శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అర్ధశాస్త్రంలో చాణక్యుడు సూచించిన శిక్షలు ఇప్పుడు అమలుచేయాలి

>> Saturday, December 29, 2012

బాలికలపై  అత్యాచారాలు నిత్యకృత్యాలవుతున్న ఈ రోజులలో   ఇక ఈ మేడిపండు ప్రజాస్వామ్య చట్టాలు పక్కనబెట్టి ఈదేశానికి సరిపడేలా రూపొందింపబడ్డ నాటి చట్టాల అమలు  మరలా అవసరం . ఈదేశంలో ఒకప్రణాళికప్రకారం ధ్వంసం చేయబడ్డ విద్యావిధానాల వలన జాతి సంస్రుతీ సంపదలను కోల్పోతున్నది. మానవసంబంధాలలో మానవీయవిలువలను కోల్పోయి మార్కెట్ విలువలు ప్రతిష్టింపబడుతున్నాయి. కావలసినది పొందటం ఎటువంటి దానికోసం ఎంతటి నీచానికైనా దిగజారటం. భౌతిక సుఖాలను పొందటమే పరమలక్ష్యం  గా సాగుతున్న ఈ చదువుల ఫలితాలు నేడు అర్ధనగ్నవస్త్రధారణలను ఆధునిక అలంకారాలుగాను, ఊరుకుక్కల్లాఎవరితోబడితేవారితో తిరిగే సంస్కృతిని స్వేఛ్ఛాజీవనానికి  సంకేతంగానూ మార్చేశాయి.
విలువల వలువలు విడిచేశాక ఇక  ఆడాలేదు మగాలేదు మృగాల మనఃస్థితే !
మనకు నచ్చినంతసేపూ ప్రమాదం మనదగ్గరకు రానంతసేపూ వీటికి  ఆహో! ఓహో! అనే బాకారాయుళ్ళు .అసలు ప్రమాదాలను గ్రహించరు.
పరిస్థితి చేయిదాటింది . ఇప్పుడు నీతివాక్యాలు , పనిచేయవు.

భయం ...భయం.. భయం కావాలి జాతికి.
తప్పుచేస్తే ఏంజరుగుతుందో తలచుకుంటేనే వణుకుపుట్టేంత భయం కావాలి.
నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడెవారి తలలు నేలకు రాల్చాలి.
అందుకే  అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు  కఠినమైన శిక్షలు సూచించాడు .

మానభంగం  చేసినవాడికి  మర్మాంగాలను కోసివేయడం.
దొంగతనం చేసినవాడికి  వేళ్ళునరకడం
ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా  శిరచ్చేదన చేయడం .
ఇలాఉండాలి శిక్షలు
ఆధునుకతపేరుతో పిల్లలకు అసభ్యకరమైనవస్త్రధారణలకు అనుమతినిస్తూ ,పబ్బు గబ్బులకు అలవాటవుతున్నా కళ్లప్పగిమ్చి చూస్తున్న తల్లిదండ్రులను బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లంటూ విచ్చలవిడితనానికలవాటుపడుతున్న పిల్లలకూ శిక్షలుండాల్సిందే.
 ఎన్నిమాటలు చెప్పినా పరాయివారైన  స్త్రీపురుషుల  మధ్య ఉండే సంబంధాలలో అంతర్లీనంగా ఉండేది "కామవాంఛే' నని ఈమధ్య శాస్త్రవేత్తలు  నిగ్గుతేల్చి చెప్పారు కదా ! కనీసం ఈవిషయాలనైనా నమ్మాలి. ఈ వావివరుసలు.శీల సంపద పట్ల శ్రద్దలేని వారికి తగిన శిక్షలుండాల్సిందే .

ఇంతకఠినమా ??? మానవత్వం వద్దా  అని మాట్ళాడకండి. మానవత్వం చూపాల్సింది మనుషులపట్ల. మనీషన్నవాడు చనిపోయి మృగాకారాలు గామారి తిరుగుతున్నవారి పట్లకాదు.

ఎంతత్వరగా ఈ చట్టాలు రావాలంటే   . మరో చెల్లి.తల్లి బ్రతుకులు అన్యాయం కాకుండా ముందుగానే కావాలి

1 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు December 29, 2012 at 4:32 PM  

ఈ వెధవలని మృగాలౌ అని పిలవడం వాటిని అవమానించడమే. ఏ మృగమైనా ఆకలి లేనప్పుడు మరో మృగాన్ని చంపుతుందా. చంపినా ఇంత శాడిజం చూపుతుందా?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP