శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇదిగో మీ కష్టాలను నివారించుకునే ఆథ్యాత్మిక ప్రయోగం ..పాల్గొనండి

>> Monday, March 2, 2009


ఒక ఆథ్యాత్మిక ప్రయోగ కార్యక్రమం శ్రీకారం చుట్టుకుంటున్నది.. లోకక్షేమము కోసము నిర్వహిస్తున్నందున దానిని పదిమందికి చేర్చే బాధ్యతను అందరికి పంచటము కోసము మీముందుకు తెస్తున్నాము. ఏదైనా ప్రయోగపూర్వకంగా నిరూపితము కాబడినప్పుడు అది సర్వజనామోదము పొందుతుంది.అందులోనూ స్వయంగా అనుభవపూర్వకంగా నిరూపించుకోగలిగినప్పుడు సందేహాలకు తావుండదు.
మానవుని శక్తి స్థాయిని మించి కష్టాలు ,కడగండ్లు . భౌతిక ,ఆథ్యాత్మిక సంకటాలు కలిగినప్పుడు ,వాటిని దాటటానికి భగవత్శక్తిని ఆశ్రయించి విజయం సాధించే అథ్యాత్మిక ప్రయోగమార్గము భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. సత్యాన్ని గ్రహించిన మహర్షులు ,మానవజాతికి మహోపకారంచేశారు,పలు ఆథ్యాత్మిక సాధనా మార్గాలను సూచించటమ్ ద్వారా. భౌతిక ఇక్కట్లతో సతమత మయ్యే మనిషిని వాటినుండి బయట పడవేయటము ద్వారావారి మనసుకు శాంతి కలిగి,ఆసక్తి పూరితులై భగవన్మార్గాన పయనించి పరాత్పరుని చేరే సోపాన మార్గమిది.
నాటి మహాపురుషులందించిన మార్గం లోనే" శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠము" "హనుమత్ రక్షా యాగమనే" ఒక ఆథ్యాత్మిక ప్రయోగానికి సన్నద్ధమవుతున్నది. ఈప్రయోగము ద్వారాసాధకులు స్వయంగా భగవంతుని కృపను రుచి చూసి.తమ బాధలను తామే బాపుగోగలమని తెలుసుకుని భగవన్మార్గాన మరింత ముందుకు ప్రయాణము సాగించగలుగుతారనే యోచనతో సాగుతున్నదిది.

ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యము
-------------------------------
విరోధినామ సంవత్సరాన కూడా భూమిపైన పలు ఉత్పాతాలు,ప్రమాదాలు .లోక కల్లోలిత చర్యలు మిక్కుటముగా జరగ నున్నాయని శాస్త్రకారులు హెచ్చరిస్తున్నారు. ఈదశలో భక్తులకు అభయ ప్రదాయకుడైన హనుమంతుని ప్రసన్నం చేసుకొని ఆయన రక్షణ పొందటము ద్వారా ఈ ఉత్పాతాలనుండి అవలీలగా దాటవచ్చని అందరికీ తెలిసినదే. ఏ సాంప్రదాయకులైనా హనుమంతుని రక్షణ లో ఉన్నచో భౌతిక ఆథ్యాత్మిక ఆటంకాలు తేలికగా దాటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ధర్మ బద్ధమైన భక్తుల కోర్కెలను హనుమదుపాసన సహాయం తో తేలికగా నెరవేర్చుకోవచ్చుఅన్నది ప్రయోగాత్మకంగా మేము అనుభవించి ,నిరూపించి చెబుతున్న విషయము. ఈతి బాధలు, రోగాలు ,జాతక దోషాలు,ప్రమాదాలు.మానసిక అశాంతి ,అపజయాలనుండి మిమ్ము మీరు రక్షించుకునే మహత్తర ప్రయోగమిది, ఇందులో పాల్గొనటము ద్వారా మరింతమందికి ఈ యాగ ఫలాన్ని పంచటము ద్వారా భక్తజన పోషకుడైన హనుమంతుని రక్షణలోకి మిమ్మలను చేరుస్తుంది.
ఎలా పాల్గొనాలి ?
-----------------------
జాతి మత కుల లింగ బేధాలు లేకుండా అందరూ పాల్గొనవచ్చు. విరోధినామసంవత్సర చైత్ర శుద్ధ పాఢ్యమి [27-3-2009] నుండి హనుమజ్జయంతి [19-5-2009] వరకు ఈయాగము శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో నిర్వహించబడుతున్నది. దీనిలో పాల్గొనదలచినవారు తమ గోత్రనామాలను పంపటము వలన వారందరి పేర్ల తో ప్రతి నిత్యము ఇక్కడ భక్తరక్షకుడై నిలుచున్న అభయాంజనేయ స్వామి వారికి రుద్రసూక్త ,మన్యుసూక్త ప్రకారము జరిగే అభిషేకాదులు అర్చనలద్వారా ను , ఇరవై ఏడు మంది బ్రహ్మచారులచే చేయబడే హనుమత్ చాలీసా,ఆంజనేయ దండకము ,మంత్రజపముల తో జరిపే సాధనకు,మీసంకల్పాలు అనుసంధింపబడతాయి. [ ఇక్కడ సందేహము వద్దు. ఎక్కడెక్కడో వున్న మనము,ఫోన్లద్వారా,ఇంటర్ నెట్ల ద్వారా ఎలా అనుసంధిన్పబడుతున్నామో,అంతకంటె శక్తివంతమైన మనోసంకల్ప తరంగాలు,దివ్యశక్తిపూరితాలైనటువంటి మంత్రోఛ్ఛారణోత్పాదితాలైన తరంగ ప్రసరణద్వారా ప్రకృతి శక్తులు మనలను అనుసంధింపజేస్తాయి.]
నలభై రోజుల కాల వ్యవధి వుండేలా చూసుకుని మీరు వ్యక్తి గతము గా కాని ,బృందముగా కాని ఇందులో పాల్గొనవచ్చు. మీరున్నచోటునుంచే మీరు ఈ కార్యక్రమములో పాల్గొనవచ్చు. ముందుగా మీరు శుభకరమయిన ముహూర్తమునెన్ను కుని ఆరోజున ఇంటి లోగాని దేవాలయము లోగాని మీరు ఏ కోరికతో ,ఏ కార్యము నెరవేర్చాలన స్వామిని కోరుకుంటున్నారో [అది అథ్యాత్మికమైనదైనా లేక భౌతిక మైనదైనా] దానిని సంకల్పములో చెప్పుకుని ప్రారంభించాలి.

పారాయణ విధానములో సాధన
-------------------

శుభ ముహూర్తము [హనుమజ్జయంతికి ముందునుంచి 40 రోజులకు తగ్గకుండా] నిర్ణయించుకుని
ఆరోజు దీపారాధన పూజ ముగించుకుని ,మీరు ఏధ్యేయముతో పారాయణము చేస్తున్నారో స్వామి ముందు సంకల్పముగా చెప్పుకోవాలి. రోజుకు 11 సార్లు గాని అంతకు మించి గాని పారాయణము చేయాలి.ఒకసారి ఆంజనేయ దండకముచదువు కోవాలి. ముందుగా స్వామివారికి ప్రదక్షిణలు చేయాలి.అవి కూడా మొదలు పెట్టినరోజు ఎన్ని చేస్తారో చివరి రోజువరకు అన్ని చేయాలి. ప్రదక్షిణకు ఆలయానికి వెల్లలేనివారు తులసికోటలోగాని .లేక ఒక శుద్దమయిన ఆసనము ఏర్పాటు చేసుకునీ అందులో స్వామి చిత్ర పటాన్నుంచి గానీ చేయవచ్చు.సింధూరము ధరించాలి. ఆడవాళ్ళు ఐదురోజుల ఇబ్బంది వదలి మరలా మొదలు పెట్టి పూర్తి చేయవచ్చు.

శనివారము ఒక్కపూట భోజననియమము చేయాలి. ఈసమయాన మధ్య మాంసాదులు ,నిషేధము.
బ్రహ్మచర్యదీక్ష
ఏసాధనకైనా అద్భుతముగా తోడ్పాటునందిస్తుంది గమనించగలరు. చివరిరోజున మీకు సమీపములోని హనుమదాలయం లో తమాలార్చన జరిపించుకోవాలి. ముందుగా మీ కుటుంబసభ్యుల గోత్రనామాలు పంపితే ఇక్కడ అన్ని రోజులు మీపేర్లపైన అర్చనాదులు,హోమములో ఆహుతులు సమర్పించబడుతుంటాయి.
ఇక మీకేదయినా గురూపదేశమయిన మంత్రాదులుంటే జపించవచ్చు. లేదా చాలీసాలో ప్రతి దోహా ఒక సంపుటీకరణ మంత్రమే కనుక మీకోర్కెను తీర్చగల దోహాను నిరంతరం జపించవచ్చు. ఏ కార్యసాధనకు ఏదోహాను పఠించాలో మరొక పోస్ట్ లో వ్రాస్తాము. మీరు కోరితే పంపిస్తాము.జయంతికి పీఠములో జరిగే పూర్ణాహుతికి అందరికి ఆహ్వానాలు అందుతాయి.ఇక్కడ సేవాకార్యక్రమాలు అన్ని మీకు తెలియజేయబడతాయి.


దీక్షా విధానములో సాధన
................
శుభముహూర్తాన గురువు చేతగాని ,హనుమదాలయములో తల్లిచేతగాని,అర్చకులచేతగాని మాలాధారణ చేసి ,దీక్ష చేపట్టాలి. అన్ని దీక్షాపద్దతులలో ఉండే నియమాలు ఇక్కడ పాటించాలి. దీనివలన చెడుఖర్మలు త్వరగా ధ్వంస మవుతాయి.

సంకల్పము చెప్పుకుని చాలీసా, దండకములను పారాయణ చేయటము,ప్రదక్షిణలు చేయటము ప్రధానము. చివరన ఏదైనా హనుమత్ క్షేత్రములో విరమణ చేయాలి. పూర్ణాహుతికి పీఠము నకు వచ్చినట్లయితే యాగములో స్వయముగా పాల్గొనవచ్చు.ఇందులో కఠిన నియమములు మన దుష్కర్మలను ధ్వంస మొనరించి శుభాలను చేకూరుస్తాయి.

భక్తితో ఈ పద్దతులలో సాధన చేయువారికి హనుమంతుని రక్షణ లభించి ,సకలప్రమాదాలనుండి,అనారోగ్యపు బాధలనుండి కాపాడబడతారు. విజయము, సిద్ది ,శుభాలను ప్రయోగాత్మకంగా పొంది స్వామి వారి రక్షణ వలయం లో కి రాగలుగుతారు.
బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్
అన్నారు పెద్దలు హనుమంతుని తలచుకుంటేనే ఇవన్నీ కలుగుతాయి. భక్తితో ఈసాధన చేసి చూడండి ఫలితాలను.

భక్తజనుల సేవకై వున్న మేము మీకు ఈసాధనలో తోడుగా వుండి మీకు కలిగే సందేహాలను పెద్దల ద్వారా తీరుస్తూ
మీవెంట నడుస్తాము.

మీకు ఎప్పటి కప్పుడు సందేహాలను తీరుస్తూ పీఠము నుండి సందేశాలు అందుతుంటాయి.

ఈ కార్యక్రమములో గ్రామ పట్టణ ములలో భక్తుల శ్రేయస్సుకై మహాత్ములు ప్రతిష్టించియుండిన మూర్తులకు సామూహిక అభిషేకములు జరుపుటద్వారా ,నూటఎనిమిది చాలీసా పారాయణ కార్యక్రమములను చేపించుటద్వారా హనుమత్ శక్తిని మేల్కొల్పటము జరుగుతుంది. మీ గ్రామాలలో ఆయా కార్యక్రమాలను జరుపుటకు ఆసక్తి కలవారికి విధి విధానాలను, అనుభవజ్ఞులను పంపుటద్వారా పీఠము సహకరిస్తుంది. అయా విషయాలు తరువాత తెలియ జేయబడతాయి.
హనుమత్ జయంతి రోజున పూర్ణాహుతి కార్యక్రమము జరుపబడుతుంది. అన్నదానము జరుగుతుంది. ఈ యజ్ఞ రక్షలను అందరికీ పంపించటం జరుగుతుంది.
ప్రయోగములో మీరు పాల్గొని ఈసాధనా ఫలితాలను స్వయంగా తెలుసుకోగలందులకై మిమ్మలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.ఇందులో పాల్గొని మీరెదుర్కొంటున్న సమస్యలను హనుమత్ కృపతో జయించగలరని ఆకాంక్ష.
చిరునామా
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము
రవ్వవరము
నూజెండ్ల మండలము
గుంటూరు జిల్లా

ఈ క్రింది లింకును కూడా చూడండి

http://durgeswara.blogspot.com/2009/03/blog-post_09.హ్త్మ్ల్

http://durgeswara.blogspot.com/2009/03/blog-post_17.హ్త్మ్ల్

దండకమునకై చూడండి
http://durgeswara.blogspot.com/2009/03/blog-post_11.హ్త్మ్ల్

చాలీసా కొరకు చూడండి
http://durgeswara.blogspot.com/2009/03/blog-post_467.html


సెల్ ౯౯౪౮౨౩౫౬౪౧


ఉగాది నాడు ప్రారంభించిన గణపతి హోమము
http://durgeswara.blogspot.com/2009/03/blog-post_27.హ్త్మ్ల్ లో చూడండి

11 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. March 2, 2009 at 11:55 AM  
This comment has been removed by a blog administrator.
మంచు March 17, 2009 at 6:44 AM  

మీ బ్లాగు లొ పైన వుండె వెంకటెశ్వర స్వామి ఫొటొ చాలా తెజస్సు కలిగి వుంటుంది. దయచేసి నాకు ఫుల్ ఫొటొ పంపించగలరా?

Amar March 20, 2009 at 10:59 PM  

ధన్యవాదములు. గోత్ర నామములు ఎలా పంపాలో తెలియచేయగలరు.

swapna@kalalaprapancham March 22, 2009 at 6:22 AM  

నాకు కూడా దయ చేసి ఫోటో పంపగలరు.

swapna@kalalaprapancham March 22, 2009 at 6:22 AM  

నాకు కూడా దయ చేసి ఫోటో పంపగలరు.

swapna@kalalaprapancham March 22, 2009 at 6:24 AM  

నాకు కూడా దయ చేసి ఫోటో పంపగలరు.

nagarajnaidu March 23, 2009 at 9:57 PM  

naku kuda dayachesi photolu pampagalaru

Sirisha April 25, 2009 at 12:08 AM  

nee mee blog ivvale choosanu mari 40 days avvadu kada...time ledu kabatti na gotra namalu cheppavachuna...suggestion pls

Kalpana April 25, 2009 at 3:37 AM  

మీ బ్లాగు లొ పైన వుండె వెంకటెశ్వర స్వామి ఫొటొ చాలా తెజస్సు కలిగి వుంటుంది. దయచేసి నాకు ఫుల్ ఫొటొ పంపించగలరా?

my e-mail id is: kalpanagullapally@gmail.com

Thank you

జ్యోతి May 10, 2009 at 8:57 AM  

ఈ బ్లాగులోని వేంకటేశ్వరస్వామి చిత్రం నా దగ్గరుంది మెయిల్ చేస్తే పంపిస్తాను..

jyothivalaboju@gmail.com

Unknown May 12, 2009 at 12:00 AM  

Hi Please send the Photo of Balaji

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP