శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిరుమలలో "శ్రీవారి సేవ"కు రామదండు బయలుదేరనుంది . పాల్గొనదలచుకుంటే సంప్రదించండి.

>> Friday, July 19, 2013

శ్రీవారి సేవకు  రామదండు బయలుదేరుతున్నది .  తిరుమలలో కొలువైయున్న జగత్ప్రభువు దివ్యసన్నిధిలో  సేవచెయగలిగే భాగ్యం ఓ అదృష్టం. మన చెడుకర్మలను ధ్వంసం  చేసి సకల శుభాలను ప్రాప్తింపజేస్తుంది  ఈ సేవావిధానం.  శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నుండి గతంలో రెండుసార్లు   భక్తులు "రామదండు" గా బయలుదేరి వెల్లి  పాల్గొన్నారు. ఈ సేవలో పాల్గొన్న ఒక్కో భక్తునికి ఒక్కోఫలితం . వారి మనోభావాలలో నిండిన స్వామి రూపం,నామం వారి జీవితాలలో అద్భుత  మార్పులను ప్రసాదించాయి .

ఆగష్టు 9 నుండి వారంరోజులపాటు  శ్రీవారి సేవకు  అనుమతిని ఇవ్వమని కోరుతూ  అభ్యర్థన పంపి ఉన్నాము . వారి అనుమతి రావచ్చునని చూస్తున్నాము. ఈ సారి సేవాకార్యక్రమంలో మాతోపాటు పాల్గొనాలనే ఆర్తి ఉన్న శ్రీవారి భక్తులెవరైనా ఉంటే వారిని  కూడా రామదండు  లో సభ్యులుగా కలుపుకుని వెళ్ళటానికి నిర్ణయించుకుని ఉన్నాము.  ఏభై ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండి పూర్తి ఆరోగ్యం తో ఉన్నవారు సంప్రదించండి .  వివరాలు తెలియపరుస్తాము.[ క్షమించాలి  ఆగష్టు పదిహేనునుండి సేవకు అనుమతి వచ్చినది ]

[మరొక ముఖ్యవిషయం
        తిరుమలలో  మూడు నెలలపాటు ఉండి సేవలందించగల ఆసక్తి ఉన్నవారు అంటే రిటైర్డ్,వారైనా  సంప్రదిస్తే   ఆకార్యక్రమం గూర్చి వివరిస్తాము.]

durgeswara@gmail.com
9948235641

3 వ్యాఖ్యలు:

భాస్కర రామిరెడ్డి July 19, 2013 at 12:41 PM  

మీ ప్రయాణం సకల సౌఖ్యాలతో సాగాలని కోరుకుంటాను.

mani July 19, 2013 at 12:57 PM  

. శ్రీ లలిత సమాఖ్య సంస్థ తరపున హైదరాబాద్ నుండి చాలా సార్లు శ్రీవారి సేవలో పాల్గొన్నము.మా గ్రూప్ లో రిటైర్ అయిన వాళ్ళు వున్నారు, మూడు నెలలు తిరుమలలో వుంది సేవచేసే అవకాశం వివరాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మీరు శ్రివరిసేవలో మీ అనుభవాలను చదివాను. మీరు చాల అదృష్టవంతులు అని అనుకున్నాను. హరిసేవ -బ్లాగ్ చదువుతుంటాను.నాకు నచ్చిన బ్లాగ్ ఇది అభినందనలు మణి. హైదరాబాద్.

mani July 19, 2013 at 12:58 PM  

. శ్రీ లలిత సమాఖ్య సంస్థ తరపున హైదరాబాద్ నుండి చాలా సార్లు శ్రీవారి సేవలో పాల్గొన్నము.మా గ్రూప్ లో రిటైర్ అయిన వాళ్ళు వున్నారు, మూడు నెలలు తిరుమలలో వుంది సేవచేసే అవకాశం వివరాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. శ్రివరిసేవలో మీ అనుభవాలను చదివాను. మీరు చాల అదృష్టవంతులు అని అనుకున్నాను. హరిసేవ -బ్లాగ్ చదువుతుంటాను.నాకు నచ్చిన బ్లాగ్ ఇది అభినందనలు మణి. హైదరాబాద్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP