శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇండియాని మూడు దేశాలుగా విడగొట్టిన చేపల వ్యాపారం!

>> Tuesday, February 10, 2015

ఇండియాని మూడు దేశాలుగా విడగొట్టిన చేపల వ్యాపారం!

 http://www.korada.com/wp-content/themes/korada/images/logo.png

India-Map-noheading

ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోవడం, ఆ తర్వాత పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడంతో ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్న అఖండ భారతం మూడు ముక్కలు అయిందన్నది చరిత్ర. భారతావని ఇండియా, పాకిస్తాన్‌లుగా విడిపోవడానికి మూలాలు ఓ వ్యక్తి చేసిన చేపల వ్యాపారంలో ఉన్నాయంటే నమ్ముతారా? నమ్మినా, నమ్మకపోయినా ఇది చరిత్ర.. కులకట్టుబాట్లు ఇండియాని ఎంత దారుణంగా దెబ్బతీశాయో తెలిపే మరో ఉదాహరణ ఇది.

గుజరాత్ లోని వేరవాల్ పట్టణంలో ప్రేమ్ జి భాయి థక్కర్ అనే ఓ వ్యక్తి ఉండేవారు. ఆయన కుటుంబం బాగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండేది. ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే, అవేమి ఆయనకు కలిసిరాలేదు. చివరి ప్రయత్నంగా చేపల వ్యాపారం చేద్దామని మొదలు పెట్టారు. ప్రేమ్ జి భాయ్, లొహాన అనే కులానికి చెందిన వ్యక్తి. ఆ కులం వాళ్ళు పూర్తిగా  శాఖాహారులు. ‘‘ శాఖాహారులమైన మనం చేపల వ్యాపారం చెయ్యడం ఏమిటి” అని తోటి కులస్తులు ప్రేమ్ జి భాయ్‌ని నిలదీశారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా మరో మార్గం దొరకలేదని ఆయన వాళ్లకి సమాధానం ఇచ్చారు. కులకట్టుబాట్ల పేరుతో ఆయనని వాళ్ళు బెదిరించారు. గతిలేని పరిస్థితుల్లో ఆయన కులకట్టుబాట్లని ధిక్కరించి తన చేపల వ్యాపారం కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన లొహానా కులస్తులు ప్రేమ్ జి ని కులం నుండి బహిష్కరించారు.

ప్రేమ్ జి ఏ మాత్రం దీన్ని లెక్కచేయకుండా తన చేపల వ్యాపారం కొనసాగించారు. బాగా డబ్బు సంపాదించారు. కొన్నేళ్ళకి ఆయన ముసలి వాడయ్యాక, కులపెద్దలని కలిసి తాను చేసింది తప్పేనని , దానికి ఎంత పరిహారం చెల్లించడానికయినా  సిద్దంగా ఉన్నానని.. తనని మళ్ళీ కులంలో చేర్చుకొమ్మని వేడుకున్నాడు. మూర్ఖశిఖామణులయిన ఆ కులపెద్దలు ప్రేంజీ కోరికను తిరస్కరించడమే కాకుండా ఆయనను తీవ్రంగా  అవమానించి పంపారు. ప్రేంజీ కులపెద్దలను కలిసినప్పుడు ఆయన కుమారుడు పున్జాలాల్ థక్కర్ కూడా పక్కనే ఉన్నారు. తన తండ్రికి జరిగిన అవమానానికి ఆయనకి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. కుల వ్యవస్థకి కారణమైన హిందూ మతంపై ఆయనకి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ కారణంతో ఆయన తన కుటుంబంతో సహా ఇస్లాం మతం లోకి మారిపోయారు. తన నలుగురు కొడుకులకి పేర్లు ముస్లిం పేర్లు పెట్టారు. అయితే తన ముద్దు పేరు “జినో” (గుజరాతి పదం ) అనేది మాత్రం నలుగురి పేర్లలోనూ ఉండేలా పేర్లు పెట్టారు.

పున్జాలాల్  నలుగురు కొడుకుల్లో ఒకరి పేరు మహ్మద్ అలీ. ఆ మహ్మద్  అలీ, జినో అనే తన తండ్రి ముద్దుపేరును జినో నుండి జిన్నాగా మార్చుకున్నారు. దీనితో ఆయన పేరు మహ్మద్ అలీ జిన్నా అయింది. ఆ మహ్మద్ అలీ జిన్నానే తర్వాతి కాలంలో భారతదేశం విడిపోవడానికి, పాకిస్తాన్ ఆవిర్భావానికి కారకులయ్యారు. ఆ దేశానికి జాతిపిత అయ్యారు. ఆ తర్వాత కాలక్రమంలో, పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయి వేరే దేశం అయింది. ఇలా ఓ వ్యక్తికి జరిగిన అవమానం, కొందరి కులదురహంకారం, కుల కట్టుబాట్లు కలిసి ఇండియా మూడు ముక్కలు కావడానికి దారితీశాయి. ప్రేంజీ కనుక చేపల వ్యాపారం చేయకుండా ఉండి ఉంటే.. కులపెద్దలు అలా వ్యవహరించకుండా ఉండి ఉంటే.. చరిత్ర మరోలా ఉండేది.  కానీ మనం చరిత్రను వెనక్కి తిప్పలేం.

మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య  వైరుధ్యాలు, అవిశ్వాసాలు, అపోహలు ఉండటం సహజం, సర్వసాధారణం. వీటిని సరిదిద్దే నాయకత్వం ఉంటే, అందరూ ఐకమత్యంతో ఉంటారు. అలా కాకుండా,ఈ వైరుధ్యాలను పెంచి, వాటి నుండి లబ్ది పొందాలన్న ఆలోచనతో  నాయకత్వం వ్యవహరిస్తే ప్రాంతాలు, దేశాలు, ప్రజలు విడిపోవడం ఖాయం. దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో ముస్లింలకు జిన్నాలాంటి ఓ విభజనవాది నాయకత్వం వహించడంతో అఖండ భారతం ముక్కలయిపోయింది. మనం చరిత్ర పాఠాలు చదవడమే కాదు,  చరిత్ర చెప్పే గుణపాఠాలు నుండి ఎంతో నేర్చుకోవాలి. ఇండియా ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి మూలం కులంలోనే ఉంది. అవకాశవాద రాజకీయాలు ఈ కులవ్యవస్థని ఇంకా పెంచి పోషిస్తున్నాయి. ఈ కుల రాజకీయాలని అంతం చెయ్యకపోతే ఇండియా ఇంకెన్ని ముక్కలు అవుతుందో.. సో, బి అలెర్ట్.

2 వ్యాఖ్యలు:

శశి కుమార్ February 10, 2015 at 9:04 PM  

సార్ !! చాలా ఆసక్తికరంగా ఉంది. చదివి ఆశ్చర్యపోయాను. ఈ టపాకి మూలం (సేకరణ) ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం , అన్యధా భావించకండి.

నా పేరు సూర్య ప్రకాష్ జోస్యుల. చాలాకాలం నుంచి రివ్యూలు రాస్తున్నా. అప్పుడప్పుడు సినిమా స్క్రిప్టు వర్క్ లు చేస్తూంటాను. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నాలుగున్నర సంవత్సరాలు పనిచేసా. వేరే దర్శకుడు దగ్గర January 3, 2016 at 5:53 AM  

వెరీ వెరీ ఇంట్రస్టింగ్ పోస్ట్...చాలా ఆశ్చర్యంగా అనిపించింది.. శశికుమార్ గారు అన్నట్లు...మూలం ఇస్తే ఇంకా బాగుండేది... ఎందుకంటే ఇది ఆశ్చర్యకరమైన చరిత్రకు సంభందించింది... ఎనీహౌ ధాంక్యూ...కొత్త విషయం తెలిపినందుకు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP