శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున రామదండు కార్యకర్తలు నిన్న రాత్రి గ్రామాలలో పర్యటించి స్వైన్ఫ్లూ నివారణ కు హోమియోఔషధాలను పంపిణీ చేశారు. రవ్వవరం. పల్లె,శాతవాహన నగర్, రెడ్దిపాలెం, గాంధీనగర్ ,లక్ష్మీపురం, తిమ్మాపురం ,సాయినగర్ లలో ఈ ఔషధాలు అందజేశారు. ప్రతిఇంటిలో ఒక తులసి మొక్క నాటు కోవాలని ,తులసిని పూజించటం ,ఔషధంగా స్వీకరించటం ద్వారా క్రిమిరోగాలను అరికట్టవచ్చని వివరించారు. పదివేలమందికి సరిపోయేలా ఆర్సెనికం ఆల్బం అనే ఔషధం ను మితృలు సుభాష్ గారు హైదరాబాద్ నుంచి పంపించారు . ఈకార్యక్రమంలో రామదండు కార్యకర్తలు, అంజిరెడ్డి, రామాంజిరెడ్డి,హనుమంతరావు,నరేంద్ర,ఎల్లారెడ్డి,అశోక్, ప్రభాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, నాగిరెడ్డి తమసేవలను అందిస్తున్నారు . ఈరోజు రేపు కూడామరికొన్ని గ్రామాలలో తిరిగి అందరికీ అందజేయనున్నారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment