శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ కాపురాలు కూలకుండా వుండేందుకు ,మీసలహాలు చెప్పండి,[సమస్యమూలాలను విశ్లేషించండి]

>> Monday, January 5, 2009

నాకు ఇప్పుడు రెండు సంకటాలు ఎదురయ్యాయి. మొత్తం మూడు కుటుంబాల లో దాంపత్యజీవితం ప్రమాదం లో పడినది.ఇందులో ఒకటి భగ్నమయినది ఆల్రెడీ.ఇక రెండు కుటుంబాలు ప్రమాదపు అంచులో వున్నాయి. దీనికి కారణాలను వెదుకుతూ సమస్య పరిష్కారాన్ని ఎన్నిరకాలుగా ఆలోచించినా అన్ని రకాల కారణాలు కన్పడుతూ మరింత సంక్లిష్టంలో పడవేస్తున్నాయి.మూల కారణాన్ని కనుగొనేందుకు నేనుచేస్తున్న ప్రయత్నానికి మీ సహ్హయం కూడాలభిస్తుందేమోనన్న ఆశతో మీముందుకూడావుంచుతున్నాను.

**************************************************************************************
ఒకటి

ఇది నా భార్యతరపున చుట్టాలైన ఒక అబ్బాయి కథ. వానికి రెండుసంవత్స్రాలక్రితం ఒక సంబంధం కుదిరినది. వినుకొండలోనే ఒక సంబంధం. అమ్మాయి నర్స్ గా ఉద్యోగం చేస్తున్నది .ఇదే జిల్లాలో. వాళ్ళు కన్వర్టేడ్ క్రిష్టియన్స్ . సంబంధం మాట్లాడుకున్నాక ముహూర్తాలు పెట్టు కునేటప్పుడు నన్ను రమ్మని పిలచారు. వెళ్ళాను అమ్మయి వాళ్ల ఇంటికి వాళ్ళు కూడా తమ ఇంటి లో వెంకటేస్వర స్వామివారి కాలెండర్లు ,ఫోటోలు తెచ్చి తగిలించారు. మగపెళ్ళివారి ఆచారాలను గౌరవించాలనో లేక మరేమోగాని వాళ్ళ ప్రయత్నాలు వాల్లు చేసుకున్నారు. ఇక నాకెందుకో వీనికి ఈ అమ్మాయి తో ఎక్కువనాల్లు పొసగదు అనిపించింది. ఎందుకంటే వీనికి బుద్ది నిలకడ తక్కువ .కొంగరి చేస్టాలు,మాట్లాడే టప్పుడు నాటకీయఫక్కీలో మాట్లాడటం ఇవి వాని లక్షణాలు. ఏదో కంప్యూటర్ వర్క్ చేస్తూ గుంటూరు లోనే సంపాదిస్తున్నాడు.కానీ వీని నిలకడ లేనితనం ను సరిదిద్దుకుని సంసారం సాగించాలంటే దాన్ని నిలుపుకోవాలంటే ఆడపిల్ల చాలా సమర్ధురాలై ఉండాలి. కాడి గట్టినప్పుడు ఒక ఎద్దు దుడుకుగా లాగినా రెండవది తన సామర్ధ్యం తో నడవగలిగితే మొదటిది తప్పనిసరయి సరిగా నడకకొస్తుంది. ఇదే సంసారజీవితాన్ని లాగే భార్యా భర్తలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వేరే చెడు అలవాట్లు లేవుగాని వీని ద్ ఆలోచనావిధానము వీని సంసార జీవితాన్ని సవ్యంగా సాగనివ్వదు. అది ఆ అమ్మాయి సర్దుకుని పోయే మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదే అబ్బాయి వాళ్ళమ్మ అడిగితే చెప్పాను.

పెళ్లయింది .గుంటూరు లొనే కాపురం పెట్టారు, ఒకమ్మాయి పుట్టినది. నేననుకున్న విధముగానే మొదలయినది ఇద్దరి మధ్య గొడవ. నువ్వెంత అంటే నువ్వెంత .నువ్వుసంపాదిస్తే నెను సంపాదించటం లేదా? నీమీద ఆధారపడటం లేదు నేను. ఇలా సాగుతున్నాయి వీళ్ల గొడవలు.దూరమయ్యారు.మధ్యవర్తులు వెళ్ళి వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరూ సర్దుకునేవారు లేరు అని తేల్చారు. చివరకు అమితుమీ తేల్చుకోవాలని మొదలు పెట్టారుప్రయత్నాలు .అబ్బాయి వాళ్లమ్మ నన్ను ఒక్కసారి మాట్లాడమని బతి మాలితే అబ్బాయితో మాట్లాడి చూసినప్పుడు వాని లోపాలు అమ్మాయి లోపాలు కనపడ్డాయి.ఇంతకంటే అమ్మాయి తరపున పెద్దవాళ్ల లోపం ఏమిటో అర్ధమయినది. కనీసం పిల్లలకు సమస్యలను ఎదుర్కోవటములో ఆడపిల్లలకివ్వవలసిన శిక్షణ ఇవ్వలేదు. భార్యా భర్తల మధ్య ఉండవలసిన సంబంధాలను బోధించటమ్ లోపించింది వీళ్ల పెంపకంలో. ఇక అబ్బాయి చెడు అలవాట్లు లేకున్నా ,సరయిన శిక్షణ లేదు. నాకు వెంటనే విడాకులిప్పించు వాళ్లతో మాట్లాడి అని అడిగాడు. కలపాలని ప్రయత్నించటం తప్ప విడాకులిప్పించే పాపం నావల్ల కాదని చెప్పి వచ్చేశాను.

ఆతరువాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఏమైంది విడాకులిస్తే వీడుకాకుంటే ఇంకొకడు అని అమ్మాయి తరపు వాళ్ళు.ఇదికాకుంటే మరొకటి అని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు.

*******************************************************************************************

రెండవ కథ...

నేను పనిచేసే పాఠశాలలో jayakumar అనే ఉపాధ్యాయుడు చేరాడు. అతని మామగారయ్యె చుట్టం డీయివో కార్యాలయం లో పెద్దవుద్యోగి.అతని కూతురు కూడా మామండలములోనే ఉద్యోగమ్ లొ చేరింది. ఇద్దరికి నాలుగు నెలలో పెళ్ళి చేశారు. వినుకొండలో కాపురం .నన్ను బావా అనిపిలుస్తాడు. వాళ్ళుక్రిష్టియన్లు. హిందూ ధర్మాన్ని ఇతిహాసాలను విమర్శిస్తాడు నాతోనే. ఇవి భగవంతునికి మాత్రమే సంబంధించిన విషయాలు కావు. మానవజాతి ప్రవర్తనను శాసించి,నియమాను సారంగానడిపించే ధర్మ సూత్రాలు అని నేను చెప్పటం మామూలయింది. వ్యక్తిగతంగా మనుషులను నేను ఎప్పుడూ ద్వేషించను.కారణం నాకు నాధర్మం నేర్పిన విశ్వాసం "ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమెప్పుడూ మరుగుకాదు అనేది." కనుక అన్ని మతాలవారూ నాతో స్నేహానికి ఏ అడ్దంకులూ లేకున్నారు.

ఇక ఇతనికి తన భార్య పట్ల ప్రేమ చాలా ఎక్కువ.పేదరికం లోంచి వచ్చినవాడు.ఇక అమ్మాయి నాన్న ఉద్యోగస్తుడు కనుక ఆ అమ్మాయికి కాస్త గర్వం వున్నట్లు కనపడేది. మాతో మాత్రం గౌరవంగానే మాట్లాడేది.
ఇద్దరమ్మాయిలు పుట్టారు.మాయింటి కొచ్చినప్పుడల్లా మా అక్క ఇంతగా చేస్తుంటే నువ్వు కులుకుతున్నావు,అందరూ అలావుండరు.మాఇల్లలో చూడు నువ్వు సంపాదిస్తే,నేనుసంపాదించటం లేదా అన్న ధోరణిలో వుంటాయి వ్యవహారలు అని అంటూ వుంటాడు. ఇతను బయట సాయంత్రం కాలేజీలలో కూడా పనిచేసి కష్టపడిసంపాదిస్తాడు. కొద్ది కొద్దిగా వీళ్ల మధ్య ఆధిపత్యధోరణులతో రాధ్ధాంతాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. వీళ్ల మామ గారు వచ్చినప్పుడల్లా ఇతనిని గదమటము,ఇతనేమొ వాళ్లమామంటే భయంతొ అణగిమణగి ఉండటము ఎలాగో గడచిపోయేది. ఇక ఇతని తల్లిదండ్రులు కూడా ఇతని దగ్గరుండాలని వస్తే పెద్దగొడవ. వాళ్లకు నేను సేవలు చేయాల్సిన అవసరం లేదని ఆమె వాదన. కానీ వాళ్లమ్మగారు పాపం సర్దుకుని తానే అన్ని పనులు చేస్తున్నా వీళ్ళు వుంటే నాకు కుదరదని బెదిరింపులు. పాపమా తల్లిదండ్రులు మానుంచి నీసంసారం లో చిచ్చులెందుకులేయ్యా! అని వాళ్ల సొంతవూరు పొన్నూరు వెళ్ళి పోయారు. మాకప్పుడప్పుడూ ఇంట్లో తన బాధలు చెబుతూవుండేవాడు.దగ్గరకనుక ప్రతిసారీ ఈఅమ్మాయి నరసరావుపేట తన పుట్టింటి కెళ్ళటం .ఈకుర్రాడు పోగానే వాళ్ల అమ్మానానలు పలు మాటలు అనటం,ఇలాజరిగిపోతున్నది.

ట్రాన్స్ఫర్ లొచ్చాయి.అందరం కౌన్సిలింగుకు వెళ్ళాము. ఇక్కడ వుంటే మీ వాళ్ల జోక్యంతో నాకు కుదరదు. మనం పొన్నూరు ప్రాంతానికి కోరుకుందామని ఇతను.వీల్లేదు నరసరావు పేటలోనైతే అన్నిటికి మా నాన్నవాళ్ళు తోడుగావుంటారు.కాబట్టి నరసరావు పేట కోరుకుందాము మావాళ్ల ఇల్లు కూడా వుంది అద్దెకూడా అవసరం లేదని ఆ అమ్మాయి,వాదన.
అక్కడకైతే నేనురాను అని ఇతను నువ్వొచ్చినా రాకున్న నేను నరసరావుపేటకే వెళతానని ఆమె ఇద్దరూ ఎడమొఖమ్ పెడమొఖమ్ గా గుంటూరు కౌన్సిలింగ్ కువచ్చారు. అతను నాదగ్గరకొచ్చి ఇక సహించటం నావల్ల కాదు,నరసరావు పేట లో వాళ్ళింటికి వెళితే నాబతుకు కుక్క బ్రతుకే. నేను తెగతెంపులు చేసుకోవటానికైనా సిద్దమే. ఇలా మా వద్దకు వచ్చి బాధపడ్డాడు. ఇక తప్పక నేను వాల్లకు కొద్దిగా సన్నిహితంగా వుండే మరి ముగ్గురు టీచర్లను పిలచి అక్కడే అందరం కూర్చుని వాళ్లకు సర్ది చెప్పటం మొదలెట్టాము. భార్యా భర్తల మధ్య మరొకరు తలదూర్చవలసిన అవసరం రావటం ఎంత బాధాకరమో ,చెప్పి,కొన్ని మానసంబంధాలు,వాటిపట్ల మన బాధ్యతలు,ఇంతకంటె ముఖ్యంగా మీఇద్దరూ విడిపోతే పిల్లల భవిష్యత్తు ఎలావుంటుందో వాళ్లకు వివరించాను. మీ ఇద్దరి పట్టుదలలకు పిల్లలను బలి చేసే హక్కు మీకెక్కడిదని? అలాంటివాళ్ళు పిల్లలను ఎందుకు కన్నారని? వాళ్ళను కొద్దిగా మందలించి మొత్తానికి ఒక రాజీకి ఒప్పించాము.నన్ను నరసరావుపేటలో వుండేట్లు చేస్తే నాచావు చూస్తావు బావా,నువ్వు అని అతను బాధ పడ్దాడు.ఏమికాదులేవయ్యా సంసారం లోఇవన్నీ సహజమే అని సర్దిచెప్పి సాతులూరు మండలము కోరుకునేటట్లు, నరసరావు పేటలో వేరే చోట ఇళ్ళుతీసుకుని వుండేటట్లు ఒప్పించాను.మూడు సంవత్స్రరాలు కావస్తున్నది. ఈమధ్య నేను పెద్దగా వాళ్ళవిషయం పట్టించుకోలేదు.. నాలుగు నెలల బట్టి అతను ఫోన్ చేస్తున్నాడు. నువ్వు చేసిన పనికి నాకు నిత్యం నరకమయినది.ఆరోజే నేను మావూరు వెళ్ళి పోయివుంటే హాయిగావుండేది. నా పరిస్థితి ఎలావున్నదో నీకుతెలియదు.
మామామ వీడుకాకపోతే ,ఇంకొకన్ని చేస్తాను అంతేకాని వీడుచెప్పినట్లు నువ్వు వినేదేమిటని మా ఆవిడను తన ఇంటిలోనే వుంచాడు .తనకున్న అంగబలంతో నన్ను బెదిరించి కొన్నస్థలాలు అన్నీ ఆ అమ్మాయి పేర వ్రాపించాడు. నన్ను తన ఇంట్లో పడివుండమంటున్నారు.మా అమ్మానాన్న ఊసెత్తవద్దంటూన్నారు,అని దు:ఖపడుతున్నాడు.నువ్వొచ్చి చెప్పమంటున్నాడు.ఏమిచేయాలి.? భార్యా భర్తల మధ్య వుండాల్సినది సమానత్వాలు,సమానబాధ్యతలూనా?ప్రేమాభిమానాలా?అసలు ఇంత కు లోపము ఎక్కడున్నది. స్త్రీధర్మాలను మనసంస్కృతిని బోధించకుండా పెంచిన తల్లిదండ్రుల లోపము లేదా ఇక్కడ.నిన్ననే ఫోన్ చేశాడు మరలా.నేను పొన్నూరు చేరాను.అక్కడ వుండటం నావల్లకాదు. విడాకులకు వాళ్ళు సిద్దమయ్యరు తప్ప నావెంటరావటానికి ఒప్పుకోలేదు మా ఆవిడ.విడాకులు తీసుకుంటాను,అంటున్నాడు. ఆరోజు అంత చెప్పిన పెద్దమనిషివి ,ఈరోజు వెళ్ళి వాల్లను గదిమావా?అని అడుగుతున్నాడు. వెళ్ళి ఏదన్నా మాట్లాడదామన్నా, ఆ అమ్మాయి వింటూన్నదన్న నమ్మకము లేదు. పాపం ఆపిల్లల పరిస్థితేమిటని బాధ కలుగుతున్నది.నేనేమి చేయాలి.భగవాదరాధన రూపములో ఏదన్నా సహాయం చేద్దామంటే ,నన్ను మతమార్పిడికి ప్రయత్నించే నీచుల జాబితాలో లెక్కవేస్తారేమోనని భయం.
*******************************************************************************************
ఇక మూడవ కథ

ఈమధ్య నా దగ్గరకొక వ్యక్తి వస్తున్నాడు. విలేఖరి గాపనిచేస్తున్నాడు దినపత్రికలో .మంచివాడు. ఇతను తన బాధను చెప్పుకొస్తున్నాడు. తన భార్యకు ఉపాధ్యాయురాలిగా జాబ్ వచ్చినది. తెలాంగాణ ప్రాంతం లో నుండి కశ్టపడి వినుకొండకు తీసుకొచ్చాడు.ఆ అమ్మాయి వాళ్ళు కన్వర్టెడ్ క్రిష్టియన్స్ ,వాళ్ల ఆచారాలు వ్యవహారాలు వేరయినా ఇతను సర్దుకుని పోతుండేవాడు. ఇక అమ్మాయి వాళ్ల అమ్మగారికి నాన్నగారికి ఇద్దరూ ఆడపిల్లలవటముతో ఈఅమ్మాయి ఉద్యోగస్తురాలు కూడా అవటముతో.అమ్మాయి తమతోనే వుండాలని అమ్మాయిని తమతోనే వుంచారు. ఇతనికి జాతకప్రభావమో,ఏమోగాని అతను చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యి ఏపనిలోనూస్థిరపడ లేక పోయాడు. మానసికంగా కొద్దిగా డిసప్పాయంట్ అయ్యాడు.కొద్దిగా కలతలు.అమ్మాయి ఉద్యోగం తో నే వాల్ల అమ్మనాన్నల కుటుంబము కూడా గడపాలి. ఇద్దరికీ తగాదాలు .విడిపోయారు ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరె వున్నారు. ఇతన్ని ఇంటికి రానీయరు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి ఇంకా గొడవలెందుకు అని ఇతను సర్దుకుని కలవాలనుకుంటున్నా విడాకులిస్తాగాని నిన్ను రానివ్వనని ఆమే పట్టుదల. ఈమధ్య ఇతను నన్ను మాష్టర్ గారూ నాకుటుంబాన్ని నిలబెట్టమని ,మీచేతులతో ఎందరికో సహాయం చేస్తున్నారు, నావిషయం చూడమని బాధ పడుతున్నాడు. ఆమెగురించి కొందరు వుపాధ్యాయమిత్రులను,యూనియన్ నాయకులను విచారించాను ,వాళ్ళంతా ఆమె పెద్దగా తెలివిగలిది కాదండీ , అని తన గురించి వివరాలు చెప్పారు. ఆవిషయం అర్ధమవుతూనేవుంది ,లేకుంటే అమ్మనానలను తన బంధువులను పోషిస్తూ రేపు తన బిడ్దల భవిష్యత్తు ,తన భర్త గురించి ఆలోచించని ఆమె తెలివి తేటలు ఏపాటివో.ఒకసారి పూజచేపిద్దామని రమ్మని అడిగి చూడమన్నాను.పాపం అతను అడిగితే ఆ అమ్మాయి తిక్కలగా మాట్లాడుతున్నదే కాని తన కాపురం సరి చేసుకుందామని ప్రయత్నించేలా లేదు. తనకు భర్తను ,కాపురాన్ని సరిచేసుకోవాలనే భావన లేదు. మన సంస్కృతీ సాంప్రదాయాలను ఆమెకు అందించకుండా పెంచిన తల్లిదండ్రుల పెంపకం ఇలా వున్నది. విడాకులు,,,,విడాకులు ఏమిటీ సంస్కృతి .తీసుకుని ఏమి బావుకుంటారు.? సహనము ప్రేమతో కాపురాలను సరి చేసుకునే స్త్రీలను .ఆ మనస్తత్వం నుండి వేరు చేస్తున్నదెవరు? మగవాళ్లంతా మంచివాళ్లని ఆడవారి మీద తప్పులు మోపటము లేదు నేను. కాని భూదేవంత సహనంతో దారి తప్పిన భర్తలను కూడా పరివర్తనతో దారికి తెచ్చుకోగలైగిన ఈదేశ స్త్రీ మూర్తులు కూడా ఇలా ఎందుకవుతున్నారు? పుట్టిన బిడ్దల కు తగిలే మనోఘాతాలు భవిష్యత్తు లో వాళ్లనేమి చేస్తాయి> ఆలోచిస్తున్నారా? నాకు అయోమయం గావున్నది.ఏమి చేయాలో వాళ్లకు ఎలా చేతనయినంత సహాయం చేసి కాపురాలు ఎలా నిలబెట్తాలో తెలియక. మీలో ఈవిషయాల లో నిష్ణాతులైన మేధావులు వున్నారు.
ఈ సమస్యకు బలైన వాళ్ళు వుండవచ్చు. కొద్ది సేపు సమాన హక్కులు , చట్తాలు జోలికి వెళ్లకుండా ఈపరిణామాలకు అసలు కారణాలు విష్లేషించండి. మీ కుతోచిన పరిష్కారాలు చెప్పండి ,విడదీసే పాపం కాకుండా.ఇవన్నీ స్నేహితులుగా లోకం యొక్క భావాలు ఎలా వున్నాయో వారి ప్రవర్తన పట్ల వాళ్లకు చూపుతా.అదృష్టం బాగుండి ఈప్రయత్నం వల్లనైనా ఒకకుటుంబం విచ్చిన్నం కాకుండా కాపాడగలిగినా ధన్యులమే.[ వ్యక్తుల పేర్లు మార్చాను ]

7 వ్యాఖ్యలు:

Anonymous January 5, 2009 at 10:40 AM  

చూడబొతే మీ వూరి వారి లో చాలామందిని కన్వర్ట్ చెసారని అర్థమైంది. మరి ఫాదర్ గారు సలహాలివ్వరా వారికి. మావూరి లో ప్రతి రోజు ప్రభువు ఎలా అందరిని ఆదుకుంటాడు అని ఉపన్యాసాలు ఇస్తారు. మీరు వాళ్లకి ఉచిత సలహా లిస్తే వాళ్లు ఒప్పుకుంటారా? అందువలన మీరు వాళ్లని కౌన్సిలింగ్ కి పొమ్మని చెపండి. అక్కడ వాళ్లు కొంత డబ్బు తీసుకొంటారు అదేకాక కౌన్సిలింగ్ ఇచ్చే వారికి ఒక గొప్ప డిగ్రి వుంటుంది దానిని చూసి ప్రజలు నమ్ముతారు. అంతే కాని బాగా పరిచయము వున్న మీలాంటి వాళ్ళు మంచి సలహా ఇచ్చినా ఎవ్వరు వినరు. మనిషి ని మనిషి గా చూసే రోజులు మరియు నమ్మే రోజులు 1995 ( గ్లోబలైజెషన్ ) తరువాత నుంచి మధ్యతరగతి వారి నుంచి పారి పోయాయి. పాపం మీరు ఎప్పుడు మారు తారో, ఇంకా ప్రజా సేవా అని అనుంటునారు.
అర్ఠో రక్షితి రక్షితహ అంటె డబ్బు నువ్వు రక్షించు అది నిన్ను రక్షిస్తుంది అని అందరు నమ్మి సంసారాన్ని వదులు కునే రోజులలో మనము ఉన్నామని ఇందు ములంగా తెలియ చేయడమైనది.

Anonymous January 5, 2009 at 11:27 AM  

చెప్పటం మరచాను తమిళ్ లో 5 సంవత్సరాల క్రితం సొల్లమరందు కథై అని ఒక సినెమా వచ్చింది. అది మీరు చెప్పిన 3కథలు కలిపి చేరన్ హీరో గా నటించాడు అందులో తెలుగు లో ఆటోగ్రఫ్ సినెమా కుడాయనే మొదట తమిలో తీశాడు.

మీరు మునిగే పడవను కొంత కాలము ఆపుతామంటున్నారు. కాని మునిగే వాళ్లకు తాము మునుగు తున్నామని తెలుసు కోవడం లేదు. వారు ఒకరు చేపినా వినరు. అడ్డుకొకండి... కృష్ణుడంతటి వాడు యాదవుల వంశ నాశనమును కాకుండా అపలేక పోయాడు. మీరు అడ్డుకుంటె మిమ్మల్ని చేత గాని వారికింద జమచేస్తారు. ఎందుకంటె మీరు కృష్ణ్దు డిలా రాజు కారు.
మీకు ఇలాంటి వాళు తరసపడితె ఓ వాళ్లు విడకులకు కోర్టుకు వేళ్లారా? ఎన్ని సంవత్సారాలు కాపురం చేసారు అని అడగండి? అప్పుడు వాల్లూ 2 సం|| చెపితే మీరు అభ్భా చానా రోజులు కాపురం చేసారు, మా పక్కింటి వాళ్ల అమ్మాయి పెళ్లైన 10 రోజే విడకులు కావాలంది ఏ రోజుల లో ఆడవారు చాలా కంఫిడెన్సె గా వున్నారు అని చెప్పండి మీకు ఏ సమస్యా రాదు.

మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించగలరు. నా ఉద్దెశము మీరు నాలాగే తప్పు చెయకూడదని నేను ఒక్కపుడు ఇలా మీలాగే సలహాలు ఇచ్చి బొర్ల పడ్డాను.

మధురవాణి January 5, 2009 at 12:03 PM  

దుర్గేశ్వరా గారు..
మీ ఆదుర్దాని నేను అర్ధం చేసుకోగలను. విడిపోకుండా చూడాలనే మీ మంచి మనసుకి అభినందనలు. కానీ.. తెలియని వారికైతే ఒకసారి చెప్తే వింటారు. అన్నీ తెలిసి, కావాలని చేసేవారికి ఏమీ చెప్పలేము. మన దృష్టిలో సరి అనిపించేది వాళ్లకి సరిగ్గా అనిపించదు. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాల్లో వేరే వాళ్ళు చేయగలిగింది చాలా తక్కువ. అయినా మీరు చెప్పిన అన్నీటిల్లోనూ వాళ్ళ వివాహలయ్యి చాలా ఏళ్ళయినట్టుంది. కొత్తగా పెళ్లి అయితే తెలియదులే పాపం అని సలహాలు ఇవ్వవచ్చు. కానీ.. వీళ్ళెవరూ వేరే వాళ్ళ మాట వినే స్టేజీలో ఉన్నారని నాకనిపించడం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే.

Anonymous January 5, 2009 at 12:43 PM  

చదువుకొని, ఉద్యోగాలు చేసుకొంటూ, ఒకళ్ల మీద ఒకళ్లకు అపనమ్మకం ఇంత పెరిగిన తరువాత కలసి వుండటం కంటే విడిపోవటమే బెటర్ ఎమో.

అయినా, మీరు సలహా ఇద్దం అనుకోంటున్నారు కాబట్టి, వాళ్లు ఇద్దరూ మీ మాట గౌరవించి, మీరు ఇద్దరి తరుపున వారు, ఒకళ్ల పక్షం వాళ్లు కాదు అనుకొనెటట్లు అయితే, వాళ్లను రేండు ప్రక్కలా పెద్దలు దగ్గరగా లేని ప్రాంతానికి transfer చేయించుకొని వెళ్లమనండి. అక్కడకు వెళ్లిన తరువాత, కొంత కాలం వరకూ, వాళ్ల ఇద్దరినీ వాళ్ల వాళ్ల తల్లితండ్రులతో నో, బంధువల్తోనో కాకుండా, ఏమయినా అవసరం అయితే కేవలం వాళ్లు కలసి ఉండాలి అనుకొనే స్నేహితులతోనే సంప్రదించమనండి.

ఇది నా మిత్రుల విషయం లో, కొద్ది కాలం క్రితం ఉపయోగపడింది.

కాకపోతే, దీనికి వాళ్ల తల్లి తండ్రుల సహకారం కూడా కావాలి. మీరు చెప్పుతున్న దానిని బట్టి వాళ్లె, దీనికి కారణం అవుతున్నప్పుడు, ఎంతవరకూ సహకరిస్తారో కదా!

విరజాజి January 5, 2009 at 8:48 PM  

మీరు చెప్పిన విషయాలన్నీ చదివిన తరువాత ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనిపిస్తోంది. అమ్మాయికి పెళ్ళి చేసి పంపించిన తరువాత, అల్లుడు చెడ్డవాడో, లేక అమ్మయిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడో అయితే గానీ తల్లిదండ్రులు వారి కాపురంలో కలుగజేసుకోకూడదు. కానీ పెళ్ళికి ముందే చాలా మంది తల్లిదండ్రులు అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పేబదులు, తొందరగా వారిని వదిలించుకొని వేరే కాపురం పెట్టమంటున్నారు. సగం సమస్యలు ఇక్కడినుంచే మొదలు అవుతోంది. అమ్మాయిలని తల్లిదండ్రులు సపోర్టు చెయ్యడం తప్పు కాదు. కానీ మరీ ఈ మధ్య ఈ ధోరణి విపరీతం అయ్యింది. అది తగ్గితే అన్నీ సర్దుకుంటాయి. పుట్టింట్లో అత్తగారి ఇంటి గురించి, భర్త గురించి చులకనగా మాట్లాడే అమ్మాయిలు తమ ఇంటి పరువు తామే తీసుకుంటున్నామని తెలుసుకుంటే చాలా బాగుంటుంది.

సుజాత వేల్పూరి January 6, 2009 at 1:34 AM  

ఒక్కళ్ళిద్దరు పిల్లలవడం వల్ల ఈ మధ్య కాలంలో ఇలా పిల్లల కాపురాల్లో పెద్ద వాళ్ళు తలదూర్చడం, తెగేదాగా లాగమని సలహాలివ్వడం చాలా చోట్ల చూస్తున్నాం! పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారంటే మరీ అంత ఆలోచించలేని అజ్ఞానులేం కాదు. అయినా వయసుకీ, అజ్ఞానానికి సంబంధం లేదనుకోండి.పిల్లల మీద విపరీతమైన ప్రేమో, లేక ఆర్థిక వనరులున్నాయని విరగబాటో, లేక అవతలి వారు ఎందుకు దిగిరారో చూద్దామనే పంతమో గానీ ఇలాంటి వ్యవహారాల్లో త్వరగా రాజీ పడటానికి ఇరుపక్షాలూ ఒప్పుకోవు.

అడిగినదివ్వడం, కోరింది తెచ్చివ్వడం తప్ప జీవితం ఒకసారి చేజారితే ఏమవుతుందో తల్లిదండ్రులు పిల్లలకు తెలియజెప్పకపోవడం బాధ్యతా రాహిత్యం! భర్తను చులకన చేసి చూడటం వల్ల తమ విలువ తామే పోగొట్టుకుంటున్నామని ఆడపిల్లలు గ్రహిస్తే బాగుండు!

ఏమైనా అందరూ చల్లగా ఉండాలని కోరుకునే మీకు అభివందనాలు!

durgeswara January 6, 2009 at 5:47 AM  

ఈ సమస్యపై తమ అభిప్రాయాలను తెలుపుతున్న మీ అందరికి ధన్యవాదములు. నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా విడాకులు అనే పదం వినబడితే ఎదో పెద్దనేరం లాగా స్పందించేది సమాజం.అటు మగవాడిని,ఇటుస్త్రీని కూడా చాలా ఏహ్యభావం తో చూసే వారు.పిల్లలకు చిన్నతనం నుంచే సంసారిక బాధ్యతలు ,బంధాలపట్ల అవగాహన లభించేది.అప్పుడు ఎక్కువగా చదువుకున్నవారు లేరు.ఐనా కాపురాలు చక్కగా సాగేవి.మగవాడు తాగు బోతైనా గాలికి తిరిగేవాడైనా పొగరుబోతైనా సరే కొద్దకాలము తరువాతైనా దారికి తెచ్చుకునే తల్లులు,నా జాతి సంస్కృతికి మూలాధారమై నిలచారు.భార్యా భర్తల మధ్య కేవలము సుఖాలేకాదు,కష్టాలు కూడా ఆనందంగా పంచుకోబడేవి.ప్రపంచం లో ఎవరికీ అందని,ఏవిశ్వ విద్యాలయమ్ లో లేని అటువంటి విద్య ఏచదువుసంధ్యలు లేని కోట్లాది భారత స్త్రీలకు ఎలా లభించింది? అదే భారత దేశములో పుట్టిన ఇప్పటి తరం స్త్రీలకు ఈ విద్య ,శిక్షణ నిచ్చే చైతన్య ప్రవాహం ఎక్కడ అడ్డుకోబడుతున్నది? అది కావాలి ఇప్పుడు.నేను వ్రాసినవి మూడు సంఘటనలే కానీ మనచుట్టూ కొద్దిగా మనసు పెట్టిచూస్తే ఇలాంటి సమస్యలు మిక్కుటంగా రాబోయే రోజులలో తయారుకాబోతున్నాయనేందుకు ఆధారాలు కనబడతాయి. అప్పుడు సామాజికంగా ప్రారంభమయ్యే అలజడి మనందరి జీవితాలను అల్లకల్లోలం చేయనున్నది. దీనిపట్ల అందరిలో జాగ్రత్త కలిగించాలనేది నా ఆవేదన.కనుక మూలాన్ని పట్టాలి.కనుక ఇంకా లోతుకు వెళ్ళి ఈసమస్య ఎక్కడనుండి మొదలయినదో,ఇప్పటిదాకా ఈ సమస్యను వుప్పెనలా సమాజం మీద విరుచుకు పడకుండా ఆనకట్ట్టలా నిలచి కాపాడిన గట్టుకు ఎక్కడ రంధ్రం పడినదో ,దాన్ని పూడ్చటానికి ఏమిచేయాలో? మీ మేధోమధనం నుంచి వచ్చే సూచనలు కోరుతున్నాను నేను. కొంపతగలబడుతుంటే అది మనది కాకపోయినా మనం కూడా తలా ఒక బిందె నీళ్లను పోయటానికి ప్రయత్నిస్తాము.ఎందుకని?మెదలకుండా వుంటే ఆనిప్పు కొద్దిసేపటితరువాత మన కొంపలమీదకు రావటం తథ్యమన్న సత్యం మనకు తెలుసుగనుక.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP