శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మలసిచూడరో !మగసింహము! పెద అహోబిళము మీది పెనుసింహము! [స్వామి అనుగ్రహాన్ని చవిచూపిన అహోబిళ యాత్ర]

>> Sunday, December 28, 2014

చెంచులక్ష్మీ సమేత  నరసింహుని సన్నిధిలో


రూట్ మాప్

తట్టాబుట్టాసర్దుకుని దర్శనానికై బయలుదేరిన తల్లులు


మాలోల నరసింహుని సన్నిధిఅరే ! వీల్లెవరో మనోల్లేనే !
జ్వాలా నరసింహుని దర్శనానికై బృందాలు బృదంలాగా రామదండు
అల్లడుగో   జ్వాలానరసింహుడు


జలకాలాటలలో

పిల్లదండు

వరాహనారసింహుని సన్నిధిచీకటిలో వెలుతురైన పరమాత్మదర్శనానికై పయనం

పావన నరసింహునిసన్నిధిలో రామదండు

దారిలో


కారంజ నరసింహుని నీడలో


నేనుకూడా


మహానందీశ్వరుని సన్నిధి లోఅదుగదుగో ఆర్తులను ఆదరించు సన్నిధి

ఉగ్రస్థంభం

పైకిచేరిన రామదండు


ఏంట్రోయ్ బ్రదరూ మాతో పోటీయా !

గోవత్సముల వాత్సల్యం
ఏంట్రా తమ్ముడు ! మూడురోజులబట్టిచూస్తున్నా కామెడియా! మర్కట్ గాడిక్కడ లోకల్ .

చెట్టులెక్కగలవా నాలా ఊయలూగగలవా ?
ఇలాగే కదా

అన్నాయ్ ఈ రామదండు గాల్లెవరో ! ఎగస్ట్రా చేస్తున్నారు.....ఓచూపుచూద్దామా.....................
ఆ  ఏడ్చారు !   పిల్లకుంకులు మనచేతిలో వీళ్లెంత  పోనిద్దూ ...!
.


మాలోల నరసింహుని సన్నిధి అదిగోమొదటిరోజు యాత్ర
--------------------

     వినుకొండ నుండి  మంగళవారం రాత్రి ట్రైన్ ఎక్కాం . దొనకొండ వెళ్ళేసరికి మిగతావాళ్లు చేరారు . రాత్రి రెండుగంటలకు  గాజులపల్లె దిగి ఆటొలు మాట్లాడుకుని మహానంది చేరి బసచేసింది రామదండు. అప్పటికే శ్రీనివాసరెడ్ది కుటుంబసమేతంగా ఎగువ అహోబిలానికి చేరి బస ఏర్పాట్లు చూశాడు. అతని కారులోనే కలువపూలు పంపించాము ముందుగా .బుధవారంఉదయాన్నే స్నాధికాలు,దర్శనం ,పారాయణములు పూర్తి చేసుకుని ఆళగడ్దమీదుగా అహోబిళం మధ్యాహ్నం చేరుకున్నాము. చిన్నపిల్లలు ఆకలికి నకనక లాడుతున్నారు. అక్కద సుదర్శన మహాయాగం జరుగుతున్నందున అన్నదానం కూడా జరుగుతుందని ఆటోవాళ్లు చెప్పటం తో మావాళ్ళు అక్కడకెళ్ళటం ,లోపలకెళ్ళి నవాళ్లనుకూడా మీరెవరు అని వివరాలడిగి బయటకు పంపటం తో ముందుగా వెళ్ళిన మా కుర్రాళ్లు కొద్దిగా బాధపడ్దారు.

దిగువ అహోబిలం దగ్గరలో ఉన్న యోగానంద నారసింహుని సన్నిధి కిచేరి అక్కడున్న అవదూతకాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నప్రసాదం స్వీకరించాము. అమృతంలా ఉంది ఆకలికి ఆ అన్నప్రసాదం .ఇక్కడ ఏసమయంలో ఎవరొచ్చినా లేదనకుండా భోజనం అందించేలా సిఢ్ధపురుషులు కాశిరెడ్డి నాయన సంకల్పం చేశారు.భోజనానంతరం అందరం అన్నదానానికి  చేతనైనంత పురుషార్ధం సమర్పించాము.
ఒకగంటవిశ్రాంతి తరువాత యోగానంద నారసింహుని దర్శనం ఆపై ఆటొలలో బయలుదేరి చత్రవట,భార్గవ నారసింహులను దర్శించుకుని రాత్రికి ఎగువ అహోబిల నారసింహుని సన్నిధిలో ఆర్యవైశ్య అన్నసత్రంలో బసచేశాము.
రెండవరోజు
--------------
ఉదయాన్నే స్నాధికములు అయ్యాక  కాలభైరవుని సన్నిధికెళ్ళి పూజించాము. ఆపైనారసింహుని దర్శించాము .విష్ణుసహస్రనామ పారాయణం, లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రములు  పారాయణం  చేసుకుని  స్వామివారిని అమ్మవారిని వేడుకుని మరలా సత్రం కొచ్చి  అక్కడ మధ్యాహ్నానికి ఆహారం పొట్లాలుగా కట్టుకుని,పూజాసామాగ్రితో పయనమయ్యాము. దారిలో వరాహనరసింహుని కలువలతో అర్చించి ఆపై మాలోల నరసింహుని సన్నిధికి పయనమయ్యాము. ఆ అడవిబాటలో  గోవిందనామస్మరణ చేస్తూ  సాగి ..సాగి.. లక్ష్మీప్రియుడైన స్వామి సన్నిధికి చేరాం.  దిగువ అహోబిలంలో పదకొండురోజులుగా సుదర్శన మహాయాగం జరుగుతున్నందున యాత్రికులతాకిడి ఎక్కువగా ఉన్నా  అర్చకులవారు మాపై అభిమానంతో ఎంతో శ్రధ్ధగా రామదండు అందరితరపున సంకల్పం చెప్పి క్షీరాభిషేకం జరిపారు. అయ్య ఒడిలో అమ్మ, నల్లని స్వామిపై నుండి తెల్లని క్షీరధారలో స్వామి ,అమ్మ దివ్యకాంతులీనుతూ
ఆహా ! దివ్యానందంలో తేలిపోయాం. మెమంతా లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం... అంటూ ఎలుగెత్తి పిలుస్తుంటే   పిల్లలు చూడండి ఎంత ఆర్తిగా పిలుస్తున్నారో అని అమ్మ .. అయ్యతో ముచ్చటిస్తున్నట్లుగా అలౌకికమైన భావతరంగాలు చుట్టుముట్టాయి మమ్మల్ని. ఆపై కలువలతో అర్చన . మార్గశిర లక్ష్మీవార పూజలలో చివరివారం అమ్మ ఇలా ఈ మహాక్షేత్రంలో జరిపించుకుని మనలను అనుగ్రహించింది.
ఆడవాళ్ళు ఆవునేతితో వెలిగించిన దీపపు కాంతులతో ఆవరణ దివ్యతేజస్సుతో నిండిపోయింది.

తరువాత ,భోజనం  చేసి కుర్రకారంతా ప్రహ్లాదబడికి వెళ్ళిచూసొచ్చారు. ఇకమరలాజ్వాలానరసింహుని దర్శనానికై బయలుదేరాము. ఆకాశాన్నంటే ఎత్తైన కొండలు,అగాధంలాంటి లోయలు మూడున్నర కిలో మీటర్లు పయనించి ఉగ్రనారసింహుని దర్శించాము. స్వామికి కలువలతో అర్చన జరిపించి ప్రసాదములు స్వీకరించిన అనంతరం అతి కష్టమైన ఉగ్రస్థంభం ఎక్కటానికై కొండలు ఎగబాకారు రామదండు కార్యకర్తలు. చిన్నపిల్లలతో కలసి కూడా ఉగ్రస్థంభం పైకి చేరుకున్నారు వాళ్లు. నేను మాత్రం వెళ్లలేదు. కాకుంటే చిత్రమేమిటంటే   నాకు గతసంవత్సరం  కాలుకు శ్త్రచికిత్సజరిపి రాడ్ వేశారు. మా ఆవిడ కు మోకాళ్ల నొప్పులు. ఇంటివద్ద కొద్ది దూరం నడవగానే నొప్పులొస్తాయి. చిత్రంగా అడవి అంతాతిరిగినా కొండలెక్కుతున్నా నొప్పి అనేది లేదు.
అందుకే అంటారు తల్లీ! నీ అనుగ్రహం ఉంటే కుంటివాడు కొండలెక్కగలడు . మూగవాడు వాచాలడుగా మారగలడు అని/ అది నిజమనిపించే ప్రత్యక్షసన్నివేశం మాకిది.

రాత్రికి బసకు  చేరుకున్నారు అన్నిబృందాలు. కుర్రవాళ్ల ఆనందానికి పట్తపగ్గాల్లేవు. వీల్లు ఎక్కడికెళ్లినా కోతులు వీళ్లననుసరించటం జరుగుతున్నది యాత్రలో  ,మేమూ మీరు ఒకటే గ్రూప్ అనుకున్నట్లున్నాయి మరి.
ఇక శుక్రవారం ఉదయాన్నే   రానూపోనూ పద్నాల్గు కిలోమీటర్లు నదవాల్సిన పావన నారసింహ క్షేత్రానికి వెళ్ళిరావాలి. సుమారు ఎనిమిదివందల మెటు బాగా నిలువుగా ఎక్కాలి  మొదట్లోనే. ఆపై యాగం టి వెళ్ళిరావాలని పిల్లలు కోరారు. ఒకక్షేత్రం లోచేయాల్సిన సాధన చేసుకుని వెళ్లాలి గానీ టూరిస్ట్ బస్సుల్లో తిరిగనట్లు హడావుడిగా తిరగటం కుదరదని మొదట్లోనే చెప్పాను. నాకు వీలుపడదు . మీరు వెళ్ళివస్తే వెళ్ళిరండని చెప్పాను. ఎందుకంటే వద్దన్నా వినేలా లేరు.


మూడవరోజు
---------------- 

ఉదయం మూడున్నరకే లేచి   తయారయ్యారు . చీకటిగా ఉన్నా లెక్కచేయకుండా బయలుదేరారు. వాళ్లవెంట లక్ష్మీ నారాయణరెడ్డిని పంపాను. హైదరాబాద్ నుంచి వచ్చిన అనిల్, మాపిల్లలు ఇద్దరు, నాగిరెడ్డి,అంజిరెడ్డి పర్యవేక్షణలో ఆడవాళ్లనుకూడా తీసుకుని బయలుదేరారు.పాపం శ్రీనివాసరెడ్డికి బాక్  పెయిన్  అయినా తిరుగుతున్నాడు మొండిగా స్వామి పై భారం వేసి. వాళ్లు తయారవటం లేటయింది. కొద్దిసేపు వాళ్లకోసం ఆగాక  ఒంటరిగా అదవిలో ప్రయాణీంచాలనే భావన కలిగింది నాకు. శ్రీనివాసరెడ్డి వాళ్లను వెనుక రమ్మని చెప్పి నేను ఒంటరిగా  బయలుదేరాను.మా అవిడ ఇక్కడే అమ్మవారి దగ్గర పూజచెసుకుంటాను శుక్రవారం కదా అని ఆగిపోయింది.
 దట్టమైన అడవి పక్షుల కిలకిలారావాలు, ఒంటరిగా పరమాత్మస్మరణ  చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని చవిచూస్తూ వెళుతున్నాను. ఏరోజైనా ఇలాఒంటరిగా నీదగ్గరకు రావాల్సినదేకదా తండ్రీ! నరసింహా అని మనస్సులో ఏవేవో భావతరంగాలు. మనస్సు నిండిపోతున్నది సంతోషం తో. మొదటవెళ్ళిన కుర్రవాళ్ళబృందం కంటే గంట లేటుగాబయలుదేరిన నేను వాళ్లుచేరుకున్న సమయానికే పావన నరసింహ క్షేత్రం చేరుకున్నాను చిత్రంగా.
అక్కడ లోయలో స్వామి సన్నిధిలో పారాయణములు చేసుకున్న తరువాత తిరిగి పయనమయ్యాము. వచ్చేప్పుడు కుర్రవాళ్ల సందడిచెప్పనలవికాదు.  అడవిదారిలో గోవులు చుట్టుముట్టాయి మమ్మల్నిపలకరించమని. వాటితో ప్రేమగా కొద్దిసేపుగడిపి వచ్చేశాను. ఇంటివద్ద మా లక్ష్మి[ఆవు]  మేము ఇద్దరం కనపడక గడ్దికూడా  మేయటం లేదని రాత్రే ఫోన్ లో చెప్పారు. లక్ష్మి గుర్తుకు వచ్చినది.  ఇలాగే మారాం  చేస్తుంది.

 ఇక బసకు చేరుకునేప్పటికి పన్నెండయింది. భోజనాలు ముగించుకుని మమ్మల్నింత ఆదరంగా చూసినసత్రం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపి కొంతమొత్తాన్ని  శాశ్వత అన్నదానానికి సమర్పించాము. మీరు పెద్దమొత్తమే ఇచ్చారుకనుక సంవత్సరంలో ఒక్కరోజు రామదండుపేరున అన్నదానాం జరుపుతా,మని వారు అడగటం మేము శుక్రవారం చేయమని చెప్పటం జరిగినది.
ఇక్కడొక గొప్పవిషయం చెప్పాలి. ఎగువ అహోబిళం లో బ్రాహ్మణ ,వైశ్య,తొగటవీరక్షత్రియ అన్నదానసత్రాలు మూడే ఉన్నాయి. అక్కడ యాత్రికులకు ఇంకేమీ దొరకవు. పైన క్షేత్రాలన్నీ తిరిగొచ్చాక ఆకలికి తల్లడిల్లుతారు యాత్రికులు.సాధారణంగా బ్రాహ్మణ,వైశ్య అన్నసత్రాలలో ఇతరులకు భోజనం,వసతి ఇవ్వరు . కానీ ఇక్కడ  మాత్రం వైశ్యసత్రం బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమాన్[  పేరుగుర్తురావటం లేదు] వారు మాత్రం పట్టుబట్టి తమవాళ్లను ఒప్పించివచ్చినవాల్లందరికీ ప్రేమగా పలకరించి ఆకలితీరుస్తున్నారు, నిజంగా అన్నదానమంటే ఏమిటో చూపిస్తున్నారు ఆయన..అన్నదానం చేయాలనుకునేవారు ఇటువంటిచోట్ల సహాయం అందిస్తే సంపూర్ణఫలితాలొస్తాయన్నది నా నమ్మకం.  ఆయన గొప్పసాధకులు,పిడుగులుపడే వర్షమైనా సరే ప్రతిరోజూ ఆయన మాలోల నరసింహుని సన్నిధికి వెళ్ళివస్తుంటారట, ఆయన పాదాలకు నమస్కరించాను.వారిని పీఠానికి ఆహ్వానించి కారంజ నరసింహుని సన్నిధికి కాలినడకన బయలుదేరాము. హనుమంతులవారికి రామావతారంగా నరసింహుని దర్శనమైనదట ఇక్కడ .అందుకే స్వామి చేతిలో ధనుర్బాణాలుంటాయి ఇక్కడ.
చిత్రంగా సద్గురువు కాశినాయన పునరుధ్ధరించిన యోగానందనరశింహుని సన్నిధిలో మొదలై ,హనుమత్ క్షేత్రమైన కారంజ  సన్నిధితో   మా నవనారసింహ దర్శన యాత్ర పూర్తయింది. రామదువారే తుమరఖ వారే...అన్నారు చాలీసాలో తులసీదాసుగారు. నిజమే హనుమంతులవారి అనుమతిలేక రామదర్శనమెలా అవుతుంది. రామదండును నడిపిస్తున్నది తానేనని స్వామి ఇలాసంకేతమిచ్చారేమో.

ఇక దిగువకు వచ్చేసరికి ఆలయం మూసి ఉంది. మూడుగంటలకు దర్శనం అన్నారు. బయట కూర్చుని ఉన్నాము. అంతలో మా నాగిరెడ్డి అసిస్టెంట్ ఒకతను ఆఊరేనట అటుగావచ్చి  ఎప్పుడొచ్చారు సార్ అని పలకరించాడు. వివరాలన్నీ కనుక్కుని వైభవంగా జరుగుతున్నసుదర్శనయాగశాలదగ్గరకు వెళ్లరా అనడిగారు.
లేదని తెలసి పట్టుపట్టి నన్నూ నాగిరెడ్డిని బండిమీద అక్కడకు తీసుకెళ్ళాడు. నిజంగా అత్యంతవైభవోపేతంగా జరుగుతున్నది. హైదరాబాద్ లో ఉంటే నృసింహోపాసకులు శ్రీధర్ స్వామి ప్రతిసంవత్సరం కోట్లరూపాయలు ఖర్చుతో ఈయాగం నిర్వహిస్తున్నారు. తమిళనాడు,కర్ణాటకనుండి వేలాది భక్తులు తరలివస్తున్నారు యాగానికి,గతంలో నేను అహోబిలం వచ్చినప్పుడుకూదా యాగం జరుగుతున్నది.  అక్కడ కు వెళ్ళెసరికి యాగప్రసాదం వితరణచేస్తున్నారు.  మహామేరువుకు అర్చన చేసిన కుంకుమ అద్భుతసువాసనలు వెదజల్లుతూ ఉన్నది. ప్రసాదం కుంకుమ తెచి మావాళ్లందరికీ ఇచ్చాను. లోపలకెళ్ళి శాంతమూర్తిగా ఉన్న లక్ష్మీనరసింహుని దర్శించి తిరుగు ప్రయాణమయ్యాము. మనసంకల్పం లేకుండానే స్వామి మన యాత్రను ఎలా సంపూర్ణఫలితాలిస్తూ జరిపించాడొ అర్ధమైనది కదా అని మావాళ్లకు వివరించాను.
ఆపై నంద్యాలచేరుకుని. నవనందులలో ఒకటైన నందిక్షేత్రం దర్శించుకుని, ఆటోలలో ఈమధ్య గొప్పగా నిర్మించిన జగజ్జనని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని  రాత్రి పదిగంటల రైల్లో తిరుగు ప్రయాణమయ్యాము.


ఈ యాత్ర చేసినవారికి,ఈ యాత్రలో తమ గోత్రనామాలు కూడాచేర్చమని కోరినవారందరికీ  ఆర్తినితీర్చే ప్రహ్లాదవరదుడగు స్వామి అనుగ్రహం  కలగాలని కోరుకుంటున్నాను

ప్రహ్లాదవరదా  గోవిందా....గోవింద

జైశ్రీరాం2 వ్యాఖ్యలు:

సురేష్ బాబు December 28, 2014 at 7:08 PM  

కళ్లకు కట్టేలా ఫోటోలు, వర్ణన చేసి అక్కడకు రాలేని మాతో మానసికంగా యాత్ర చేయించినందుకు కృతజ్ఞతలండీ. నా తమ్ముడి పెళ్ళి జనవరిలో ఉన్నందున ఎక్కడికీ కదలడానికి వీలులేకుండా ఉందండీ.

HARI March 4, 2015 at 7:25 AM  

Great guru garu... neenu chaala mis ayyanu. . . please let me know your next program, i will deffinetly join you.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP