శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మతమార్పిడి నిరోధక బిల్లా ? తేవడానికి వీల్లేదంతే !!! కానీ హిందువులు మాత్రం ఘర్ వాపస్ లంటూ మతం మార్చటం నీచం..ఘోరం...దుర్మార్గం...

>> Sunday, December 21, 2014

ఈదేశంలో ఎన్నినికృష్ట వ్యూహాలతోనో మతమార్పిడులుచెస్తూ పొట్ట పోసుకుంటూ ,విదేశీ శక్తులకు ఏజంట్లుగా సాగిస్తున్న మతమార్పిడులగూర్చి ,రాజకీయనాయకులకు, మేతావులకు ఒక్కరోజన్నా బాధకలగలేదు. మొన్న ఘర్వాపస్ అంటూ  కొంతమందిని తిరిగి హిందుమతంలోకి ఆహ్వానించగానే   కుహనసెక్యులర్ నాయకులు ,రాచకీయపార్టిలు ,గగ్గోలెత్తిపోయారు. ఇక మీడియాలోనూ ,అంతర్జాలం లోనూ ఈవర్గాలు హిందువులే మతమార్పిడులు చేస్తే   ..హమ్మో..హమ్మో.... ఈదేశం ఏమైపోతుందని పొర్లిపొర్లి ఏడ్చారు.

సరేనయ్యా ! మతమార్పిడులు నీచం అని మీరంటున్నారు కనుక మతమార్పిడి నిరోధక చట్టం పెడదాం మద్దతిస్తూ ముందుకు రావాలని పిలిస్తే మాత్రం   ఒక్కరు ముఖం చూపిస్తే ఒట్టు.
ఇక మనరాష్ట్రం లో  ఓరకం ఉద్యమాలకు నాయకత్వంవహిస్తూ ,మార్గదర్శనం చేస్తున్న ఓమేధావి   మతనిరోధక బిల్లు తేవడమంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చను హరించడమే నని వాపోయాడు.

ఉత్తరప్రదేశ్ నుండి  పెళ్లికోసం మతమార్పిడిచేసుకోవటానికి అనుమతివ్వాలని కోరుతూ వచ్చిన కేసులన్నీ హిందువులైన ఆడపిల్లలవేనని  ఇవి చెల్లవని కోర్టు వ్యాఖ్యానించిన వార్తలు ఈరోజు పేపర్లో వచ్చాయి చూడండి.ఇవేవీ మతమార్పిళ్ళుగా కనిపించటం లేదు. లవ్ జీహాద్ లనేవి ఎక్కడా లేవని బుకాయించే బధిరులకు నిజం గొంతెత్తిచెప్పినా వినపడదు.

ఈరోజు  గ్రామాల్లో  భుజానికొక సంచి తగిలించుకుని మాయవ్యూహాలతో మతమార్పిళ్లు చేస్తూ  కేవలం ఈవృత్తిమీదే బతుకుతూ  ఈ బృందాలుచేసే కార్యక్రమాలు వీల్లెవరికీ నీచంగా  కనపడవు.

ఇంతకీ మతమార్పిడులు నీచమైనవా? కాదా?
మతమార్పిడి నిరోధక బిల్లు తేవాలా ? వద్దా?

ఈచర్చ మొదలయ్యేసరికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్దట్లయి గిలగిల కొట్టుకుంటున్నాయి ఈరకం జీవులు.
హిందువులు ఇకనైనా మౌనం వీడాలి . గొంతెత్తి తమ అభిప్రాయాలను సమాజానికి వినిపించాలి. అది ఇంకెవరో మనతరపున చేయాల్సిన పనికాదు. మనవ్యక్తిగత బాధ్యతగా గుర్తెరగాలి.


3 వ్యాఖ్యలు:

Zilebi December 22, 2014 at 9:06 PM  

ఇంతకీ మతమార్పిడులు నీచమైనవా? కాదా?
= నీచాతి నీచ మైనవి

మతమార్పిడి నిరోధక బిల్లు తేవాలా ? వద్దా?
= వద్దు


జిలేబి

durgeswara December 22, 2014 at 10:45 PM  

మీజిలెబీచుట్టలకు మొదలెక్కడొ అంతమెక్కడో అర్ధం కానట్లుగా ...వీళ్ల అభిప్రాయాలు అర్ధమైచావట్లేదు జిలేబీగారు

hari.S.babu December 23, 2014 at 3:39 AM  

సరిగ్గా నాకు కంటికి ధడామని కనిపించేసి నేను యేమి చెబ్దామనుకున్నానో అదే జిలేబీ గారు చెప్పేసారు?
వాళ్లంతే,శ్రీనాధుదు చెప్పాడు చూశారా,"కొందరు భైరవాశ్వముల్,కొందరు పార్ధుని తేరి తెక్కెముల్" అని!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP