కోటి నామ పుణ్యఫలం
>> Sunday, July 20, 2014
కోటి నామ పుణ్యఫలం
July 10, 2014 surya daily
రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్‌లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు శ్రీరామ జయం అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు.
* రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి.
* శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.
* మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి.
* రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకుండా స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.
* అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.
* రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.
* రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపేయాలి.
* ప్రతి లక్ష నామాలకు ప్రత్యే్యక పూజ,నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి.
* రామకోటి రాయడం పూర్తి్త అయిన తర్వాత శక్తా్యనుసారంగా పూజ,నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.
* పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రమూర్తికి సమర్పించాలి. లేదా ఏదైనా రాముని గుడిలో, ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించాలి. అదీ వీలుకాకుంటే నదిలో వదలాలి.
0 వ్యాఖ్యలు:
Post a Comment