శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిలకాన్ని అడ్డుగానో, నిలువు నామం గానో పెట్టుకోవచ్చా? ఏది శ్రేష్ఠం?

>> Thursday, November 21, 2013

తిలకాన్ని అడ్డుగానో, నిలువు నామం గానో పెట్టుకోవచ్చా? ఏది శ్రేష్ఠం?
కొందరు ఉపాసకులు ఆయా ఉపాసనా దేవతలననుసరిస్తూ దానికి అనుగుణంగా బొట్లు, నామాలు పెట్టుకుంటారు.  విశాలమైన నుదుటిపై ధరించిన గుండ్రని బొట్టు అనంతాకాశంలో ప్రకాశించే సూర్యునిలా శోభిస్తుంది.  భ్రూమధ్యం లోని యోగ్యమైన క్షేత్రం పై చక్కని గుండ్రమైన శీతల గంధాన్ని, దాని మధ్యలో కుంకుమ ధరించడం ఆదర్శనీయం, ఆచరణీయం, అందరికీ ఆమోదయోగ్యం.

కొందరు తిలకాన్ని ధరించడం నామోషీ గా ఎందుకు భావిస్తున్నారు?
తిలకధారణ యొక్క విలువను తెలియని వారే దీనిని నామోషీ గా భావించవచ్చు.  అయితే కొందరు గృహిణులు కూడా కనీ కనిపించని స్టిక్కర్లకు పరిమితమౌతున్నారు. హిందూధర్మంలో స్త్రీలకు తిలక ధారణ సువాసినీ చిహ్నంగా పేర్కొనబడింది.  ఈ చిహ్నంతో నిండుగా కనిపించే స్త్రీలను సమాజం గౌరవ ప్రపత్తులతో ఆదరిస్తుంది.

ఈశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి?
జీవులలో రకరకాల వ్యామోహాలు కల్పించి ప్రకృతి లోని ఆకర్షణలకు గురిచేసేది మాయ.  'మమ మాయా దురత్యయా' అని గీతా వాక్యం.  ఈ మాయ మహా శక్తివంతమైనది.  దారుకావనంలో తపోనిష్ఠులైన మహర్షులు మాయాశక్తిని దాటే మార్గం చూపమని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడు వారికి 'ఆత్మజ్ఞానము'ను ఉపదేశించాడు.  కానీ సామాన్యులకు అది అంత సులభంగా బోధపడదు.
...

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP