గురుపౌర్ణమి శుభాకాంక్షలు
>> Sunday, July 21, 2013
లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగుదారి చూపే దివ్యతేజం గురువు. భగవానుడు లోకానుగ్రహకాంక్షతో గురువుగా రూపుదాల్చి భూమిపై అవతరిస్తున్నారు యుగయుగాలుగా. అలా అవతరించిన సంపూర్ణ గురుసత్తాయే వ్యాసభగవానులు . నాటినుండి నేటీదాకా వ్యాసులవారు మానవలోకానికి మార్గదర్శనం చే స్తూ అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఆది గురువును స్మరించుకుంటూ జరుపుతున్న ఉత్సవం గురుపౌర్ణమి. మీకు మీకుటుంబానికి వ్యాసభగవానుల సంపూర్ణానుగ్రహం ప్రాప్తించాలని వేడుకుంటూ శుభాంకాక్షలు తెలుపుతున్నాము .
2 వ్యాఖ్యలు:
క. ఈ రోజున ఎందరు వ్యాసుని
మీరిన సద్భక్తి తలచు మేలగు గుణవ్యా
పారంబులు నుందురు బాబా
లూరూరను కొత్తగురువులో రఘునాథా
ఇంకా ఏం చెప్పాలీ? ఎవరికి వారికే సర్వజ్ఞపీఠాధిపత్యం. ఎవరికి వారే ఎవరు గురువులో నిర్ణయించి పారేస్తున్నారు. ఎవరికి వారే ఏది ప్రమాణమో తేల్చిపారేస్తున్నారు. అసలు ఎవరు దేవుడో, కాదో కూడా వాళ్ళకు వాళ్ళే నిశ్చయం చేసి పారేస్తున్నారు. అబ్బే, వ్యాసులవారు మరీ పాతగురువులండీ. మన కొత్తకొత్త గురువులంత వారంటారా?
ఎక్కువమందికి అర్ధం కావాలని వ్రాస్తున్నానండి
పూర్వం మావాడొకడు సంగీతాన్ని చీల్చిచెండాడుతూ పాడేవాడు. ఏదన్నా అన్నామనుకో ! ఎస్పీ బాల్సుబ్రమణ్యం గొప్పేంటి? ఆయనలాగా నేను పాడలేకపోవచ్చు.. కానీ నాలాగా అయన పాడగలడా ? సవాల్..... అనేవాడు.
నిజమే మరి ఈయానలాగా ఆయన చచ్చినా పాడలేదు మరి.
Post a Comment