శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అహోబిలం లో అమ్మవారికి జరుపనున్న అర్చనకు మీగోత్రనామాలు పంపండి.

>> Friday, December 19, 2014

అమ్మవారి అనుగ్రహంతో మార్గశిర లక్ష్మీవారపూజలు నాలుగువారాలు పీఠంలో చక్కగా జరిగాయి. జగన్మాత మరింతగా సంతోషించినదేమో  అహోబిలంలో ఐదవవారం పూజ జరుపాలనే సంకల్పం కలిగించినది. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నుండి రామదండు కార్యకర్తలు ఈనెల ఇరవై మూడు రాత్రికి బయలుదేరి వెళ్ళి ఇరవైనాలుగునుండి నవనారసింహక్షేత్రదర్శనములు,ధ్యానాదులు  ప్రారంభమవుతాయి . ఇరవై అయిదు లక్ష్మీవారం నాడు. ఎగువ అహోబిలంలో నరసింహుని,చెంచులక్ష్మీ అమ్మవారికి గాని, లేక మాలోల నరసింహుని సన్నిధిలోగాని విశేష అభిషేకములు ,అర్చనలు  భక్తులందరి తరపున జరుపబడుతాయి.పూజకుఅవసరమైన కలువలు అక్కద దొరకవు కనుక ఇక్కడనుండి తీసుకెళ్లటాని ప్రయత్నాలు చేస్తున్నాము. అసలేభక్తజనవరదుడగు నారసింహుని సన్నిధిలో చల్లని తల్లి. ఆపై ధనుర్మాసం .

మీ గోత్రనామాలు   పంపితే మీతరపున సంకల్పంచెప్పబడుతుంది.
మీ గోత్రనామాలు
durgeswara@gmail.com నకు మీగోత్రనామాలు ఇరవైరెండు మధ్యాహ్నానికల్లాపంపాలి.
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP