శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివారాధన

>> Tuesday, October 14, 2014

శివేన స్వయం లింగం ..లింగం గమకయే వదా శివేన గమ్యతే సర్వం శివానాన్యేనగమ్యతే (సూత సంహిత) శివుడే లింగస్వరూడు. శివుని చేత సర్వం నడపబడుతున్నది. శివుడు గమనకుడేకాని గమ్యుడు కానేరడు. ఆ లింగం స్వయం జ్యోతి స్వరూపమని వేదం చెప్పుచున్నది. జీవుడు దేనిని ఆరాధించడం వల్ల శివుని చెంతకు చేరునో, ఆ చిహ్నం లింగం శివుని చెెరే సాధనమే శివలింగార్చన.

శివుని బిల్వ పత్రాలను, శీత పత్రాలను, శంఖ పుష్పాలతో అర్చించినా పాపాలు నశించును. శివుని ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే పుు్తల్రు, తులసీ దళాలతో పూజిస్తే భక్తి, ముక్తి, అవిశపూలతో పూజిస్తే కీర్తి తెల్ల జిల్లేడుతో శతృజయం, చిన్న కలువలతో శతృనాశనం, గన్నేరు పువ్వులతో రోగనిర్మూలన, జాజిపూలతో వాహన లాభం, శమీ పత్రాలతో పూజిస్తే వ

మానవుని తరింప చేయువాడు శివుడుగాన శివారాధనకు మించిన సులభోపాయములేదు. మాఘ బహుళ చతుర్ధశి మహాశివరాత్రి. ఆ రోజున శివుడు హల్లింగ స్వరూపమున నుండుననియు అట్టి అర్థరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలమందురు. లింగోద్భవ కాలమందు శివలింగదర్శనం పుణ్యప్రదం. అభిషేక ప్రియుడైన శివునికి లింగోద్భవ కాలంలో పంచామృతాలతో శా„సో్తక్త్రంగా ఏకవారాభిషేకంగానీ, లఘన్యాస, మహావ్యాస పూర్వకంగా అభిషేకం లక్ష బిల్వార్చన చేసి తరిస్తారు.
లింగోద్భవ కాలంలో ఎవరు శివలింగ దర్శనం చేయుదురో వారి సర్వపాపాలు నశించును. లింగోద్భవ కాలంలో శివదర్శనం కానివారు ఒక్క బిల్వదళాన్ని చేతపట్టుకున్నా ఆ పుణ్యదర్శన ఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున ఎవరైతే నిరాహారులై శివలింగాన్ని పూజించి, ఆభిషేకించి, రాత్రి జాగరణ చేస్తారో వారికి ఇహపర లోకములందు శుభం, సుఖం కలుగును. మహాశివరాత్రినాడు శివారాధన వల్ల అన్నివిధాల అపమృత్యు బాధలు, తొలగిపోతాయి. శివ శక్తా్యత్మకమైన శివలింగార్చన వల్ల జన్మనివృత్తి అవుతుంది కాబట్టి శివలింగాన్ని సేవించి తీరాలి.

ఏ పూలతో పూజించాలి
శివుని బిల్వ పత్రాలను, శీత పత్రాలను, శంఖ పుష్పాలతో అర్చించినా పాపాలు నశించును. శివుని ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే పుత్రులు, తులసీ దళాలతో పూజిస్తే భక్తి, ముక్తి, అవిశపూలతో పూజిస్తే కీర్తి తెల్ల జిల్లేడుతో శతృజయం, చిన్న కలువలతో శతృనాశనం, గన్నేరు పువ్వులతో రోగనిర్మూలన, జాజిపూలతో వాహన లాభం, శమీ పత్రాలతో పూజిస్తే ముక్తి, నాగమల్లెపూలతో ఉత్తమభార్య, మంకెన పూలతో అభరణ ప్రాప్తి, అడవి మల్లెలతో స్వగృహం, దుర్వారాలతో పూజిస్తే ఆయుష్షు, వావిలి పువ్వులతో మనశ్శాంతి, శివ ప్రీతికరమైన శ్వేతాక్షతలతో పూజిస్తే మోక్షం లభిస్తాయి. ఏకబిల్వ దళం, త్రిబిల్వములతో, పంచ బిల్వములతో పరమేశ్వర ఆరాధన వల్ల సకల వాంఛలు సిద్ధిస్తాయి. సంపెంగ, సుర పొన్న, నంది వర్ధనం, ఎఱ్ఱగన్నేరు, తుమ్మిపూలతో పూజిస్తే శీఘ్ర ఫలం లభిస్తుంది. చంపక, కేతకం, మొల్ల, మొగలి, జపాకుసుమ, దిరిసెన, మాలతీ, బండిగురువింద పువ్వులు ఇవి శివార్చనకు పనికిరావు.నేరేడు, దానిమ్మ, నిమ్మ, రేగు, ఉసిరి, పనస, మామిడి, అరటి ఫలాలు శివ ప్రీతియైన వానితో లింగ స్వరూపుడైన పరమేశ్వరునికి అర్పించిన మహాఫలం కలుగును.
„సృష్టిలో ఎన్ని పుష్పాలు గలవో వానితో శివుని అర్చించిన ఎంత ఫలితం కలుగునో దానికి కోటిరెట్లు శివునికి విభూతితో అభిషేకించిన కలుగును.శివాభిషేక పంచామృతాలైన ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ పదార్థాలన్నీ దేహానికి పుష్టి్టని, తుష్టిని అందిస్తాయి.

కృతయుగమున రత్నలింగం, త్రేతాయుగమున సువర్ణలింగం, ద్వాపరయుగమున పాదరసలింగం, కలియుగమున పార్ధివ లింగం శ్రేష్టములు. కలియుగమున పార్ధివ లింగార్చన వలన ఫలమొందెదరు.
విప్పనూనెతో, నువ్వులనూనెతో, ఆవునెయ్యితోగాని శివునికి దీపం పెట్టాలి. శివుడిని నమ్మిన వారికి ఏలోటూ ఉండదు. ఏకాగ్రతతో శివుడిని పూజిద్దాం, స్మరించి తరిద్దాం.
ఓం నమశ్శివాయ ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.
2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.
3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.
4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.
5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితౄఎదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.
6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.
7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP