శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నరకద్వారాలు భూమిపై ఎక్కడెక్కడ ఉన్నాయి

>> Thursday, October 16, 2014

 
 
 
 
 
నరకం ద్వారాలు

ఒకే ఒక్క క్షణం.. శరీరం నుంచి ప్రాణం వెళ్లిపోతోంది... వందల కొద్దీ తేళ్లు ఒక్కసారిగా కుట్టిన బాధ.. ఏమీ చేయలేని అసమర్థత... ఒక్కసారిగా నిశ్శబ్దం...
మనిషి చనిపోయాడు.. ప్రాణం వెళ్లిపోయింది. ఆ తరువాత...ఏం జరుగుతుంది? జీవుడు అంటే ఆత్మ ఉందా? ఉంటే ఏమవుతుంది? ప్రాణం బయటకు వచ్చిన ఉత్తరక్షణంలోనే రెడీగా పొడవాటి జుట్టు... వికృతమైన ఆకారాలు.. పాశం పట్టుకుని యమదూతలు జీవుడిని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.. క్షణాల్లో యమలోకానికి వెళ్లిపోతాడు..
మీరు పుణ్యం చేశారా? అయితే ఇబ్బంది లేదు లెండి మీకోసం స్వర్గంలో బోర్డింగ్‌ రిజర్వ్‌ అయ్యే ఉంటుంది. పాపం చేస్తే మాత్రం పైన చెప్పినట్లు నరకానికి వెళ్లేందుకు రెడీ కండి.. నరక బాధలు అనుభవించేందుకు సిద్ధం కండి.. పదుల కొద్దీ శిక్షలు దారుణంగా అమలు చేసేందుకు యమభటులు కాచుక్కూచున్నారు.. రక్తమాంసాల చెరువు వైతరిణి పాపులను ముంచెత్తేందుకు సిద్ధంగా ఉంది..అపరిచితుడు సినిమా గుర్తుంది కదా... పాపం చేసిన వాళ్లకు, తప్పులు చేసిన వాళ్లకు నరక శిక్షలు ఎలా ఉంటాయో రుచి చూపించిన సినిమా... అంధకూపం.. కుంభీపాకం, క్రిమిభోజనం వంటి పదాలు ఇప్పటికీ మార్మ్రోగుతూనే ఉంటాయి. సినిమాలో అయితే ఏదైనా ఓకే.. కానీ, నిజంగా నరకం ఉంటే.. అందులో ఈ శిక్షలు అమలవుతూ ఉంటే.. అనుభవించాల్సిందేనా? స్వర్గం లేదు.. నరకం లేదు.. అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ వెళ్లే నరకం నిజంగా ఉంది. గరుడ పురాణంలో చెప్పిందేదీ కట్టుకథ కాదు.. నరకం ఉంది.. భూమిపైనే ఆరు చోట్ల నరకాలు ఉన్నాయి.. భూమిపై అత్యంత రిమోట్‌ ఏరియాల్లో అగ్ని పర్వతాల అట్టడుగున నరకం దాగి ఉందని వివిధ మతాల గ్రంథాలు చెప్పిన విషయాలు ఇప్పుడిప్పుడే రుజువవుతున్నాయి. 
గరుడ పురాణంలో నరకం గురించి చాలా విషయాలే చెప్పారు.. గరుడ పురాణంలోనే కాదు.. ఇస్లాం, క్రిస్టియానిటీలోనూ నరకం గురించి, గేట్స్‌ ఆఫ్‌ హెల్‌ గురించి సవివరంగా ఉంది.. నరకం ద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అన్న విషయాలు ఈ గ్రంథాల్లో స్పష్టంగానే వివరణలు కనిపిస్తాయి. వీటిని ఆధారం చేసుకుని నిర్వహించిన పరిశోధనలు ఇదిగో ఫలితాలను ఇచ్చాయి. నరకం ఎలా ఉంటుందో మనం జీవించి ఉండే, స్పష్టంగా చూసేయొచ్చు.
యమపురి-పాపులకు శిక్షలు విధించే సుప్రీం కోర్టు..
భూమికి 86 వేల యోజనాల దూరంలో ,అంటే సుమారు మనకు ఏడు లక్షల కిలోమీటర్ల దూరంలో నరకం ఉంది. నరకానికి దారిలో 16 చిన్న యమ నగరాలు ఉన్నట్లు గరుడ పురాణం చెప్తుంది.
మనిషి చనిపోయిన తరువాత జీవుడు ఈ నగరాల మీదుగానే వెళ్తాడట. చనిపోయిన తరువాత 13 రోజుల పాటు కర్మకాండ జరిగినంత సేపు అతను భూమిపైనే ఉంటాడు. పుత్రులు సమర్పించే పిండాన్ని ప్రేతరూపంలో స్వీకరించి, కర్మ భాగాన్నిఅందుకున్న తరువాత 14వ రోజున యమపురికి బయలుదేరుతాడు. రోజుకు పగలూ రాత్రి కలిసి 247 యోజనాలు అంటే సుమారు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడట.. మొత్తం 348రోజులు పూర్తయిన తరువాత అంటే సరిగ్గా చనిపోయిన ఒక ఏడాదికి మూడు రోజుల ముందు తన గమ్యమైన ప్రధాన నరకానికి చేరుతాడు. మార్గమధ్యంలో 16 నగరాలను అతను చూసి వెళ్లాల్సి ఉంటుంది... 361 రోజునుంచి మూడు రోజుల పాటు భూమిపై ఆ జీవునికి సంవత్సరీకం జరుగుతుంది.. దానితో జీవుడు భూమి నుంచి అన్ని సంబంధాలతో ముక్తుడవుతాడు.
నరకానికి దక్షిణం వైపున వైతరిణి నది ఉంటుంది.. ఇది రక్తమాంసాలతో అతి భయంకరంగా ఉంటుంది. పాపాలు చేసిన వాళ్లు ఈ నదిని దాటి నరకంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. పాపికి తొలి హర్డిల్‌ ఇదే. ఇది వంద యోజనాల పొడవుంటుంది. అంటే 800 కిలోమీటర్లన్న మాట. 
హరించే వారు,తీసుకున్న అప్పు తీర్చని వారు, ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించే వారు,విశ్వాసఘాతుకులు,విషాన్నం పెట్టి ఇతరులను హత్యచేసే వాళ్ళు వైతరణిని దాటి వెళ్ళవలసినదే. దోషులను పొగిడేవారు,మంచివారిని నిందించే వారు,ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, నీచులతో స్నేహం చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు,పుణ్య తీర్ధాలనూ, సజ్జనులనూ, సత్కర్ములనూ,గురువులనూ,దేవతలనూ నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు,ఆత్మస్తుతి చేసే వారు, పరనింద చేసేవారు.అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే.తల్లి తండ్రులకు,గురువుకు,ఆచార్యులకు,పూజింపతగిన వారికి అవమానం కలిగించేవాడు,పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచి పెట్టేవారు,ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు,ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు,దానం ఇచ్చి తరవాత ఇచ్చినందుకు బాధ పడేవారు వైతరణిని దాటక తప్పదు.దానం చేసే వారిని ఇవ్వవద్దని ఆపేవారు,యజ్ఞ విధ్వంసకులు,హరికథకులకు విగ్నం కలిగించే వారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించే వారు, పశువుల బీడును దున్ని వాటికి మేతలేకుండా చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు. కపిల గోవుపాలను దైవకార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించే వారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసి వేస్తారు.గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వ్రేలాడ వలసి వస్తుంది.అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు,వంచనచేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు,ఫలవృక్షాలను పూలతోటలను ద్వంసం చేసేవారు తీర్ధయాత్రలను చేసే వారికి ఆటంకం కలిగించేవారు,వితంతువులను మోసం చేసి మానహరణ చేసే వారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు.ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది.
కటిక చీకటి, ఎండ, కార్చిచ్చు, చెట్టుకు వేలాడ దీసి ముళ్ల గదతో కొట్టడం, తాళ్లతో కట్టి చర్మం ఒలిచేయటం, సలసల కాగే నూనెలో వేయించటం, క్రిమికీటకాలే భోజనం, రక్తంతోనే స్నానం, అన్నీ బాధలే.. భరించలేని బాధలు.. సహించలేని నరక యాతన, మనిషి చనిపోయాక అతను చేసే పాపాలను అనుసరించి శిక్షలు అనుభవిస్తారు.. ఒక్కో నరకంలో ఒక్కో శిక్ష.. ఒక్కో శిక్షకు ఒక్కో ప్రత్యేకత.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 84 లక్షల నరకాలు.. నరక బాధలు.. మనిషి కోసం.. మన కోసం.. పాపం చేసిన వారి కోసం కాచుక్కూచున్నాయి.. వీటిలో భూమిపైనే ఆరు నరకాలు ఉన్నాయి. అత్యంత భయంకరమైన, దుర్గమమైన ప్రాంతాలు, మనిషి దగ్గరకు వెళ్లటానికి కలలోనైనా ఊహించలేని ప్రదేశంలో యమపురులు ఉన్నాయి...
ఇస్లాం కూడా నరకానికి ఏడు ద్వారాలుంటాయని చెప్పింది.
జహన్నామ్‌
లజా
అల్‌హుతామా
సాఇర్‌
సఖర్‌
అల్‌ జహీమ్‌
హానియా
ఇస్లాం చెప్పిన నరకంలోనూ పాపికి తాగటానికి చీమూ నెత్తురూ ఇస్తారని, భయంకరమైన శిక్షలు విధిస్తారని ఉంది.
సైన్స్‌కు ఇలాంటివి సరిపడవు. కానీ, భూమిపైనే ఆరు నరక నగరాలు ఉన్నాయి. వాటి గురించి ఖురాన్‌, బైబిల్‌లు కూడా ప్రస్తావించాయి. చర్చించాయి. ఇప్పుడు సైంటిఫిక్‌ పరిశోధనలు వాటినే గేట్స్‌ ఆఫ్‌ హెల్‌గా నిర్ధారిస్తున్నాయి.
స్వర్గం భూమికి పై భాగాన ఉంటుందని, నరకం భూమికి కింద ఉండే లోకాలలో ఉంటుందని అన్ని మతాలు చెప్తున్నాయి. అయితే, నరకం ఎక్కడ ఉంటుంది? భూమి కిందకు వెళ్లేదెలా? చనిపోయిన వ్యక్తులు ఏ విధంగా నరకానికి చేరుతారు.. భూమి నుంచి నరకానికి వెళ్లేందుకు దారి ఎక్కడి నుంచి ఎలా ఉంది? భూమిపైనే ఆరు ప్రాంతాలలో నరకానికి ద్వారాలు ఉన్నాయని పాశ్చాత్య మైథాలజీ చెప్తోంది. ఆ ఆరు ఇవే..
-మసాయా-
నికరాగువా రాజధానికి కూతవేటు దూరంలో అతి పెద్ద వాల్కెనో.. పేరు మసాయా.. ప్రాణుల్ని గభాలున మింగేసేందుకు ఆబగా తెరుచుకున్న నరకపు నోరు అది.. మైళ్ల కొద్దీ లోతుల్లోంచి ఎగిసి పడే మంటలు.. భయంకరమైన విషవాయువులు.. అంతం ఎక్కడో తెలియనంత డీప్‌ హోల్‌..
ఫైర్‌ లోపల మరేదో ఉంది.. అక్కడ మరేదో తెలియని అండర్‌వరల్డ్‌ యూనివర్స్‌ ఉంది. లోపలికి వెళ్లడం అంత ఈజీ కాదు.. మసాయాకు మరో వైపు నుంచి లోపలికి వెళ్లేందుకు ఓ పెద్ద చీకటి గుహ ఉంది. మసాయా నరకపు ద్వారం.
క్రిస్టియన్లు, సుమేరియన్లు, జోరాస్ట్రియన్‌లు దీన్ని గేట్‌ ఆఫ్‌ హెల్‌గా నమ్ముతారు. రిమోట్‌ ఏరియాలో రహస్యంగా ఉన్న ఈ గుహ మసాయా వాల్కెనోలోతుల్లోకి దారి చూపుతుంది. కానీ, ఇందులోకి వెళ్లడం అంత ఆషామాషీ కాదు..
1940లలోనే రాబిన్‌సన్‌ అనే ఆర్కియాలజిస్టు దీన్ని ఛేదించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అతను ప్రయాణించిన విమానం మసాయా గుహకు సమీపానికి రాగానే ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది.. ఒక్కసారిగా మంటలు కమ్ముకున్నాయి. క్షణాల్లోనే తెల్లని పొగ తుపానులా విరుచుకు పడింది.. మరు క్షణంలోనే చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. ఇదంతా నిజంగా జరిగిన ఘటన. అతని కుడివైపు శరీర భాగం అంతా కాలిపోయింది. జీవించటానికి అతనికి రెండో అవకాశం లభించింది.
హోలీ బైబిల్‌ మసాయాను మౌత్‌ ఆఫ్‌ హెల్‌ అని వర్ణించింది. మసాయా నిప్పుల గుండం నుంచే పాపులు నరకానికి వెళ్తారని, ఆ లోపల రకరకాల శిక్షలను అమలు చేస్తారని చెప్పింది..
-గ్జిబల్బా-
ఇక్కడికి నాలుగు వందల మైళ్ల దూరంలో సెంట్రల్‌ అమెరికా పరిధిలో గ్జిబల్బా అనే మరో అగ్ని పర్వతం ఉంది.. దీని గురించిన ప్రస్తావన అన్ని మతాల్లోనూ ఉంది. ఇక్కడికి మనుషులు నీటిలోపలి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దీని లోపల మినీ గుహలు ఉన్నాయి. కత్తుల గుహ, గబ్బిలాల గుహ, తోడేళ్ల గుహ, మంచు గుహ, అగ్ని గుహ, వీటితో పాటు రక్తనది కూడా ఉంటుంది. ఇదంతా మేయన్‌ బైబిల్‌లో ఉన్న అంశాలు.. గరుడపురాణంలోనూ నరకం గురించి పేర్కొన్న పదహారు పురాలు ఇవే.
ఇక్కడ ఉన్న ఎరుపు నది హిందూయిజంలో పేర్కొన్న వైతరిణి. అటు బైబిల్‌లోనూ దీన్ని రక్తనదిగా చెప్పారు. ఏడవ శతాబ్దంలో కొందరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది. గ్జిబల్బా అగ్ని గుహలో చాలా వరకు హ్యూమన్‌ రిమెయిన్స్‌ కనిపించాయి. ఇక్కడ కత్తుల గుహలు, గబ్బిలాల గుహలు, పాముల గుహలు.. అతి పొడవైన వృక్షాలు ఉన్నాయి. ఇవన్నీ బైబిల్‌, జోరాస్ట్రియన్‌ మత గ్రంథాల్లో పేర్కొన్న అంశాలు కావటం గమనార్హం.
భూమిపై నుంచే నరకానికి దారులున్నాయనటానికి ఈ అగ్ని గుహలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీటిపై చేసిన రీసర్చ్‌లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. మత గ్రంథాలలో చెప్పిన కొన్ని అంశాలు.. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలతో సరిపోలుతున్నాయి.
-ఈజిప్ట్‌-
ప్రపంచ ప్రాచీన నాగరికతకు సింబల్‌గా నిలిచే ఈజిప్టులోని గిజా పిరమిడ్‌ కాంప్లెక్స్‌లో మధ్య పిరమిడ్‌ కింద అండర్‌ వరల్డ్‌ ఉందిట. పిరమిడ్‌పై రాసిన రాతల్లోనూ, వివిధ శాసనాల్లో పిరమిడ్‌ కింద నరకం ఉందని, అందులో పాపులకు శిక్షలు పడతాయని చెప్తారు.. మృత్యువుకు అధిపతి ప్లూటో అని గ్రీకు మైథాలజీ చెప్తోంది. అతనే నరకానికి రాజుగా చెప్తున్నారు.
-హేడ్స్‌-
ఈజిప్టుకు దగ్గర్లోనే అండర్‌వరల్డ్‌ గాడ్‌ హేడ్స్‌ గుహ ఉంది.. ఇందులో మృత్యుదేవత కొలువై ఉంటుందని నమ్మకం.. ఈస్లాంలో, జోరాస్ట్రియన్‌ టెక్స్‌ロ్టలో కూడా హేడ్స్‌ గురించి చర్చించారు. నీళ్లలోనుంచి గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది.. ఇంత భయంకరమైన గుహ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. లోపలికి వెళ్తున్నకొద్దీ వెళ్లటమే తప్ప ముగింపు లేని గుహ ఇది.. దీన్ని కత్తుల గుహ అని కూడా అంటారు. ఇందులోనూ హ్యూమన్‌ రెలిక్స్‌ కనిపించాయి. దీని లోతుల్లో మనకు అంతుపట్టని నరక ప్రపంచం ఉందని గ్రీకు మైథాలజీ చెప్తుంది.
-హెక్లా-
నరకానికి అయిదో దారి అట్లాంటిక్‌ ప్రాంతంలో ఐస్‌లాండ్‌మధ్య హెక్లా వాల్కెనో ఉంది. దట్టమైన చీకట్లో, చుట్టూ మంచు మధ్యలో.. రెండు వేల డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి ఉబికుబికి రావటం హెక్లా బీభత్సానికి నిదర్శనం.
-సేలమ్‌-
దీని తరువాత సేలమ్‌ అగ్ని పర్వతం మరో నరకం.. దట్టమైన అడవి మధ్య ఉన్న ఈ వాల్కెనో లోపల ఉన్నదేమిటో ఇంతవరకు అంతుపట్టలేదు.. వాల్కెనో చుట్టుపక్కలకు వెళ్లటం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యపడలేదు.

నరకంలో లక్షలాది శిక్షలు ఉన్నాయని అన్ని మత సిద్ధాంతాలు చెప్తున్నాయి. రక్తకాసారాలు.. క్రిమిభోజనం, అంధకూపం, కుంభీపాకం వంటి కఠిన శిక్షలు అన్ని మైథాలజీలూ చెప్తున్నాయి. నరకానికి మనకు తెలిసిన మార్గాలు ఆరు మాత్రం మనకు దొరికాయి. ఇంకా ఎన్ని దారులున్నాయో ఇంకా వెతకాల్సి ఉంది..

మరణం తరువాత ఏమవుతుందో.. ఆత్మ అనేది ఉన్నదో లేదో ఎవరికీ తెలియదు.. మరణం తరువాత జీవితం అనేది ఉందా? లేక స్వర్గనరకాలు అన్నీ కల్పితాలేనా? అసలు చావు అంటేనే ఏమిటో ఎలా వస్తుందో ఇంతవరకు తెలియనప్పుడు, ఇక మరణం తరువాత ఏమిటన్నది తెలిసేదెలా? నరకం ఉందో లేదో, యమధర్మరాజు ఎలా ఉంటాడో తెలియదు. మనిషి మంచివాడిగా ఉండేందుకు అతనికి పాప పుణ్యాల భయం పెట్టడం అన్ని మతాలకూ అవసరంగా కనిపించింది. ఈ భయం పెట్టేందుకే స్వర్గం నరకం కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. అయితే, ఈ కాన్సెప్ట్‌కు అతీతంగా, ఈ భూమికి కింద ఏదో ఉన్నదన్నది మాత్రం వాస్తవం.. రిమోట్‌ ఏరియాలో అగ్ని గుండాలు నరక ద్వారాలని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు.. మైథాలజీని తమ పరిశోధనలకు ఆధారంగా చూపుతున్నారు. వీటి లోతుల్లో ఏమున్నదన్నది ఇప్పటికైతే తెలియకపోయినా, తెలుసుకోవటం అసాధ్యం కాకపోవచ్చు.

1 వ్యాఖ్యలు:

manohar perumalla October 24, 2014 at 5:00 AM  

endulo cheyppena panulu anni cheyakunda brathakaali antey manam sanyasam lo undali naaaku oka dout sir nenu cheysey tappulaku naaku ente sambandam naa karma ni nenu nervartestunnanu andulo tappuoppulaku naaku enduku siksha padali siva aagna lenedey chemma kuda kadaladu antaru antey nenu cheysey panulo anni sivudu cheypetey ney kadaaa nunu cheystunde naa anumaanam evaranna terchande please

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP