్రసాదరావు ప్రశంసించారు. స్వీయ అనుభవాలతో భరత్‌ భూషణ్‌ రచించిన పుస్తకం అందరూ చదవతగ్గదన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ స్కూళ్ల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ... భరత్‌ భూషణ్‌ రాసిన పుస్తకంలో ఎన్నో మంచి విషయాలున్నాయన్నారు. కడుపు నింపుకోలేని, కాలికి చెప్పుల్లేని వారి గురించి ఆలోచించే మంచి మనసు ఆయనకుందని పుస్తకం చదివాక తెలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులతో విజ్ఞానాన్ని పెంపొందించే జైభీమ్‌ దీక్ష చేయిస్తున్నామని తెలిపారు. దళితులు రచనల్లో మరింత శ్రద్ధ చూపాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు సూచించారు. ఈ పుస్తకాన్ని తన తల్లికి అంకితమిస్తున్నట్లు రచయిత భరత్‌ భూషణ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు దళిత, క్రైస్తవ అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

2 వ్యాఖ్యలు:

Marripoodi Mahojas July 16, 2015 at 11:44 PM  

ఇలాంటివాళ్ళు ఒక కోటిమంది కలిసినా హిందూమతాన్నీ, వేదాల్నీ, బేపనోళ్ళనీ ఏమీ చేయలేరు. గతంలో వీడికంటే ఫైర్ బ్రాండువాళ్ళే పుట్టారు. వాళ్ళంతా ఏమయ్యారు? వీడూ అంతే. ఈ మధ్య అందరూ చదువుకుని బ్రేహ్మలైపోయారు. ఇప్పుడు అన్ని కులాలవాల్లకీ సంస్కృతం, స్నానాలూ, మడీ, మంత్రాలూ, పూజలూ, నామాలూ, ఆచారాలూ, యోగా-జ్యోతిష్యం-వాస్తు చాదస్తాలూ, వేదాంతం ఎక్కువైపోయాయి. ఇంక ప్రచ్చేకంగా వీటి కోసం బ్రామ్మణ కులమంటూ ఎక్కడ మిగిలింది గుళ్ళల్లో తప్ప? ఎవణ్ణి పొడవగలడు వీడు?

వీడసలు దళితుడే కాదు. మతం మార్చుకున్న బీసీ. అయినా దేశ జనాభాలో సగం మంది ఉన్న బీసీలు బుర్రలేనివాళ్ళంటాడు. క్రైస్తవులకీ, దళితులకే బుర్రుందంటాడు. ఈ మాటన్నందుకు వీణ్ణి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా? "ఒక్క పావుగంట పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఊరికే ఉండమనండి. హిందువులో, మేమో తేల్చేసుకుంటాం" అన్న అక్బరుద్దీన్ గాడికీ వీడికీ తేడా ఏంటి?

పాపం, ఇంకా సోనియా జమానాయే నడుస్తోందన్న భ్రాంతిలో ఉన్నట్టున్నాడు. "అంతా మారిపోయిందిరా నాయనా! ఇకనైనా కాస్త నోరు మూసుకుంటేనే నీ బతుకు భద్రం" అని వీడికి అర్థమయ్యేలా తెలియజెప్పాలంటే వారంట్ ఇష్యూ చేయడమే మార్గం. ఇహనిప్పుడు వీడి పిచ్చికూతల సంగతి మోదీగారి/ రాజనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చేసిందనుకుంటా. ముందా సంగతేదో అర్జెంటుగా ఆలోచించండి దుర్గేశ్వరగారూ!

sarma July 17, 2015 at 3:12 AM  

చూస్తూ ఊరుకుంటే మేస్తూపోయిందని సామెత. ప్రభుత్వాలు గుడ్డివి చెవిటివి,వారికి ఇటువంటివి వినపడవ్,కనపడవు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP